జస్టిస్ రంజన్ గొగోయ్: స్వతంత్ర న్యాయవస్థ మీద లైంగిక ఆరోపణలు

షేర్ చెయ్యండి

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్  మీద చేసిన లైంగిక ఆరోపణలు నిజంకాదని ముగ్గురు సభ్యులు గల ధర్మాసనం క్లిన్ చిట్ ఇచ్చింది.  ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ప్రాంగణంలో మహిళా సంఘాలు చేపట్టిన ఆందోళన ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.


జస్టిస్ రంజన్ గగోయ్ మీద లైంగిక ఆరోపణలు చేసిన మహిళ విచారణ కమిటి ముందుకు ఏప్రిల్ 30 వ తేదీన హాజరుకావాల్సి ఉండాగా ఉద్దేశ్య పూర్వకంగా ఆమే కమిటి ముందు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు విచారణ కమిటి ప్రధాన న్యాయమూర్తి మీద సదరు మహిళ చేసిన ఆరోపణలు తోసిపారేసింది. 


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చుట్టూ అల్లుకున్న ఆరోపణలు వెనక కేవలం లైంగిక ఆరోపణల కోణం మాత్రమేనా లేక మరేదైనా ఉందా? న్యాయమూర్తు ల మీదనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఏ వర్గం చేస్తుంది? వీరిని నడిపిస్తున్న వ్యవస్థ ఎవరు?


ఒక వ్యక్తి ని వృత్తి పరంగా నాశనం చేయాలి అనుకుంటే అతనో నాస్తికుడు అనో, అమ్మాయిలతో పడుకుంటాడు అనో చెప్పు. సమాజం అతన్ని ద్వేషిస్స్తుంది. అతని వృత్తి కి, దానికి సంబంధం ఎంటి అని నువ్వు అడగచ్చు? నిజమే సంబంధం లేదు. అదంతా మూర్కత్వమే. అందుకే అది ప్రభావితం గా పని చేస్తుంది. మన జీవితాల్లో మూర్కత్వానికి, అర్ద రహిత భయాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ” అయాన్_రాండ్


ఏప్రిల్ 19 వ తేదీన సుప్రీం కోర్టు జెసిఎ గా లైబ్రరీ లో డాక్యుమెంట్ టైప్ చేసే ఉద్యోగిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగికంగా వేధించాడు అంటూ 22 మంది సుప్రీం కోర్టు జడ్జీలకు లేఖ రాసింది. 

Also read  అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్


జస్టిస్ రంజన్ గొగోయ్ మీద మహిళ చేసిన ఆరోపణలు వెబ్సైట్ లలో రావడంతో ఖంగుతిన్న ప్రధాన న్యాయమూర్తి స్వతంత్ర న్యాయవ్యవస్థ మీద కుట్రలు చేస్తున్నారని, ప్రమాదంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని మీడియాకు ప్రకటన ద్వారా వెల్లడించాడు. 


ఏప్రిల్ 20వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని అస్థిర పరిచేందుకు ఒక బలీయమైన శక్తి పనిచేస్తుందని  జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. 

  
సుప్రీం కోర్టు రూల్స్ పాటించని మీడియా!


వ్యవస్థలు కులాలు  / ప్రాంతాల / మతాల వారీగా  స్పందిస్తాయని ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్నాయి. కొన్ని  కొన్ని సందర్భాలను గమనిస్తే ఆరోపణలు నిజమే అనిపిస్తుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద మీడియా లో ఎలాంటి వార్తలు రాకూడదనే రూల్ ఉండగా జస్టిస్ రంజన్ గొగోయ్ మీద ఏకంగా వెబ్సైట్ల లో వార్తలు వచ్చాయి. 


గతంలో ఓ సుప్రీం జడ్జితో పాటు, సీనియర్ న్యాయవాది మీద లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు వార్తలను ప్రచురించరాదని సుప్రీం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. 
తన పైన వచ్చిన ఆరోపణలు మీడియా లో రాగా , సుప్రీం కోర్టు అడ్వాకేటు జనరల్ కెకె వేణుగోపాల్ జస్టిస్ రంజన్ గొగోయ్ దృష్టికి తీసుకువెళ్ళాడు. దీనికి స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి అది మీడియా విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు చెప్పాడు. 

