చండశేఖర్ ఆజాద్ రావణ్ ఢిల్లీ పీఠంమే లక్యంగా భీంఆర్మీ కార్యాచరణ ప్రకటించబోతున్నాడా!
షేర్ చెయ్యండి
- 76Shares
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఈ పేరు తెలియని దళిత యువత దేశంలో ఉంది అంటే ఆచ్చర్యపడాలి. అంత పాపులర్ అయిన ఈ చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు? అతని లక్ష్యం ఏంటి?
2014 తర్వాత బారత దేశంలో జరిగిన రాజకీయ మార్పుల్లో హిందూ అతివాద గ్రూప్ గా పేరుగావించిన రాష్ట్రీయ స్వయం సేవక్ RSS అనుబంధ రాజకీయ పార్టీ బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతో దళితుల పరిస్థితులు ఉన్నట్టు ఉండి మార్పులకు గురైంది. అది దళితుల మనుగడకు ప్రశ్నర్ధకంగా తయారు అయింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటన తర్వాత ఈ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ తర్వాత గుజరాత్ లోని ఉన దళితులను ఆవు చర్మం వలుస్తున్నారు అని అర్ధ నజ్ఞనంగా కట్టేసి వారి పైన దాడి చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం సంచలనం కలిగించింది.
ఇలాంటి సంఘటనలు నేపధ్యం లో ఉత్తర ప్రదేశ్ లోని షహారాన్ పూర్ కు చెందిన చంద్ర శేఖర్ ఆజాద్ రావణ్ లాంటివారు దళిత యువత ని చైతన్యం పరిచే కార్యక్రమంలో బాగంగా షెహరాన్ పూర్ లో మే 11, 2017 దళితుల కు , ఇతర భూర్జువా కులాల మధ్య జరిగిన ఘర్షణ లో దళితులకు నాయకత్వం వహించి రాజ్ ఫుట్ ల దాడిని విజయవంతం గా తిప్పికొట్టేడు జరిగిన సంఘటన లో అతనిని అరెస్టు చేసి జైలులో వేసేరు.
అంతకు ముందు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ 2014 లో తన సహచరుడు వినయ్ రతన్ ఆర్య తో కలిసి భీం ఆర్మ్ ని స్థాపించేడు. దళిత యువత అభివృద్ధి ప్రధానంగా భీం ఆర్మీ ని స్థాపించేరు. విద్య ద్వారా నే దళిత యువతలో చైతన్యం, అభివృద్ధి సాధించగలం అని పచ్చిమ ఉత్తర ప్రదేశ్ లో స్కూలు మరియు ట్యూషన్ సెంటర్ ప్రారంభించేడు.
తన సొంత గ్రామం అయిన షహరాన్ పూర్ లో జరిగిన చిన్న సంఘటన తో చంద్ర శేఖర్ ఆజాద్ వెలుగులోకి వచ్చేడు. తన పుట్టిన గ్రామం అయిన దద్కౌలి గ్రామ పొలిమేరల్లో ” చమర్ల గ్రామానికి స్వాగతం” అని బోర్డు పెట్టడం ద్వారా వార్తల్లోకి వచ్చేడు.
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ లక్ష్యం ఏంటి?
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ దాదాపుగా సంవత్సరం జైలు జీవితం గడిపిన తర్వాత ఇటీవల విడుదల అయ్యేడు. ఈ సందర్బంగా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వూ లో పలు ఆశక్తికరమైన ఆలోచనలు వ్యక్తపరిచేడు.
చంద్రశేఖర్ ఆజాద్ జైలు నుండి విడుదల అయిన సందర్బంగా షెహరాన్ పూర్ దళితులు పండగ వాతావరణం లో అతనికి స్వాగతం చెప్పేదానికి ఏర్పాట్లు చేసేరు.
తనకి స్వాగతం పలకటానికి తన ఇంటి వద్దకు వచ్చిన దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ. “నా మీద నాకు నమ్మకం ఉంది, నెను ఆచరణ సాధ్యంకాని హామీలు , మాటలు మీకు చెప్పడం లేదు. ఇంకో సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం లో నేను భీం ఆర్మీ ని RSS తో సమానంగా లేదా అంత కంటే గొప్ప సంస్థ గా తీర్చిదిద్దుతాను. విలువలతో, క్రమశిక్షణ తో ఈ సంస్థ ఉండబోతుంది. దేశం మొత్తం ఈ సంస్థ ఆదర్శం కావలి” .
