కశ్మీర్: కశ్మీర్ ఏర్పాటు వాదానికి కారణం మతమా? రాజకీయమా?

షేర్ చెయ్యండి
  • 82
    Shares

కశ్మీర్ లోని పుల్వామా గ్రామంలో ఆగస్టు 14 న జరిగిన మానవ బాంబుదాడి కశ్మీర్  సమస్యని మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపింది.


1947 పూర్వం వరకూ వరకూ ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయ, ఆతర్వాత నుండి నెత్తుటి మరకలతో  నిత్యం వార్తల్లో ఉంటుంది.  అమాయక ప్రజలు బలి అవుతున్న ఈ మారణ హోమానికి కారణం ఎవరు? రాజకీయమా లేక మతమా?


గాంధీ జాతీయ ఉద్యమంలోకి  రాకపూర్వమే భారత దేశానికి తూర్పు న బెంగాల్ లో  ఆధునిక హిందూ భావజాలంతో ప్రేరేపితమయ్యాయి. బంకించంద్ర ఛటర్జీ రాసిన “ఆనంద మఠం” నవల దీనికి కర్త, కర్మ, క్రియ. 


అందులోని దుర్గా మాతను కీర్తించే  “వందేమాతరం” గీతం కాంగ్రెస్ పార్టీ కి జాతీయ గీతం అయ్యింది. అందులో బ్రిటీష్ తాబేదార్లను, ముస్లిం లను సమూలంగా నిర్ములించాలని సందేశాన్ని ఇచ్చింది. 


మహారాష్ట్ర లో బాల గంగాధర్ తిలక్ వినాయకుడిని ఆధారంగా చేసుకుని సరికొత్త దేశభక్తి సిద్ధాంతాన్ని తెచ్చారు. దాని నేపథ్యంలోనే 19 వ శతాబ్దం చివరిలో మత ఘర్షణలు ప్రారంభం అయ్యాయి.

 
భారత జాతీయ ఉద్యమంలో మతాన్ని ప్రవేశ పెట్టిన వ్యక్తి గాంధీ. గాంధీ కి పీతిపాత్రుడైన నెహ్రు లో ఆధునిక బావాలు ఉన్నా  రాజకీయ అవసరాల కోసం గాంధీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సాహసం చెయ్యలేదు. 


కశ్మీర్ లో వివాదస్పదం ఎలా అయ్యింది?


కశ్మీర్ చాలా భిన్నమైనది, అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లిం లు, కానీ పాలించేది మాత్రం హిందూ రాజు. నిరంకుశత్వం లో నిజాం రాజుతో పోటీ పడతాడు.

 
భారత దేశంలో ఉన్న సంస్థానాలు అన్నిటిలో కశ్మీర్ అతి పెద్ద సంస్థానం. 1840 లో ఈస్ట్ ఇండియా కంపెనీ కశ్మీర్ ను ఒక ‘దోగ్రా’  జాతి వ్యక్తి కి అమ్మింది. అతని వారసులు ఆ ప్రాంతాన్ని ఒంటెద్దు పోకడలతో పాలించారు.

 
1920 లో షేక్ అబ్దుల్లా ( ఫారూఖ్ అబ్దుల్లా తండ్రి ) అనే పాఠశాల ఉపాధ్యాయుడు ముస్లిం కాన్ఫెరెన్స్ అనే రాజకీయ  సంస్థను స్థాపించాడు. ఆనతి కాలంలోనే  ముస్లిం కాన్ఫెరెన్స్ నేషనల్ కాన్ఫెరెన్స్ గా మారింది. 


కశ్మీర్ లో ఈ పార్టీ యొక్క పలుకుబడి ఆనాటి ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ కన్నా ఎక్కువగా పెరిగింది. 


1944 లో నేషనల్ కాన్ఫరెన్స్ జమ్ము కశ్మీర్ ను ఆసియా స్విజర్లాండ్ గా స్వతంత్ర రాజ్యాంగా ప్రకటించాలని సామజిక ఉద్యమం ప్రారంభించింది. 


రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కశ్మీర్ రాజు తో పాటు నేషనల్ కాన్ఫెరెన్స్ కూడా బ్రిటీష్ వారికి మద్దత్తు పలకడం తో ప్రజల్లో పాపులారిటీ తగ్గింది. షేక్ అబ్దుల్లా రాజును గద్దె దించాలని ఉద్యమం చేసి విఫలం అయ్యేడు. 1946లో షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసారు. 

Also read  ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?


జమ్మూ ప్రాంతం లో ముస్లిం లు తక్కువ, అక్కడ హిందూ రాజులకు వెన్నుదన్నుగా ఉండే డోగ్రా ప్రజలకు ముస్లిం ల మధ్య ఉద్రికతలు ఉండేవి. దీనితో ముస్లిం లోని కొందరు పాత ముస్లిం కాన్ఫెరెన్స్ ని పునర్ధించారు. 


