గాంధీ గ్రామ స్వరాజ్యం ఒక కుట్ర!

షేర్ చెయ్యండి

మీ బానిసత్వం పోగొట్టుకోవటానికి ఏ దేవుడు మీదకానీ, మహానుభావుడు మీద కానీ ఆదరపడవద్దు: బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్.

బారత దేశంలో నిమ్నజాతీయులకు ప్రదానంగా ఇద్దరు శత్రువులు

  1. హిందూ మతం
  2. గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ (భూస్వామ్య వ్యవస్థ)

బారత దేశం అంటే గ్రామీణ ప్రాంతం. వ్యవసాయ ఆధారిత దేశం. హిందు కుల వ్యవస్థ ఏమి చెబుతుంది అంటే అంటారని వారికి ఎలాంటి ఆస్తి హక్కు ఉండకూడదు అంటుండ్. ఒక్క ఆస్తి హక్కే కాదు ఎలాంటి హక్కులు ఉండకూడదు. ఇక గ్రామాల్లో అధిపతి అక్కడి భూస్వామి. ఎవరీ భూస్వామి అంటే ఒకప్పటి శూద్రుడు. బ్రాహ్మణ కరణాల వ్యవస్థ నాశనం అయినతర్వాత వారి తాబేదారులు అయిన శూద్ర కులాలు బ్రాహ్మణుల నుండి గ్రామాల్లో భూమిని , అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వారే పెత్తందారులు.

సహజంగా ఆనాటి నిమ్నకులాలు అయిన నేటి ఎస్సి లు శ్రామిక జీవులు. కుల వ్రుత్తి ఆధారంగా జీవించే వారిని బి సి లు గా పిలవబడుతున్నారు. ఈ శ్రామిక కులాల జీవితం గ్రామాల్లో పెత్తందారీ / భూస్వాముల  పై ఆదారపడి ఉంటుంది. కాబట్టి వారి బ్రతుకు భూస్వాముల గుప్పెట్లో ఉంది. అందుకే శ్రమను దోచుకున్నా, లేదా వారి స్త్రీలను మాన బంగం చేసినా, దేవుడు పేరు చెప్పి దేవ దాసీ అని అనుబవించిన నోరు మెదపలేదు.

బొంబాయి కౌన్సిల్ లో పంచాయతీ బిల్లు మీద జరిగిన చర్చలో బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ మాట్లాడుతూ

A population which is hidebound by caste; a population which is infected by ancient prejudices; a  population which flouts equality of status and is dominated by notions of gradations in life; a population which thinks that some are high and some are low — can it be expected to have the right notions even to discharge bare justice? Sir, I deny that proposition, and I submit that it is not proper to expect us to submit our life, and our liberty, and our property to the hands of these panchas

గాంధీ గ్రామ స్వరాజ్యమే అంతిమ లక్ష్యం అన్నారు. గ్రామ స్వరాజ్యం అంటే అక్కడ పెత్తందారుల పెత్తనం. గ్రామానికి మూలం అయిన వ్యవసాయ భూమి పెత్తందారుడి చేతిలో ఉంది. మొత్తం భూమి గుడి క్రింద ఉంది. కాబట్టి అక్కడ బ్రతకటానికి భూమి మీద బ్రతకాలి. 

Also read  రెండో రౌండ్ టేబుల్ సమావేశం!

సెంటు భూమి కుడా లేని ఎస్సీలు గ్రామాల్లో ఉండి భూస్వామి మీద ఆధారపడకుండా, వివక్ష అనుబవించకుండా, దోపిడీకి గురికాకుండా ఉండాలి అంటే గ్రామాలను ఎస్సీలు విడనాడాలి అని అభిప్రాయపడ్డారు. అందుకే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఎస్సీలను పట్టణీకరణ చెందమన్నారు. బాబాసాహెబ్ డా. భీంరావ్ అంబెడ్కర్ గ్రామ స్వరాజ్యం ఆంటే పెత్తందారీల స్వరాజ్యం, అక్కడ ఎస్సిలు దోపిడీకి గురి అవుతారు మురికి కుంటలాంటిది, తరాలుగా అక్కడ దోపిడి చేస్తూనే ఉన్నారు, హక్కులు నిరాకరించబడతాయి, కాబట్టి పూర్తిగా వ్యతిరేకించేరు.

