న్నికల కమీషన్: హద్దు దాటిన ప్రచారం మీద ఎన్నికల కమీషన్ కొరడా!

షేర్ చెయ్యండి
  • 88
    Shares

ఎన్నికల కమీషన్ భారత రాష్ట్రపతి కార్యనిర్వహణ పరిధిలోని ముఖ్యమైన వ్యవస్థలో ఒక్కటిగా భారత రాజ్యాంగం కల్పించింది. సుప్రీం కోర్టు, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ , మరియు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తో పాటు ఎన్నికల కమీషన్ రాజ్యాంగానికి ఉన్న నాలుగు స్తంబాలలో ఒక్కటి. 


ఎన్నికలు నియంత్రణ, పర్యవేక్షణ ఎన్నికల కమీషన్ స్వతంత్రంగా , ఎలాంటి రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా, ఎన్నికలు నిర్వహించాలి. 


ఎన్నికల కమీషన్ ను 1950, జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమీషన్ సుప్రీంకోర్టు మాదిరిగా స్వయం ప్రతిపత్తి గల్గిన సంస్థ. 


భారత ఎన్నికల కమీషన్ ను రాష్ట్రపతి నియమిస్తారు. రాజ్యాంగంలోని 15వ భాగంలో  ఆర్టికల్ 324 నుండి 329 వరకూ ఎన్నికల సంఘం యొక్క విధి విధానాల గురించి ప్రస్తావించారు. 


ప్రజాస్వామయంలో ఎన్నికలు ముఖ్యమైన ఘట్టం. ఎన్నికల సమయంలో కమీషన్ తమ విచక్షణా అధికారాలు వుపయోగించి ఎన్నికలు రద్దు చెయ్యవచ్చు, అభ్యర్థిని తొలగించవచ్చు. 


ఎన్నికల పక్రియ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీం కోర్టు లేదా హైకోర్టు లో ఎన్నికల కమీషన్ మీద కేసు వేయవచ్చు. 


భారత రాజ్యాంగము చాలా సరళంగా కనిపిస్తుందని కొందరు విమర్శలు చేస్తూ ఉండవచ్చు, కానీ రాజ్యాంగ మూల స్తంబాలు వేటికి అవే స్వయంప్రకాశకాలు గా అగుపించినా , నియంత్రణ విషయంలో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. 


ఎన్నికల కమీషన్ 1989 వరకూ ఏక సభ్య కమీషన్ గా ఉన్నా ఆతర్వాత బహుళ సభ్యులు గల కమీషన్ గా ఏర్పాటు చేశారు. 1993 లో టి ఎన్  శేషన్ ప్రధాన ఎన్నికల కమీషనర్ గా నియమిపబడ్డాడు. 


మాజీ ఎన్నికల కమీషన్ టిఎన్  శేషన్ బహుళ సభ్యులు గల కమీషన్ ను 1990 జనవరి 1 వ తేదీన రద్దు చేసి ఏక సభ్య కమీషన్ గా నియమించాడు. 

Also read  దళితుల ఐక్యత రాజ్యాధికారం ఎండమావేనా!


టి ఎన్ శేషన్ నియంతృత్వ ధోరణి నచ్చక ఆనాటి ప్రభుత్వం కమీషన్ ను రద్దు చేసి బహుళ సభ్యులుగల సంస్థగా ఏర్పాటు చేశారు. 


గీత దాటిన వారి మీద చర్యలు!

రిప్రెజెంటిటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఎన్నికల ప్రచారంలో ఏ అభ్యర్థి అయినా కులం , మతం , ప్రాంతం, బాష, జాతి తదితర అంశాలు ప్రస్తావిస్తూ ఓట్లు అడిగితే ఆ అభ్యర్థి ని ఎన్నికల నుండి దూరం పెట్టవచ్చు.

రిప్రెజెంటిటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఎన్నికల ప్రచారంలో ఏ అభ్యర్థి అయినా కులం , మతం , ప్రాంతం, బాష, జాతి తదితర అంశాలు ప్రస్తావిస్తూ ఓట్లు అడిగితే ఆ అభ్యర్థి ని ఎన్నికల నుండి దూరం పెట్టవచ్చు.

 
రిప్రజెంటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 99 ప్రకారం, ఎన్నికల కమీషన్ పేర్కొన్న నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఆ అభ్యర్థిని పోటీ నుండి తప్పించవచ్చు. 


పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ సబ్ సెక్షన్ 3-A ప్రకారం, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతూ ప్రసంగించరాదు. ఇతర కులాల మధ్య , మతాల ను ప్రేరేపిస్తూ మాట్లాడటం నేరం. 


1987, మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో ఆనాటి శివసేన చీఫ్ బాల్ థాక్రే చేసిన ప్రసంగం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోర్టుకు వెళ్లగా దశాబ్దం కాలం సుదీర్ఘ విచారణలో బాల్ థాక్రే మీద చర్యలు తీసుకుంది. 


సుప్రీం కోర్టు తీర్పు నేపద్యంలో ఎన్నికల కమీషన్ బాల్ థాక్రే ను 6 సంవత్సరాలు ఎలాంటి ఎన్నికల్లో కూడా ఓటు వేయకుండా బహిష్కరణ చేసింది. 


ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార , ప్రతి పక్ష  నాయకుల ప్రసంగాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు లో దాఖలు అయిన పిటీషన్ కు స్పందిస్తూ  రాజ్యాంగం ఎన్నికల కమీషన్ కు  కల్పించిన అధికారాలను గుర్తు చేసింది. 

Also read  ఆనంద్ తెల్తుండే 'కోరేగామ్ నిజానిజాలు'


సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వాఖ్యలకు స్పందిస్తూ భారత ఎన్నికల కమీషనర్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంతి ఆదిత్యానాద్ యోగి , బిఎస్పి అధినేత బెహన్జీ కుమారి మాయావతి, కేంద్ర మంత్రి  మేనకా గాంధీ, మరియు ఎస్పీ నేత అంజాద్  ఖాన్ లను ఎన్నికల ప్రచారం నుండి బహిష్కరించింది. 


భారత దేశంలో ప్రజా పాలన సజావుగా జరిగేందుకు స్వతంత్ర అధికారాలు కల్పించిన రాజ్యాంగ వ్యవస్థలు, శాసన వ్యవస్థలు అవినీతి , బందు బందు ప్రీతి లేకుండా పనిచేస్తే భారత సమాజం సుభిక్షంగా ఉంటుంది. 


రాజ్యాంగ చట్ట సభలో , సభ్యులను ఉద్దేశించి రాజ్యాంగ నిర్మాత డా. బాబాబుసాహెబ్ అంబేడ్కర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం సరళంగా కన్పించినా అవసరమైనప్పుడు  దుర్బేధ్యంగా ఉంటుందని చెప్పారు. 


ఎన్నికల సమయంలో పార్టీలు, నాయకులు ఎన్నికల నియమావళిని తూ . చా తప్పకుండా పాటించకుండా, అధికారులను అడ్డంపెట్టుకుని  యథేచ్ఛగా చట్టాలను ఉల్లంగిస్తున్నారు. 


సాధారణ ప్రజల్లో ఎన్నికల కమీషన్ వెన్నుముక లేని కమీషన్ అనే అభిప్రాయం వుంది. కానీ ఈ అభిప్రాయం తప్పంటూ ఎన్నికల కమీషన్ అప్పుడు, అప్పుడు కొరడా ఝుళిపిస్తుంది. 


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కమీషన్ అవకతవకలకు పాల్పడిందని అధికార తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికల కమీషన్ మీద తీవ్ర ఆరోపణలు చెయ్యడం జరిగింది. 


తమ శాసన అధికారాలతో రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని బ్రష్టు పట్టించిన పాలకులే నేడు వ్యవస్థ లు సరిగా పనిచెయ్యడం లేదనడం దురదృష్టకరం.

 
రాజ్యాంగ వ్యవస్థల మీద, వాటి నైతికత మీద పాలకులు తప్పుడు ప్రచారం చేస్తే ప్రజల్లో అపోహలు పెరిగి శాసన  మరియు స్వతంత్ర వ్యవస్థల పట్ల చిన్న చూపు చూసే అవకావం ఉంది. 

Also read  ఆధిపత్యం కోసమే బారత రాజ్యాంగం ను తగలబడుతున్న హిందూ సంఘాలు!


వ్యక్తుల స్వప్రయోజనాల కోసం వ్యవస్థల మీద దుష్ప్రచారం చేస్తే తమగోతిని తాము తవ్వుకున్నట్లే!


ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సహనశీల రాజ్యాంగం రూపుదిద్దుకున్న , ఆకర్షణీయ, ఒకింత సంక్లిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. 


స్వాతంత్య్రం రావడంవల్ల ఇకనుంచీ ఏదైనా తప్పు జరిగితే బ్రిటీషును నిందించే అవకాశం మనకు ఉండదు. ఏ పొరపాటు జరిగినా ఇక మనల్ని మనల్ని మనమే నిందించుకోవాలి.


బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ 


వ్యక్తులు ఎంతటి గొప్పవారైనా , పలుకుబడి కల్గినవారైనా రాజ్యాంగం ముందు అందరూ సమానులే. ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒకే విలువ కల్పించబడింది. 


దేశ అధ్యకుడు అయినా , సాధారణ పౌరుడికైనా ప్రాధమిక హక్కులు ఒక్కటే , ఒకే విలువ తో కుడి ఉంటాయి. 


భారత ఎన్నికల కమీషన్ సాధించిన ఎన్నో విజయాలు లతో మరింత చైతన్యవంతంగా, ప్రభావంతంగా వ్యవహరిస్తుంది. 

కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, మొత్తం మీద కమిషను పనితీరు మాత్రం ఎంతో మెరుగుపడింది. 

కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీ నాయకులతో ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఆక్షేపణ తెలియజేసింది. 

ఏది ఏమైనా మొత్తం మీద భారత ఎన్నికల కమీషన్ తాను స్వయం స్వతంత్ర వ్యవస్థ  అని నిరూపించుకుంటూనే ఉంది. 

(Visited 71 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!