గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్: ఆర్ధిక నేరగాళ్ల వలన దేశ ఆర్ధిక వ్య్వవస్థ పతనం అవుతుందా?

షేర్ చెయ్యండి
  • 17
    Shares
కర్ణాటక మాజీ మంత్రి గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ ; నిన్న రాత్రి 9 గంటల సమయంలో  సిబిఐ అరెస్ట్ చేసింది. యాంబిడాంట్ కంపెనీ ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోవడానికి శనివారం సాయంత్రం బెంగుళూరు లోని సిబిఐ కార్యాలయానికి వచ్చిన  గాలి జనార్దన్ రెడ్డిని ఆదివారం కూడా విచారించి అదుపులోకి తీసుకున్నారు.  
 
 రూ 600 కోట్ల ఆర్ధిక నేరగాడిని   సిబిఐ , ఈడి కేసుల  ల నుండి తప్పిస్తానంటూ రూ 25 కోట్లు తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి. 
ఈ సంఘటనతో సిబిఐ / ఈడీ లాంటి  అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థల ప్రతిష్ట దిగజారిందని మీరు భావిస్తున్నారా? 
 
ఆర్ధిక నేరాలకు పాలపడుతూ , వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారి ఆస్తులను ప్రభుత్వం జాతీయం చెయ్యాలి. దేశ ప్రతిష్టకు భంగంకలిగిస్తున్న ఆర్ధిక నేరగాళ్ల చిట్టాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చెయ్యాలి. 
 
ప్రజా ప్రతినిధులుగా వున్నా వీరిని తొలగించి ఇప్పటి వరకూ ప్రభుత్వం కల్పించిన సేవలకు రుసుము వసూళ్లు చెయ్యాలి. 
దేశ సంపదను కొల్లగొడుతూ ప్రజలను బికార్లుగా చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారి మీద ప్రజలు స్పందించాలి. 
 
ఒక వైపు ప్రజల జీవన స్థితి రోజు రోజుకూ దిగజారిపోతుంటే , ఇలాంటి ఆర్ధిక నేరగాళ్ల సంపద రాకెట్ లా దూసుకుపోతుంది. 
ప్రభుత్వాల నుండి సరైన ప్రోత్సాహాలు లేక ఎందరో యువ పారిశ్రామిక వేత్తలు బ్యాంకులు చుట్టూ తిరుగుతూ ఉండాటానికి కారణం ఆర్ధిక నేరగాళ్లే కారణం. 
 
వేల కోట్ల రుణాలు బ్యాంకుల నుండి తీసుకుంటూ , మొండి బకాయిదారులుగా తయారై ప్రభుత్వంతో లాలూచీ పడి ఋణ మాఫీ చేయించుకుంటున్నారు. వీరు తీసుకున్న ఋణ భారం బ్యాంకులు సామాన్య ప్రజల మీద వేస్తుంది. 
 
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతరులు  తన ఖాతా దారుల నుండి కనీస నిల్వ లేని వారి నుండి దాదాపుగా రూ. మూడు వేల కోట్లు వసూళ్లు చేసింది 
 
ఈ విధంగా ఋణ ఎగవేత దారుల డబ్బును ఖాతా దారుల మీద వేస్తూ వసూళ్లు చేసుకుంటున్నారు మన  బ్యాంక్ లు. ఒకరు చేసిన మోసానికి సామాన్య ప్రజానీకం మీద బారం వేస్తున్నారు. 
 
గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ – యాంబిడాంట్ కేసు!
 
అంబిడెన్ట్ మార్కెటింగ్ పేరుతొ గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ ప్రజల నుండి పెట్టుబడులు ఆకర్షించి , ఆనతి కాలంలోనే రూ 600 కోట్లు మూటగట్టుకున్న ఈ సంస్థ పెట్టుబడిదారులకు తక్కువ కాలంలోనే పెట్టిన పెట్టుబడికి నాలుగు నెలలకే   50 % ఆదాయం వస్తుందని చెబుతూ వందల కోట్లు వసూళ్లు చేసి ప్రజలను మోసం చేసింది.
 
