ట్రిపుల్ తలాక్: ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

షేర్ చెయ్యండి
  • 68
    Shares
 
ట్రిపుల్ తలాక్ అని చెప్పి తక్షణమే విడాకులు ఇవ్వడం ఇక నుండి క్రిమినల్ చర్యగా భావించాలని, ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చే భర్త కు మూడు సంవత్సరాలు లకు తగ్గకుండా జైలు శిక్ష విధించే ముస్లిం మహిళల  వివాహ పరిరక్షణ చట్టం – 2018 కి లోక్ సభ ఆమోదం తెలిపింది. 
 
తాజా బిల్లు తో ట్రిపుల్ తలాక్ మీద జరుగుతున్న చర్చ పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. విడాకులు ఇవ్వడం నేరం, జైలు శిక్ష ఒక్క ముస్లిం భర్త లకేనా లేక హిందూ భర్త లకు వర్తించదా? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది.
 
వివాహం అయిన తర్వాత ఎలాంటి హక్కులు లేకుండా అకారణంగా విడాకులు ఇచ్చే హిందూ భర్త ల కోసం కూడా ఇలాంటి చట్టం తేవాలని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నారు. 
 
శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న హిందూ సాంప్రదాయ వాదులు, ఇస్లాం సంప్రదాయం 

అయిన ట్రిపుల్ తలాక్ ని రద్దు చేయడాన్ని స్వాగతించడం ని మహిళా తప్పుబడుతున్నారు.
 

         

2011 జనాభా లేఖల ప్రకారం దేశ వ్యాప్తంగా 2. 37 మిలియన్ మహిళలు భర్త నుండి తెగతెంపులు ( విడాకులు ) చేసుకుని జీవిస్తునట్లు లెక్కలు చెబుతున్నాయి.
 
అయితే వీరు చట్ట ప్రకారం విడాకులు మంజూరు అయి విడిగా ఉంటున్నారా లేక భర్త నిరాదరణకు మరియు, అత్తగారి ఇంటి నుండి బలవంతాన నెట్టి వేయబడ్డారా అనేది స్పష్టం కావడం లేదు. 
 
దేశవ్యాప్తంగా 1.9 మిలియన్ హిందూ మహిళ లు భర్త నుండి విడిపోయి జీవిస్తుంటే 0. 28 మంది ముస్లిం మహిళలు ఉన్నారు.
 
ట్రిపుల్ తలాక్ బిల్లు  రాజ్యాంగ విరుద్ధం: విపక్షాలు!     
 
లోక్ సభలో ప్రతి పక్ష నేతలు ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అభిప్రాయపడ్డారు. ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని, ఒక వర్గంలోని మగ వారిని శిక్షించే విధంగా ఈ చట్టం రూపొందించడం మైనారిటీల మత విశ్వాసాలకు విరుద్దంగా ఉందని పేర్కొన్నారు. 
 
హైదరాబాదు పార్లమెంట్ సభ్యుడు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి మీడియా తో మాట్లాడుతూ వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం నేరం కానప్పుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 
 
తాజా బిల్లు ముస్లిం మహిళల సాధికారత కాదని, ముస్లిం పురుషులను శిక్షించడడమే పరమావధిగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 
 
లోక్ సభలో ప్రతి పక్షాలు ఈ బిల్లును పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందు పెట్టి చర్చించిన తర్వాత సభలో పెట్టాలని డిమాండ్ చేసారు. 
 
ట్రిపుల్ తలాక్ గురించి ఖురాన్ ఏమి చెబుతుంది!
 
తలాక్ అని మూడు సార్లు కాదు 100 సార్లు చెప్పినా అది ఒకసారి చెప్పినట్లు గానే పరిగణించబడుతుందని ఖురాన్ లోని “సురా – ఆల్ బఖ్వరా (Sura – Al -Baqara ) 227 – 230” 
 
వాట్సప్ మెసేజ్ ద్వారా, లేదా సింపుల్ గా ఎస్ ఏం ఎస్ ద్వారా మూడుసార్లు తలాక్ అని చెబితే ఆ వివాహం రద్దు అయినట్లు కాదు. 
 
భారత దేశంలో కొందరు ముస్లిం పురుషులు వాట్సప్ ద్వారా తలాక్ చెప్పి భార్యలను వదిలించుకుంటున్న  సంఘటనలను ఉన్నాయి. 
 
