గాడ్సే:గాంధిని చంపడానికి కారణాలు ఏమిటి!

షేర్ చెయ్యండి

గాడ్సే, పూర్తి పేరు నాధూరాం గాడ్సే గత రేడు రోజుల నుండి మళ్ళీ ప్రజల నోళ్ళల్లో నాకుతున్నాడు. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల సభలో మాట్లాడుతూ హిందు మతస్తుడే భారత దేశంలో మొదటి ఉగ్రహాది అని మాట్లాడటం తో చర్చనీయాంశం అయ్యింది.


ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కమల్ హాసన్ లాంటి వారు వివాదస్పదమైన వాఖ్యలు చెయ్యడం వలన గందరగోళ పరిస్థితికి తీసుకువెళ్తుంది. నాధూరాం మొదటి ఉగ్రవాది గా పేర్కొనడంతో రైట్ వింగ్ సంఘాల నాయకులు, అభిమానులు మరింత ఆజ్యం పోయడానిక రెడిగా ఉన్నారు.

 
మత వాదం, ఇతర మతాల పట్ల విద్వేషం అణువు, అణువు ఏర్పర్చుకున్న అతని అసలు పేరు రామచంద్ర గాడ్సే. కానీ ఎక్కువ మందికి తెలిసింది వాళ్ళ గ్రామంలో పిలిచే పేరు నాధూరాం.


నాధూరాం తల్లి తండ్రులు ముంబయ్ – పూణే మధ్య ఉన్నప్పుడు గాడ్సే జన్మించాడు. మహారాష్ట్ర లో కరువు పరిస్థితులు వలన మిగతా ముగ్గురు చనిపోయారు.


గాడ్సే ని అతని తల్లితండ్రులు ఆడపిల్ల లాగా పెంచారు. ముక్కు పుడక కూడా కుట్టించారు. మరో అబ్బాయి పుట్టినంత వరకూ అమ్మాయి లాగానే పెంచారు. ముక్కు పుల్ల ధరించడం వలన రామచంద్ర కాస్త నాధూరాం గా గుర్తింపు పొందాడు.


గాడ్సే మహారాష్ట్ర కు చెందిన చిత్పవన్ బ్రాహ్మణ కులం లో జన్మించాడు. చిత్పవన్ బ్రాహ్మణలు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో పైన ఉన్న వ్యక్తులు మరియు సమాజన్ని రూల్ చేసిన వర్గం. 


ఎంతో ఉన్నత స్థానంలో ఉండాల్సిన చిత్పవన్ బ్రాహ్మణులు స్వతంత్ర పోరాటం వలన, ఆంగ్లేయుల పాలన వలన జరిగిన మార్పులలో బ్రాహ్మణ ఆధిపత్యం సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా క్షీణించిందని గాడ్సే బలంగా నమ్ముతాడు. 

Also read  అంతర్జాల పోకిరీలు!


కుల వ్యవస్థను, హిందు మతం మీద దురభిమానం పెంచుకోవడం వలన సమాజంలో (కుల వ్యవస్థలో) జరిగే మార్పులు అతని మనోభావాల మీద చాలా ప్రభావం చూపించాయి. 


గాడ్సే 16 సంవత్సరాలకే వస్త్రాల వ్యాపారం మొదలు పెట్టాడు. టైలరింగ్ కూడా చేయించాల్సి వచ్చింది. ఈ పరిణామాలు గాడ్సే లో ఉన్న కుల స్వభావం అహం దెబ్బతిన్నది. 


ఒక చిత్పవన్  బ్రాహ్మణుడు టైలరింగ్ చెయించడమా, తక్కువ కుల వాళ్ళు చేసే కుల వృత్తి, వస్త్రాల వ్యాపారం చెయ్యడం కూడా చిన్నతనంగా , కులం తక్కువ వారు చేసే పనిగా బావించాడు.


సాక్షాత్ దైవ స్వరూపం అయిన చిత్పవన్ బ్రాహ్మణుల దుస్థితికి గాంధీ – కాంగ్రెస్ యొక్క ఆలోచనా విధానాలు కారణం అని గాడ్సే బలంగా నమ్మేవాడు. 


హిందూ మతం, కులం మీద దురభిమానం ఉన్న అతడు  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం  – RSS సంస్థలో చేరిన ఆనతి కాలంలోనే ఆ సంఘం నుండి బయటకు వచ్చేసాడు.

రాడికల్ హిందుత్వ ఆలోచన, మిలిటెంట్ హిందుత్వ అజెండా RSS లో లేదని సంఘం నుండి వైదొలిగాడు.


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుండి బయటకు వచ్చిన గాడ్సే హిందూ మహా సభలో సభ్యునిగా చేరాడు. అనంతరం ‘హిందూ రాష్ట్ర ‘ పేరుతొ వార్త పత్రికను ప్రారంభించాడు. 


