కెసిర్ ఫెడరల్ ఫ్రంట్ కేంద్రం మీద పెత్తనం కోసమేనా!

షేర్ చెయ్యండి
  • 27
    Shares
  • ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన కె. చంద్ర శేఖర్ రావు, ఉద్యమ నాయకుడిగా అనంత కీర్తిశిఖరాలు కెక్కి తెలంగాణా సొంత రాష్ట్రం , సొంత పాలనలో తానే ముఖ్యమంత్రిగా ప్రజల ఆశలకు, కలలకు న్యాయం చెయ్యలేక రోజు, రోజు కూ దిగజారిపోతున్న క్రమంలో అయిన నోట ఫెడరల్ ఫ్రంట్ రాజకీయంగా తెలంగాణ ప్రజల్లో సంచలనం కలిగించింది. 
 
అందరికీ తెలిసిందే కె సి ర్ ఎలాంటి పరిస్థితిల్లో అయినా తన వాగ్ధాటి తో నెట్టుకు రాగాల సమర్ధుడు. అయితే సడెన్ గా ఫెడరల్ ఫ్రంట్ గా తెరపైకి రావడంతో కేంద్రం తో కేసిర్ గొడవపడుతున్నట్లు గా, ఏదో మతలబు ఉందని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు. 
 
కేంద్రంలో బా జ పా సర్కార్ కి భవిషత్ లో దక్షణాది రాష్ట్ర లు చాలా కీలకం, అందుచేత BJP తెలంగాణా లో సొంతగా ఎదిగే అవకాశములో కె సి ర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిందా లేక 2019 ఎన్నికల వ్యూహంలో  తే రా స(TRS) – బా జ పా (BJP) ఎన్నికల పొత్తులో TRS మోడీ కి మొండి చెయ్యి చూపించిందా?  ఇటీవల కాలంలో కె సి ర్ (KCR) పై విమర్శల దాడి ఎక్కువ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా తన స్థాన్నాన్ని పదిలం చేసుకునే క్రమంలో కుల సమీకరణ లో ముందు ఉండి KCR /TRS  వ్యతిరేక రెడ్డి వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకు వస్తుంది. అలాగే తెలంగాణా ఉద్యమ సమయంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు గా ప్రో. కోదండరాం కి కేసిర్ మధ్య పెరిగిన దూరం కోదండరాం పార్టీ పెట్టేచాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజల్లో కాస్తో, కూస్తో పలుకుబడి ఉన్న ప్రో. కోందండరాం భవిషత్ లో తే రా సా ని ఓడించటానికి కాంగ్రెస్ తో చేతులు కలపవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కేసీర్ తన ఇమేజ్ పెంచుకోవడానికి ఫెడరల్ ఫ్రంట్ గా తెరపైకి వచ్చేడు. 
 
కేసీర్ ఫెడరల్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో BJP వ్యతిరేక శక్తులు  కాంగ్రెస్ కూటమిలో చేరకుండా కాంగ్రెస్- BJP వ్యతిరేక ఫ్రంట్ గా తెరపైకి రావడం BJP వేసిన ఎత్తుగడలో KCR ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు అని సోషల్ మాధ్యమంలో విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
నవభారత నిర్మాత బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ భారత దేశాన్ని యూనియన్ గా మాత్రమే పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కి భారత భూభాగం పైన , ఇక్కడ ప్రజల మనస్తత్వం కి సరిపోదు అన్నారు. 1948 నవంబర్ 4 వ తేదీన రాజ్యాంగ సభలో మాట్లాడుతూ “ప్రజాస్వామ్యుతమైన మంత్రివర్గం సుస్థిరమైంది గాను, బాధ్యతాయుతమైంది గాను ఉండి తీరాలి” అని పేర్కొన్నారు. 
 
బాధ్యత మరిచి అవినీతి ఊబిలో కూరుకుపోయిన పార్టీలు కేంద్రం ని బెదిరించే ధోరణిలో జాతీయ పార్టీలను బెదిరిస్తూ వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మీదనే పార్టీ స్థాపించేరు అనేది అందరికీ తెలిసిందే, అదే ఎన్టీర్ కేంద్ర మిధ్య, రాష్ట్రాలు స్వతంత్రం అని ఆనాడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రాతీయ పార్టీలతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేరు. ఇప్పుడు కూడా కేసీర్ కానీ , చంద్ర బాబు నాయిడు కానీ కేంద్రంలోని BJP ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే కేంద్రం వారి యొక్క అవినీతిని బయట పెడుతూ ఉండటమే. 
 
