ఉత్తరప్రదేశ్ బా జ పా దళిత ఎం.పి లు తిరుగుబాటు!

షేర్ చెయ్యండి

BJP పార్టీ లో పనిచెయ్యాలి అంటే ముందు నుండి హిందుత్వ పోకడలు అలవర్చుకుని ఉండాలి, లేదా సంఘ్ సబ్యుడై ఉండాలి. అలా కాని వ్యక్తులు ఆ పార్టీలో మనుగడ సాధించలేరు. ముక్యంగా దళిత , ఆదివాసీ రాజకీయ నాయకులు. బా జ పా పుట్టుపూర్వోత్తరాలు అందరికి తెలిసిందే, దాని మాతృ సంస్త స్వబావం దళిత , మైనారిటీ లను ద్వేషించడం. కుల (మను) ధర్మాన్ని పాటించడం. అలాంటి పార్టీలో రాజకీయ పునరావాసం కోసం చేరిన ఏ రాజకీయ నాయకుడు ఉండలేరు.

ఉత్తర ప్రదేశ్ బహుజన రాజకీయానికి వేదిక అలాంటి బహుజన రాజకీయంలో స్వతంత్రంగా ఎదిగిన సావిత్రి భాయ్ ఫూలే , అశోక్ దొరేయ్,చోటేలాల్ కార్వార్, యశ్వంత్ సింగ్ అనే దళిత పార్లమెంట్ సబ్యులు  బా జ పా మీద తమ కులం కోసం తిరుగుబాటు చేసేరు.

వీరి నలుగురు మొదటసారి పార్లమెంట్ కి ఎన్నుకోబడ్డారు. బా జ పా దళితులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చెయ్యడం లేదని, యోగి ప్రబుత్వం లో దళితుల పట్ల మరింత దాడులు పెరిగిపోవడంతో వీరు ఆగ్రహం వ్యక్తం చేసేరు.

BJP Dalit Mp open letter to PM
Dalit MP Mr.Yashwanth Singh letter

గత శనివారం పచ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని నాజీన పార్లమెంట్ సబ్యుడు  యశ్వంత్ సింగ్ ప్రదాని నరేంద్ర మోడీకి రాసిన ఉత్తరంలో NDA ప్రబుత్వం దళితుల మీద దాడులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని. 30 కోట్ల  జనాబా కి మోడీ ప్రబుత్వం మొండి చెయ్యి చూపిస్తుంది అని పెర్కున్నాడు. మరొక పార్లమెంట్ సబ్యుడు చోటేలాల్ ఖర్వార్ ప్రదాని మోడీ కి మార్చి చివరి వారంలో బహిరంగ లేక రాస్తూ ముఖ్యమంత్రి యోగి మీద అలాగే ఇతర బా జ పా పార్లమెంట్ సబ్యులు తన నియోజకవర్గం లోని ఇతర అగ్రవర్ణ నాయకులు తన మీద చేస్తున్న కుట్రలను అడ్డుకోవడం లేదని , ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కుడా రాకుండా అడ్డుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఇత్వా పార్లమెంట్ సబ్యుడు అశోక్ దోరేయి ప్రడానికి రాసిన బహిరంగ లేఖలో దళితులను టార్గెట్ చేసి మరీ యోగి సర్కార్ పోలీసుల చేత హింసకు గురిచేస్తుందని పేర్కొన్నారు.

Also read  కర్ణాటకలో జెడిఎస్, బిఎస్పిల కూటమి దారెటు!

BJP లో దళిత నాయకత్వం తిరుగుబాటు సుప్రీం కోర్టు ఎస్సి, ఎస్టీ యాక్ట్ ని నిర్వీర్యం చేస్తూ ఇచ్చిన తీర్పు కు నిరసనగా బయటకు వచ్చింది. యువ పార్లమెంట్ సబ్యురాలు సావిత్రి భాయ్ ఫూలే మోడీ ప్రబుత్వం మీద విరుచుకపడ్డారు. మోడీ ప్రబుత్వం రిజర్వేషన్ల ను రద్దు చెయ్యటానికి ఇలాంటి కుట్రలు చేస్తుందని ప్రకటించేరు. 37 సంవత్సరాల సావిత్రి భాయ్ ఫూలే ఏప్రిల్ 1 వ తేదీన లక్నో లో ఎస్సి ఎస్టీ యాక్ట్ పై సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ చేసేరు.

