ఎన్నికలు: భారత దేశ ఎన్నికల చరిత్ర-1

షేర్ చెయ్యండి

ఎన్నికలు స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలు 1950 నుండి ప్రారంభం మొదలైంది. భారత రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి స్వతంత్ర (కమీషన్) వ్యవస్థని ఏర్పాటు చేశారు.


దేశం అంతటా ఎన్నికలు విధానం, పక్రియ మరియు ఆచరణ ఒకే విధంగా ఉండే విధంగా కమీషన్ విధి విధానాలను ఏర్పాటు చేశారు.

 
డా బాబాసాహెబ్ అంబేడ్కర్, ఎన్నికల కమీషన్ కు కేంద్ర, రాష్ట్ర మరియు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించే హక్కు ఉండాలని గట్టిగా వాదించారు. 


రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమీషన్ స్వతంత్ర సంస్థ, ఎన్నికల కమీషనర్ ను రాష్ట్రపతి నియమిస్తారు.


స్వతంత్ర దేశములో మొట్టమొదటిసారి 1952 లో పార్లమెంట్ (లోక్ సభ) కు ఎన్నికలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ 245 స్థానాలు గెలుచుకుని మొదట దేశాన్ని పాలించింది. 

    

ఎన్నికలు ,లోక్ సభ లో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 530 మంది వివిధ రాష్ట్రాల ద్వారా డైరెక్ట్ గా ఎన్నిక కాబడతారు. మిగిలిన 22 మందిలో 20 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరు ఆంగ్లో – ఇండియన్స్ ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.

 

ఎన్నికలు – మొదటి లోక్ సభ – 1952:

స్వతంత్ర భారత దేశం , ప్రజాస్వామ్య , రిపబ్లిక్ భారత దేశం లో  మొదటిసారి ఏప్రిల్ 1952 లో ఎన్నికలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుని  జవహర్ లాల్ నెహ్రు ని స్వతంత్ర దేశానికి మొదటి ప్రధానిగా ఎన్నుకున్నది.

 
కాంగ్రెస్ పార్టీ కి పోటీగా శ్యాంప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో జన సంఘ్, రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ,  రాంమనోహర్ లోయ , జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా, ఆచార్య కృపలానీ నేతృత్వంలో కిసాన్ మజుదూర్ ప్రజా పరిషత్  తదితరులు పోటీ పడ్డారు.


మొదటి ఎన్నికలు 26 రాష్ట్రాలలో 489 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరోజుల్లో రెండు లేదా మూడు స్థానాలకు కలిపి ఒక అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది. 1960 లో ఈ బహు నియోజకవర్గాలను రద్దు చేసారు.

 
1952, ఏప్రిల్ 17న మొదటి లోక్ సభ ప్రారంభం అయ్యింది. రికార్డ్ స్థాయిలో 3,784 గంటలు లోక్ సభను నిర్వహించారు. 677 సార్లు సభ్యులు లోక్ సభకు హాజరుఅయ్యేరు ఏప్రిల్ 4, 1957 న మొదటి లోక్ సభ కాలం ముగిసింది.

 

ఎన్నికలు – రెండవ లోక్ సభ – 1957:


రెండవ లోక్ సభ కు ఎన్నికలు 1957 లో జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 296 స్థానాలలో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టింది.

 
మే 11, 1957 న జవహర్ లాల్ నెహ్రు రెండో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసాడు. M. అనంతశయనం ఐయ్యంగార్ రెండొవ లోక్ సభకు స్పీకర్ గా ఎన్నుకోబడ్డాడు.

Also read  పెట్రోలు ధర పెంపు : ముంబై లో పెట్రోలు లీటరు ధర 91 రూపాయిలు

 
కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 47.78 శాతం ఓట్లతో మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ మొట్టమొదటి సారిగా రాయబరేలి నియోజకవర్గం లో 29,000 ఓట్ల ఆధిక్యంతో తమ సమీప అభ్యర్థి నంద కిషోర్ మీద విజయం సాధించారు.

 
రెండొవ లోక్ సభ లో మొదట ఒక్క మహిళా ప్రతినిధి ఎన్నుకోబడలేదు. స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మొత్తం 19 శాతం ఓట్లు సాధించారు.

 
ఈ సమయంలోనే నెహ్రు ప్రభుత్వం పంచవర్ష ప్రణాళిక లు రూపొందించారు. అలాగే సైన్స్ ఆండ్ టెక్నాలజీ మీద దృష్టిపెట్టారు. స్టీల్ మరియు చేనేత పరిశ్రమలను స్థాపించారు. జలవనరుల నిల్వ కోసం ఆనకట్టలు కట్టడం ప్రారంభించారు. 

