ఎన్నికల ఆరాటంలో వ్యవస్తీకృత మోసానికి పాల్పడుతున్న పార్టీలు!

షేర్ చెయ్యండి
  • 55
    Shares

ఎన్నికల ఆరాటంలో రాజకీయ పార్టీలు వ్యవస్తీకృత మోసానికి పాలాడుతున్నాయి. స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజాస్వామ్య పరిరక్షణ రాజకీయ పార్టీలలో లేకపోవడం దురదృష్టం. 


ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న వెలుగులోకి వచ్చిన ఐటి గ్రిడ్ డేటా వ్యవహారం దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 


ప్రజల వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉండాలి. ఆ సమాచారం ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉంటే ఆర్ధిక నేరగాళ్లకు పగ్గాలు ఇచ్చినట్లే అవుతుంది. సంఘ విద్రోహ శక్తులకు ద్వారాలు తెరిచినట్లే. 


ప్రభుత్వ పధకాల నిర్వహణ కోసం అంటూ ఒక రాష్ట్రం లోని ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కన్సల్టెంట్ లకు ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గానీ, మంత్రులుగానీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుంది. 


ఎన్నికల ముందు పశుపు కుంకుమ!


ఎన్నికల లబ్ధికోసం ప్రభుత్వాలు విచ్చలవిడిగా మోసాలకు పాలపడుతున్నారు. ఎన్నికలు రెండు నెలలు ముందు అధికార పార్టీ డ్వాక్రా మహిళలకు పశుపు – కుంకుమ పేరిట డబ్బులు పంచుతుంది. 


ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం లో రైతు బంధు పేరిట సరిగ్గా ఎన్నికలకి మూడు నెలలు ముందు రైతుల బ్యాంకు ఖాతా లో డబ్బులు వేసింది. 

Also read  క్రోనీ క్యాపిటలిజం!


ఈ ఓట్ల కొనుగోలు పధకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ప్రవేశపెట్టడం అంటే వ్యవస్థ ఎంతటి మోసానికి గురవుతుందో ప్రజాస్వామ్య వాదులు అర్ధం చేసుకోవాలి. 


ఇటీవల తెలంగాణా అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో దాదాపుగా 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారు. 


ఒక రాష్ట్రంలో  ఏకంగా 22 లక్షల ఓటర్ల ప్రాధమిక హక్కు అయిన ఓటు ను తొలగించిన కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రాంతీయ అధికారి క్షమాపణలు కోరడం మనకి తెలిసిందే. 


సంక్షేమ పధకాల పేరుతొ  ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించి, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఓటర్లను తొలగించడం ప్రభుత్వాలే చేస్తున్నాయి. 


ఒక రాష్ట్రంలో ఏకంగా 22 లక్షల మంది ఓటర్ల ను తొలగించి ఎన్నికలు నిర్వహించిన సదరు అధికారి మీద భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.


కేంద్ర ప్రభుత్వం ఓటు చైతన్యం అంటూ కోట్లాది రూపాయిలు ప్రకటనలకు ఖర్చు పెడుతున్నా సాక్షాత్ రాజకీయ నాయకులు , అధికారులు కుమ్మకై వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న తీరు సివిల్ సొసైటీ ప్రశ్నించక పోవడం క్షమించరానిది. 


సమాజాన్ని కులం – మతం వారీగా విడగొడుతున్న పార్టీలు!


అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో బహిరంగంగా కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఒక కులం వారి, మతం వారి ఓట్లు అప్పనంగా దోచుకోవడం కోసం ఈ ఎత్తుగడ వేస్తున్నారు. 

Also read  Dalits outrage effects politics in Andhra Pradesh!


రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో లేని అంశాలను సైతం ఎన్నికల హామీలుగా ఇచ్చి, ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. 


కుల రహిత, మత రహిత సమాజాన్ని నిర్మించాల్సిన రాజకీయ పార్టీలు రాజ్యాంగేతర శక్తులు గా మారి  లౌకిక రాజ్యం లో మత, కుల ఘర్షణలకు కేంద్ర బిందువు అవుతున్నారు. 


ఎన్నికలు – ఆర్ధిక నేరగాళ్లు!


నేడు ఏ రాష్ట్రంలోని ప్రభుత్వాలను లేదా పార్టీ నాయకులను ఉదాహరణకు తీసుకున్నా మెజారిటీ రాజకీయ పార్టీల మీద ఆర్ధిక నేరారోపణ ఉంది. 


ప్రభుత్వాలు వ్యవస్థలను మోసం చేసి యథేచ్ఛగా తమ అనుమాయులకు మరియు బందు మిత్రులకు సంపదను దోచిపెడుతున్నారు. కొందరు పరోక్షంగా వాటాలు తీసుకుంటూ జైలుకి వెళ్తున్న సందర్భం ఉంది.


ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులే అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలు కు వెళ్లడం మనకు తెలుసు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు పేరిట వేలాది ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. 


పాలనలో పారదర్శకత లోపించి, గెలుపు కోసం డబ్బు, అలివికాని వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత డబ్బు యావ తప్పా సంక్షేమం పట్టని ప్రభుత్వాలు. 

Also read  మదుర మీనాక్షి ఆలయంలో దళితులు అడుగుపెట్టినప్పుడు ఏమైందంటే...?


భారత రాజ్యాంగ చట్ట సభలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ దేశ రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేసారు. 


భారత రాజ్యాంగం సరళంగా కనిపిస్తున్నా అవసరమైనప్పుడు అది చాలా గట్టిగా వ్యవహరిస్తుంది. రాజకీయ నాయకులు రాజ్యాంగం అడ్డం పెట్టుకుని ఎలాంటి మోసాలు చేసినా అదే రాజ్యాంగం వారిని శిక్షిస్తుంది. 

(Visited 51 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!