కనిషక్ కఠారియా: సివిల్ సర్వీస్ 2018 ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించిన దళిత ఇంజినీర్

షేర్ చెయ్యండి
  • 592
    Shares

కనిషక్ కఠారియా, ఐఐటి ముంబయ్ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన విద్యార్థి 2018 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన పరీక్షల లో మొదటి ర్యాంకు సాధించాడు. 

శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో కనిషక్ కఠారియ జాతీయ స్థాయిలో   అత్త్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకు సాధించాడు.  

కనిషక్ కఠారియ రాజస్థాన్ కి చెందిన  షెడ్యూల్ కులం (ఎస్సి ) కు చెందిన వ్యక్తి.  మ్యాధ్స్ ప్రధాన సబ్జెట్ గా ఈ పరీక్షలు రాసి ఈ ఘనత సాధించాడు. 

కఠారియా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో పేర్కొన్న దానిని బట్టి అతను ప్రస్తుతం బెంగుళూర్ లో డాటా సైన్స్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గేహాలెట్ ట్విట్టర్ ద్వారా కనిషక్ కటారియా కి అభినందనలు తెలియజేశాడు.    

 కనిషక్ కఠారియా మొదటి స్తానం లో ఉండగా రెండు మూడు ర్యాంకు లలో రాజస్థాన్ కె చెందిన ఆకాష్ జైన్ మరియు ఉత్తర ప్రదేశ్ కి చెందిన జునైద్ ఆహ్మద్ లు నిలిచారు 

Also read  సుప్రీం కోర్టు తీర్పు ఎస్సి,ఎస్టీ మహిళల పై దాడులను ప్రోస్తహిస్తుందా!

 మధ్య ప్రదేశ్ కి చెందిన  శృతి జయంత్ దేశముఖ్ మహిళా విభాగంలో మొదటి ర్యాంకు సాధిచారు. ఈమే 6 వ ర్యాంకు  సాధించారు 

UPSC 2018 సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నిర్వహించిన రాత పరీక్ష మరియు 2019, ఫిబ్రవరి – మార్చి లో జరిగిన ఇంటర్యు ఫలితాలు ఆధారంగా ర్యాంకు లు ప్రకటించారు. 

మొత్తం 759 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ కి సెలెక్ట్ అయినట్లు పరీక్షలు నిర్వహించిన UPSC ప్రకటించింది. వీరిలో 128 మంది ఎస్సి లు మరియు 61 మంది ఎస్టి , 209 మంది ఓబిసి లు సెలెక్ట్ అయ్యారు. మిగిలిన 361 మంది జెనెరల్ క్యాటగిరి కి చెందిన వారు.  

మొదటి పది స్థానాల్లో నిలిచిన అభర్ధులు, శ్రేయాన్స్ కుమార్, శుభాన్ గుప్త, కర్నాటి వరుణ్ రెడ్డి, వైశాలి సింగ్, గుంజన్ ద్వివేది మరియు తన్మయ్ వసిష్ఠ శర్మ 

రాజస్థాన్ కి లోని కోట కు చెందిన కనిషక్ కఠారియా ఐఐటి జెఇఇ లో 43  ర్యాంకు సాధించిన వ్యక్తి. ఎస్సి లలో నెం 1 ర్యాంకు. 

Also read  మోకాళ్ళ మీద నిలబడుతున్నదళిత ఉద్యమం!

కనిషక్ కఠారియా రాజస్థాన్ లోని ఒక ప్రవేట్ విద్య సంస్థలో ప్రాధమిక విద్యను అభ్యసించాడు. 

ఐఐటి ముంబయి లో 9.1 జిపిఏ సాధించి న వ్యక్తి.  మొదటి ర్యాంకు ఊహించని ఫలితం అని కఠారియా పేర్కొన్నారు. ఈ ఫలితానికి తనకు సహకరించిన తల్లి తండ్రులకు మరియు సోదరికి, తన స్నేహితురాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 

(Visited 586 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!