ఎన్నికల మ్యానిఫెస్టో: సామాజిక అభివృద్ధికి అడుగులు వేయలేని ప్రాతీయ పార్టీలు!

షేర్ చెయ్యండి
  • 90
    Shares

ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలతో  ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019 పక్రియ చివరి ఘట్టానికి చేరుకున్నది. నిన్న ప్రధాన పార్టీలు తమ పార్టీ మ్యానిఫెస్టో ని విడుదల చేశాయి. జనసేన పార్టీ ఇంతకు ముందే మ్యానిఫెస్టో విడుదల చేసింది. 


అధికార తెలుగు దేశం ప్రభుత్వం కానీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జనసేన పార్టీ లు తమ ఎన్నికల  మ్యానిఫెస్టో లోని అంశాలు ఒకరిని మించి ఒకరు పోటీపడి డబ్బు పంచె కార్యక్రం కె పెద్ద పీట వేశారు. 


ఉచిత పధకాలు పేరిట ప్రజలను సోమరులుగా చేస్తున్నారు అని ప్రజలనుండి విమర్శలు వస్తున్నా జాతీయ , ప్రాంతీయ పార్టీలు డబ్బు పంచే స్కీమ్ లు మరియు ఉచిత పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 


భారత దేశంలో నేడు ఏ కార్యక్రమం చూసినా ప్రవేట్ రంగంలోనే జరుగుతుంది. ప్రభుత్వ సంస్థలను లక్షలాది కోట్లకు పాలకులు అమ్మేస్తున్నాయి. 


ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఉచిత విద్య , వైద్యం, ఉద్యోగ భద్రత, ఆహార భద్రత ప్రజలకు ఎలా కల్పిస్తారో వారి ఎన్నికల  మ్యానిఫెస్టో లో వివరించలేదు. 


లక్షల కోట్ల డబ్బు పంచడానికి ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం ఎంత వస్తుంది? అసలే కట్టు బట్టలతో బయటకు పంపేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. 


ప్రభుత్వం ఆదాయ మార్గాలు చూపెట్టకుండా డబ్బులు పంచడం వలన ప్రజల ఆర్ధిక స్థితిగతులు మారుతాయా? నిరుద్యోగ భృతి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఆ డబ్బుతో కుటుంబం పోషణ సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. 


ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత , ఇప్పటి వరకూ ఆంధ్రాలో పెద్దగా పరిశ్రమలు స్థాపించిన దాఖలాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగలేదు, ప్రవేట్ రంగ పరిశ్రమలు స్థాపన జరగలేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించలేదు ఉద్యోగాలు ఎలా ఇస్తారు?


ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నంత విద్య వ్యాపారం, వైద్య వ్యాపారం మరేఇతర రాష్ట్రాలలో జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే విద్యా , వైద్య వ్యాపారం చేసేవాళ్లు ఉన్నారు. 


ప్రైవేట్ విద్యని , వైద్యాన్ని అరికట్టకుండా ప్రభుత్వ రంగంలో స్కూల్స్ , కాలేజీలు , ఆసుపత్రు లు మనుగడ సాధించగలవా ?  


వైసిపి ప్రవేట్ విద్య లో ఫీజులను నియంత్రణ చేస్తాం , ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం అంటూనే రూ. 1000 దాటిన వారికి ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం అంటున్నది. మరి ఇది ఎలా అర్ధం చేసుకోవాలో ఆ పార్టీ చెప్పాలి. 

Also read  ఓటు హక్కు: దళితులకు ఓటు హక్కు కల్పించిన డా. అంబేడ్కర్!


రిజర్వేషన్లు లేని సమాజం కావాలి అంటూనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ సొంత కులం ‘కాపు’ ల రిజర్వేషన్లు ఆర్టికల్ 9 వ షెడ్యూల్ ద్వారా కల్పించాలనడం ద్వంద నీతి . 


భారత దేశంలో ప్రైవేటు రంగం అంటే భద్రత లేనిది, భరోసా లేని రంగం. కార్మిక చట్టాలను, కంపెనీ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించే దేశం భారత దేశం. ఇలాంటి దేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం అంటే గాలిలో దీపం లాంటిదే. 


ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత గురించి ఏ పార్టీ తమ ఎన్నికల  మ్యానిఫెస్టో లో ప్రకటించ లేదు. జీవితానికి భరోసా లేని ఉద్యోగం ద్వారా కుటుంబ అభివృద్ధి సాధ్యమా? 