రెండొవ లోక్ సభ మార్చి 31, 1962 లో మొత్తం వ్యవధిని పూర్తిచేసుకుని ముగిసింది.ఎన్నికలు – మూడవ లోక్ సభ – 1962:


మూడోవ లోక్ సభ అత్యంత కీలమైన సమయం లో ఎన్నోకోబడింది. స్వతంత్ర భారత దేశానికి, ప్రజాస్వామ్యానికి మొదటి సవాల్ ని ఎదుర్కొంది. ఏప్రిల్ 1962 లో మూడోవ లోక సభ ప్రారంభం అయ్యింది.

 
మూడోసారి కూడా నెహ్రు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టి విజయంసాధించి అధికారం చేజిక్కించుకుంది.

 
ఈ కాలంలో నెహ్రు చైనా నుండి తీవ్రమైన ఘర్షణ ను ఎదుర్కొన్నాడు. చైనా టిబెట్ కి అత్యంత సమీపంలో మిలటరీ కోసం రహదారిని  నిర్మించి భారత్ మీద యుద్దానికి కాలుదువ్వింది.

 
ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆరోగ్యం దెబ్బతిని మే 27, 1964 న గుండెపోటుతో మరణించడం జరిగింది.

 
పదవిలో ఉన్న కాలంలో నెహ్రు మరణించడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుల్జారి లాల్ నంద ఆపధర్మ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు.

 
కాంగ్రెస్ పార్టి గుల్జారీ లాల్ నంద ని కాదని లాల్ బహుదూర్ శాస్త్రిని ప్రధానిగా ఎన్నుకున్నారు. నంద కేవలం రెండు వారాలు మాత్రమే ప్రధాని గా సేవలు అందిచారు.

 
ప్రధానిగా లాల్ బహుదూర్ శాస్త్రి 1965 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో విజయం సాధించారు. అయితే విజయఫలాలు రుచిచూడక ముందే శాస్త్రి జనవరి 10, 1966 న  మరణించారు.


పదవీకాలం ముగియకుండానే మరణించడంతో మళ్ళీ ఆపద్ధర్మ ప్రధానిగా గుర్జాలి లాల్ నంద ప్రమాణ స్వీకారం చేసారు.

 
నెహ్రు కుమార్తె ఇందిరా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రి వర్గంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేసారు.

 
ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నడియర్ ఇందిరా గాంధీ ని ప్రధానిగా చెయ్యడానికి కృషి చేశారు. జనవరి 24,1966  ఇందిరా గాంధీ ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసారు.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ, దేశం చాల విపత్కర పరిస్థితులు అనుభవించింది.

ఒకవైపు కరువు, నిరుద్యోగ సమస్య, లేబర్ సమస్య లు, రూపాయి విలువ పడిపోవడం, పంజాబ్ నుండి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఇలా దేశం అతలా కుతం అయ్యింది.

 

ఎన్నికలు – నాల్గొవ లోక్ సభ – 1967:


నాల్గొవ లోక్ సభ జాతీయ కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం అని చెప్పాలి. ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు వలన మెర్జీ దేశాయ్ ని ఉప ప్రధానిగా ఎన్నుకున్నారు. 

Also read  ఎన్నికలు 2019: దళిత రాజకీయం - ఎన్నికలు


మొరార్జీ దేశాయ్ నెహ్రు చనిపోయిన తర్వాత  ఇందిరా గాంధీ ని
ప్రధాని గా కాకుండా అడ్డుకున్న వ్యక్తి. ఈయన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో పనిచేసారు.

 
ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు అయ్యింది. క్రమశిక్షణ పేరుతొ ఇందిరా గాంధీ ని పార్టీ నుండి బహిష్కరించారు. 

మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ (ఓ) గా , ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ (ఐ) విడిపోయింది.

 
మైనారిటీ,అంతర్గత విభేదాలతో ప్రభుత్వం నడపడం భావ్యం కాదని సంవత్సరం కాలం ఉండగానే ఇందిరా గాంధీ లోక్ సభ ను రద్దు చేసి ఎన్నికలు కు  వెళ్లారు.

 
దేశంలో తొలి సారిగా కాంగ్రెస్ వ్యతిరేక నాయకత్వం దేశంలో ప్రారంభం అయ్యింది.

ఎన్నికలు తమిళనాడు, కేరళ, ఒడిస్సా, బీహార్ , పచ్చిమ బెంగాల్, పంజాబ్  లాంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ యేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

    
 
ఎన్నికలు – ఐదొవ లోక్ సభ – 1971:


ఐదొవసారి దేశం ఎన్నికలు ఎదుర్కొంది. ఇందిరా గాంధీ నాయకత్వంలో మొట్టమొదటిసారి అత్యధిక 352 స్థానాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

 
ఇందిరా గాంధీ ‘గరీబ్ హఠావో’ నినాదం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఈ అఖండ విజయం  ఇందిరా గాంధీ ఒక ప్రభల శక్తి గా తయారుకావడానికి తోడ్పడింది.

