చరిత్రలో నిలిచిపోయిన బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఆంధ్రా పర్యటన!

షేర్ చెయ్యండి
  • 47
    Shares
 

దేశ వ్యాప్తంగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కి ప్రజల్లో కాలేజీ విద్యార్థుల్లో  ఆదరణ రోజు రోజుకు పేరుగుతూన్న విధంగా  ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అంతే స్థాయి లో ఆదరణ బాబాసాహెబ్ డా అంబేడ్కర్  మీద తెలుగు ప్రజలు చూపించేరు. ఆనాడు బాబాసాహెబ్ డా .అంబేడ్కర్  ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అని దానికి డిల్లీలో పనిచేస్తున్న నందనారు హరి మీద ఆ బాధ్యత పెట్టేరు.  డా. అంబేడ్కర్ ఆంధ్రా పర్యటన ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా పేర్కొనాలి. అయిన పర్యటన దళితులు మరింత చైతన్యం కావడానికి దోహదం చేసింది  

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని ఆంధ్ర ప్రదేశ్ కి తీసుకు రావటానికి నందనారు హరి పెద్ద సర్కస్ చేసేరు అని చెప్పాలి. సాధారణంగా  బాబాసాహెబ్ డా. అంబేడ్కర్  గంభీరంగా ఉంటారు. 

ఉత్తరాలకు కూడా పెద్ద గా స్పందించరు. ఎవరి మాట కూడా వినరు. ఆహ్వానించగానే వచ్చే మనిషి కూడా కాదు. హరి డీల్లీ లో అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పని చేస్తూ ఉండేవారు. 

అప్పటికి వైస్రాయి కౌన్సిల్ లో లేబర్ సభ్యులు గా ఢిల్లీ లో ఉండేవారు. హరి వుద్యోగం చేస్తూనే నిమ్నజాతుల సమస్యల మీద ప్రభుత్వాలకు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు, విద్యా సౌకర్యాలు కల్పించాలి అని విజ్ఞాపన పత్రాలు ప్రభుత్వనికి ఇచ్చేవారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ని ఎలాగైనా ఒప్పించి ఆంధ్ర కి తీసుకురావాలి అని అయిన ఒక ఉపాయం చేసేరు. 

ఒక సోమవారం సరాసరి ఢిల్లీ లో బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ఇంటికి వెళ్లేరు. దర్వాన్ చూసేటట్టుగా వీథి వరండా లో ఉన్న బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ఫోటో కి పూలమాల వేసి సాష్టాంగ దండం పెట్టి వచ్చేవారు. 

ఆ సమయంలో బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఇంటిలో ఉండేవారు కాదు. సాయంకాలం ఇంటికి వచ్చిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ఫోటో కి దండవేయటం గమనించి దర్వాన్ ని అడిగి తెలుసుకున్నారు. 

ఇలా ప్రతి సోమవారం జరిగేది. ఇలా నాలుగు సార్లు జరిగే సరికి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్  కి కుతూహలం పెరిగింది. ఐదో సోమవారం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్  ఇంటిలో ఉండేసరికి నందనారు హరి దొరికి పోయేరు. 

నందనారి హరి లో ఉన్న చదువు,చిత్త శుద్ధి గమనించిన బాబాసాహెబ్ డా. అంబేడ్కర్  దక్షిణ భారత యుద్ద ప్రచారకుడిగా నెలకు రు 500 వందల వేతనం ఇచ్చి నియమించేరు. హరి కోరిక మీద అధికార పర్యటన వేసుకుని డా. అంబేడ్కర్ ఆంధ్రా పర్యటన వచ్చేరు.

“రాజులకు రాజు, మహారాజు – మాల రాజు వచ్చుచున్నారు చూచుటకు రండి”

“అమెరికన్ నీగ్రోలకు బుకర్ వాషింగ్టన్ ఎంటువంటి వారో మన అస్పృశ్యులకు అంతకంటే మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్  వచ్చుచున్నాడు దర్శనం చేసికొండు,”

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

“అసమాన శేముపీదురందురుడు, ప్రతిభావంతుడూ, అనాథలకు ఆశాజ్యోతి వచ్చుచున్నారు తరలిరండు , తనివితీరా చూడుడు”

ఇవి బాబాసాహెబ్ డా అంబేద్కర్ కి స్వాగత ( అట్టల మీద రాసినవి ) బ్యానర్ లు, కరపత్రాలు పంచారు. ఎటుతిరిగినా కనిపించే విధంగా స్వాగత పత్రాలు రాసి గోడల మీద అంటించేరు.

బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆంధ్రా పర్యటన లో తెలుగు నేల మీద మొదట కాలుమోపింది అమలాపురం.

