ఓటు హక్కు: దళితులకు ఓటు హక్కు కల్పించిన డా. అంబేడ్కర్!

షేర్ చెయ్యండి
  • 126
    Shares

దళితులకు అత్యంత ముఖ్యమైన హక్కు ” ఓటు హక్కు ” అనే చెప్పుకోవాలి. బాబాసాహెబ్ డా అంబేడ్కర్   ఈ హక్కు కోసం ఎంత శ్రమించేరో వర్ణనాతీతం.

తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అహర్నిశలు శ్రమపడ్డారు.

సానుభూతి వాక్యాలు మనస్సులను కరిగించవు. కార్యరూపం దాల్చటానికి చట్టం సహాయం ఉండాలి అని గ్రహించిన  బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

ఆనాటి కాంగ్రెస్ నాయకుల మనస్సులను బాగా గమనించిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తన అపారమైన మేధస్సు తో బవిషత్ లో తన దళిత జాతుల రక్షణ ఏ ఒక్కరి చేతుల్లో లేకుండా రాజ్యాంగ పరిరక్షణ లో ఉండాలి అని చట్టరీత్యా హక్కులు సాధించాలి అనుకున్నారు.

1928 లో మోతీలాల్ నెహ్రూ నాయకత్వం లో కాంగ్రెస్ భవిషత్ రాజ్యాంగం కోసం అన్నీ వర్గాల తో సమాలోచనలు చేసింది ,సిక్కులతోను, ముస్లిం ద్రవిడ సంఘాలు తదితర ప్రతినిదులను సంప్రదించింది. కానీ దళితులతో సంప్రదించలేదు. 

కాంగ్రెస్ సైమన్ కమీషన్ కి ఇచ్చిన నివేదిక లో దళిత, ఆదివాసుల తదితర  జాతుల గురించి ప్రస్తావించలేదు.

Also read  ఎన్నికలు: భారత దేశ ఎన్నికల చరిత్ర-1

1932 ఫిబ్రవరిలో ఓటు హక్కు కమిటి లో  బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కూడా సభ్యులు. ఈ కమిటీతో పాటు దేశంలో చాల ప్రాంతాలను పర్యటించిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను కోరారు.   

సైమన్ కమీషన్ కి ఇచ్చిన నివేదిక లో ప్రత్యెక స్థానాలతో కూడిన ఉమ్మడి నియోజక వర్గాలను కొరారు  బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 

గాంధీ ప్రవర్తన చూసి తన మనసు మార్చుకున్నారు. అయితే కాంగ్రెస్ లోని దళితులు డా. మాంజీ, యం.సి రాజల అనుచరులు కొందరు ప్రత్యేక స్థానాలతో కూడిన నియోజకవర్గాలను కోరడం బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తీవ్ర ఆవేదనకు గురిచేసింది. 

బాబాసాహెబ్ డా అంబేడ్కర్కి అవమానాలు, నిందారోపణలు కొత్తకాదు. లక్ష్యం కోసం అవి అన్నీ భరించేరు. అఖిల భారత దళిత జాతుల అధ్యక్షుడు గవాయ్ కి ఉత్తరం రాస్తూ మనలో మనం ఇలా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం సరికాదని, ఉమ్మడి నియోజకవర్గాలను కొరవద్దు అని కోరాడు. 

దళితుల ప్రాధమిక హక్కుకు అడ్డుపడేవారికి శిక్ష విధించేలాగా భారత శిక్షాస్మృతిని మార్చవలిసిందిగా ఓటు హక్కు కమిటీ ని కోరాడు. అధిక శాతం దళితులు అంబెడ్కర్ ని సమర్థిస్తూ ప్రత్యెక నియోజకవర్గాలను కోరారు.

Also read  భారతీయట్రైబల్ పార్టి: అస్తిత్వ ఉద్యమం నుండి రాజ్యాధికారం వైపు!

ఫిబ్రవరి 28, 1932 బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మద్రాస్ వచ్చినప్పుడు దళిత ప్రజలు, వివిధ సంఘాలు ఘన స్వాగతం పలికారు. రాజకీయాదీకారం సంపాదించటానికి కృషి చెయ్యాలి అని, కొన్ని సమస్యలు దానితో పరిస్కారం కాగలవని వారికి సూచించారు.

ఓటు హక్కు కమిటీ లోని కొందరు సభ్యులతో అంబెడ్కర్ కి భేదాభిప్రాయాలు వచ్చాయి. కమిటీ నివేదిక ఎలా వుండబోతుందో అని అయిన తీవ్ర ఆందోళన చెందా రు. దీనితో అనారోగ్యంపాలు అయ్యేరు. అయినా ఎవరికీ చెప్పకుండా లండన్ వెళ్ళి బ్రిటీష్ ప్రధాన మంత్రి ని కలుసుకుని చర్చించాలి అనుకున్నారు.

1932 మే 1 వ తారీఖున ఓటు హక్కు కమిటీ తమ నివేదికను పూర్తి చేసింది. కమిటీ లోని హిందువులు తో ఉన్న అభిప్రాయాభేదాలు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ను కమిటీ కి ప్రత్యెక నివేదిక ఇవ్వటానికి పరిస్థితులుదారి తీసాయి.

కమిటీ అధ్యక్షుడు లార్డ్ లొదియాన్, బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తో సమావేశం అయి ఒకటి రెండు రోజులు ప్రత్యెక అంశాల మీద చర్చించేరు.

Also read  ఎన్నికల మ్యానిఫెస్టో: సామాజిక అభివృద్ధికి అడుగులు వేయలేని ప్రాతీయ పార్టీలు!

లొదియన్ తో సమావేశంలో లో ప్రత్యేక జాతులకు ఒక నిర్వచనం మీద నిర్ణయం తీసుకున్నారు. 

కొండ జాతులను, నెరస్థ జాతులను నిమ్న జాతుల నుండి తొలగించి అంటరానితనం అనుభవిస్తున్న జాతులను మాత్రమే నిమ్న జాతులుగా పరిగణించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.

దీనికి రెండు సంవత్సరాల ముందు సైమన్ కమీషన్ నివేదికలో కూడా దళిత జాతులకు ప్రత్యెక నియోజకవర్గాలు, ఇతర సభ్యులను ఎన్నుకునే ఓటు హక్కును (కమీషన్ కి  బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఇచ్చిన నివేదిక అనుగుణంగా) కల్పించారు.

ఈ సందర్భంగా 1930 ఆగస్ట్ 8 న , నాగపూర్ సభలో అంబెడ్కర్ అన్నమాట ను గుర్తుచేస్తాను. ” ఏ దేశము మరో దేశాన్ని పాలించే అంత గొప్పదికాదనీ, అలాగే ఏ జాతీ మరో జాతిమీద పెత్తనం చేలాయించారాదనీ ” అన్నారు.

(Visited 78 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!