కుల వ్యవస్థ – కమ్యూనిజం

షేర్ చెయ్యండి
  • 79
    Shares
 
  • ఏ సంస్కర్తకైనా అవసరమైన ఆయుధాలలో హేతువాదం, నైతిక శక్తి అనేవి రెండూ అత్యంత ముఖ్యమైనట్టివి. బలమైన ఈ రెండు ఆయుధాలనూ అతనికి నిరుపయోగం చెయ్యడం కార్యరంగంలో అతణ్ణి నిస్సహాయుడ్ని చెయ్యడమే! 
 
బాబాసాహెబ్ డాక్టర్ బి ర్ అంబెడ్కర్ తన కుల నిర్ములనలో చెప్పిన మాట ఇక్కడ మనం భారతీయ కమ్యూనిజం కి  ఉపమానంగా చెబుదాం. 
 
కుల సమస్య ఇవాల కొత్తగా వచ్చింది కాదు. కానీ నేడు ఎక్కువగా చర్చకు వస్తుంది. ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రెండు పరిణామాలను పరిశీలన చేద్దాం. మొదటిది పచ్చమ గోదావరి జిల్లా గర్గపర్రు, రెండవది గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడు. 
 
రెండు సంఘటనలో బాధితులు పెద వర్గాలు, ఒకే సామాజిక వర్గం. గరగపర్రు లో కానీ, పెద్ద గొట్టిపాడు లో జరిగిన రెండు సంఘటనలకు మూలం కులం. రెండూ చోట్ల నిందితులను కాపాడింది వారి కులం. పెత్తందారీ కులం, సో కాల్డ్ అగ్ర కులం. 
 
భారతీయ కమ్యునిజం యొక్క దృకధం ఈ విధంగా ఉంది.”కులమనేది ఒక ఉపరితల అంశమని, వర్గ పోరాటం ఫలితంగా పునాదిని ముందు విప్లవీకరిస్తే ఆ పైన ఉపరితలంలో అనివార్యంగా లేక ప్రయత్నా పూర్వకంగా జరిగే సాంస్కృతిక విప్లవ పోరాట ఫలితంగా వచ్చే మార్పుల్లో కులం అనేది మాయం అవుతుంది”
 
ఇండియా లాంటి దేశంలో కమ్యునిజం చైతన్యం వలన లేదా చొరవతో ప్రజల సంఘటిత చర్య వలన వర్గం పోయి కులం దానంతట అదే పోతుంది అనుకునే భ్రమల్లో ఇండియా కమ్యూనిస్ట్ నేటికీ ఉన్నారు. 
 
ప్రయత్నిస్తే ప్రపంచంలోని ఒక వర్గంలోని ప్రజలు మరొక వర్గంలోకి మారటానికి వీలవుతుంది కానీ ఇండియా లో ఒక కులం లోని ప్రజలు ఇంకొక కులం లోకి మారటానికి వీలు లేదు. 
 
కుల సమస్యను పరిష్కరిస్తే  ఇండియాలోని ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని బాబాసాహెబ్ డాక్టర్ అంబెడ్కర్ చెబితే, కమ్యూనిస్టు నాయకుడు కారల్ మార్క్స్ వర్గ సమస్య పరిష్కరిస్తే ప్రపంచంలోని ప్రధాన సమస్య పరిష్కారం అవుతుదంటాడు. 
 
ఇండియా లో కులము వర్గం రెండూ ఒకే చోట పుట్టినవి అవి వేరు వేరుగా ఎప్పుడూ లేవు, కమ్యూనిజం నే తీసుకుంటే భారత కమ్యూనిస్ట్ లకు జెండా మోసే వారిగానే దళిత వర్గాలు నేటివరకూ ఉన్నాయి కానీ నాయకత్వం వహించే అవకాశం ఇవ్వలేదు. కారణం కులం అని వేరే చెప్పక్కర్లేదు. 
 
