ఎస్సీల రాజ్యాధికారం ఎండమావేనా!

షేర్ చెయ్యండి

బారత దేశానికి స్వతంత్రం రాక పూర్వం బారత రైల్వేలు ప్రవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేవి. కర్నాటకలోని జి ఐ పి రైల్వే శాఖ లోపని చేస్తున్న నిమ్నజాతీయులు ఒక సంఘంగా ఏర్పడి ఆసంఘ వార్షికోత్సవానికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని కుడా ఆహ్వానించేరు. 1938 వ సంత్సరం, ఫిబ్రవరి 12, 13వ తేదీలలో రైల్వే కూడలి అయిన మన్నాడ్ పట్టణంలో జరిగిన సభలో కార్మికులను ఉద్దేశించిన సభలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మాట్లాడుతూ “రాజకీయమైన శక్తి ద్వారానే మనం స్వేఛ్చ స్వాతంత్రాలను సాధించి తద్వారా సాంఘక బంధనాల నుండి విముక్తి పొందగోలుగుతాం” అంటారు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ వారసుడు బహుజన రాజ్య స్తాపకుడు మాన్యశ్రీ కన్షిరాం 1998 అక్టోబర్ 10, 11 తెదేలలో మలేషియాలో జరిగిన మొట్ట మొదటి అంతర్జాతీయ ఎస్సి ల సమ్మేళనం లో మాట్లాడుతూ “ మనం MLA / MP  లు అవ్వాలి అంటే ఏమి చెయ్యాలి? బాబాసాహెబ్ డా అంబేడ్కర్ యొక్క ఉద్యమ స్పూర్తి ని ముందుకు నడిపించాలి అంటే ఏమి కావలి? నా దృష్టిలో MLA / MP అవ్వడం కంటే బాబాసాహెబ్ ఉద్యమాన్ని నడిపించడం చాల ముక్యం అంటారు. కాబట్టి నేను ఉద్యమాన్ని ఎన్నుకున్నాను అంటారు. మరి ఉద్యమాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే మనకి MLA / MP ల మదత్తు కావలి. మరి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఉద్యమానికి సహకరించే MLA/MP లు కావలి అంటే మనకి ఎవరు సీట్లు ఇస్తారు? కాబట్టి మనకీ ఒక రాజకీయ పార్టీ కావలి.  మన MLA/MP లను మన పార్టీ నే ఎన్నుకుంటుంది.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బారత దేశానికి స్వయం పాలన, స్వయంప్రతిపత్తి వచ్చే సమయానికి నిమ్నజాతీయులకు  కుడా ఒక రాజకీయ పార్టీ అవసరం అని “ ఇండియన్ లేబర్ పార్టీ” ని 1935 వ సంత్సరంలో స్తాపిస్తారు. ఈ పార్టీ ద్వారా రిజర్వర్డ్ స్తానాల్లోనే కాకుండా అల్ప సంఖ్యాక వర్గాలను , మిగాతా అణగారిన వర్గాల ని  కలుపుకుని జనరల్ స్తానాల్లో కుడా అభ్యర్ధులను నిలబెడతారు. ఆ తర్వాత షెడ్యుల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా మన తెలుగు ప్రాంతంలో కుడా చాలమంది ఎస్సి నాయకులు విజయం సాధించేరు.

సమానత్వం, సమాన ప్రాతినిధ్యం, ఆత్మ గౌరవం యీ మూడింటి కోసం నిమ్నాజాతీయులు నిరంతరం పోరాటం సాగించవల్సింది గా బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ కోరారు.