ఈ కేసులో అరెస్ట్ అయిన సంస్థ యాజమానిని ఈడీ , ఐటీ కేసుల నుండి తప్పిస్తానంటూ గాలి జనార్దన్ రెడ్డి రూ 25 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడని కేసు నమోదు చేసేరు. 
 
ఈ ఒప్పందంలో బాగంగా రూ 18 కోట్లను బంగారం వ్యాపారి రమేష్ .కొఠారి ఖాతాలో జమచేసి 57 కిలోల బంగారం కొన్నారు. 
అధికారుల  విచారణ లో రమేష్ కొఠారి డబ్బు అందినట్టు ఒప్పుకున్నారు.  అలీఖాన్ అనే వ్యక్తికి బంగారం అందించినట్లు చెప్పేడు. 
 
శనివారం సాయంత్రమే గాలి జనార్దన్ రెడ్డి బెంగుళూరులోని సిబిఐ ఆఫీసుకు చేరుకోగా అర్ధరాత్రి వరకూ విచారించిన సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించేరు. 
 
అనంతరం అతనిని వైద్య పరీక్షలు చేయించి 6 వ అదనపు మేజిట్రేట్ ముందు హాజరుపరచగా ఈనెల 24 వరకూ రిమాండ్ విధించేరు. 
 
ఆర్ధిక నేరాల వలన నష్టపోతున్న సామాన్యులు. 
 
రాజకీయ పార్టీలతో కుమ్మకై లేదా రాజకీయ పార్టీలలో సభ్యులుగా ఉంటూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతూ వ్యాపారస్తులు ఆర్ధిక నేరాలకు లేదా పన్ను ఎగవేతకు, ఋణాలు ఎగవేతకు పాలపడుతున్నారు. 
 
బడా వ్యాపారం పేరుతొ బడా వ్యాపారులు లక్షల కోట్లు బ్యాంకులకు , ప్రభుత్వానికి పంగనామం పెట్టేరు. ప్రభుత్వాలు కొందరు బడా వ్యాపారుల ఋణం మాఫీ చేసి, తిరిగి వారికే కార్పొరేట్ ప్రోత్సాహకాల పేరుతొ తిరిగి ఋణాలు ఇస్తున్నారు. 
 
పాలకులు కార్పొరేట్ కి ఇచ్చే ప్రోత్సాహకాలు వారి వలన జరుగుతున్న కోల్పోతున్న ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు వివరించకుండా రిజర్వేషన్లు వలన దేశం వెనకబడిపోతుందని దొడ్డిదారిన కామెంట్స్ చేస్తూ వారి తప్పులను కప్పి పుచ్చుకుంటున్నారు. 
 
గత 10 -15 సంవత్సరాలలో బారత కార్పొరేట్ రంగం ప్రజలకు ఇచ్చిన ఉద్యోగాలు, బోర్డు తిప్పేసిన కంపెనీల పరిస్థితి చుస్తే అత్యంత దారుణంగా సామాన్య ప్రజల జీవన స్థితిని దిగజార్చేరు. 
 
ఒకవైపు డాలర్ రేటు రోజు రోజుకూ పెరుగుతూ పోతూ రూపాయి కి వాల్యూ లేకుండా చేస్తుంది. నిత్యం పెరుగుతున్న పెట్రో ధరల వలన ప్రజలు కుదేలవుతుంటే పాలకులు తమ బాధ్యతనుండి తప్పుకుంటూ ప్రజల మధ్య ఆంతరాలు పెంచుతున్నారు. 
 
రాజకీయ నాయకులు, వారి తాబేదారులు వ్యవస్థను మ్యానేజ్ చేస్తూ, సహజ వనరులను దోపిడీ చేస్తూ మరుగు దొడ్డి గోడలకు బంగారం తో తాపడం చేయిస్తున్నారు. 
 
ప్రజలు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకుని గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు మా కులం – మా మతం, మా ప్రాంతమని మద్దతు పలికితే నుంచోటానికి జానెడు నెల కూడా మిగల్చరు. 
 
 
 
  
 
 
(Visited 79 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!