స్వాతంత్రదినోత్సవం: చరిత్ర పునరావృతం అవుతుందా!

షేర్ చెయ్యండి

స్వాతంత్రదినోత్సవం,చరిత్రపునరావృతం అవుతుందా! అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి దేశం నియంతృత్వం పోకడ కు దగ్గర గా చేరింది. నియంతృత్వ ధోరణి పెచ్చుమీరి ఒక వర్గ ప్రజల సాంఘిక, ఆర్ధిక రాజకీయ హక్కులు హరిస్తున్నారు. ఈ చర్య దేశం లో అంతర్గత తిరుగుబాటుకు దారితీస్తుంది. 

ఒక దేశాన్ని పరిపాలించే అధికారం మరొక దేశానికెక్కడిది? భారతదేశానికి స్వాతంత్య్రమైన వెంటనే అధికారాన్ని హస్తగతం చేసుకున్న అగ్రవర్ణ వారు కోట్ల మంది ఎస్సి , ఏస్టీ మరియు బిసి కులాల మీద అధికారం చెలాయిస్తున్నారు. 

 
దేశం అంటే ప్రజలు, పరాయివాడి ఆధికారం వద్దని పోరాటం చేసిన భారతీయులు తమ దేశంలోనే మెజారిటి ప్రజల మీద అధికారం చెలాయించాలనుకోవడం అగ్రవర్ణాల దమన నీతి. 
 
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని సంబరాలు చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ దేశంలో రోజు రోజుకు హక్కులు నిరాకరించబడుతున్న నిమ్న కులాల , జాతుల వారి యొక్క స్వేచ్చ, సౌభ్రాతత్వం కి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. 
 
గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే ప్రభుత్వ పెద్దలు, గ్రామ స్వరాజ్యానికి ఉండాల్సిన లక్షణాలేమిటొ ముందు తెలుసుకోవాలి. గ్రామ స్వరాజ్యం పేరిట నేటి ఫ్యూడల్ కులాల రాజకీయ పార్టీలు చేసేది కుల స్వరాజ్యం మాత్రమే అని దళిత వర్గాల బావన. 
 
ప్రపంచంలో చాలా చోట్ల పేదలను అణగారిన వర్గాలంటారు. రోమన్లకు వారి బానిసలు, స్పార్టన్లు వారి హెలోట్లు, బ్రిటిష్ వారి విల్లెయిన్లు, అమెరికన్స్ కి నీగ్రో లు , జర్మన్లకు వారి యూదులు. కాబట్టి భారతదేశంలో హిందువుల కు వారి అస్పృశ్యులు. ఉన్నారు. 
 
ప్రపంచం లో ఏ బానిస కూడా ఇది మాఖర్మ  వలన బానిసత్వాన్ని అనుభవించాల్సి వస్తుందని పేర్కొనలేదు. భారతదేశంలో అంటరాని వారి స్థితి కి వారి యొక్క పూర్వజన్మ ఖర్మ ఫలం అని చెప్పడం దుర్మార్గం. 
 
ప్రపంచ దేశాల్లో ఉన్న బానిసత్వం తొలగిపోయింది, కానీ భారతదేశంలో అంటరానితనం ఉంది, హిందూ మతం వున్నంతకాలం వుంటుంది. 
 

మా కొద్దీ నల్లదొరతనం:

 
తెల్లవాడు మాకొద్దు అన్నట్లు గానే స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో దళిత మేధావులు భారతీయ కుల వ్యవస్థ యొక్క స్థితిని ముందే పసిగట్టి మాకొద్దీ నల్లదొరతనం అన్నారు. 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలలో నిమ్నజాతుల ప్రతినిధిగా పాల్గొని స్వతంత్ర భారతదేశంలో దళితులకు రాజాకీయ పరమైన రాజ్యాంగ రక్షణ కోసం శ్రమించారు. 
 
ఆది ఆంధ్ర ఉద్యమకారుడు కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్లదొరతనం అంటూ గేయం రాసి ఊరూరా ప్రచారం చేసాడు. 
 
ఆనాటి నిమ్నజాతి నాయకులు అనుమానించినట్లు నేటి మనువాద ఫాసిస్ట్ పాలకులు ఎస్సి, ఎస్టి ల హక్కులను నిర్వీర్యం చేసే పనిలో వున్నారు. మత స్వేచ్ఛ ను అడ్డుకుంటూ బాహాటంగా దాడులు చేస్తున్నారు. 
 
