“ఇద్దరూ ఇద్దరే”అంబేడ్కర్-మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్!

షేర్ చెయ్యండి

ఏప్రిల్  నెల బారతదేశంలో దళితులకు, అమెరికా లో నల్లజాతీయులకు ప్రత్యేకమైన నెల. బారత దేశంలో కోట్లమంది ప్రజలు ఎలాంటి హక్కులు లేకుండా నిరాకరించబడిన వారికీ హక్కులు కల్పించిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ జన్మించిన నెల. అమెరికాలో నల్లజాతీయుల హక్కులు కోసం పోరాడిన మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చనిపోయిన నెల. అమెరికాలో ఆఫ్రికా అమెరికాన్స్ యొక్క జీవన ప్రమాణాలు, బారత దేశంలో దళితుల జీవిన స్తితిగతులు దశాబ్దాల క్రితం హక్కులు సాధించుకున్నా దుర్భర స్తితిలోనే ఉన్నాయి అని చెప్పక తప్పదు.

అమెరికాలో మార్టిన్ లూధర్ కింగ జూనియర్ మాదిరిగానే బారత దేశంలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తన జాతిని అంటరానితనం రూపుమాపటానికి  మరియు కుల నిర్మూలన దిశగా నడిపించేరు. తమ హక్కులు కోల్పుతున్న సమయంలో దళితులు రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రకటిస్తునారు. ఇటీవల కాలంలో దళితుల రక్షణ చట్టం ఎస్సి/ ఎస్టీ యాక్ట్ మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి దళితులు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్తితి వచ్చింది.

అమెరికాలో మనవ హక్కుల పోరాటం చేసిన ఐదు దశాబ్దాల తర్వాత, ఆరు దశాబ్దాల బారత రాజ్యాంగం అంటరానితనం, కుల వివక్ష కు వ్యతిరేకంగా రాసుకున్న రాజ్యాంగాన్ని ఆమోదించన తర్వాత కుడా కుల వివక్ష వివిధ రూపాల లో మనకి కనిపిస్తుంది. సామాజిక, రాజకీయ, సంస్కృతి, సంప్రదాయాలలో లో కుల వివక్ష నేటికీ పాటిస్తున్నారు.  మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ మాదిరిగానేనవబారత రాజ్యాంగం లో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దళితులకు అన్ని రకాల ప్రజాస్వామ్య చట్టాలు, రాజకీయ చట్టాలు కల్పించేరు. సాక్షాత్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నే పార్లమెంట్ లో దళిత ప్రజా ప్రతినిధిగా తన కర్తవ్యం నిర్వహించేరు.

Also read  మోకాళ్ళ మీద నిలబడుతున్నదళిత ఉద్యమం!
america human rights
America African Human rights leader Martin Ludhar king jr

అక్టోబర్ 14, 1956 బారత దేశంలో ఒక మహా తిరుగుబాటు జరిగిన రోజు, దురదృష్ట వశాత్తు నేను హిందువుగా పుట్టెను కానీ హిందువు గా మరణించను అన్న బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ నాగపూర్ కేంద్రంగా హిందూ మతం వీడి బుద్దిజం లోకి మారేరు. అదేరోజు ఐదు లక్షల మంది దళితులు, బాబాసాహెబ్ అనుచరులు, అభిమానులు బుద్దిజంలోకి మారేరు. అదే సంవత్సరం మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ అమెరికా నల్ల జాతీయులు బహిరంగ ప్రదేశాలలో స్వేఛ్చ గా తిరగ వచ్చు, పబ్లిక్ రవాణా వ్యవస్థ అయిన బస్సుల్లో స్వేచ్చగా తిరగవచ్చు అని కోర్టు లో కేసు వేసి గెలిచిన రోజు.

ఆరు దశాదాబ్దాల బాబాసాహెబ్ డా అంబేడ్కర్ , మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ స్పూర్తి తో  దళితులు , నల్ల జాతీయులకు ఎన్నో పోరాటాలు చేసి విజయంసాధించేరు.  సామాజిక న్యాయం మరియు పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ కి 1964 లో నోబుల్ శాంతి అవార్డ్ ఇచ్చేరు. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ కి మాత్రం చనిపోయిన 34  సంవత్సరాల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో 1990  లో బారత రత్న అవార్డ్ ఇచ్చేరు.