బారత దేశంలో మెజారిటీ జనాబా అయిన ఎస్సి / ఎస్టీ గ్రామాలను విడిచి పెట్టి పట్టణీకరణ చెందితే గ్రామాలకు ఆయువు పట్టు అయిన “కుల వ్యవస్థ” దెబ్బతింటుంది అని గాంధీ బయపడి ఉంటారు. గాంధీ హిందూ కుల వ్యవస్తను నమ్ముతాను అని ప్రకటించుకున్నారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కుల నిర్మూలన జరగాలి అని కోరుకున్నారు,

ఏడు దశాబ్దాల బారత దేశ చరిత్రలో కుల వ్యవస్థ చేస్తున్న కుట్రలు ఒకటి కాదు రెండు కాదు. గాందీ టోపీలు ధరించి జెండా పట్టుకుని గొప్పగా చెప్పే గ్రామ స్వరాజ్యం ఖైర్లాంజీ లో విలయతాండవం చేసింది. కంచకచర్ల లో కోటేశ్ ను పందిరి గుంజకి కట్టేసి కాల్చేసింది. నీరుకొండ, కారంచేడు, చుండూరు, ప్యాపిలి ఒకటి కాదు రెండు కాదు నిన్న మొన్న మందని లో మధుకర్, అగిరిపల్లి, గరగపర్రు, ఆబగపట్టణం, దేవరపల్లి, గొట్టిపాడు ఒకటి కాదు రెండు కాదు. అందుకే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గ్రామ స్వరాజ్యం కాదు అవి “మురికి కుంటలు” అన్నారు.

Also read  Four years of Chnadrababu Naidu regime, neglected Tribals!

భూమిని పంచకుండా గ్రామ స్వరాజ్యం సాధ్యమా!

సంపన్నుల చేతుల్లో భూమి కేంద్రీకృతం అయితే అధికారం అధికారం కేంద్రీకృతం అయ్యి పేదల పైన నిరంకుశపాలన సాగే ప్రమాదం ఉంటుందని, ప్రజల అభివృద్ధి కోసం భూమిని పంచాలని క్రీ .పూ 6 వ శతాబ్దానికి చెందిన గ్రీకు  రాజనీతజ్ఞుడు సోలస్ చూచించారు.

ప్రపంచంలో భూమిని పంచిన దేశాల వివరాలు ఒక్కసారి చూద్దం. క్యూబా 60%, అమెరికా 45%, చైనా 43 %, జపాన్ 40%, ఫ్రాన్స్ 40%, తైవాన్ 37%, దక్షిణ కొరియా 32% అదే బారత దేశం లో కేవలం 1.2% పంచి ప్రపంచదేశాల లో అధమ స్తాయిలో ఉంది. భూమిని పంచిన దేశాలు అభివృద్దిలో దూసుకు పోతుంటే బారత దేశంలో భూమిని పంచమని అడిగితె కాల్చి చంపుతున్నారు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ప్రకారం దేశంలో భూస్వామ్య వ్యవస్తను రద్దు చేసి, ప్రబుత్వమే భూమి పై పూర్తీ అధికారం కలిగి ఉండాలని, సమిష్టి లేదా సహకార వ్యవసాయ విధానం ప్రవేశ పెట్టాలని అప్పుడు మాత్రమే ఎస్సీల కట్టుబానిసత్వం నుండి విముక్తి కల్పించగలమని పేర్కొన్నారు.

