ఎన్కౌంటర్ లో చనిపోయిన 40 మంది లో ఏడుగురు చిన్నపిల్లలు!

షేర్ చెయ్యండి
  • 3
    Shares

వారు అడివి మల్లెలు, ముక్కుపచ్చలారని చిన్నారులు. వారు విద్యార్ధులు, రేపటి బవిషత్ కొరకు తమ తలరాత మర్చుకోనుటకై మైళ్ళ దూరం పోయి చదువుకుంటున్న పిల్లలు. వాళ్ళు అడవి బిడ్డలు. పెళ్ళికి వెళ్లి సరదాగా గడుపుదాం అని ఏప్రిల్ 21 న ఇంటిలో నుండి వెళ్ళిన ఎనిమిది మంది చిన్నారులు.

ఆ అడవిలో అదో సాంప్రదాయం పెళ్ళికి పక్కన ఊరు వారిని అధితులుగా పిలవడం. పెళ్ళికి రెండు రోజుల ముందు నుండే సాంప్రదాయ ఆట పాటలతో వినోదాలు వారికి అలవాటు.

కాలం చాలా దుర్మార్గమైనది, కటినమైనది. ఏప్రిల్ 21 న పెళ్ళికి వెళ్ళిన తమ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోయేసరికి, తల్లి తండ్రుల్లో ఆందోళన. ఆ అడవి బాటన పట్టేరు. వారికి తెలిసిన విషయం ఏంటంటే ఆ ఎనిమిది మంది అసలు పెళ్ళికి రాలేదంటా! వారి గ్రామం నుండి 140 కి మీ దురాన ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం దగ్గరకి ఏప్రిల్ 24న  వెళ్లి విచారించేరు . అలాంటి పిల్లలు ఎవరూ లేరని వార్త వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయి. పోలీసుల నుండి సరైన సమాచారం లేకపోయేసరికి దేవుడి మీద బారం వేసి ఇంటికి వచ్చేరు.

సి -60 కమెండోస్ (the Maharashtra police’s special anti-Naxal unit) హక్కులు అడిగే వారిని ప్రశ్నించే వారిని అడవిలో  నయానో, భయానో అవసరం అయితే మట్టు బెట్టటానికి రాజ్యం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. మహారాష్ట్రలోని ‘గడ్చిరోలి’ ప్రాంతంలో ఇప్పటివరకు జరగని అతి పెద్ద ఎన్కౌంటర్ చేసిన సి-60 కమెండోస్.

ఆదివాసీల భయం నిజం అయ్యింది!

Vanji (second from left) and Jano (centre) identify their 16-year-old sister Raasu Chacko Madavi in the picture. Credit: Sukanya Shantha/The Wire

మీడియాలో మొదట ఒక ప్రమాదంగా పేర్కొన్నారు. మొదట వాళ్ళు గుర్తు పట్టలేని స్తితిలో ఉన్న రాస్సు (16) అనే ఒక అమ్మాయి మృతదేహం గమనించేరు. విశాలమైన ఆమె నుదురు, చిన్న కళ్ళు. ఆడివాసిలలో అనుమానం మరింత పెరిగింది, బయం ఇంకా రెట్టింపు అయ్యింది. ఇంటిలో నుండి పెళ్ళికి వెళ్ళిన రాస్సు శవంగా కనిపిస్తుంది.నమ్మలేకుండా ఉన్నారు. అంతలోనే ఇంకొన్ని ఫోటో లు పోలీసులు షేర్ చేసేరు. అందులో రాస్సు ఆనవాళ్ళు లేని మృత దేహం గా పేర్కొన్నారు. రాస్సు కి ఒక నంబర్ కూడా ఇచ్చేరు. వరస సంఖ్య లో నెం.5. ఏప్రిల్ 22న ఇంద్రావతి నది ఒడ్డున ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు పేర్కొన్నారు.

Also read  ఆదివాసీ యువశక్తి "జాయ్స్" ఫేస్ బుక్ పేజి నుండి అసెంబ్లీ ఎన్నికల వరకూ!

మృత దేహం నెం. 10 – నుస్సీ , పెళ్ళికి వెళ్ళిన ఆ గ్రామ టీనేజ్ యువకుడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చేడు. పెళ్ళికి అని వెళ్లి శవం గా మారిపోయేడు. మృత దేహం ఉబ్బిపోయి ఉంది, బాగా కొట్టిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఫోటో చూసి నా కొడుకే అయివుడొచ్చు అనుకున్నాడు నుస్సీ తండ్రి.