సురా 228 ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వాలంటే మూడు నెలలు నెలసరి ( పీరియడ్స్ ) వచ్చేంత వరకూ ఆగాలి. ఈ మూడు నెలలో ఒకవేళ గర్భవతి అయితే ఆ మహిళ కు విడాకులు ఇవ్వకూడదు. 
 
ఇండియాలో ట్రిపుల్ తలాక్ !
 
భారత దేశంలో ట్రిపుల్ తలాక్ ని తలాక్ ఏ బిద్దత్ అంటారు. హనఫీ సున్నీ ఇస్లామిక్ న్యాయ సూత్రాల ప్రకారం భారత దేశంలో విడాకులు లేదా ట్రిపుల్ తలాక్, ఇన్స్టాంట్ తలాక్ పద్ధతులు పాటిస్తున్నారు. 
 
ఈ విడాకుల పద్దతి చాలా వివాదాస్పదంగా ఉంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ కి చెందిన  ఒక వ్యక్తి  తన భార్య ప్రధాని మోడీ సభకు వెళ్ళేరని ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చేరు 
 
ఒక ప్రొఫెసర్ వాట్సప్ లో మెసేజ్ చెయ్యడం ద్వారా తన భార్యకు విడాకులు ఇచ్చేరు. 
 
తలాక్ బిల్లును స్వాగతిస్తున్న ముస్లిం  మహిళలు!
 
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముస్లిం మహిళల వివాహ చట్టం బిల్లు – 2018 ని ముస్లిం మహిళా సంఘాలు స్వాగతిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళా అందోళన్ సభ్యురాలు ఈ తాజా బిల్లును స్వాగతించారు. 
 
బహుభార్యత్వం మరియు పిల్లల సంరక్షణ, వంటి అంశాలలో హిందూ వివాహ చట్టం లో మాదిరిగా స్పష్టంగా ముస్లిం మహిళల కోసం కూడా బిల్లు తేవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇది ఇలా ఉంటే ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోషియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ముస్లిం మహిళా లకు ఒక చట్టం, హిందూ మహిళలకు ఒక చట్టమా? అని ప్రశ్నించారు?
 
భార్యను వదిలేయడం ముస్లింయేతర భర్తలకు శిక్ష లేనప్పుడు , ముస్లిం భర్తలు చేస్తే నేరం ఎలా అవుతుంది అని అన్నారు. 
 
ట్రిపుల్ తలాక్ సాంప్రదాయం అయినప్పటికీ అది లోపభూయిష్టమైనది. తిరిగి ఆలోచించుకునే సమయం లేకుండా వెంటవెంటనే తలాక్ అని చెప్పడం వలన వివాహ బండలు విచ్ఛిన్నం అవుతున్నాయని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ( సమానత్వపు హక్కు ) ను ఉల్లంఘించడమే అని ముగ్గురు జడ్జీలు 2017 ఆగస్టు 22 వ తేదీన తలాక్ – ఏ బిద్దత్ – (ట్రిపుల్ తలాక్) సాంప్రదాయం  చెల్లదని తీర్పు చెప్పారు. 
 
తమకు న్యాయం చెయ్యాలంటూ ముస్లిం మహిళలు కోర్టులను ఆశ్రయించినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టులు లకు సాధ్యం కాదు. 
 
తలాక్ ఏ బిద్దత్ సహా మూడు రకాల విడాకుల పద్దతులను ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం – 1937 లో చేర్చి గుర్తింపునిచ్చారు. ముస్లిం షరియా చట్టం చేర్చినంత మాత్రాన అది ప్రాధమిక హక్కులకు అతీతం కాదు. 
 
రాజ్యాంగ రచన కంటే ముందు లేదా తర్వాత రూపొందించిన ఏ చట్టమైనా  సరే ప్రాధమిక హక్కులను ఉల్లంగించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 (1) చెబుతోంది. 
 
ముస్లిం పురుషుడు బాధ్యత లేకుండా , ఇష్టానుసారంగా , ఏకపక్షంగా  విడాకులు ఇచ్చేందుకు తలాక్ సాంప్రదాయం కల్పిస్తుందని జస్టిస్ ఆర్ ఎఫ్  నారీమన్ తన తీర్పులో పేర్కొన్నారు. 
 
 
 
(Visited 43 times, 1 visits today)
Also read  దళిత నాయకులు: ఆంధ్రా మార్క్సిజం చరిత్రలో కానరాని దళిత నాయకులు!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!