కులం అనేది ఒక నిజం. బారతీయ సమాజం ఉన్నంతవరకూ కులం ఉంటుంది. కులం పుట్టుక అయిన హిందూ మతం ఉన్నంత కాలం కులం ఉంటుంది. బారత దేశంలో రాజకీయాలు కులం పునాదుల నుండి ప్రారంభం అవుతాయి. నెహ్రు దగ్గర నుండి నేటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వరకూ మనం పరిశీలన చేస్తే నెహ్రు తన బ్రాహ్మణ కులాన్ని ఉపయోగించుకునే ప్రదాని కాగలిగేరు. రాజీవ్ గాంధీ వరకూ బ్రాహ్మణులు కాంగ్రెస్ తో ఉండేవారు, ఎప్పుడైతే సోనియా గాంధీ కాంగ్రెస్స్ అధ్యక్షరాలు గా ఎన్నుకోబడిందో అప్పటి నుండి దేశంలో బ్రాహ్మణులు బా జ పా వైపు వెళ్ళేరు. ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టి కులం పునాది మీద నే ఏర్పడ్డాయి అనేది వాస్తవ చరిత్ర.

Also read  World Bank: India's 48% bank accounts inactive, thanks to Modi's Jan Dhan, twice that of developing countries

మాన్యశ్రీ కన్షిరాం కులాన్ని సమీకరించి రాజకీయం చేద్దాం అన్నాడు, అందుకు ఉత్తర ప్రదేశ్ ని ఒక ప్రయోగశాల గా తీసుకుని బి సి లను కలుపుకుని బహుజన రాజ్యం స్తాపించేడు. అదే సూత్రం ఇతర రాష్ట్రాలకు వర్తింప చేసేడు దురదృష్ట వస్తు ఎస్సీల లో మూతులు నాకే నాయకత్వం ఉండటం వలన విఫలం అయ్యేరు. మాన్యశ్రీ కన్షిరాం తర్వాత నాయకత్వం లోపంతో బిఎస్పి ఉనికికే ప్రమాదం ఏర్పడింది.

చిన్న రాష్ట్రాలు ఎస్సిల రాజ్యదికారానికి ఒక మొట్టు!

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పాలనా సౌకర్యం కోసం చిన్న రాష్ట్రాలు ఉండాలి అని కోరుకున్నారు. అదే సమయంలో చిన్న రాష్ట్రాలలో కుల పరంగా సమీకరణలు చేస్తే ఎస్సిల రాజ్యాధికారం వస్తుంది అంటారు మాన్యశ్రీ కన్షిరాం. మద్య ప్రదేశ్ రెండు గా విభజన్ చేసిన తర్వాత ఎస్టీ లు ఎక్కువగా ఉండే ప్రాతంలో అజిత్ జోగీ ముఖ్యమంత్రి కాగాలిగేరు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కుల సమీకరణ చేస్తే ఆంధ్రలో ఎస్సి / ఎస్టీల ఓటు బ్యాంకు అతి పెద్దది. ఈ ఓటు బ్యాంకు ని ఫ్యూడల్ కులాలకు తాకట్టు పెట్టకుండా ఎస్సి / ఎస్టీ నాయకులు / యువత రాజకీయ పార్టీ గా మారడంలో తర్జన బర్జనలు పడుతున్నారు.

Also read  దళితుల బంద్ బా జ పా దళిత ఓటు బ్యాంక్ కి గండి కొడుతుందా!

దేశంలోని బాబాసాహెబ్ అనుచరులకు 1952, 54 ల మధ్య బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఓటమి ఒక అనుమానం వచ్చింది. యావత్ నిమ్నజాతీయులకు, అణగారిన వర్గాలకు తన జీవితాన్ని త్యాగం చేసిన బాబాసాహెబ్ లాంటి వారే ఎన్నికల్లో ఓటమి తర్వాత సాదారణ నాయకులు అయిన మనము ఇంకెలా గెలుస్తాము? ఇలా అలోచించి చాలామంది కాంగ్రెస్స్ రాజకీయాల్లోకి వెళ్ళేరు. ఆనాడు బాబాసాహెబ్ ని పార్లమెంట్ రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్స్, కమ్యునిస్టుల కుట్ర ను బెంగాల్ లోని నామ శూద్రులు ( చండాల ) కులస్తులు సగౌరవంగా గెలిపించి పార్లమెంటుకు పంపించేరు. బెంగాల్ లో బాబాసాహెబ్ విజయానికి కారణం అత్యధిక ఓటర్లు అయిన నామ శుద్రులే. దాదాపుగా 50 % కన్నా ఎక్కువగా ఉన్న నామశుద్రుల ఓట్ల తో బాబాసాహెబ్ ని గెలిపించి పార్లమెంటు కు పంపి నవబారత నిర్మాణానికి పునాది వేసిన నామశుద్రులు.