ఒకవైపు ప్రభుత్వ రంగాన్ని మూసివేసి ప్రైవేట్ కన్సల్టెంట్ లను నియమించుకుంటూ నిరుద్యోగాన్ని ఎలా తగ్గిస్తారు. 


ఇప్పటికే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో లక్ష ఎస్సి / ఎస్టి బ్యాక్ లాగ్ ఉద్యోగాలు కాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఎస్సి / ఎస్టి ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏ పార్టీ చెప్పలేదు. 


ఎన్నికల మ్యానిఫెస్టో లో ఒక్క జన సేన మాత్రమే బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొంది. 


ఎస్సి , ఎస్టి లను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం అనే మాట పెద్ద బోగస్ అయ్యింది. ఎస్సి / ఎస్టి లకు ప్రత్యేక ఆర్ధిక మండలి లో భాగస్వామ్యం కల్పించే కార్యక్రమం ఏ పార్టీ ప్రకటన చెయ్యలేదు. 


ఎస్సి లను , ఎస్టి లను వర్గీకరించడానికి తెలుగుదేశం , వైసిపి పోటీ పడి ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఈ కార్పొరేషన్ లకు ఎన్ని వేల కోట్లు సంవత్సరానికి కేటాయిస్తారా చెప్పలేదు. 


ఆదివాసీలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని , తండాల ను పంచాయతీలుగా గుర్తిస్తామని అలాగే ఆదివాసీల జిల్లా లో ప్రభుత్వ వైద్య శాల ఏర్పాటు చేస్తామని వైసిపి ప్రకటించింది. 


సమాజంలో అసమానతలు తొలగించాలంటే వారి మధ్య ఆర్ధిక వ్యత్యాసాలు ఉండకూడదు. దళిత , ఆదివాసీ , బిసి కులాలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించిన రోజే సమాజం అభివృద్ధి చెందుతుంది. 


ఎస్సి / ఎస్టి ల మీద జరిగే సామాజిక దాడులను , అవమానాలను , వివక్షను ఎలా అరికడతారో ఏ పార్టీ కూడా నామ మాత్రంగా చెప్పలేదు. 


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నేపథ్యంలో మ్యానిఫెస్టో ద్వారా ప్రజలను మభ్యపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అత్యధిక ఓటు బ్యాంకు కల్గిన పేద వర్గాలను  ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు  మరోసారి మోసం చెయ్యబోతున్నాయి. 

Also read  ఎన్నికల ఆరాటంలో వ్యవస్తీకృత మోసానికి పాల్పడుతున్న పార్టీలు!


పార్టీల మ్యానిఫెస్టో లో ప్రకటించిన అంశాలు ఆర్ధికంగా ఎదిగిన కులాలకు ఉపయోగపడతాయి తప్పా పేద వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. 


సంక్షేమం పేరుతొ పార్టీలు ఉచిత సౌకర్యాలు, కానుకలు కాకుండా ఆర్ధికంగా అభివృద్ధి చెందటానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. 


వ్యవస్థలోని సగంమంది శీతల పానీయాలు ( కూల్ డ్రింక్స్ ) తాగుతుంటే, మరి సగం మంది పురిసేడు మురికి నీళ్లతో కాలం గడుపుతున్నారు. ఎంతో వేగవంతమైన సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రవేటీకరణ అనే త్రిముఖ రహదారి మీద అభాగ్య భారతదేశంలోని పాదచారులు సురక్షితంగా దాటటానికి ఏర్పాట్లు ఉండాలి.


ఆర్ కె నారాయణన్, భారత మాజీ రాష్ట్రపతి 


2000 వ సంవత్సరం రిపబ్లిక్ డే సందర్బంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆనాడు పెద్ద దుమారం లేపింది. 


ఎన్నికల మ్యానిఫెస్టో లో తెలుగు దేశం , వైసిపి, జనసేన, కాంగ్రెస్ , ఉభయ కమ్యూనిస్టులు సమాజ ఆర్ధిక అభివృద్ధికి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించలేదు. 


నవభారత నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారు చాల ఆర్ధిక సమస్యలను కుల వ్యవస్థ కేంద్రంగా పరిశీలించారు. శ్రామిక వర్గానికి బ్రాహ్మణ వాదం, పెట్టుబడిదారీ విధానం ప్రధాన శత్రువులుగా బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ భావించారు. 


ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టుబడిదారీ విధానాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. శ్రామిక కులాలు అయినా దళిత , వెనకబడిన తరగతుల వారికి శ్రమ శక్తినే అంటగడుతున్నారు. 


కుల వ్యవస్థ ఆర్ధిక శక్తిని అగ్రవర్ణాల చేతికి ఇచ్చి ఎస్సి , ఎస్టి , బిసి లను భౌతిక శ్రమ కె పరిమితం చేసిందని బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ అంటారు.

 
కుల వృత్తు లను పటిష్టం చేస్తూ , కుల వృత్తులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఎన్నికల మ్యానిఫెస్టో లో రాజకీయ పార్టీలు తాయిలాలు ప్రకటించడం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారు చెప్పిన దానికి ప్రతిబింబం గా కనిపిస్తుంది. 


కుల వృత్తులు అంటే వర్ణ వ్యవస్థను ప్రోత్సహించడం, కుల వృత్తులు అంటే కుల వ్యవస్థను ప్రోత్సహించడం గా భావించాలి. కుల వ్యవస్థ అంటే శ్రామిక విభజన. 


కుల వ్యవస్థ దాని అంతర్గత నిర్మాణంలోనే ఒక పంపిణీ యంత్రాంగాన్ని రూపొందించింది. ఈ యంత్రాంగంలో ఆర్ధిక, సామాజిక, రాజకీయ అధికారం, హోదాలకు సంబంధించి ప్రధానంగా అగ్రకులస్తులకే కేటాయించింది. 

Also read  రిజర్వేషన్లు: ఆర్థికపరమైన రిజర్వేషన్లు మరక పోగొట్టుకోవడం కోసమేనా!


అందుకే తెలుగుదేశం కమ్మ కులస్తులు, వైసిపి రెడ్డి కులస్తులు, జన సేన కాపు కులం నాయకత్వ బాధ్యతలు వహిస్తూ దళిత , గిరిజన , బిసి కులాలను పాలితులుగా భౌతిక శ్రమకే కట్టడి చేసే పనిలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 


జాతీయ పార్టీలు అయినా బిజెపి, కాంగ్రెస్ బ్రాహ్మణ వర్గాల చేతిలో ఉండగా, రాష్ట్రాలలో అగ్రకులాల నాయకత్వం లో వాటి బాద్యులుగా ఉన్నారు. 


అంతిమ విశ్లేషణలో, ఆర్థికాభివృద్ధి, అసమానతలు అంతంచేయడానికి సమాజంలో అందరికీ భాగస్వామ్యం కల్పించే చర్యలు చేపట్టడం మాత్రమే. కులం, మతం హోదాలత్ప్ సంభంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు, దేశంలోని అన్ని ప్రాంతాలకు జాతి పరిపుష్ఠికావడానికి, అభివృద్ధి చెందడానికి పూర్తిస్థాయి సావకాశం కల్పించడమే.


మూడవ పంచవర్ష ప్రణాళిక 1966


దళిత కులాలు , ఆదివాసీలు, వెనకబడిన కులాలు సామాజిక ఆర్ధిక అభివృద్ధికి కల్పించిన రిజర్వేషన్ల విధానం అమలులో లోపం సరిదిద్దుతామని ఏ పార్టి తమ ఎన్నికల మ్యానిఫెస్టో లో పేర్కొనకపోవడం దురదృష్టకరం. 


కాంట్రకు విధానంలో గానీ, ఔట్సోర్సింగ్ విధానంలో రిజర్వేషన్లు ఆధారంగా ఉద్యోగస్తులను నియమిస్తాం అనే నిబంధన తెలుగుదేశం  ఎన్నికల మ్యానిఫెస్టో, వైసిపి ఎన్నికల మ్యానిఫెస్టో , జనసేన ఎన్నికల మేనిఫెస్టో లో  లేదు. 


దేశానికీ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అగ్రవర్ణ పాలకులే దేశాన్ని గానీ, రాష్ట్రాలను గానీ పాలిస్తున్నాయి అయినా నేటికీ కలచివేసే దారిద్య్రం, దుర్భర జీవన స్థితిగతులు. కనీసం త్రాగేందుకు పరిశుభ్రమైన నీటి ని కూడా ఈ అగ్రవర్ణ కుల నాయకులు కల్పించలేక పోతున్నారు. 


కాబట్టి ఈ ఎన్నికల మ్యానిఫెస్టో లు ఓట్లు కోసమే గాని సమాజ అభివృద్ధి కి కాదనేది నగ్న సత్యం. 

(Visited 105 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!