బారత దేశంలో కానీ, అమెరికా లో కానీ రాజ్యాంగపరంగా దళితులకు, ఆఫ్రికా నల్ల జాతీయులకు హక్కులు సాధించుకున్నా వివక్ష మాత్రం ఎదుర్కుంటున్నారు. బారత దేశంలోని దళితుల పరిస్తితి అమెరికా లోని ఆఫ్రికా నల్ల జాతీయుల తో పోలిస్తే 100రెట్లు అధికంగా వివక్ష కి గురిఅవుతున్నారు.

Also read  దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

గత సంవత్సరం జులై 17 న బెంగుళూరు లో కర్నాటక ప్రబుత్వం నిర్వహించిన దళిత సమ్మేళనం లో పాల్గొన్న మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ కుమారుడు అమెరికా మనవ హక్కుల నాయకుడు  మార్టిన్ లూధర్ కింగ్-౩ ప్రత్యెక అదితిగా పాల్గొని చేసిన ప్రసంగంలో బారత దేశంలో కోట్లాది మంది ప్రజల హక్కుల కోసం పోరాడిన బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ , ఆఫ్రికా అమెరికన్స్ హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ ఇద్దరూ సామాజిక విప్లవానికి అన్నదమ్ములు లాంటి వారు అని పేర్కొన్నారు. ఇంకా మార్టిన్ లూధర్ కింగ్ -౩ మాట్లాడుతూ ఏమన్నారో అతని మాటల్లోనే  “intellectually, philosophically, morally and spiritually cut from the same cloth”. “They were brother revolutionaries whose minds and hearts were driven by justice and compassion,”

Ambedkar quote
Chief Architect of modern India Babasaheb Dr. B RAmbedkar

నిమ్నజాతీయులను బానిస విముక్తి నుండి కాపాడటానికి వారిలో చైతన్యం కొరకు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ Educate, Agitate, Organize అనే త్రికరణ సూత్రాలను దళితులకు విశదీకరించి చెప్పేడు. అలాగే మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ కుడా ఇంచుమించు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ త్రికరణ సూత్రాలు లాగానే అమెరికా నల్ల జాతీయులను వివక్ష నుండి కాపాడటానికి పిలుపునిచ్చేవారు.

మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ అట్లాంటా లో పుట్టరు. అతని తండ్రి బాప్టిస్ట్ చర్చి మినిస్టర్, మార్టిన్ లుదర్ కింగ్ కి చదువు అంటే బాగా ఇష్టం అందుకే చర్చి లోని సేవ వదిలి డాక్టరేట్ చేసేరు. 19 యేండ్ల కే బాప్టిస్ట్ చర్చి మినిస్టర్ అయ్యేరు. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ తండ్రి సైనికుడు, బాబాసాహెబ్ తన చదువుని తను పుట్టిన జాతి అభ్యున్నతి కోసం వినియోగించేరు, మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ కుడా చర్చి ఫాస్టర్ గా ఉంటూనే 1956 లో నల్ల జాతీయుల హక్కుల కోసం కోర్టు లో దావా వేసి విజయం సాధించేరు. మహద్ చెరువు పోరాటం లో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కుడా కోర్టు కు వెళ్లి సభకోసం అనుమతి తీసుకున్నారు.

Also read  ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

బారత దేశంలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ నేతృత్వంలో సాగిన కుల వ్యతిరేక పోరాటం మరియు అమెరికా లో అమెరికా ఆఫ్రికాన్స్ యొక్క పౌర హక్కుల ఉద్యమానికి చాల పోలికలు ఉన్నాయి. కుల వివక్షకి , వర్ణ వివక్ష కి చాల తేడాలు ఉన్నాయి కుల వివక్ష సామాజిక ,సాంస్కృతిక అంశాలతో ముడి పడి  ఉంటే వర్ణ వివక్ష మనిషి యొక్క రంగుకు సంభందించినది,

మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చర్చి కేంద్రంగా తన హక్కుల ఉద్యమం చేస్తే , బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గుడిలో ప్రవేశం కొరకు పోరాడి, ఇక గుడులు నా జాతికి అవసరం లేదు అని నియో buddist గా మారిపోయేరు.

రెండు ఖండాలలో ఒక గొప్ప ఉద్యమం చేసిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ –మార్టిన్ లూధర్ కింగ్ ఆ జాతుల నాయకత్వ పటిమకు, చైతన్యానికి స్పూర్తి ప్రదాతలు.  

(Visited 151 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!