ఇండియాలో బ్రాహ్మణులు, బ్రాహ్మణత్వం ఏ దైనా రాజకీయ పార్టీలో కానీ లేదా సాంఘిక సంఘంలో ఉన్నంత వరకూ ఆయా సంఘాలకు పార్టీలకు ఎలాంటి డోకా ఉండదు. ఎప్పుడైతే బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గిపోతుందో అప్పుడు ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తారు లేదా నిర్వీర్యం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుల ఆధిపత్యం లో ఉన్నంత వరకూ ఆ పార్టీ కి డోకా లేదు ఎప్పుడైతే ఆ పార్టీ లో బ్రాహ్మణ ఆధిపత్యం పోయి సోనియా గాంధీ నాయకత్వం వహించిందో బ్రాహ్మణు లు BJP పక్షాన చేరేరు. అందుకే నేడు BJP పార్టీని బ్రాహ్మణ , బనియా పార్టీ గా పిలుస్తున్నారు. బహుశా ఇండియా లో కమ్యూనిస్ట్ లకు కూడా ఈ భయం ఉండే ఉంటుంది అందుకే వారి రాజకీయ కార్యవర్గం లో కానీ లేదా నాయకత్వంలో కానీ ఎక్కడా దళితులకు చోటు ఇవ్వలేదు. 
 
ఇండియా కమ్యూనిస్ట్ లకు  వర్గ రహిత, కుల రహిత సమాజాన్ని స్థాపించే రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా ?  ప్రతి చారిత్రిక దశలో వచ్చిన కొత్త పరిణామాన్ని పాత సిద్ధాంతంతో సంయోగం చెందించి అటు పాతది కాకుండా, ఇటు కొత్తది కాకుండా “మధ్యే మార్గ- బ్రాహ్మణీయ” భావజాలంతో  వర్గ పోరాటం అంటూ కాలం వెల్లదీస్తారా? కమ్యునిస్టు ల్లో విలక్షణ బ్రహ్మణీయ నాయకత్వం ద్వారా కాంగ్రెస్ లాంటి పార్టీలతో లేదా తెలుగు దేశం లాంటి ఫ్యూడల్ కుల పార్టీలతో జత కలిసి వర్గ నిర్ములన, కుల నిర్ములన చేస్తారా?
 
పెట్టుబడిదారీ సమాజం నుండి కమ్యూనిజానికి వెళ్ళడం ఒక చారిత్రిక ఆధ్యాయం. ఈ అధ్యాయం ముగిసేవరకూ పెట్టుబడిదారులు పునరుద్దరణకు ఆసిస్తూ ఉంటారని లెనిన్ చేచ్ఛరించేడు. ఇది 1917 లోనే సోవియట్ యూనియన్ లో రుజువుకూడా అయ్యింది. దురదృష్టవశాత్తు భారత దేశంలో పెట్టుబడి దారుడు (ఆధిపత్య కులం ) కమ్యూనిజం లో చేరినా వారి తరం లేదా వారు కుల పార్టీల లో చేరి కుల ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి లెనిన్ ప్రపంచ వ్యాప్తంగా హెచ్చరించిన వర్గం ఇండియా లో బాబాసాహెబ్ చెప్పిన కులం రెండూ ఒకే వరలో కత్తులే అని చెప్పటానికి కమ్యునిస్టు ల రాజకీయ మైత్రి లేదా వారి తరం వారి సొంత సామజిక వర్గాల రాజకీయ పార్టీలలో చేరడం మనకి స్పష్టం చేస్తుంది. 
 
దళిత వర్గం నుండి వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా ఇండియా కమ్యూనిస్ట్ లు వారి పార్టీ లకు అనుబంధంగా కుల నిర్ములానా సంఘాలు ఏర్పాటు చేసేరు. కుల నిర్ములనా సంఘాల ద్వారా కులం పోతుందా అని మానవ హాక్కుల నాయకుడు కె . బాలగోపాల్ అనుమానం వ్యక్తం చేసేరు. ప్రజాతంత్ర విప్లవ పోరాటంలో అంతర్భాగంగా కుల సమస్యతో సరైన వైఖిరి. కుల వ్యవస్థను విడి విడిగా విశ్లేషించి, దానితో విడి విడిగా తలపడటం వలన ప్రయోజనం లేదని కె బాల గోపాల్ పేర్కొన్నారు. 
 