ఆనాటి నామశుద్రుల పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణా లోని ఎస్సి లు , ఎస్టీ లు పరిశీలన చెయ్యాలి. ముక్యంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగిన మాల సామజిక వర్గం ఎస్సి లలోని మిగతా కులాను కలుపుకుపోయి ఎస్సి / ఎస్టీ లతో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయ్యాలి. ఎప్పటి నుండో రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కాపులు, మైనారిటీ ల మైత్రి తో ఫ్యూడల్ కులాల అధిపత్యానికి గండి కొట్టడం ఏమంత కష్టమైన పని కాదు. కానీ దురదృష్ట వశాత్తు ఎస్సి లలో అగ్ర బాగం వివధ పార్టీలకు అనుబంధంగా ఉంటున్నారు. ఫ్యూడల్ కులాలు అవలంభించే “రాజకీయ వివక్ష మైత్రి” సంఘానికి నాయకత్వం వహిస్తూ ఎస్సీల రాజ్యాధికారం ఇదే అన్నట్టు గా, ఇంతకంటే గత్యంతరం లేనట్టుగా మాట్లాడుతున్నారు.

Also read  నాయకుడు లేని ఎస్సి సామాజిక వర్గం!

ఆత్మగౌరవం!

ఎస్సీల గా వుంటూ విద్యా, ఉద్యోగాల్లో, అసెంబ్లీ , పార్లమెంటులో ఇవ్వబడిన రిజర్వేషన్లు హాయిగా అనుభవిస్తూ బవిషత్ తరాలకు అన్యాయం చేస్తున్న వారు బొంబాయి నగరంలో వైశ్యలను ఉదహరిస్తూ బాబాసాహెబ్ చెప్పిన ఆత్మగౌరవం అంటే ఏంటో చెప్పేరు. ఆరంతస్తుల మేడలో పట్టు పరుపుల పై బ్రెడ్ , కైమా లు తింటూ హాయిగా ఉండే వైశ్య , అదే మెడ క్రింద ఉండే ఒక కూలి చాలీ చాలని డబ్బులు లతో పస్తులు ఉంటూ ఉంటుంది. తాను కుడా పట్టు వస్త్రాల పై హాయిగా పాడుకోవాలి వంటే తన ఆత్మగౌరవాన్ని చంపు కోవాలి కానీ అలా చెయ్యడం లేదు. ఆర్ధిక రూపమైన ప్రయోజనాల కంటే ఆత్మగౌరవమే మానవునికి ముక్యం. ఈ హక్కు కోసం మేము ఎంతటి త్యాగానికైనా సిద్దం అంటారు బాబాసాహెబ్ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.

నేటి ఫ్యూడల్ కుల పార్టీలలో ఉండే నాయకులు లేదా ఆ పార్టి లో చేరబోయే ఉన్నత విశ్రాంతి ఆఫీసర్లు బాబాసాహెబ్ కి కనీస కృతజ్ఞత గా తమ బాధ్యత గా అయిన అందించిన త్రికరణ సూత్రాలు

బోధించు – పోరాడు – సమీకరించు అనే సూత్రాల పై ఎస్సి , ఎస్టీ ల రాజకీయ ప్రయోజనాలకు వారి రాజ్యాధికారానికి కృషి చెయ్యాలి. కుల సంఘాలు తమ కార్యవర్గాన్ని రాజకీయం దిశగా పయనింపచెయ్యాలి. అప్పుడే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కోరుకున్న “నా ప్రజలు పాలితులు గా కాకుండా పాలకులుగా ఉండాలి “ అనే ఆశయం సాధించిన వారు అవుతారు.

 

(Visited 251 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!