క్రోనీ క్యాపిటలిజం!

షేర్ చెయ్యండి

మనం తరచూ వినే మాట క్యాపిటలిజం, ఆంటే పెట్టుబడిదారీ వ్యవస్త.మానవ అభివృద్ధి లో పెట్టుబడిదారీ విధానం మానవ హక్కులు లేకుండా పూర్తి గా వ్యాపార లాభాపేక్ష మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇదే పెద్ద ప్రమాదం అనుకుంటే ఈ క్రోనీ క్యాపిటలిజం ఏంటీ కొత్తగా అనుకుంటూన్నారా? క్రోనీ క్యాపిటలిజం ఆంటే ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా పెట్టుబడిదారుడికి గుత్తాధిపత్యం కట్టబెట్టడం. ఆంటే ప్రజలకు చెందాల్సిన సంపదను వారికి కావాల్సిన పెట్టుబడిదారుడికి మాత్రమే చెందేటట్టు చెయ్యటం.

అసలు బారత దేశంలో క్రోనీ క్యాపిటలిజం ఉందా ఆంటే ఖచ్చితంగా ఉందే అని చెప్పాలి. అసలు బారత దేశం నడుస్తుందే క్రోనీ క్యాపిటలిజం మీదనే అని చెప్పాలి. ప్రపంచీకరణలో బాగంగా బారత దేశం గాట్ ఒప్పందాలు కానీ, IMF , ప్రపంచ బ్యాంకు తో ఒప్పందాలు చేసుకుని దేశం అభివృద్ధి చెందాలి ఆంటే సరళమైన ఆర్ధిక చట్టాలు, ప్రభుత్వం ఇచ్చే అనుమతులు సులువుగా ఉండాలి. ఆంటే పెట్టుబడి దారుడికి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలకాలి. దీనికి మనవాళ్లు కనిపెట్టిన విధానం సింగిల్ విండో పద్ధతి , మొదట వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యత తదితర అంశాలు.

బారత దేశం Rich in Natural Resources అని మనం చిన్నప్పటి నుండి చదువుకోవడం జరిగింది. సహజ సంపద (Natural Resources) ఆంటే భూమి, నీరు, బొగ్గు, గ్యాస్, ఖనిజాలు , తదితర సంపద. ఇవి అన్నీ ప్రజలకు చెందుతాయి. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ ప్రభుత్వాలు బాధ్యత తో వాటిని ప్రతి పౌరుడికీ ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఈ సహజ సంపద భావితరాలకు కూడా ఉపయోగ పడాలి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు సంఘటన లు దేశ సంపద ఎలా వ్యక్తుల సొంత ఆస్తిలా మరిపోయిందో మనకు తెలుసు.

1. అనంతపురం లో జరిగిన అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు, ఆలాగే బళ్ళారి జిల్లా లో జరిగిన అక్రమ రవాణా 2. కృష్ణా గోదావరి బేసిన్ లోని గ్యాస్ నిక్షేపాలు.

ఇక బారత దేశాన్ని కుదిపేసిన ది గ్రేట్ ఇండియన్ టెలిఫోన్ విప్లవం వెనకాల ది గ్రేట్ ఇండియన్ టెలిఫోన్ దోపిడీ కూడా ఉంది. 2జి స్పెక్ట్రమ్ లో కాగ్ రూ 1 లక్ష 75 వేల కోట్లు ప్రజాధనం నష్టపోయిన సంగతి భారతీయులకు చెప్పిన సంగతి తెలిసిందే. First come – First serve ఆంటే సినిమా టిక్కెట్లు మొదట క్యూ లైన్ లో ఉన్నవాడికి ఇచ్చినట్టు లైసెన్స్ లు ఇచ్చేరు. దేశ ప్రజలకు చెందాల్సిన సంపద కొన్ని కుటుంబాలకే దక్కింది. 2 జి స్పెక్ట్రమ్ ఆంటే అందులో తరిగిపోయేది , ఆరిగి పోయేది ఏమీ లేదు. ఇనుప ఖనిజం , నల్ల బంగారం బొగ్గు, గ్యాస్ నిక్షేపాల పరిస్థితి ఏంటి.

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

ఇటీవల బళ్ళారి ఐరన్ ఓర్ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఎలా జరిగిందో మనకి తెలుసు, నలుగురు వ్యక్తులు ఉండటం కోసం బొంబాయి నగరంలో ముఖేష్ అంబానీ 24 అంతస్తుల ఇల్లు చూస్తే మనకి బడా వ్యక్తులు ప్రజల సంపద ఎంత దోచుకున్నారో తెలుస్తుంది. రెడ్డి బ్రదర్స్ గాలి జనార్ధన్ రెడ్డి, వై యెస్ జగన్మోహన్ రెడ్డి బళ్ళారి, అనంతపురంలో కొండలనే కాదు భూ గర్భంలో బొంద తవ్వి లక్షలాది టన్నుల ఇనుప ఖనిజం అక్రమంగా తరలించిన సంగతి మనకు తెలిసిందే. చైనా ఒలింపిక్స్ సమయంలో బళ్ళారి, అనంతపురం లో ఐరన్ ఓర్ చైనాకి తరలిపోయింది. ఒక విధంగా చెప్పాలి ఆంటే కృష్ణ పట్నం పోర్టు వీరి అక్రమ రవాణా కోసమే నిర్మించేరు.

ధీరుబాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సాంబ్రజ్యాన్ని ముఖేష్, అనీల్ అంబానీలు పంచు కోవటం అనేది ఒక పెద్ద కుటుంబ మెలోడీ డ్రామా ఆని బొంబాయిలో వ్యాపార వర్గాలు అనుకుంటున్నాయ్. అంబానీ కోడళ్ళు నీతా , టినా అంబానీ లకు పడటంలేదు అంటూ ప్రచారం చేసి మరీ రక్తి కట్టించిన నాటకం దాద్రీలోని అనిల్ అంబానీ మెగా గ్యాస్ పవర్ ప్లాంట్ (Biggest in Asia) కి కృష్ణ గోదావరి బేసిన్ లొని గ్యాస్ తరలి పోతుంది. ప్రాజెక్ట్ ఉత్పత్తికి ముందే అత్యధిక ధరకు షేర్ లు అమ్మిన ఘనత రిలియన్స్ ఎనర్జీ లిమిటెడ్ ది. నాలుగు గోడల మధ్య జరిగిన ఈ గ్యాస్ నిక్షేపాల ధర లో జరిగిన అవినీతి ని సి. ఏ జి control and auditor general తప్పుబట్టింది. కేంద్ర క్యాబినెట్ నే ఈ ధర నిర్ణయించటానికి రెండుగా విడిపోయింది. కేంద్ర మంత్రిని పలుమార్లు మార్చటం జరిగింది. ఇలా అడ్డగోలుగా కావాల్సిన వ్యక్తులకు చట్టాలు మార్చి వారికి నచ్చిన విధంగా మార్చి మనందరికీ దక్కాల్సిన సంప్రదను రిలియన్స్ కు కట్టబెట్టేరు.

Also read  రిజర్వేషన్లు కావవి, రిప్రజెంటేషన్స్; మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు రాష్ట్రాన్ని పాలిస్తున్న మీ కులం అని ఎందుకు గుర్తించరు?

ఇక మరో సహాజ సంపద బోగ్గు, నల్ల బంగారం గా మనం పిలుచుకుంటాము. క్యాప్టివ్ పవర్ జనరేషన్ పేరుతో బారత ప్రభుత్వ రంగ సంస్ఠ, మహా నవరత్న కంపెనీ అయిన కోల్ ఇండియా బొగ్గు గనులను ప్రైవేట్ పరం చెయ్యటానికి జరిగిన అవినీతి “కొలిగేట్ స్కామ్” ని కోర్టులు తప్పుబట్టి రద్దు చేసిన సంగతి దేశ ప్రజలకు తెలుసు. బహుసా ఈ స్కామ్ తర్వాత నే అనుకుంటా మీ పేస్ట్ లో బొగ్గు ఉందా అని అడిగింది కొలిగేట్ కంపెనీ వాడు. ఇలా దేశ సంపదను ప్రభుత్వం కుమ్మక్కు అయి నచ్చిన వ్యక్తులకు కట్టబెట్టడమే క్రోనీ క్యాపిటలిజం.

2013 మధ్య కాలం లో మోడీ మొత్తం మీడియాని మేనేజ్ చేసి ప్రచారం చేసిన “అచ్చేదిన్ ఆనేవాలా హై” ఇంకా వస్తూనే ఉంది. విదేశాల్లో దాచిపెట్టిన అవినీతి సొమ్ము నల్ల డబ్బు ఒక్కొక్కరి ఖాతాలో రు 15 లక్షలు వేస్తాను అన్నది ఒట్టి మాట. ఆర్ధిక వెతలు మాట ఏంటంటే నల్ల డబ్బు ఎప్పుడో దేశంలోకి తెల్ల డబ్బుగా మారిపోయి వచ్చింది అంటున్నారు. సూట్ కేస్ కంపెనీలు, మారిష స్ దేశాల నుండి దర్జాగా వ్యక్తుల బెడ్ రూములో భద్రంగా దాగి ఉంది అంటున్నారు.

Also read  తెలంగాణ ఎన్నికలు దళిత - బహుజనుల నవీన రాజకీయానికి నాంది కాబోతుందా!

ఒక పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తుల కోసం దేశ సంపదను దోచి పెట్టడం ప్రజలు ప్రశ్నించాలి.

(Visited 18 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!