కశ్మీర్ రాజు భారత దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ లేదా భారత్ లో కలపాలని కోరుకోలేదు.  మహ్మద్ అలీ జిన్నా అసలు కశ్మీర్ అంశాన్ని ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు. 


జిన్నా అస్సాం ని పాకిస్తాన్ లో కలపాలని బ్రటిష్ వారికి వినతిపత్రం ఇచ్చేడు కానీ కశ్మీర్ గురించి అసలు పట్టించుకోలేదు. 


ఒక విధంగా చెప్పాలంటే కశ్మీర్ కి భారత్ తో ఎలాంటి సరిహద్దులు లేవు. పాకిస్తాన్ తో సరిహద్దును కల్గి ఉంది.


కశ్మీర్ లో గొడవ దానికదే రూపుదిద్దుకుంది. దేశ విభజన సమయంలో పంజాబ్ లో రేగిన అల్లర్లు జమ్ముకు వ్యాప్తి చెందాయి. హిందువులు ముస్లిం లను తరిమి కొట్టడం జరుగుతుంది.


పచ్చిమ సరిహద్దు ప్రాంతమైన పూంచ్ లో హిందూ రాజు పాలనకు వ్యతిరేకంగా ఒక్కసారిగా ముస్లిం తిరుగుబాటు జరిగింది. భారత ఆయుధాలను దాచిన ప్రాంతానికి పాటియాలా నుండి ఒక సాయుధ దళం వచ్చింది.


ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో ముస్లిం లను ఊచకోత కోస్తున్నారు అనే వదంతులు వ్యాప్తి చెందటంతో పాకిస్తాన్ నుండి, పటియాలా నుండి వచ్చిన ముస్లిం లు హిందువులను తరిమికొడుతూ శ్రీనగర్ వైపు వచ్చారు. 


ఈ సమయంలో భారత వాయుసేన క్షణాల్లో స్పందించి పఠాన్ లను నిలువరించింది. ఆనాటి గృహ మంత్రి పటేల్ చొరవ వలన ఇది సాధ్యం అయ్యింది. 


ముస్లిం ప్రజలకు మద్దతుగా పాకిస్తాన్ భారత భూభాగంలో కి వచ్చే ప్రయత్నాన్ని భారత దేశంలోని బ్రటిష్ కమాండర్లు అడ్డుకున్నారు. పాకిస్తాన్ లోని వారి బ్రిటీష్  మిత్రులను పాకిస్తాన్ కి సహకరించకుండా ఉండాలని చెప్పారు.


రాజు తన  సంస్థానాన్ని భారత్ లో విలీనం చేస్తున్నట్లు బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటిన్ కి రాసినట్లు చెబుతున్న లేఖను కేరళ కు చెందిన మేనన్ 
ఇచ్చిన లేఖ ద్వారా భారత్ లో అంతర్ భాగం అయ్యింది.

 
అయితే ఈ లేఖ పెద్ద వివాదస్పదం అయి సమస్య యునైటెడ్ నేషన్ వరకూ వెళ్ళింది. నెహ్రు షేక్ అబ్దుల్లా మీద నమ్మకంతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని యునైటెడ్ నేషన్ కి తెలియజేసాడు 
.

Also read  రివర్స్ డేమోక్రసీ...!

 
పటేల్ కి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రజాభిప్రాయం చేస్తే కశ్మీర్ ని భారత్ వదులుకోవాలని నెహ్రు కి చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేసారు. అప్పటి నుండి ఈ సమస్యను జఠిలం చేసారు. 


కశ్మీర్ ని భారత్ లో కలపాలని నెహ్రు ఎందుకు కోరుకున్నాడు?

 
ఉత్తర ప్రదేశ్ లో పుట్టిన జవహర్ లాల్ నెహ్రు కశ్మీర్ కి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి.  తన చిన్న తనంలో ఎలుగుబంటి వేటకు వెళ్లడం తప్పా,1940 వరకూ ఈ ప్రాంతం  ను సందర్శించిన దాఖలాలు లేవు. 


నేను అద్భుత సౌదర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ కశ్మీర్ లో సంచరించాను, ఆమైకం నా మనసంతా ఆవహించింది. ఆ ప్రాంతం ఒక అతిలోక సుందరిలాగా ఉంది. మానవ అతీతంగా మనిషి ఊహలకు అందని అందాలను కల్గి ఉంది. 


