జాత్యహంకారంలో బారత దేశం!

షేర్ చెయ్యండి
  • 1
    Share

ఆది నుండి కుల పరంగా ద్వేషిస్తే, నవీన యుగంలో మత పరంగా ద్వేషిస్తున్నారు. ఇంకా కొంచెం ముందు అడుగు వేసి కులం – మతం తో కలిపి రిజర్వేషన్లు పేరుతో ద్వేషిస్తున్నారు.ఈ దేశంలో చాలా మందికి నవబారత నిర్మాత బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఆంటే నచ్చదు అని ద్వేషిస్తారు. ఈ మధ్య అయిన విగ్రహాల మీద దాడి చేస్తున్నారు.స్వతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణానికి , పౌరుల స్వేచ్ఛ, గౌరవం మరియు హక్కుల కొరకు అయిన చేసిన కృషి కనీసం తెలుసుకోకుండా గుడ్డి గా వ్యతిరేకిస్తున్నారు.

ఈ దేశం మీద మొదట నుండి బ్రాహ్మణుల ప్రభావం ఉంది. ఆలాగే మన రాష్ట్రంలో కూడా. ఈ ప్రభావం, ఆధిపత్యం తగ్గించటానికి, వారి రాజకీయ, ఆర్ధిక స్థానాన్ని అక్రమించు కోవటానికి మొదట గా కమ్మ కులస్తులు (కమ్మ జనభ్యుదయ సంఘం ) ప్రయత్నించేరు, వారికి వ్యతిరేకంగా కోవెలమూడి. గోపాలకృష్ణయ్య మొదట The Indian Political Craze అనే గ్రంధాని రచించేరు. ఆంటే ఆనాటి కాంగ్రెస్ లో ఉన్న బ్రాహ్మణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రాసేరు. ఆ తర్వాత దుగ్గిరాల రాఘవయ్య చౌదరి బ్రహ్మణుడి తో సహాయ నిరాకరణ మొనరపుడు అని హెచ్చరిస్తూ వందలాది పుటల గ్రంధాలు రాసేరు. ఇక త్రిపురనేని రామస్వామి చౌదరి తో మొదలైన హేతువాద దృకపదం, కమ్యూనిస్ట్ లు గా మారి బ్రాహ్మణ వాదాన్ని చీల్చి చెండాడేరు. వీరిని చూసి రెడ్లు రెడ్డి జనభ్యుదయం అనే సంఘం పెట్టి కట్టమంచి రామలింగారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి తదితరులు బ్రాహ్మణ ఆధిపత్యానికి వెతిరేకంగా పోరాడేరు.

Also read  ఆధిపత్యం కోసమే బారత రాజ్యాంగం ను తగలబడుతున్న హిందూ సంఘాలు!

ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో బ్రాహ్మణ అధికారాన్ని , భూమిని సంపాదించి వారి, వారి కులాల సామాజిక, ఆర్ధిక రాజకీయ అభివృద్ధికి దోహదపడ్డారు. ఎక్కువ శాతం రాష్ట్రాన్ని పాలించింది వారే.ఈ పరిణామ క్రమంలో ఎస్సి, ఎస్టి, బిసి రిజర్వేషన్లు వలన రాష్ట్రం ( ప్రస్తుత రెండు తెలుగు ప్రాంతాలు) ఏ విధంగా నష్ట పోయింది, నాశనం అయ్యింది.ఫేస్ బుక్ లో ఉన్న రిజర్వేషన్ వ్యతిరేక గ్రూపులు, వ్యక్తులు, సంఘాలు సమాధానం చెప్పాలి.

ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు దగ్గర నుండి తీసుకుని పంచాయతీ శాఖ వరకు మెజారిటీ ఉద్యోగస్తులు , అధికారులు ఎస్సి లు కాదు. వ్యాపారులు రిజర్వేషన్లు మీద వచ్చిన వారు కాదు. మరి రిజర్వేషన్లు వలన ఏ విధంగా నష్ట పోయిందో చెప్పాలి.ఇది ఒక దుష్ప్రచారం.ఈ దుష్ప్రచారానికి కర్త, కర్మ, క్రియా అంతా పాలక వర్గాలే.పాలక వర్గాల అవినీతి, అసమర్ధత రిజర్వేషన్లు మీదకు నెడుతున్నారు.

రిజర్వేషన్లు సాకు చూపి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. వారి బంధువులకు వాటాలు తీసుకుంటున్నారు.

Also read  రిజర్వేషన్లు కావవి, రిప్రజెంటేషన్స్; మీ పేదరికానికి, మీ నిస్సహాయతకు రాష్ట్రాన్ని పాలిస్తున్న మీ కులం అని ఎందుకు గుర్తించరు?

ఉదాహరణకు. విద్యుత్ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేరు బాబు. దీని కాంట్రాక్టర్ కార్వే అనే సంస్ఠ. ఇందులో పనిచేసేది ఎక్కువ శాతం మహిళలు. వారికి ఇచ్చేది మహా అయితే నెలకు రూ. 15000/- అందులో కటింగ్ పోను రూ 13000/- ఎప్పుడు వుడుతుందో తెలియదు. కాంట్రాక్టర్ ది ఏ కులం అయితే ఆ కులపోళ్ళు బాస్ లు. వీరి దాయాదక్షణాల మీద ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. ఎన్ని రోజులు చేసినా బెత్తెడు జీతం. కార్వే వాడి ఖాతాలో ప్రజల సొమ్ము కోట్లల్లో డిపాజిట్ అవుతుంది. దీనిని చూపించి బ్యాంక్ ల నుండి వందల కోట్లు అప్పు తీసుకుంటారు. వారికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్న రోజులు బాగుంటుంది. ఆ తర్వత బోర్డు తిప్పేస్తారు.

ఇలా ప్రజల ఆస్తి దోపిడి చేస్తుంటే రిజర్వేషన్లు మీద పడి కులాన్ని, ఆ కులాల ప్రజలను ద్వేషిస్తున్నారు. బహుసా ప్రపంచంలో మరేదేశంలో ఇలాంటి జాతి ప్రజలు ఉండరు. సారీ బారత దేశం నానా కులాల సమూహం కదా!

Also read  బాబు వస్తే జాబు స్వాహః నిరుద్యోగ భృతి స్వాాహః !
(Visited 32 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!