కీలకమవుతున్న ‘బెహన్ జి మాయావతి’ బిఎస్పీ పార్టీ!

షేర్ చెయ్యండి

దేశంలో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయ పోలరైజేషన్ లో మార్పు మార్పులు జరుగుతూ ఉంటాయి. కొత్త పొత్తులు కోసం చర్చలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఇప్పటినుండే మొదలు పెడుతున్నారు. బా జ పా దేశంలో ఇప్పుడు అత్యంత బలమైన పార్టీ. ప్రదాని మోడీ –  బా జ పా అధ్యక్షుడు అమిత్ షా జోడీ ఎన్నికల వ్యూహంలో ఆరితేరి ఉన్నారు. ఆ జోడీ 2014 నుండి జరిగిన ఎన్నికల్లో ఓటమి లేకుండా దూసుకుపోతున్నారు.

మోడీ ప్రబుత్వం హిందుత్వం పునాదిగా ఏర్పడినది. అది చాప క్రింద నీరు లా ప్రతి సామాజిక రంగంలో ప్రవేశించి మైనారిటీ ల ఫై మరియు దళితుల ఫై దాడులకు ప్రేరేపిస్తుంది. బారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ హిందూ మత సంస్కృతీ, సాంప్రదాయాల ప్రమోషన్ కోసమే అన్నట్టుగా ఉంది. అదే విధంగా మోడీ – అమిత్ షా ద్వయం దేశంలో చాల ప్రాంతీయ పార్టీలకు గొడ్డలి పెట్టుగా ఉన్నారు.

దేశంలో కాంగ్రెస్స్ పార్టీ అన్ని రాష్ట్రాల లో చరిష్మా కలిగిన నాయకత్వం లేక రోజు రోజుకూ తన ఉనికిని కోల్పోతూ ఉంది. కాంగ్రెస్స్ జాతీయ అధ్యక్షుడు గా రాహుల్ గాంధీ ఇమేజ్ ని 2014 లోనే బా జ పా సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం జరిపి  ప్రస్నార్ధకంగా మార్చింది. కాంగ్రెస్ బా జ పా ఎత్తుగడలు పసిగట్ట టానికి మూడు సంవత్సరాలు పట్టింది.

Also read  చండశేఖర్ ఆజాద్ రావణ్ ఢిల్లీ పీఠంమే లక్యంగా భీంఆర్మీ కార్యాచరణ ప్రకటించబోతున్నాడా!
A supporter holds a cutout of the Indian parliament with an image of Mayawati, chief of Bahujan Samaj Party (BSP), during a rally addressed by Mayawati in the northern Indian city of Lucknow January 15, 2014. REUTERS/Pawan Kumar (INDIA – Tags: POLITICS SOCIETY)

గత వారం ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బిఎస్పీ పొత్తు ద్వారా సమాజ్ వాది అభ్యర్ధులు బా జ పా ని ఓడించడం తో డిల్లీ మీడియా మరియు సోషల్ మీడియా బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జి మాయావతి యొక్క ప్రాభల్యం ఎంత కీలకమో గుర్తించింది. దళితులు – బి సి ల కలయక ఉత్తర ప్రదేశ్ లో బా జ పా మెజారిటీ కి గండి కొట్టగలిగితే 2019 లో బా జ పా మళ్ళీ గద్దేనేక్కడం అనుకున్నంత సులువు కాదు.

హిందుత్వ రాజకీయాలను నిలిపివేయడానికి ప్రాంతీయ పార్టీలతో బిఎస్పి కూటమి ముఖ్యమైనది?   

ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలో ఎస్పి అభ్యర్థికి బిఎస్పి తన మద్దతును విస్తరించింది. ఫుల్పూర్, గోరఖ్పూర్లలోని రెండు స్థానాలకు ఎస్పి గెలుపొందింది. ఎస్పీ, బిఎస్పీలు యుపిలో సీట్ల సర్దుబాటు పూర్తయితే, అప్పుడు ఆర్ఎస్ఎస్ / బిజెపి కష్టసాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

బిఎస్పీ కి నాయకత్వం వహిస్తున్న దళితుల మద్దతు తో, బలమైన ఓటు బ్యాంకు తో బి ఎస్పీ అన్ని రాష్టాల లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వలన బా జ పా ని సమర్ధవంతంగా ఎడుర్కొవొచ్చు. కానీ ఈ విషయంలో బి.ఎస్పీ కేంద్ర నాయకత్వం చాలా నెమ్మదిగా ఉంది అని చెప్పాలి.

 

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!

కర్ణాటకలో బిఎస్పి గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరిగి కాంగ్రెస్స్ అధికారం లోకి రావడం తో  బలహీనమైన బిఎస్పీ పార్టీ , దళిత  నాయకులతో బేరసారాలు చేసింది. దళిత సంఘాల నాయకులతో కూడా తన కబంధ హస్తాల్లోకి తీసుకుంది.  . కాంగ్రెస్ పార్టీ కర్ణాటక దళిత నాయకుడు మల్లికార్జున్  ఖార్గేను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రతిపాదించింది. కర్ణాటక రాష్ట్రంలో బిఎస్పి ఉనికి లేకుండానే ఇది సాధ్యం కాదు. బిఎస్పి ఇప్పుడు కర్ణాటకలో జెడియుతో కలిసి ఉంది. ఇది ఒక స్వాగత చిహ్నం. 

ఎస్పిల ఓట్లు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ యొక్క మిషన్ మరియు సిద్దాంతం  చుట్టూ ఏకీకృతం చేయటంతో BSP సులభంగా ప్రాంతీయ పొత్తులు నిర్మించగలదు. భారతీయ రాజకీయ ముఖ చిత్రంలో, గత ఎన్నికలలో ఓటింగ్ సరళని, ఓటింగ్ పదత్తుల ఆధారంగా హేతుబద్దమైన భాగస్వామ్యన్ని , స్నేహపూరితమైన పొత్తు తో ఎన్నికల్లో  బరిలోకి దిగాలి.

After BSP-SP won the UP by poll RSS-BJP supporter tweet

హిందూత్వ రాజకీయాలు బహుజన రాజకీయాలతో మాత్రమే ముగియగలవు మరియు దానిని ఎదుర్కోవటానికి ఇంకొక మార్గం లేదు.

అప్పటికి ఎస్పి- బిఎస్పి కూటమి బిజెపి అయోధ్య చుట్టూ ఉన్న మండల్ రాజకీయాల తర్వాత బిజెపిని ఆపివేసింది. బహుజన పార్టీలు కలిసి వచ్చి బ్రాహ్మణవాదానికి అంతిమ తీర్పు ఇవ్వాలి. బహుజన సమజాని ఇది సరైన సమయం. బహుజన విప్లవకారుడు, బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ కలలను సాకారం చేసిన మాన్యశ్రీ కాన్షి రాం ఈ పరిణామాలను ముందు గానే ఉహిన్చేరు.

Also read  చేవలేని దళిత నాయకత్వం!

దేశంలోని  దళితులు ఈ పరిణామాల కోసం ఎదురు చూస్తున్నారు.

(Visited 297 times, 1 visits today)

2 thoughts on “కీలకమవుతున్న ‘బెహన్ జి మాయావతి’ బిఎస్పీ పార్టీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!