#ME TOO: బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ పై గుత్తా జ్వాల సంచలన వాఖ్యలు!  

షేర్ చెయ్యండి
  • 12
    Shares
 
 
#metoo ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. బాలీవుడ్న సీనియర్ నటుడు నానాపటేకర్ పై తనుశ్రీదత్తా చేసిన అభియోగం తర్వాత పెనుఉప్పెనలా మొదలైన మీ టూ ఉద్యమం ఇప్పుడు  బారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా తను ఎదుర్కొన్న వివక్షను బయటపెట్టింది. 
 
బాలీవుడ్ హీరోయిన్స్ లేదా నటీమణులు లైంగికంగా తమకు ఎదురైన లైంగిక వేధింపుల   సంఘటనలు  ఒక్కొక్కరూ బహిరంగపరుస్తుంటే గుత్తా జ్వాలా కూడా తనకు జరిగిన అవమానాలను, వేధింపులను ట్వీట్ ద్వారా వెల్లడించింది. అయితే గుత్తా జ్వాలా లైంగిక వేధింపులు కాకుండా పుల్లెల గోపీచందు కోచ్ అయినప్పటి నుండి తనను జట్టు కు ఎంపిక చెయ్యకుండా వేధించిన సంఘటన బహిరంగపరిచింది. 
 
 
Maybe I should talk about the mental harassment I had to go through. #metoo 
 
_ Gutta Jwala (@guttajwala) October 9,2018 
ట్విట్టర్ లో పాపులర్ అవుతున్న హ్యాష్ టాగ్ #metoo ను ప్రస్తావిస్తూ తను కూడా ఒకప్పుడు తాను అనుభవించిన మానసిక క్షోభ ప్రస్తావిస్తే బాగుంటుందని ప్రారంభిస్తూ ఆ తర్వాత వరస ట్వీట్ లలో కోచ్ పుల్లెల గోపీ చంద్ నుండి అనుభవించిన మానసిక క్షోభను పేర్కొంది. 
 
Since 2006.since this person became the chief, threw me out of national team inspite of me being a national champion. the latest was when I returned from https://t.cp/Ag37TIXFd3 out of national team https://t.co/OVhyvFNAN of the reasons I stopped playing!!
_ Gutta Jwala (@Guttajwala) October 9, 2018.
 
హైదేరాబద్ కి చెందిన గుత్తా జ్వాలా, 2006 దాకా నేను జాతీయ జట్టులో వున్నాను. 2006 లో ఈ వ్యక్తి చీఫ్ అయ్యాక నన్ను జాతీయ జట్టు నుండి తొలగించాడు. నేషనల్ చాంపియన్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే నన్ను తప్పించాడు. ఈ మధ్య రియో ఒలంపిక్స్ నుండి వచ్చిన తర్వాత మరోసారి జాతీయ జట్టులో నుండి నన్ను తొలగించేడు. నేను బాడ్మింటన్ ఆడకుండా రిటర్మెంట్ తీసుకోవడానికి ఇదో కారణం. అంటూ ఆరోపణ చేసింది గుత్తా జ్వాల 
 
పుల్లెల గోపీచంద్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావించక పోయినప్పటికీ జాతీయ చీఫ్ కోచ్ గోపీచంద్ నే కాబట్టి అతనిని ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసినట్టు అర్ధం అవుతుంది. 
 
    “2006 నుండి 2016 దాకా … మళ్ళీ, మళ్ళీ నన్ను తప్పిస్తూ వచ్చాడు నా  ప్రదర్శనతో సంభందం లేకుండా . నన్ను తొలగించేడు. ప్రపంచ నెం 9 ర్యాంక్ సాధించిన తర్వాత 2009 లో జట్టులోకి వచ్చాను.
 
బ్యాడ్మింటన్ సింగిల్ ప్లేయర్స్ అయినా సైనా నెహ్వాల్, పి వి సింధులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ డబుల్స్లో సంచలన విజయాలు స్దధించిన వారిని మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదనే కారణంగా గుత్తా జ్వాలా బ్యాడ్మింటన్ నుండి రిటర్మెంట్ ప్రకటించిన విష్యం తెలిసిందే. 
 
గుత్తా జ్వాల తన కెరీర్ లో 5 బంగారు పతకాలు, మూడు రజిత పతకాలు, ఐదు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయాల ద్వారా బారత జెండా ని వివిధ వేదికలలో రెపరెప లాడించింది. 
(Visited 74 times, 1 visits today)
Also read  సోషల్ మీడియా-యువ చైతన్యం!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!