Also read  దళిత పాంథర్స్: నాందేవ్ దస్సాల్


జస్టిస్ రంజన్ గొగోయ్ మీద ఆరోపణలు చేసిన మహిళ పై మూడు ఎఫ్ ఐ ఆర్ లు ఉన్నాయి. కోర్టు ఉద్యోగంలో చేరేనాటికి ఆమే మీద ఒక ఎఫ్ ఐ ఆర్ పెండింగ్ లో ఉంది. 


ఒక సాక్షిని బెదిరించడం కేసులో కూడా ఆమె మీద ఎఫ్ ఐ ఆర్ ఉంది.ఆమెకు ఉన్న నే; ఎఫ్ ఐ ఆర్ లు పెండింగ్ లో ఉండగా ఆమెకు కోర్టులో ఉద్యోగం ఎలా ఇచ్చారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సదరు మహిళ నాలుగు నెలలు జైలు జీవితం కూడా గడిపారు. 


ఆరోపణల వెనక పెద్దల హస్తం? 


సుప్రీం కోర్టు మాజీ మహిళ ఉద్యోగి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద చేసిన ఆరోపణల వెనక పెద్దల హస్తం ఉందా?  అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


సుప్రీం కోర్టు లాయర్ ఒకరు సిజెఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మీద మాజీ మహిళ ఉద్యోగి చేసిన ఆరోపణలు వెనక పెద్దల కుట్ర ఉందంటూ కోర్టు లో కేసు దాఖలు చేశారు. జస్టిస్ రంజన్ గొగోయ్ కి మద్దత్తు గా 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు.


ఉత్సవ బైన్స్ అనే న్యాయవాది సమర్పించిన అఫిడివిట్ లో కొందరు జస్టిస్ రంజన్ గొగోయ్ మీద ఆరోపణలు చేసిన మహిళ కు మద్దత్తు గా కోర్టులో వాదిచాలని, అందుకు ప్రతిగా రూ 1.5 కోట్లు ఫీజు ఇవ్వడానికి సిద్ధపడినట్లు అఫిడివిట్ లో పేర్కొన్నారు. 

Also read  దళిత రాజకీయం: మా (దళితులకు) కెందుకు రాజకీయం!

స్వతంత్ర న్యాయవ్యవస్థ మీద కుట్ర జరుగుతుందా?


జస్టిస్ గొగోయ్ వెనక జరుగుతున్న కుట్ర కేవలం స్వతంత్ర న్యాయవ్యవస్థ మీద జరుగుతున్న కుట్ర అనుకోవాలా లేక వ్యక్తిగతంగా  జరుగుతున్నా కుట్రగా భావించాల్సి ఉందా?


గతంలో జస్టిస్ కర్ణన్ మీద కూడా ఆరోపణలు చేసి అభాసుపాలు చెయ్యడమే కాక, కోర్టు ధిక్కారం నేరం క్రింద జైలు లో పెట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ కర్ణన్ చేసినటువంటి పనినే ఆంధ్రప్రదేశ్ కు చెందిన అగ్రకుల న్యాయమూర్తి చేస్తే అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు.


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద ఆరోపణలు చేసిన మహిళ కు  స్వయం ప్రకటిత దేవుడు ఆశారం బాబా కి ఏమిటి సందర్భం, ఉత్సవ బైన్స్ ని ఎందుకు కలిసారు  కోట్ల రూపాయిల ఆఫర్ ఎందుకు చేశారు.?


ఈరోజు ఉదయం దాదాపు గా 50 సంఘాల మహిళలు జస్టిస్ రంజన్ గొగోయ్ లి ఇచ్చిన క్లిన్ చిట్ కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారు. 


జస్టిస్ రంజన్ గొగోయ్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కుమారుడు.   

(Visited 45 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!