కశ్మీర్ లో స్త్రీ సౌదర్యాన్ని చూసి మోజు పడ్డాడు నెహ్రు. ఆ విషయం మౌంట్ బాటన్ దగ్గర చెప్పుకునే వారు. మరీ వ్యక్తిగతంగా తీసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నెహ్రు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 


నాకు కశ్మీర్ కావాలంటూ నెహ్రు మారం చేసాడు. మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా తో ‘నా పై కశ్మీర్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కసారి సంగీతంలా, ప్రియురాలి సాంగత్యంలా అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకున్నారు’. 


కశ్మీర్ మీద భారత్ దేశం మంకు పట్టు పట్టటానికి ఇంకొక అంశం కూడా ఉంది.
 ఈ ప్రాంతం మధ్య ఆసియా మార్గాలను నియంత్రించ గల్గిన వ్యూహాత్మక రక్షణ ప్రదేశంగా భావించింది. 


అన్నిటికంటే మించి సైదంతికంగా దేశ ప్రతిష్టను పెంచే ప్రాంతమది. భారత దేశానికి
 ఈ ప్రాంతం  దక్కితే ముందు నుండి చెప్పుకుంటున్నట్లు తమది పాకిస్తాన్ దేశం లా మత రాజ్యం కాదని, హిందువులతో పాటు, ముస్లిం రాష్ట్రాలతో కూడా కలసి సహజీవనం చేయగలమని భావించింది. 


అఖండ భారత దేశాన్ని విభజించడానికి బ్రిటీష్ ప్రభుత్వం పెద్దగా ఇష్టపడలేదు. భారత ఉపఖండం విడిపోతే రష్యా కమ్యూనిజం ప్రభావం భారత దేశం మీద ప్రభావం చూపించి, రష్యా నియంత్రణ లోకి భారత ఉపఖంఢం వెళ్తుందని బ్రిటీష్ ప్రభుత్వం భావించింది. 


కశ్మీర్ సమస్యను ముందే పసిగట్టిన డా అంబేడ్కర్!


ఆనాటి బావి భారత నిర్మాత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ అంశాన్ని ముందే పసిగట్టి కాంగ్రెస్ నాయత్వాన్ని హెచ్చరించారు. 


బాబాసాహెబ్ డా అంబేడ్కర్ రాసిన పాకిస్తాన్ లేదా పార్టిషన్ ఆఫ్ ఇండియా లో కాంగ్రెస్ నాయకత్వం యొక్క బావా దారిద్రయాన్ని ఎండగట్టారు.

Also read  నయా సూత మహర్షులు-దళిత రాజకీయ నాయకులు!


అదే విధంగా ముస్లిం ల అంతర్ముఖాన్ని, సావర్కర్ యొక్క హిందుత్వాన్ని, కాంగ్రెస్ నాయకుల పై పై మెరుగుల మత సామరస్యాన్ని అయన ఎత్తి చూపారు.


ఈ  సమస్య కు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పరిష్కారం చూపెట్టారు. ఆ ప్రాంతంలో  ప్రజాభిప్రాయం జరగాలని, ప్రజలు విడిపోవాలని కోరుకుంటే లోయతో పాటు వారిని విడగొట్టాలని చూచన చేసాడు.


ఈ  సమస్య ముందు, ముందు భారత ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రవభావం చూపెడుతుందని , దేశ బడ్జెట్ సగం సరిహద్దు రక్షణ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ హెచ్చరించారు . 


కాంగ్రెస్ పార్టీ లోని హిందూ జాతీయ వాదం ఈ ప్రాంతాన్ని  వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వారికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ద్వంత పౌరసత్వాన్ని కల్పించింది.


ఆనాటి న్యాయశాఖ మంత్రి గా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తీవ్రంగా ఈ విషయం లో కాంగ్రెస్ తో విభేదించారు. 


షేక్ అబ్దుల్లా ను ఉద్దేశించి మాట్లాడుతూ డా అంబేడ్కర్ మా దేశ రక్షణ నీకు కావాలి, సంపద కావాలి కానీ మా దేశ చట్టాలు నీకు వర్తించవా, దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అంటూ తీవ్ర స్వరం తో హెచ్చరించారు. 


సమస్య కేవలం రాజకీయ మైనదే , అది నేడు మత పరంగా మారింది. హిందూ జాతీయ వాదం దీనికి ప్రేరణ అనే వాస్తవం అందరూ గ్రహించాలి.

 
ఆనాటి కాంగ్రెస్ నాయకులకు ఒక అభిప్రాయం ఉంది, ఏ నాటికైనా పాకిస్తాన్ విఫలం అవడం తప్పదని, అది తిరిగి భారత దేశంలో కలుస్తుందని అనుకునేవారు. 


బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కూడా ఏర్పాటు వాదం ఎప్పటికైనా విఫలం అవుతుందని , విడిపోయిన రాష్ట్రం తిరిగి భారత దేశంలో కలవాల్సిందే అని
అభిప్రాయం వ్యక్తం చేసారు   

(Visited 152 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!