   
1971 లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్తాన్ మీద యద్ధం చేసి విజయం సాధించారు. ఈ విజయమే బంగ్లాదేశ్ దేశం ఏర్పాటు అయ్యింది.

 
ఈ యుద్ధం లో విజయం సాధించిన తర్వాత నుండి చైనా, అమెరికా దేశాలు భారత దేశంతో సాధారణ సంభందాలు కొనసాగించడానికి విముఖత చూపించాయి.

 
ఒక వైపు కరువు, మరోవైపు యుద్ధం అత్యంత ఖరీదు కావడంతో దేశం ఆర్ధికంగా సమస్యలు చూడాల్సి వచ్చింది.

 
ఇందిరా గాంధీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని అలహాబాద్ హైకోర్టు లో వేసిన పిటీషన్ ఆమెకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది.

జూన్ 12, 1975 న తీర్పుకు ఇందిరా గాంధీ తన పదవికి రాజీనామా చెయ్యకుండా దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి, ప్రతిపక్ష నాయకులను జైలు లో నిర్బంధించింది.

 
జూన్ 25, 1977 నుండి, మార్చి 1977 వరకు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ తర్వాత నాయకులను జైలు నుండి విడుదల చేసి ఎన్నికలు నిర్వహించారు.

 

ఎన్నికలు -ఆరొవ లోక్ సభ – 1977:


మార్చి 1977 వరకూ ఎమర్జెన్సీ ఎత్తివేసి, సాధారణ ఎన్నికలు నిర్వహించారు  కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నేతృత్వంలో మొట్ట మొదటి సారి ఘోర పరాజయం పాలైంది.

జనతా పార్టీ ఈ ఎన్నికలు లో విజయం సాధించింది. మొట్ట మొదట కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది.

Also read  లోక్ సభఎన్నికలు: భారత దేశంలో ఎన్నికల చరిత్ర -2

 
కాంగ్రెస్ పార్టీ నుండి బాబు జగ్జీవన్ రాం లాంటి చాలా మంది నాయకులు పార్టీ ని వీడిపోయారు.

 
కాంగ్రెస్ (ఓ ) , జన సంఘ్ , జనతా పార్టీ, భారతీయ లోకదళ్, సోషలిస్టు పార్టీలు కలిసి
ఎన్నికలు కూటమిగా ఇందిరా కాంగ్రెస్ తో పోటీపడి విజయం సాధించారు.

ఎమర్జెన్సీసమయంలో ఇందిరా గాంధీ మీద దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘన జరగడం, నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆమె మీద వ్యతిరేకతకు కారణాలు.


ఈ ఎన్నికల్లో ఇందిరా గాంధీ మరియు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఇద్దరు ఎన్నికల్లో ఓటమి చవిచూసారు. 


ఎన్నికలు – ఎడొవ లోక్ సభ – 1980

దేశంలో తొలిసారి కాంగ్రెస్ కాకుండా జనతా  పార్టీ  కేంద్రంలో అధికారం చేపట్టింది. జనతా పార్టీ కి ఎన్నిక ల్లో 274 స్థానాల మెజారిటీ లభించింది.


కాంగ్రెస్ పార్టి ని ఓడించగలిగేరు కానీ ప్రభుత్వాన్ని నడపడంలో జనతా పార్టి విఫలం చెందారు.చరణ్ సింగ్, బాబు జగ్జీవన్ రామ్ లాంటివారు మొర్జీ దేశాయ్ కి తలనొప్పిగా మారారు.


కూటమి లో ఉన్న సోషలిస్టు లకు, హిందూ శక్తుల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. జన సంఘ్ నేతలు ఆటలబీహారీ వాజపేయ్, ఎల్కే అద్వానీ లు ప్రభుత్వానికి తమ మద్దత్తు ఉపసంహరించుకున్నారు. 


ఇంకొకవైపు ఎమర్జెన్సీ లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన మీద జనతా ప్రభుత్వం వేసిన కమీషన్ లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేక భావాన్ని ప్రజల్లో కల్గించింది.

 
జూన్ 1979 లో  మొరార్జీ దేశాయ్ పార్లమెంట్ లో  మెజారిటీ పొందలేక పదవికి రాజీనామా సమర్పించారు.  


చరణ్ సింగ్ జనతా పార్టీ కూటమి లోని కొందరి మద్దతు తో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మొదట చరణ్ సింగ్ కి మద్దతు పలుకుతామని చెప్పి తర్వాత తప్పుకున్నారు.

 
ప్రధాని చరణ్ సింగ్ 1980 లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు.ఇప్పటివరకూ పార్లమెంట్ లో ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కొని ప్రధాని గా రికార్డ్ సృష్టించారు.   


ఎన్నికలు ఎనిమిదో లోక్ సభ – 1984
సశేషం 
ఎనిమిదొవ లోక్ సభ నుండి తరువాయి భాగం లో  

(Visited 20 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!