BJP Dalit MP Mr.Chotelal Kharwar letter

చోటేలాల్ ఖర్వార్, అశోక్ దొరేయ్, యశ్వంత్ సింగ్ , సావిత్రి భాయి ఫూలే ఈ ముగ్గురిలో ఒక కామన్ అజెండా ఉంది. యోగి కి వ్యతిరేకంగా మాట్లడటం ఒక్కటే కాదు దళితుల పట్ల బారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం చూపిస్తున్న వైఖిరి వీరు జీర్ణించుకోలేక పోతున్నారు. 2014 ఎన్నికల్లో మోడీ చేసిన వాగ్దానాలు, ప్రమాణాలు అన్నీ నీటి మూటలని బావిస్తున్నారు.

Bjp Dalit Mp open letter to pm
BJP Dalit MP Mr. Ashok Doreh letter

దళితులు RSS-BJP రాజకీయాల్లో ఉండలేరు అని ఈ నలుగురి ఉదంతం చెబుతుంది వీళ్లు సంఘ్ పరివార్ నేతృత్వంలో రాజకీయాల్లోకి రాలేదు. సావిత్రి భాయి ఫూలే 2002లో BSP వ్యవస్తాపకుడు మాన్యశ్రీ కాన్షిరాం స్పూర్తి తో రాజకీయాల్లోకి వచ్చేరు. యశ్వంత్ సింగ్ మరియు అశోక్ దొరేయ్ BSP బెహన్జీ మాయావతి ప్రబుత్వం లో 2007 నుండి 2012 వరకూ మంత్రులుగా చేసేరు. సావిత్రి భాయి ఫూలే , అశోక్ దొరేయ్ తిరిగి BSP పార్టీ లో చేరే అవకాసం ఉన్నట్లు స్తానికులు చర్చ చేసుకుంటున్నారు.

Also read  ప్రాంతీయ రాజకీయ పార్టీలు కులాలను విభజించడం మానుకోవాలి.

బారత దేశానికి ఉత్తరప్రదేశ్ ఆయువు పట్టులాంటిది. అలాంటి ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ పార్లమెంట్ స్తానాలు గెలిచిన పార్టీ దేశ ప్రదానిని నిర్ణయించే శక్తి ఉటుంది. ఉత్తరప్రదేశ్ లో బహుజనులు సమాజవాదీ పార్టీ మరియు బహుజన సమాజ్ పార్టీ మీద ఎంతో విశ్వాసం తో ఉన్నారు కానీ ఆ రెండు పార్టీలు దళితులను, బి సి లను కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు అన్ని పార్టీలు ప్రోస్తాహిస్తూ గెలిచే గుర్రాలకోసం తమ పార్టీలో చేర్చుకుని అవకాసం ఇస్తున్నారు. ఇలాంటి పరిణామంలో పార్టీ మారడం చాల చిన్న విషయం. అయితే దళిత వర్గాలు తమ సహజ మిత్రులు అయిన పార్టీలను కాదని మనువాద పార్టీలకు ఓటు వేస్తె హిందూ కుల వ్యవస్థ యొక్క ప్రబావానికి వారు గురికాక తప్పదు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దళిత వర్గాలను సొంతగా పార్టీ పెట్టుకుని మూడో శక్తి గా రాజకీయం చెయ్యమన్నారు. వేరే పార్టి లో చేరి రాజకీయం చేస్తే అది రాజ్యాధికారం కాదు అన్నారు. కాబట్టి దళిత వర్గాలు సొంతగా రాజకీయం చేస్తే నేడు BJP లాంటి ప్రబుత్వాలు వారి జీవితాలతో ఆడుకునే వారు కాదు.

