ఎన్నికలు 2019: దళిత రాజకీయం – ఎన్నికలు

షేర్ చెయ్యండి
  • 98
    Shares

ఎన్నికలు 2019, సార్వత్రిక ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో ఏప్రిల్ 11వ తేదీన జరుగుతున్నట్లు ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.

లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 


అత్యంత ఉత్కంఠ భరితంగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో అధికార తెలుగు దేశం పార్టీ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య ప్రధానంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 


ఆంధ్ర ప్రదేశ్ లో మెజారిటీ ఓటర్లు దళితులు కాగా, రాజకీయంగా మైనారిటీ ప్రజలైన కమ్మ – రెడ్డి కి సంభంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులు గా మెజారిటీ ప్రజలను పాలిస్తున్నారు . 


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ పరిస్థితి కొనసాగుతుంది. మెజారిటి ప్రజలైన వెనకబడిన`తరగతులలో రాజకీయంగా పెద్దగా చైతన్యం లేకపోవడం తో గత 70 ఏండ్ల నుండి బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ ముఖ్యమంత్రులే రాజ్యాధికారం చేపట్టారు. 


తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తో జనాభా పరంగా మైనారిటి లో ఉన్న వెలమ సామజిక వర్గం మరియు రెడ్డి సామజిక వర్గం రాజ్యాధికారం కోసం పోటీ పోటీపడుతున్నాయి. 


మరి కాపు,  బిసి లు, ఎస్సి ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఎస్టీ ( షెడ్యూల్ తరగతి ) మరియు మైనారిటీ లు ఎప్పుడు రాజ్యాధికారం కోసం పోటీ పడతారు?

Also read  భారతీయట్రైబల్ పార్టి: అస్తిత్వ ఉద్యమం నుండి రాజ్యాధికారం వైపు!

ఎన్నికలు 2019 – దళితులు:

 
కమ్యూనల్ అవార్డు ద్వారా దళిత ( ఎస్సి / ఎస్టీ ) లకు రాజకీయ ఓటు హక్కును సాధించిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారు, దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు సాధించగలిగారు. 


ఈ ప్రత్యేక నియోజక వర్గాలలో నిలబడిన దళిత రాజకీయ నాయకులు కీలు బొమ్మలు గానే ఉంటున్నారు. ఎన్నికలు 2019 లో కూడా కీలు బొమ్మలనే పోటీ బరిలోకి దింపుతారు.

దీనివలన దళితులకు ఏ ప్రయోజనం దక్కకపోగా ఇటీవల కాలం లో రిజర్వుడు అసెంబ్లీ స్థానాలలో గెలిచిన వారిని అడ్డం పెట్టుకుని ఫ్యూడల్ కులాలు దళితులకు ద్రోహం  (రాజకీయం) చేస్తున్నాయి. 


1937 ఆగస్టు నెలలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వార్షిక సభ ముంబాయి లో జరిగినంతరం జరిగిన కార్యకర్తల మహా సభ లో బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ప్రసంగించారు.


గాంధీ జి శ్రమ జీవుల పట్ల సానుభూతి గలవాడని, వారి సమస్యల పట్ల శ్రద్ధ వహిస్తాడని ఎవరైనా భావిస్తే అది శుద్ధ పొరపాటు. 


గాంధీ బిర్లా , టా టా లాంటి లక్షాధికారుల సన్నిహితుడే గాని, శ్రమజీవుల శ్రేయోభిలాషి కానే కాదు. నేడు దేశంలో అందరూ గాంధీ వారసులే కాబట్టి దళిత సమాజం బాబాసాహెబ్ చెప్పిన మాటలు పరిగణ లోకి తీసుకోవాలి. 


గాంధీయిజం అంటే మెజారిటి ప్రజల ఓట్లతో ( దళిత , ఆదివాసీ, బి సి మరియు మైనారిటి) మైనారిటి కులం రాజ్యం పాలించడం. కాడెద్దులు గా బహుజనులను తీర్చిదిద్దటమే. 

