ఎస్సి సామాజికవర్గం: దిశ దశ లేని ఎస్సి సామాజికవర్గం!

షేర్ చెయ్యండి


ఎస్సి సామాజికవర్గం; ఏడు దశాబ్దాల భారతీయ రాజకీయ యవనిక పై ఎన్నికలు అనే నాటకానికి తెర పడింది. అలాగే ఎస్సి లు అత్యధికంగా ప్రేమించే నవభారత నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి ఉత్సవాలు కూడా అయిపోతున్నాయి?


మరి తరవాత ఏంటి అని ఎస్సి వర్గాల్లో చాలా ఉత్కంఠత ఉంది.

ముక్యంగా సోషల్ మీడియా లో తరువాత ఏంటి అనేదాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి.


అప్పుడే 2024 ఎన్నికలకు సమాయత్వం అవుతూ ఈసారి ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం, బాబాసాహెబ్ ఆశయాల కోసం పని చెయ్యాలని తీర్మానాలు కూడా జరుగుతున్నాయి. 


కుల సంఘాలకు, అంబేడ్కర్ సంఘాలకు ఇది విశ్రాంతి కాలం అనుకోవాలి. మళ్ళీ ఏదైనా ఒక సంఘటన జరిగితే చేతినిండా పని ఉంటుంది. 


ఈ ఉపోద్గాతం ఎందుకంటె, సత్యాల నుండి వాస్తవాలు గ్రహించమన్నాడు ఒక పెద్ద మనిషి. ఎస్సి సామాజికవర్గం నిజం మాట్లాడుకోకపోతే ఏ ఉద్యమాలను నడిపించలేరు, ఏ మార్పు రాదు.


నిజం ఎందుకు మాట్లాడుకోవాలంటే మార్పు కోసం. అవును ఎస్సి సామాజికవర్గం కు మార్పు అవసరం. అది ఎలాంటి మార్పు అంటే సామాజిక ఆలోచనా విధానం లో మార్పు కావాలి, ఆర్ధిక స్థితిగతుల్లో మార్పు రావాలి. రాజకీయ విధానం లో మార్పు రావాలి.


డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఏమంటారు అంటే, సామాజిక, ఆర్ధిక అభివృద్ధి లేనిది రాజ్యాధికారం రాదు అంటారు. 

Also read  అంబేడ్కర్ ఆలోచనా విధానం:మే 17 కామ్రేడ్స్ సామాజిక విప్లవం!


ఎస్సి సామాజిక అభివృద్ధి అంటే ఏమిటి?


ఎస్సి సామాజికవర్గం కులం అనే నిచ్చెనమెట్ల వ్యవస్థలో తాము తక్కువ వర్గంలో ఉన్నాం అనే అభద్రతా భావం నుండి బయటపడాలి.


హిందూ సమాజంలోని దురాచారాలన్నిటినీ సదాచారాలుగ చిత్రిస్తూ, ప్రతి మూర్ఖ సంప్రదాయానికి వివిధ కులాలకు అంటగట్టారు


కుల వృత్తులు పేరిట ఎస్సి సామాజిక వర్గానికి నీచమైన వృత్తులు బలవంతంగా కల్పించారు.  అంటరానితనానికి మూలమైన నీచమైన వృత్తులను వదులుకోవాలని డా బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎస్సి లకు సలహా ఇచ్చారు. 


మారుతున్న సమాజంలో ఎస్సి సామాజికవర్గం కూడా అధునూతన పద్దతులతో అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలి.


ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఇతరులపై ఆధారపడి జీవించే నీచమైన మనస్తత్వానికి ఎస్సి లు స్వస్తి చెప్పాలి. 


కుల వ్యవస్థ నిర్మించిన సాంప్రదాయాలను తుంగలోకి తొక్కి గ్రామాలనుండి ఎస్సి లు బయటకు రావాలి. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్దత కలిగివుండటం ఎస్సి లకు ఆభరణాలు.