భీం ఆర్మ్ వ్యవస్థాపకుడు 16 నెలల జైలు జీవితంలో ఎంతో రాటుదేరేడు మరియు పరిపక్వత చెందేడు. ఇప్పుడు తన ముందు ఉన్న లక్ష్యం కేంద్రం లో బీజేపీ ని ఓడించాలి. బిజెపి ని బొంద పెట్టడానికి నేను సహకరిస్తాను. అలాగే కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తాను.
చంరశేఖర్ ఆజాద్ రావణ్ న్యూస్ లాండ్రీ కి ఇచ్చిన పూర్తి ఇంటర్వూ చూడండి
చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులకు ఎందుకు లొంగిపోయేడు?
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ మే 11 2017 న షెహరన్ పూర్ లో జరిగిన సంఘటన లో ఢిల్లీ ర్యాలీ నిర్వహించి పోలీసులకు తానే లొంగిపోయేడు. కారణం చంద్రశేఖర్ ఆజాద్ ని యోగి సర్కార్ ఎన్కౌంటర్ చేసి చంపాలి అనుకుంది. అందుకే ఢిల్లీ పోలీసులు కానీ లేదా ఉత్తర ప్రదేశ్ పోలీసులు ముందు అరెస్ట్ చెయ్యలేదు. అతని సన్నిహితులు ద్వారా అతనికి తెలిసిన సమాచారం ప్రకారం యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపాలి అనుకున్నారు. అందుకే ఢిల్లీ ర్యాలీ తర్వాత కొన్నిరోజులు ఎవరికీ కనిపించకుండా పోయేడు.
ఒకొనొక సందర్భంలో జైలు లోనే చంద్రశేఖర్ రావణ్ ని చంపాలనుకుంది అని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్త దేశ వ్యాప్తంగా దళిత వర్గాల్లో ముక్యంగా యువత లో చాలా ఆందోళన కలిగించింది. కాళ్లు చచ్చుబడి , మనిషి నడవలేని స్థితిలో చుసిన దళిత యువత చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ విడుదల కోసం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసింది.
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ బీఎస్పీ కి పోటీ అనుకుంటున్నారా?
జైలు నుండి విడుదలైన చంద్రశేఖర్ రావణ్ మీడియా తో మాట్లాడుతూ బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ని Buaji -మేనత్త అని సంబోధిస్తూ మాట్లాడటం జరిగింది. దీనికి ప్రతిగా బహుజన్ సమాజ్ పార్టీ నేత బెహన్ జీ మాయావతీ నాకు అలాంటి రక్త సంబధీకులు లేరంటూ చెప్పుకొచ్చేరు. బెహన్ జీ మాయావతి గారి కామెంట్ మీద వివరణ కోరగా చంద్రశేఖర్ రావణ్ ఆమెకు నా మీద ఎవరో చెడుగా చెప్పి ఉండవచ్చు, తప్పుదోవ పట్టించి ఉండవచ్చు, కాబట్టి ఈ సంఘటన లో నాకు బయట వ్యక్తులు కలగజేసుకోవడం ఇష్టంలేదంటూ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడేరు. ఆమె నా మేనత్త తనకి నా మీద హక్కులు ఉన్నాయి. ఇది ఒక కుటుంబ సమస్య గా కొట్టిపడేసేడు Ye humare parivarik rishtein hain. Ghar ke maamlon mein hum doosre logon ko nahi involve karna chahte.
2017 లో షెహరన్ పూర్ అల్లర్ల సమయంలో బెహన్ జీ మాయావతి భీం ఆర్మీ చంద్రశేఖర్ రావణ్ ని బీజేపీ కుట్రలో / ఎత్తుగడ లో బాగం అని చంద్రశేఖర్ బిజెపి ప్రోడక్ట్ గా మీడియా సమావేశంలో పేర్కొనడం తెలిసిందే.
భీం ఆర్మీ బహుజన ఉద్యమమా?
భీం ఆర్మీ విస్తరణ గురించి మాట్లాడుతూ , ఇది బుద్దుడి అహింసా వాదం గా పనిచేస్తుందని చెప్పుకొచ్చేరు. భీం ఆర్మీ ఒక్క దళితులకు మాత్రమే సంబంధించినది కాదని ఇది బహుజన ఉద్యమము, త్వరలో ప్రకటించబోయే జాతీయ భీం ఆర్మీ కమిటీ లో బహుజన సమాజం నుండి అందరి పేర్లు కమిటీలో ఉంటాయని పేర్కొన్నారు.
లక్ష్యం?
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. మీడియా అడిగిన ఒక ప్రశ్న కు బదులిస్తూ బిజేపీ ని ఓడించాలి, దేశ వ్యాప్తంగా RSS కంటే గొప్పగా బహుజన సైనికులను తయారు చెయ్యాలి అదే తన లక్ష్యం గా పేర్కొన్నారు.
(Visited 370 times, 1 visits today)