Also read  కీలకమవుతున్న ‘బెహన్ జి మాయావతి’ బిఎస్పీ పార్టీ!


ఎన్నికలు 2019, లో కూడా దళిత వర్గాలు కాడెద్దు లుగా ఉండటానికే ఇష్టపడుతున్నారా? 


సమానత్వం, సమాన ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం యీ మూడింటి కోసం నిమ్న జాతీయులు రాజకీయం చెయ్యాలని బాబాసాహెబ్ పిలుపు నిచ్చేరు. 


సొంతగా పార్టీ నిర్మాణం చేసి రాజకీయం చేసే స్థితి దళిత వర్గాల్లో లేకపోయినా ఉన్న అవకాశాలను క్రోడీకరించి కూటమి రాజకీయాలలో కూడా దళిత పార్టీ / దళితులు లేకపోవడం మరో ఐదు సంవత్సరాలు కాడెద్దులు గానే ఫ్యూడల్ కులాలకు ఊడిగం చెయ్యబోతున్నారు. 


ఎన్నికలు 2019 – దళిత తిమ్మయ్యలు:

 
కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు ద్వారా ఇప్పటి వరకూ దళిత వర్గాలు సాధించింది పెద్దగా ఏమీ లేదు. దళిత వర్గాలపైన జరిగే దాడులను అరికట్ట లేకపోయాం. 


కులోన్మాదుల ఏలుబడిలో కుల సంఘాలు పుట్టుకొస్తూ, తమ స్వల్ప ప్రయోజనాలతో, అగ్రకులాలకు ఊడిగం చేస్తున్నాయి. 


కుల, మతోన్మాదుల ఏలుబడిలో ప్రత్యేక నిధులు, ప్రత్యేక కార్పొరేషన్లు , ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పాటు కు అంగీకరిస్తారు, కానీ రాజకీయంగా దళితులు ఎంత అణగ దొక్కబడుతున్నారో అర్ధం కావడం లేదు. 


రాజకీయమైన శక్తి ద్వారానే మనం స్వేచ్ఛా స్వాతంత్య్రలను సాధించి తద్వారా సాంఘిక బంధాల నుండి విముక్తి బొందగలుగుతాం. బాబాసాహెబ్ డా. అంబేడ్కర్.

 
దళితుల్లోనే కొందరు తిమ్మయ్యలు తయారై శత్రువర్గాల చుట్టూ కుప్పిగంతులు వేయడం వల్ల మనం సాధించిన రాజకీయ శక్తి చాలా వరకూ దుర్వినియోగమైంది అని బాబాసాహెబ్ నిమ్న జాతీయ రైల్వే సభ్యులను ఉద్దేశించి బాబాసాహెబ్ మాట్లాడారు.

Also read  తెలంగాణ ఎన్నికలు దళిత - బహుజనుల నవీన రాజకీయానికి నాంది కాబోతుందా!

 
వీరు సాగించిన విద్రోహ చర్యల వల్లనే శత్రువర్గాల వారు మనపై దెబ్బ తీయగల్గారు. ఈ విద్రోహం ఎన్నికలు 2019 కూడా జరుగుతుండటం గమనార్హం. 


జాతీయ పార్టీ అయిన బిఎస్పీ మరియు తమిళనాడు కేంద్రంగా దళిత – బహుజన రాజకీయం చేస్తున్న విసికె లాంటి పార్టీ లు ఆ ప్రాంతాలకే పరిమితం అవడం, మిగతా ప్రాంతాల్లో రాజకీయంగా ప్రభావం చూపలేక పోతున్నాయి.

 
దేశవ్యాపతంగా దళిత యువ కుల్లో బాబాసాహెబ్ కోరుకున్న రాజకీయ శక్తి ఇప్పుడు, ఇప్పుడే మొగ్గతొడుగుతుండం ఆహ్వానించదగ్గ పరిణామం.

ఈ శక్తిని వ్యవస్తీకరించగలిగితే బాబాసాహెబ్ కోరుకున్న రాజ్యాధికారం 2024 లో అయినా సాధించగలుగుతారు.   

(Visited 203 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!