బాబాసాహెబ్ డాక్టర్  అంబెడ్కర్ రాజ్యాంగ చట్ట సభలో  మాట్లాడుతూ ఒక అనుమానం వ్యక్తం చేసేరు ” అధ్యక్షా! చరిత్ర పునరావృతమౌతుందా? ఏమో, నే జెప్పలేకున్నాను’  బాబాసాహెబ్ వ్యక్తం చేసిన ఈ అనుమానాలకు కారణం దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న ప్రాంతీయవాదం, బాషా వాదం, కుల తత్త్వం, మతత్వం వంటి ఆలోచనలు రాజకీయ నాయకులు ప్రేరేపించినట్లైయితే దేశం మళ్ళీ స్వాతంత్య్రం కోల్పోవడం ఖాయం”  రాజ్యాంగ సభను హెచ్చరించారు. 
 
ప్రాంతీయ పార్టీలు కులం పునాదుల మీదనే నిర్మాణం అవుతున్నాయి. ఆర్ధికంగా బలమైన రెండు ఫ్యూడల్ స్వభావం కలిగిన కులాలే రాష్ట్రాలను పాలిస్తున్నారు. జనాభా పరంగా మెజారిటీ కలిగిన దళితులు, బి సి ల రాజకీయ ప్రాధాన్యత కోల్పోతూ ఫ్యూడల్ కుల పార్టీలకు భజన పరులుగా ఉంటున్నారు. ఈ కుల పెత్తందారులను వ్యతిరేకిస్తూ ఫ్యూడల్ కులాలకు వ్యతిరేకంగా దళితులను , బి సి లను రాజకీయంగా ఏకీకరణ చేసే సమయంలో పెత్తందారులు కొత్త సిద్ధాంతంతో అణగారిన వర్గాల ఐక్యత ని దెబ్బతీస్తూ వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని చేసిన వాగ్ధానం కేసీర్ మరచినా దళితులు మరవలేదు. దళితుల మీద దాడి చేసేవారి కొమ్ముకాస్తున్నారు. దీనిని నిరసించి దళితులు లెఫ్ట్ డెమాక్రాటిక్ ఫ్రంట్ గా మరియు బహుజన సమాజ్ పార్టీ (BSP )ని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉండే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒక రాజకీయ చర్చను కేసీర్ తీసుకు వచ్చేరు. 
 
మన రాజ్యాంగం ఆచరణ సాధ్యమైనది, చాలా సున్నితమైనది గా కనిపించినా అవసరమైనప్పుడు దుర్బేధ్యం గా ఉంటుంది. ఇది కేసీర్ లాంటి ప్రాంతీయ పార్టీలకు నచ్చడం లేదు. బడ్జెట్ ని సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ ల కోసం వాడుకునే కేసీర్ , చంద్రబాబు లాంటి కుల పార్టీల నాయకులకు కేంద్రం ప్రశ్నించడం నచ్చదు, వారికి కేంద్రం నిధులు వరదలా పొర్లించాలి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ రైతులకు పంపిణీ చేసిన చెక్కుల పబ్లిసిటీ కోసం రూ 200/- కోట్లు ఖర్చు పెట్టేడు అంటే పాలకుల బాధ్యతారాహిత్యం మనకి అర్ధం అవుతుంది.. 
 
రాజ్యాంగచట్టం అమల్లోకొచ్చిన తరువాత ఏదైనా విషమ పరిణామాలు వాటిల్లినట్లైతే దానికి మానవ లోపమేకానీ, రాజ్యాంగ లోపం కారణం గాజాలదని గట్టిగా చెప్పగలను అని బాబాసాహెబ్ డాక్టర్ అంబెడ్కర్ రాజ్యాంగ చట్ట సభ ను ఉద్దేశించి చెప్పేరు. 
 
కేంద్రాన్ని బెదరించటానికి ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీర్ చేసిన ప్రయత్నం ఓటి కుండలాంటిదే, జాతీయ భావం లేకుండా ప్రాతీయ వాదం తో కూటమి కట్టి అధికారంలోకి వస్తే దేశం మళ్ళీ 500 ల ముక్కలుగా విడిపోతుంది ఆ ముక్కలను రాజ్యాంగపరంగా ఒకే దేశం గా నిర్మించటానికి బాబాసాహెబ్ డాక్టర్ బి ర్ అంబెడ్కర్ మళ్ళీ, మళ్ళీ పుట్టరు. 

 
(Visited 86 times, 1 visits today)
Also read  ప్రమాదంలో కుల పార్టీల రాజకీయ భవిషత్తు?

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!