హిందు రాష్ట్ర లో గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడు. గాంధీ హిందువుల శక్తిని నిర్వీర్యం చేస్తున్నాడంటూ వాదన చేసేవాడు. హిందువులు రాజకీయ పదవి తో అధికారం చెలాయించాలని , లౌకిక వాదాన్ని వ్యతిరేక భావం గల వ్యక్తి గాడ్సే. 

Also read  ఆధిపత్యం కోసమే బారత రాజ్యాంగం ను తగలబడుతున్న హిందూ సంఘాలు!
గాంధీని చంపటానికి కారణం ఏమిటి?


గాంధీ వర్ణాశ్రమ ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. హిందు భావజాలం కలవాడు. అలాంటి గాంధీ ని కరుడుకట్టిన కులోన్మాది, మరో హిందువు చంపటానికి కారణాలు ఏమై ఉంటాయి?


గాంధీ ని చంపిన కేసులో అరెస్ట్ అయిన గాడ్సే ని మరుసటి రోజు గాంధీ కుమారుడు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్న దేవదాస్ కలిసాడు. 


గాంధీ ని చంపిన కేసులో మరో ముద్దాయి గోపాల్ గాడ్సే తన పుస్తకం ‘ గాంధీ హత్య మరియు తర్వాత’ అనే పుస్తకంలో  దేవదాస్ జైలు లో నాధూరాంగాడ్సే ని కలవడానికి వచ్చాడు అని రాసాడు.

నాధూరాం పగ, ప్రతీకారం తో రగిలి పోతూ ఉంటాడని అనుకొని ఉండవచ్చు. ఒక పేరుమోసిన పెద్ద క్రిమినల్ లాగా గాడ్సే వుంటాడనీకున్నాడు. కానీ నాధూరాం ఆలా లేడు.

నాధూరాం దేవదాస్ తో మాట్లాడుతూ,  ఆరోజు గాంధీ తో నేను ఉన్నాను, గాంధీని చంపి మీకు , మీకుటుంబానికి తీవ్రదుఃఖాన్ని కల్గించాను, అందుకు విచారిస్తున్నాను. కానీ నమ్మండి నాకు మీ పట్ల , గాంధీ పట్ల ఎలాంటి విద్వేషము లేదు,  ఈ హత్య వెనకాల పెద్ద కుట్రగాని, పెద్ద వ్యక్తులు ఎవరు కూడా ప్రోత్సహించలేదు.


మరి ఎందుకు చంపవల్సి వచ్చిందని దేవదాస్ నాధూరాంగాడ్సే ని అడగగా, కేవలం రాజకీయ కోణాలు మాత్రమే గాంధీ హత్యకు దారితీసిందని జవాబు చెప్పాడు.

Also read  రిజర్వేషన్లు: ఆర్థికపరమైన రిజర్వేషన్లు మరక పోగొట్టుకోవడం కోసమేనా!


గాంధీ ముస్లిం లకు మద్దత్తు గా నిరాహార దీక్ష చెయ్యడం నాధూరాంకి అసలు నచ్చలేదు. గాంధీ సౌతాఫ్రికా లో ఉన్నంత వరకూ కుల , మత ధర్మాలను బాగానే పాటించాడని భారత దేశానికి తిరిగి వచ్చి హిందువులకు అన్యాయం చేసే పెనులు చేస్తున్నాడంటూ కోపం పెంచుకున్నాడు.


పాకిస్తాన్ దేశం ఏర్పడటానికి ప్రధాన కారణం గాంధీ అని పూర్తిగా విశ్వసిస్తాడు
నాధూరాం. గాంధీ ది బలహీనమైన నాయకత్వం గా అతడు భావిస్తాడు. ఇలాంటి బలహీనుల నాయకత్వంలో దేశం ముక్కలు అవుతుందని అతని విశ్వాసం.


అయితే గాంధీ యొక్క అసలు మనస్తత్వాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు
నాధూరాం దేశానికి తోలి ప్రధానిగా ఒక హిందువు , అది కూడా తన శిష్యుడైన కశ్మీరీ బ్రాహ్మణుడు అయిన జవహర్ లాల్ నెహ్రు ని గాంధీ ప్రతిపాదించాడు.


కమ్యూనల్ అవార్డు ని అడ్డుకుని హిందు మతాన్ని మైనారిటీ మతం కాకుండా  దళిత వర్గాలను హిందు మతంలోనే ఉండే విధంగా కుట్రలు చేసిన వ్యక్తి గాంధీ. నాధూరాం అంతరంగం తన బ్రాహ్మణ ఆధిక్యత. నాధూరాం కరుడు గట్టిన హిందువు మాత్రమే కాదు, మనువు వారసుడు కూడా.
 .  

(Visited 238 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!