అధికారంలో వున్న మనువాదులు రాజ్యాంగ చట్టాలన్నీ తమకి అనుకూలంగా మార్చుకుంటూ పాలిత బహుజనుల రక్షణ చట్టాలను బలహీన పరుస్తూ సామాజిక,ఆర్ధిక, రాజకీయ రంగాలలో వీరిని నిర్వీర్యం చేసున్నారు. 
 
మత స్వేచ్ఛను హరిస్తున్నారు, ఆహారపు అలవాట్ల మీద దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే వారిని తీవ్రవాదులంటూ అరెస్ట్ చేసి జైలు లో పెడుతున్నారు. 
 
మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కాల్చి చంపుతున్నారు. ప్రతి రోజు దేశంలో ఏదో ఒక చోట  బహుజనుల మీద దాడికి చేస్తూ చంపేస్తున్నారు. 
 

మనువాద ఫాసిజం జాతీయ సమైక్యతకు ముప్పు: 

 
రాజ్యాంగ చట్ట సభలో రాజ్యాంగాన్ని సభ్యుల ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహెబ్ అంబేడ్కర్ సభ్యులను హెచ్చరించారు. 
 
మన భారతదేశంలో భక్తితత్వమనేది అత్యంత దారుణమైన విధంగా ఉంటున్నది. ఈ భక్తితత్త్వం నింపాదిగా రాజకీయ రంగంలోకి గూడా ప్రవేశిస్తున్నది. వ్యక్తి పూజ దేశాన్ని కృంగదీసి సర్వాధిపత్యానికి (Dictatorship) దారితీస్తుంది. 
 
ప్రస్తుతం భారతదేశంలో జరుగుతుంది కూడా ఇదే. కార్పొరేట్ రాజకీయాలలో విపరీతమైన మార్కెటింగ్ ద్వారా నాయకులను ప్రమోట్ చేస్తూ , నాయకులను పూజించేస్తాయికి ప్రజలు వెళ్లారు. 
 
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో ప్రజల మధ్య తీవ్రమైన తేడా ఉంది. అయినప్పటికీ గత 73 సంవత్సరాల నుండి మనమంతా “ఒకే దేశం, ఒకే ప్రజ” అని జాతీయభావంతో నివసిస్తున్నాం. 
 
మనువాద ఫాసిస్టులు దేశాన్ని ఒకే మతం ఆధారంగా ఒకే దేశం, ఒకే ప్రజ గా దేశాన్ని పునర్నిన్మించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సమాజంలో ఇరు వర్గాల మధ్య కలహాలు ప్రోత్సహిస్తున్నారు. ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. 
 
ఈ దేశంలో మతం యొక్క ఆయువుపట్టు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ.కుల వ్యవస్థ. కుల వ్యవస్థ లేకుండా మతం మనుగడ ఉండదు. కుల వ్యవస్థ ఏ ఇద్దరు మధ్య సోదర భావం పెంపొందించదు. 
 
అందుకే డా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ సవర్ణ హిందువులను హెచ్చరిస్తూ “మతం, కులం పునాదుల మీద ఒక జాతిని గాని, దేశాన్నిగాని నిర్మించలేరు” అని చెప్పాడు.
 
నేడు హిందువులను భుజాన వేసుకున్న RSS – BJP లు హిందు మత రాజ్యమే లక్ష్యంగా కేద్రంలో అధికారం చేపట్టి ఎస్సి లు , మైనారిటీ ల మీద దాడి చేస్తున్నారు. 
 
అధికారంలో ఉన్న వారికి ప్రస్తుతం విజయం సాధించినట్లు వున్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వమనేది లేకుండినట్లైయితే ఈ రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు. 
 
గతంలో ఎన్నోసార్లు స్వాతంత్య్రం కోల్పయిన భారతదేశం మరొకసారి తన స్వాతంత్య్రం ను కోల్పోవాల్సి ఉంటుంది. 
 
73 వ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు 
 
(Visited 43 times, 1 visits today)
Also read  కర్ణాటకలో జెడిఎస్, బిఎస్పిల కూటమి దారెటు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!