ఇటీవల మతోన్మాదాన్ని ఎదుర్కుంటానికి లాల్ – నీల్ కలయిక చాలా అవసరంమని ఒక చర్చ జరుగుతుంది. “ప్రజలు రాజకీయంగా ఎదగటానికి ముందు వారి మనస్సు ఆత్మ విముక్తి కావాల్సిన అవసరం ఎంతో ఉన్నది” బాబాసాహెబ్ డాక్టర్ అంబెడ్కర్. లాల్ -నీల్ జిందాబాద్ అని అంటున్న ఇండియా కమ్యునిస్ట్ లకు, లిబరల్ దళిత వాదులకు బాబాసాహెబ్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? 
 
మావో లక్ష సాంస్కృతిక విప్లవాలలో  దళిత సంస్కృతి ఉందా? 1993 లో ఏడు విప్లవ విప్లవ సంస్థల విలీనశక్తిగా ఏర్పడిన సి. పి . ఐ (ఏం . ఎల్ ) జనశక్తి శిబిరంలో 1994లో కుల పోరాట సిద్ధాంతం పై, పూలే , బాబాసాహెబ్ డాక్టర్ అంబెడ్కర్ ఆలోచనా విధానం పై జరిగిన చర్చలో విభేదాలు వచ్చి ఆ సంఘం రెండు ముక్కలుగా చీలిపోయింది. దీనికి కారణం మార్క్సిస్టు విప్లవ శిబిరంలో కుల పోరాట సిద్ధాంతాన్ని ఎజెండాకేక్కకుండా అగ్ర కుల శక్తులు అడ్డుకోవడమే అసలు కారణం. 
 
సాంప్రదాయ విప్లవ ఉద్యమంలో ఆధునిక దళిత విప్లవ కారులు గ్రహించిన కుట్రలు, సిద్ధాంత విభేదానికి దళిత వర్గాలకు విప్లవ ఉద్యమం పై భ్రమలు కోల్పోయేటట్టు చేసింది. ఇప్పటికే ఎందరో దళిత మేధో శక్తి కమ్యూనిజం , విప్లవం వెంటపడి విలువైన సమయం కోల్పోయేరు. 
 
“హింసాయుత చర్యల ద్వారా, కార్మిక నియంతృత్వ పరిపాలన ద్వారా కమ్యూనిస్టు లు తమ ధ్యేయాన్ని సాధించదలుచుకున్నారు. ఈ నియంతృత్వ పాలనలో వ్యక్తి స్వాతంత్యానికే మాత్రము తావులేదు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా  ఈ నియంతృత్వ పాలన ఎంతవరకు అని ప్రశ్నిస్తే  యీ నియంతృత్వ పాలన తాత్కాలికమేనని, కమ్యూనిజం పరిపక్వమైన దశలో పాలకుడు, పాలితుడు అనేవారే ఉండరని వారు సమాధానం చెబుతారు. కమ్యునిజం పరిపక్వమయ్యే దశ ఎన్నాళ్లకు వస్తుంది.? ఇరవై ఏళ్ళల్లో, నలబై ఏళ్ళల్లో, పోనీ ఎనభై ఏళ్ళకైనా వస్తుందా ? అని అడిగితె వారి వద్ద నుండి సమాధానమే రాదు.” బాబాసాహెబ్ డాక్టర్ అంబెడ్కర్. 
 
బాబాసాహెబ్ లేవనెత్తిన ఈ ప్రశ్న నేటి కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ సానుభూతిపరులైన దళిత మేధావులు చెప్పాల్సిన సమాధానం ప్రశ్నగానే మిగిలిద్దామా? 
 
 
(Visited 142 times, 1 visits today)
Also read  ఎస్సిల ట్రిపుల్ తలాక్ ఎప్పుడు! 

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!