నాగపూర్ కి 310 కి మీ దూరం లో ఉండే ‘గట్టేపల్లి’ అనే ఒక కుగ్రామం ఈత పల్లి తాలూకా, గడ్చిరోలి జిల్లా కి సంబంధించిన ప్రాంతం. 35 ఆదివాసీ కుటుంబాలు మాత్రమె జీవించే ఆ గ్రామం తెండు ఆకులను సేకరిస్తూ జీవనం సాగిస్తుంది.

ఏప్రిల్ 21 న 16 సంవత్సరాల రాస్సు మరియు మిగతా 7 మంది పక్క గ్రామం అయిన కసనూరు కి  పెళ్ళికి వెళ్ళేరు.  కానీ వాళ్ళు పెళ్ళి ఇంటి వరకూ వెళ్ళిన జాడా లేదు. మధ్యలోనే ఎన్కౌంటర్ కి గురి అయ్యేరు.

నాగోటి-గడ్చిరోలి జిల్లా పరిషత్ సబ్యుడు కధనం ప్రకారం ఈ 8 మంది పెళ్ళికి బయలుదేరిన వారు ఆ గ్రామం దగ్గర్లో ఉన్న మావోయిస్టు క్యాంప్ వైపు వెళ్లి ఉండాలి లేదా పోలీసులు దారి మధ్య లో వారిని బలవంతాన తీసుకుని వెళ్లి ఉండోచ్చు. అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

According to the police, 34 “armed rebels” gathered on the banks of Indravati river were killed in an alleged encounter between the C-60 commandos and Naxals. Credit: Sukanya Shantha/The Wire

పోలీసులు మీడియా కి ఇచ్చిన సమాచారం ప్రకారం రెండు చోట్ల ఎన్కౌంటర్ జరిగినట్లు పేర్కొన్నారు. ఆ ఎన్కౌంటర్ లో సి- 60 కమెండోస్ 34 మంది ని ఒక చోట మిగతా 6 ని ఇంకొక ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు ల ఏరివేత కార్యక్రమంలో ఒకే రోజు ఇంత మందిని మట్టు బెట్టడం ఇదే ప్రధమం గా పేర్కొన్నారు.

ఏది ఏమైనా రాజ్య వ్యవస్థ కి – మావోయిస్టు లకు మధ్య 8 మంది ఆదివాసీ పిల్లలు చనిపోయేరు. ఇప్పుడు, ఇప్పుడే చదువు ల బాట పడుతున్న ఆదివాసీల జీవితంలో ఇది మరో విషాదం. దీనికి కారణం మావోయిస్టు లు , బారత ప్రబుత్వం.

Also read  “ఇద్దరూ ఇద్దరే”అంబేడ్కర్-మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్!

ప్రజాస్వామ్య బారత దేశం లో ఒక అమాయక పౌరుడు రాజ్యం చేతిలో చనిపోయేడు అంటే అది మానవ హక్కుల ఉల్లంగన. బారత ప్రబుత్వం, బారత దేశం అంతర్జాతీయ మానవ హక్కుల సంస్త ముందు, విదేశాల ముందు తల దించుకునే సంఘటన. అలాంటిది 8 మంది యుక్త వయస్సు పిల్లలు ఒకే రోజు అత్యంత కిరాతకంగా చంపబడితే రాజ్యం మౌనంగా ఉంది. దేశం మౌనంగా నాకేమి పట్టనట్లు ఉంది. ఎందుకంటె వాళ్ళు ఆదివాసీలు, వారు మనుషులు కారు, ఈ పౌర సమాజానికి సంభంధం లేని వారు.

ఆంధ్ర ప్రదేశ లో తిరుపతి శేషాచల అడవిలో ఎర్ర చందనం కూలీలను కాల్చి చంపినప్పుడు కుడా సమాజానికి చీమ కుట్టినట్లు కుడా లేదు.

దీనికి పరిష్కారం ఏంటి?

