ఎస్సిల ట్రిపుల్ తలాక్ ఎప్పుడు! 

షేర్ చెయ్యండి
 
“I will not believe in Brahma, Vishnu, and Mahesh. Neither would I worship them.” -బాబాసాహెబ్ డా. అంబెడ్కర్
 
బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు. హిందూ మతనానికి ప్రతీకలు. బ్రాహ్మణలు వేదాల్లో రాసుకున్నారు బ్రహ్మ పాదాల నుండి శూద్రులు జన్మించేరు అని. బ్రహ్మ వారసుడు మనువు హిందువులకు ధర్మ సిద్ధాంతం చెప్పేడు.మనుషులను వారి జన్మను బట్టి, సంస్కారాలను బట్టి నాలుగు వర్ణాలుగా వేరుపరుస్తారు. ఈ విషయంపై మనుస్మృతి ఇలా ప్రస్తావించింది. 
“ప్రపంచ శ్రేయస్సు కోసం సృష్టికర్త బ్రాహ్మణులను తన నోటినుండి, క్షత్రియులను బాహువులనుండి, వైశ్యులను ఊరువులనుంచి, శూద్రులను అతని పాదాలను నుండి సృస్టించేడు” శూద్రుడు అనబడే వాడు ఏ సంస్కారాలను స్వీకరించరాదు, వీళ్లకు రెండో జన్మలేదు. ఆ తర్వాత ‘పంచమ’ జాతి అని ఐదో వర్ణాన్ని సృష్టించేరు ఆ పంచమ జాతి నే నిమ్న కులాలు /జాతులు అని నేడు షెడ్యూల్ కులం / దళితులు అని పిలుస్తున్నారు. 
 
కోట్లాది మంది బారతీయులు సమాజంలో ఎలాంటి హక్కులు లేకుండా, పశువులు , పక్షుల జాతికంటె హీనంగా ఈ సమాజం చూసింది. ఈ ఐదు వర్ణాలు రాను రాను వేలాది కులాలుగా విభజించబడ్డాయి, కానీ పంచమ జాతుల స్థితి మారలేదు. చివరికి వారిని అంటరానివారిగా మధ్య యుగాలలో కుల వ్యవస్థ చూసింది. ఆధునిక యుగంలో కూడా కుల వ్యవస్త ఏమాత్రం మారలేదు, ఈ కాలంలో చాలామంది సంస్కరణ వాదులు కుల వ్యవస్తని ప్రశ్నించేరు. 
 
“మనిషి తాకితేనే మైలపడ్డానని 
నువ్వు స్నానం జేస్తోన్నావు 
తాకితేనే మైలపడే నువ్వు 
తాకినవాని కన్న తక్కువ స్తాయికి చెందుతావా?” 
అని కబీర్ సూటిగా ప్రశ్నించేడు”
 
అయినా బారతీయ సమాజం ఏమాత్రం మార్పు చెందకపోగా ఇంకా కటినంగా అంటరానితనాన్ని అమలుచేసేరు. పచ్చిమ బారత దేశంలో బ్రాహ్మణ పీష్వా రాజుల కాలంలో అంటరానివారు అని పిలవబడే నిమ్న జాతులు రోడ్డు మీద నడవాలి అంటే మూతికి ముంత, నడుముకు తాటేకు కట్టుకుని, నీడ పడని కాలంలో వీదుల్లో నడవాలి.బారత దేశాన్ని పాలించిన ముస్లిం చక్రవర్తులు కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ/ ఇంగ్లాండ్ చక్రవర్తి  కానీ వీరి స్తితిగతులు ఏమాత్రం మార్పు తీసుకురాలేక పోయేరు. 
 
వర్ణ వ్యవస్త, కుల వ్యవస్త అలాగే ఉంది. ఈ స్తితికి మూలం ఎక్కడ ఉందో పరిశోదించటం మొదలుపెట్టరు బాబాసాహెబ్. డా బి ర్ అంబేడ్కర్. ఉన్నత విద్యావంతుడు, విదేశాల్లో డిగ్రీలు చేసి , పరిశుబ్రంగా ఉన్నా బరోడా మహారాజు సంస్తానంలో డా. అంబేడ్కర్ కి జరిగిన అవమానం ఆసియా ఉప ఖండంలోని కోట్లాది మంది పౌరుల విముక్తి కి మార్గం వేయబడింది. అంటరానివారు ఉన్నత స్తితిలో ఉన్నా సమాజంలో ఏలాంటి మార్పు లేకపోయేసరికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ కుల వ్యవస్తికి మూలం హిందూ మతం అని నిర్ధారణకి వచ్చేరు. హిందు వైదిక ధర్మంనే ప్రధాన కారణం అని “హిందువుగా” మరణించను అని ఈ దేశ కుల వ్యవస్తలో మగ్గిపోతున్న తన జాతి వారికి విముక్తి కల్పించటానికి బౌద్ద మతం స్వీకరించేరు. 
 
బౌద్ద మతం తీసుకున్న అతి కొద్దిరోజులకే బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ అంటే డిసెంబర్ 6,1956 న మరణించేరు. ఆ తర్వాత అయిన చూపిన బాటలో ముందడుగు వేయటంలో  ఎస్సీలు వెనకబడిపోయరు అని చెప్పొచ్చు. నేటికీ వెలివాడలు వెలుస్తూనే ఉన్నాయి. రోహిత్ వేముల, గరగపర్రు లాంటి సంఘటనలు నిత్యకృత్యం. సాక్షాత్ ముక్యమంత్రులకే అంటరానితనం తప్పడంలేదు. నేడు కేంద్రంలోని బా జ పా ప్రబుత్వం వారి బవిషత్ ఆలోచనలు అప్పుడు అప్పుడు ప్రకటిస్తూనే ఉంది. హిందూ మత సంస్తలు , బా జ పా ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అని ప్రణాలికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే అణిచివేత మొదలు పెట్టేరు, ఆహరం మీద ఆంక్షలు, మతం పేరుతొ దాడి చేస్తూనే ఉన్నారు. ఇకనైనా బారత దేశంలో ఎస్సి లు హిందు మతాన్ని వదిలించుకుని బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ బాట లో నడవాలి.   
 
(Visited 114 times, 1 visits today)
Also read  దళితులు అల్టర్నెట్ కల్చర్ని ఏర్పాటు చేసుకోవడం లో విఫం అయ్యేరా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!