ఉద్యమాల ప్రస్థానాన్ని మొదటి అడుగు.

షేర్ చెయ్యండి

అంటరాని కులం లో జన్మించిన వ్యక్తి విద్యా ,ఉద్యోగం లో ఏ స్థాయికి ఎదిగిన కుల రక్కసి కాటు వేస్తూనే వుంటుంది.

బాబాసాహెబ్ డా అంబెడ్కర్ గారు విదేశాలలో విద్యను అబ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత బరోడా సంస్థానం లో మిలటరీ కార్యదర్శి గా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలు పెట్టేరు. ఒక అంటారని కులస్తుడు అధికార స్థాయిలో ఉండటం సహించలేని ఉద్యోగస్తులు బాబాసాహెబ్ అంబెడ్కర్ గారిని సూటి, పోటి మాటలతో వేదింపులకు గురిచెయ్యటం వలన ఆ ఉద్యోగానికి రాజీనామా సమర్పించేరు.

ఒకరి వద్ద ఉద్యోగం చేస్తే కులం అవమానాలకు గురి అవుతున్నాను అని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ప్రైవేట్ టీచర్ గా విద్యార్థుల ఇంటికి వెళ్లి టూషన్ చెప్పేవారు. ఇదే సమయం లో అకౌంటెంట్ గా ఒక కాన్సెల్టెన్సీ స్థాపించేరు. ఇక్కడ కూడా బాబాసాహెబ్ ని కులం వెంటాడింది. చివరిగా బొంబాయి లోని సిడెంహం కాలేజీ లో కామర్స్ మరయు ఎకనామిక్స్ లెక్చరర్ గా చరెరు.

Also read  "బాబాసాహెబ్" డా. అంబేడ్కర్ ఆగ్రా ఉపన్యాసం!

అడుగు అడుగునా కుల వివక్షను ఎదుర్కొన , బాధింపడిన అంబెడ్కర్ గారు కుల వివక్షతో దీనస్థితి లో ఉన్న తన సాటి కులస్తులను, అంతరానివారిని ఆ స్థితినుండి పైకి తీసుకు రావటానికి కొల్హాపూర్ మహరాజ్ సహాయంతో ‘ మూక్ నాయక్ ‘ అనే వార పత్రిక ను స్థాపించేరు. అందులో హిందూ మతం యొక్క పోకడకలను, రాజకీయ నాయకులను బాబాసాహెబ్ విమర్శించేవారు.

ఉన్నత చదువులు చదవాలి అనే జిజ్ఞాస కలిగిన అంబెడ్కర్ గారు 1921 లో లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో చేరెరు.రెండు సంవత్సరాల తర్వాత Dsc in Economic లో పట్టబద్రుడు అయ్యేరు. అదే సమయం లో లా ను పూర్తి చేసి లండన్ బార్ కౌన్సిల్ లో సభ్యులు గా చేరేరు.

భారత దేశానికి తిరిగి వచ్చి లీగల్ సహాయుకుడి గా వృత్తిని ప్రారంభించారు. అయితే సమాజంలో కులన్ని పాటించటం అనే దురాచారాన్ని నిర్ములించాలి అనే కోరికతో ” బహిస్క్రిత హితకారిని సభ “ అనే సంఘాన్ని స్థాపించి అంటరాని కులాలకు , వెనకబడిన తరగతుల వారికి విద్యా మరియు పరిశీరాలు పరిశుబ్రత మీద ప్రజల ను చైతన్యం చెయ్యటం ప్రారంభించారు.

Also read  కీలు బొమ్మల కాలం-ఎస్సీల రాజకీయం!
 
(Visited 24 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!