బారత దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ఓటు అనే హక్కు ద్వారా పాలకులను ఎన్నుకుంటాం. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బారత గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేరు. అడివసీలా లేక మైదాన ప్రాంతంలో ఉంటే అత్యంత ఖరీదు చేసే మనుషులా అని చూడలేదు. ఒకే వ్యక్తీ- ఒకే విలువ- ఒకే ఓటు. దీనిని సద్వినియోగం చేసుకోవడంలో ఆదివాసీలు విఫలం అవుతున్నారు. దళితులు మాదిరిగానే ఆదివసీలలో కుడా నాయకుడు, నాయకత్వం లోపం తీవ్రంగా ఉంది.

దున్నే వాడిదే భూమి అనే నినాదం తో ప్రజలను ఆకట్టుకున్న ఒకప్పటి పీపుల్స్ వార్ నేడు ఆదివాసీల ను తమ రక్షణ కవచంగా పెట్టుకుంది. వారిని బలితీసుకుంటుంది.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బ్రాహ్మనిజం ఏ రూపాన ఉన్నా ప్రమాదం అన్నారు. మావో ఇజం లో కుడా కులం ఉందని మే 17 కామ్రేడ్స్ చెప్పకనే చెప్పేరు. దళిత బహుజనుల శ్రామిక విముక్తి కోసం పోరాడిన మారోజు వీరన్న లాంటి వారు బాబాసాహెబ్ ని అధ్యనం చేసి ప్రజాస్వామ్యం దిశగా వెళ్ళే క్రమంలో ఎన్కౌంటర్ చెయ్యబడ్డారు.

Also read  మోడీల అవినీతిపై చర్చను అడ్డుకున్నహోదా!

ఆదివాసీలు కానీ, దళితులు కానీ బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ని అధ్యయనం చెయ్యకుండా తమ కి విముక్తి కలగాలి అంటే అది అసాద్యం. ఆదివాసీ గూడెం లో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ విగ్రహం వారి ఆత్మగౌరవ చూచిక కావలి. అయిన చూపుడు వేలు మార్గంలో ఆదివాసీలు నడవాలి.

పీపుల్స్ వార్ కానీ, మావో లు కానీ గ్రామీణ వ్యవస్తలో ఫ్యూడల్ కుల నాయకులను వారి అరాచకాలను నిలువరించేరు అనేది కాదనలేని సత్యం, కానీ నూతన ప్రజాస్వామ్య సిద్దాంతం ఓటు అనే హక్కు ద్వారా తమకి విముక్తి కలుగుతుందని మావో లు గుర్తించలేదు.

ప్రపంచ విప్లవ చరిత్ర చుస్తే ఏ దేశంలో అయినా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేదు. అది ఎప్పటికీ హింసాత్మక మార్గమే, ఆ హింసాత్మక మార్గం లో 1980 నాటి నుండి ఎందరో దళిత – గిరిజన మేధావులను ఆ సమాజం కోల్పోయింది. బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ చూచించిన “భోధించు, పోరాడు, సమీకరించు” అనే త్రికరణ సూత్రాలు అధ్యనం చెయ్యకుండా దళిత, ఆదివాసీ మేధస్సు ను అడువులపాలు చేసేరు.

ఇప్పటికైనా దళిత, ఆదివాసీలు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మార్గమే అంతిమ మార్గం అని గుర్తించి ఆ మార్గం లో ప్రయాణించాలి. మావో సానుబుతి పరులుగా లేదా కమ్యునిజం సానుబుతి పరులుగా ఉన్న దళిత, ఆదివాసీ లు తమ విముక్తి మార్గం బాబాసాహెబ్ చూపుడు వేలు అని గుర్తించాలి లేదంటే మావో భూతాన్ని చూపించి రాస్సు, నుస్సీ లాంటి బవిషత్ తరాలను ఇంకేందరినో కోల్పోతాము. పెట్టుబడిదారులు సి- 60 కమాండోస్ ని అడ్డం పెట్టుకుని యద్దేచ్చగా దళిత , ఆదివాసీలకు చెందాల్సిన సహజ వనరులను దోచుకుంటూనే ఉంటారు.

ఇప్పటికైనా ఆదివాసీ, దళిత మేధావులు, సంఘాలు మేల్కొనకపోతే వారు చారిత్రాత్మకమైన తప్పిదం చేసినవారు అవుతారు.  

మూల కధనం : సుకన్య శాంత – ది వైర్ 

 

 

(Visited 172 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!