విశేషము ఏమంటే 1969 లో భూసంస్కరణ చట్టాలకు పునాది వేస్తె 1972 వరకూ చట్టం ఆమోదించలేదు. ఆంధ్రప్రదేశ్ లో 34 లక్షల ఎకరాల మిగులు భూమి ఉంటుంది అని అంచనా వేస్తె కేవలం 7400 ఎకరాలు మాత్రమె తేల్చేరు. 1992లో 20 లక్షల భూమి ఉందని చెప్పినా ప్రబుత్వం 8 లక్షల ఎకరాలు మాత్రమె చూపెట్టింది. పేదలకు భూమిని పంచాలి అంటే ఖచ్చితంగా అది ఎస్సి / ఎస్టీ లకే పంచాలి, కానీ భూస్వామ్య కుల పాలకులు భూమిని పంచకుండా గ్రామ స్వరాజ్యం గురించి కలలుగంటున్నారు.

గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి?

వ్యవసాయం, పశుసంవర్థక, గ్రామీణ నీటి సరఫరా, విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మత్స్యశాఖ వంటి ఎన్నో అంశాలు గ్రామ స్వరాజ్యంతో  ముడిపడి ఉన్నాయి.

Also read  చరిత్రలో నిలిచిపోయిన బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆంధ్రా పర్యటన!

అభివృద్ధి అంటే ఎత్తైన భవనాలు, నునుపైన రోడ్లు కాదని, మానవుని అభివృదే  నిజమైన సమాజ అభివృద్దని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అంటారు. ఎస్సి , ఎస్టీల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ది కాదని ఈ దేశ పాలకులకు చూచించారు.

ఒక వైపు ఎస్సి / ఎస్టీ లు అభివృద్ధి చెందకుండా, వారికి స్వయం ప్రతిపత్తి కల్పించకుండా, భూమి లేకుండా ఇక స్వరాజ్యం ఎలా సాధిస్తారు?

మురికి కుంటని నమ్ముకుంటే మురికే మిగులుతుంది. అందుకే బాబాసాహెబ్ గ్రామాలను కాలి చెయ్యమన్నారు. నగరాలల్లోకి వచ్చి స్వతంత్రంగా బ్రతకమన్నారు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ యొక్క శక్తిని తెలిసిన గాంధీ ఈ దేశ ప్రజలను పక్కదారి పట్టించేరు. గ్రామ స్వరాజ్యం పేరిట బడుగు బలహీన వర్గాలను అక్కడే ఉంచేరు.

మనిషి మనుగడకు సాంఘిక హక్కులతో పాటు, ఆర్ధిక హక్కులు కుడా ముక్యమైనవి.2018లో కుడా  ఖాప్ పంచాయితీలు, కుల బహిష్కరణ లు చేస్తున్న గ్రామాల్లో మనుగడ కష్టమైనది. గరగపర్రు భూస్వాముల నుండి కౌలుకు తీసుకున్న పొలం కుడా దౌర్జన్యంగా లాక్కొని 14 కులాలు కలసి సంఘ బహిష్కరణ చేసేరు అంటే దానికి ఆ ఊరు పెత్తందారి అంటే గ్రామాల పరిస్తితి , బారతీయుల కుల వ్యవస్థ ఎంత నీచ దశలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాంఘిక సంస్కరణల పేరుతొ లేదా సంస్కృతి పేరుతోనో గాంధీ లాంటి ‘కుల సంస్కార వాదుల’ మాటలు నమ్మి మోసపోకూడదు.

భూమిని పంచి లేదా జాతీయం చేసి భూమి లేని వ్యవసాయ కూలీలకు,నిరోద్యుగులకు భూమిని పంచి ఆర్ధిక వ్యవస్తను బలోపేతం చెయ్యాలని పాలకులకు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చూచన చేసేడు. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది.  

 

 

 

 

 

(Visited 185 times, 1 visits today)

2 thoughts on “గాంధీ గ్రామ స్వరాజ్యం ఒక కుట్ర!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!