ఆత్మగౌరవం కంటే విలువైనది మరొకటిలేదు. ఆత్మగౌరవం లేని ఎస్సి లు బండి సున్నాతో సమానం. ఐక్యత తోను , సంఘటిత శక్తితోను సామాజిక అభివృద్ధి సాధించాలి. 


ఎస్సి ల ఆర్ధిక అభివృద్ధి!


ఎస్సి సామాజికవర్గం ప్రధాన సమస్య ఆర్ధికంగా వెనుకబాటుతనం. నేటికీ ఎస్సి మరియు ఎస్టి ల పిల్లలు  పౌష్ఠిక ఆహరం లేక చనిపోతున్నారు.


దారిద్య్ర రేఖ దిగువున ఉన్న ఎస్సి సామాజిక వర్గం ఉంది. రిజర్వేషన్లు ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంటే, మిగతా వారి స్థితి దమనీయంగా ఉంది. 

Also read  దళితులపై దాడుల్లో ముద్దాయిలు ఎవరు?


డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎస్సి సామాజికవర్గం ఆర్ధిక అభివృద్ధికి సంక్షేమ పధకాలు రూపొందించినా అవి ఆ పూట గడవటానికే అన్నట్లుగా ఉన్నాయి.

ఎస్సి లను వ్యవస్తగత అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక ఎకనామిక్ జోన్స్ లాంటివి ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యలేదు. చిత్తశుద్ధి తో పనిచేయ్యలేదు. 


ఎస్సి సామాజికవర్గం లో కూడా మౌళిక మైన మార్పు ను ఆ  వర్గంలోని మేధావి వర్గం ఏర్పాటు చెయ్యలేదు. దిశ దశ నిర్మించలేదు.


నిరంతరం సామాజిక పోరాటంలో నిమగ్నమైన ఎస్సి కులాల నాయకత్వం, నిర్లిప్తత , బాధ్యతారాహిత్యం మరియు వ్యక్తిగత స్వార్థం తో  రిజర్వేషన్స్ రిప్రజెంటిటీవ్స్ ఉండటం చేత దళిత సమాజ ఆర్ధిక అభివృద్ధికి ప్రణాళికలు రచించలేకపోయారు. 


డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఎస్సి లను గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్లామన్నారు. కానీ ఎస్సి లు గ్రామాలకే పరిమితం అవుతున్నారు. 


ప్రభుత్వ వుద్యోగం తప్పా సొంతగా వ్యాపారం చేసుకునే ఆలోచనా దిశగా ఎస్సి సామాజికవర్గం అడుగులు వేయడంలేదు.


ఈ దేశానికి మోడ్రన్ ఆర్ధిక పాఠాలు చెప్పిన డా బాబాసాహెబ్ అంబేడ్కర్ ( ఎస్సి సామాజికవర్గం) వారసులకు ఆర్ధిక మూలాలు తెలియకపోవడం ఆలోచించదగ్గ విషయం.

Also read  దళితులు అల్టర్నెట్ కల్చర్ని ఏర్పాటు చేసుకోవడం లో విఫం అయ్యేరా!


సామాజిక పరిణామం జరగకుండా రాజకీయ పరిణామం జరగదని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చెప్పినా ఆయన ఆశయాల కోసం పోరాడే అంబేద్కరిస్టు లు ఎస్సి
సామాజికవర్గం లో మార్పు కోసం ప్రయత్నం చెయ్యలేదు.


ఈ పరిణామంలో కొత్త తరం తమ సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. మనువాద పాలకులు ఎస్సి సామాజికవర్గం అభివృద్ధి ని అడ్డుకునే ఆలోచనలతో ప్రభుత్వరంగ పరిశ్రమలను , సంస్థలను ప్రైవేటు కి అప్పజెబుతున్నారు.


ఈ క్రమంలో ఎస్సి సామాజికవర్గం, యువత ఆలోచనా విధానం దృక్పధం మారాలి. శరవేగంగా తమ దశను , దిశను మార్చుకోకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది, భవిషత్ తరం క్షమించదు.

(Visited 451 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!