గత నాలుగేళ్ళ నుండి దేశంలో దళితుల మీద జరిగిన దాడుల్లో BJP పాలిత రాష్ట్రాలే మొదటి నాలుగు స్తానాల్లో ఉండటం సిగ్గు చేటు. Barateeya Janata Party (బా జ పా ) యొక్క నేపధ్యం తెలిసిన దళితులు కానీ, ఆదివాసీలు,ముస్లిం లు ఆ పార్టీకి ఓటు వేయరు. దురదృష్టం ఏంటంటే 2014 లో దళితుల ఓట్లు బా జ పా కి 24% పడ్డాయి అంటే ఆచ్చర్య పడక తప్పదు.

Also read  నయా సూత మహర్షులు-దళిత రాజకీయ నాయకులు!

ఆంద్ర ప్రదేశ్ లో TDP తో BJP పొత్తు పెట్టుకుంది కాబట్టి దళితులు కుడా BJP కి ఓటు వేసి తమగోతిని తాము తవ్వుకున్నారు. ప్రజా సంఘాలు, దళిత మేధావులు అలాగే అంబేడ్కరైట్ సంఘాలు ఓటు యొక్క ఆవశ్యకత మనం ఎలాంటి వ్యక్తులకు, పార్టీలకు ఓటు వేయాలో చెప్పాలి. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ త్రికరణ సూత్రాలలో బాగంగా దళిత వర్గాలలోచైతన్యం తీసుకు వచ్చి దళిత వ్యతిరేక పార్టీలకు ఓటు పడకుండా చూడాలి.

ఉత్తర ప్రదేశ్ లో పుంజుకుంటున్న బెహన్ జీ మాయావతి, సమాజ్ వాది పార్టీ యొక్క పొత్తు BJP కి వణుకు పుట్టిస్తుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి విజయం సాధించి BJP కి చెమటలు పుట్టించేయి. ఈ నేపధ్యంలో BJP తన దళిత పార్లమెంట్ సబ్యులను తిరుగుబాటు చేసి దళితులు BSP వైపు వెళ్ళకుండా సావిత్రి భాయి ఫూలే తో తిరుగుబాటు ఉద్యమం చేయిస్తుండా అనే అనుమానాలు కుడా ఉన్నాయి.

ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్ లో బా జ పా లో ఉన్న దళిత నాయకులకు తొందరగా కనువిప్పు కలిగితే మంచిదే లేదంటే ఆ వైరస్ దేశం మొత్తంపాకి దళితులను తుదముట్టిస్తుంది. ఇదే బా జ పా దళితుల మీద చూపిస్తున్న సానుబుతి కుట్ర.

2014 నుండి జరుగుతున్న పరిణామాలు గ్రహించి అయినా దళితులు  RSS-BJP కి దూరంగా ఉండక పొతే బవిషత్ పరిణామాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. 

 

 

 

(Visited 105 times, 1 visits today)

4 thoughts on “ఉత్తరప్రదేశ్ బా జ పా దళిత ఎం.పి లు తిరుగుబాటు!

  • 10/04/2018 at 11:04 AM
   Permalink

   ధన్యవాదాలు

   Reply
 • 09/04/2018 at 12:37 PM
  Permalink

  Brother Venkat! ప్రతి దళితుడు విధిగా చదవవలసిన వ్యాసాలు. మనకంటూ పత్రికలు లేక ఇలాంటి విషయాలు యదార్ధాలు వెలుగులోకి రాలేకపోతున్నాయి. కాని మీలాంటి బాధ్యతకలిగిన యువకులు అవరోధాలన్నింటినీ ఎదిరించి వీటిని మనవాళ్ళకు అందిస్తున్నందుకు యావత్ దళితలోకం మీకు సదాఋణపడివుంది. జైభీం.

  Reply
  • 10/04/2018 at 11:04 AM
   Permalink

   జై భీమ్
   ప్రకాష్ అన్న. ధన్యవాదాలు మంచి కామెంట్. మీ ప్రోస్తాహానికి ధన్యవాదాలు

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!