సెప్టెంబర్ 27 కలకత్తా మెయిల్ లో బయలుదేరి మరుసటి రోజు అమలాపురం చేరుకున్నారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ . రైల్ ఆలస్యం అయ్యింది మద్యాహ్నం రెండు గంటలు అయ్యింది. ఆరోజు విజయదశమి ఆకాశం మబ్బుపట్టి ఉంది. రైల్వే స్టేషన్ లో ఆయనకు అపూర్వమైన స్వాగతం లభించింది. 

సరిగ్గా అదే సమయానికి వర్షం మొదలైంది. అయినా జనం ఎవరూ కదలలేదు. ఊరేగింపుగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని తీసుకువెళ్లటానికి 24 జతల ఎడ్లు కట్టిన పూల బండిని సిద్దం చేసేరు. 

బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ని పూల బండి ఎక్కాల్సిందిగా ఆహ్వాన సంఘం వారు ఆహ్వానించేరు. నేను పూల రధం ఎక్కి ఊరేగింపుగా రావటానికి పెళ్లికోడుకు నా అంటూ తిరస్కరించి , ఆ రధం మీద ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఉప్పల. సత్యనారాయణ ని ఎక్కించి అయిన మామూలు కారులోనే ట్రావెల్స్ బంగ్లా కి బయలుదేరారు. నాలుగు ఫర్లాంగులు దూరానికి దాదాపు గంట సమయం పట్టింది.

Dr. Ambedkar-andhra_tour
Image: Babasaheb Dr. Ambedkar visit to Kakinada

 

రైల్వే స్టేషన్ నుండి ట్రావెలర్ బంగ్లా కి వెళ్ళటానికి గంట సమయం పట్టింది. దళిత దీన బంధువు ని చూడటానికి ప్రజలు రోడ్ల వెంట బార్లుతీరినిల్చున్నారు. సాయంకాలం 4:30 గంటలకు మునిసిపల్ పాఠశాల ఆవరణలో బహిరంగ సభ జరిగింది. 

బాబాసాహెబ్ డా అంబేడ్కర్  ఇంగ్లిష్ లో ప్రసంగించగా జొన్నల. మోహన్ రావు గారు తెలుగులోకి అనువధించేరు. వైశ్య సంఘం వారు అంబేడ్కర్ ని ప్రత్యేకంగా సన్మానించేరు. 

ప్రేమ సమాజం వారు, నిమ్న జాతుల సమాజం వారు కూడా సన్మాన పత్రాలు సమర్పించేరు. సభ అనంతరం అమలాపురం లోని వైశ్యుల వ్యాపార కేంద్రాలను దర్శించేరు.అక్కడ వారి వ్యాపార, సమాజ సేవ ని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బాగా ఆకర్షించేయి. 

దేశంలో ని చాల చోట్ల కంటే ఇక్కడి వైశ్య కులస్తుల సమాజ అభివృద్ధి దిశగా వారి వ్యాపారాలు నన్ను ఆనందింప చేసాయి అని విజటర్ బుక్ లో రాసేరు. కొన్ని దళితులు   నివసించే వాడలు కూడా బాబాసాహెబ్ డా అంబేడ్కర్  సందర్శించేరు. రాత్రి 7 గంటలకు విశాఖపట్నం బయలుదేరి వెళ్ళేరు.

విశాఖ వెళ్ళేటప్పుడు బాబాసాహెబ్ డా అంబేడ్కర్  కి పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుండి విశాఖ వెళ్ళె మార్గం లో సముద్ర కాలవ ఉంది ఆ కాలవ ఫెర్రీ ద్వారా దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి. కారు చివరి సమయంలో కారు లైట్ లు నీళ్ళ మీద పడి తళ తళ మెరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా డ్రైవర్ కారుని ఆపేరు. అప్పటికి కారు సరాసరి కాలవ ఒడ్డుకు చేరింది. క్షణం ఆలస్యం అయినా కారు కాలవ లోకి దూసుకు వెళ్ళేది. కారులో బాబాసాహెబ్ డా  అంబేడ్కర్ తో పాటు నందనారు హరి, సిబ్బంది ఉన్నారు.

Also read  దళితులు విముక్తి పొందాలన్నా,అభివృద్ధి చెందాలన్నా మతం మార్చుకోక తప్పదు!

29 వతేది ఉదయం విశాఖపట్నం లో కొన్ని అధికారక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని సభల్లో ప్రసంగించారు. జొన్నల మోహన రావు గారు తెలుగులో కి అనువాదం చేసేరు. అన్ని సభలకి జనం అశేషంగా హాజరు అయ్యేరు. రాజ్యాధికారం , పరిపాలన లో బాగం ఈ రెండు లేకుండా నిమ్నజాతులు అభివృద్ధి సాధించ లేరు అని ఆ అధికారం కోసం పోరాడాలి అని భోధించేరు.

 29 వ తేదీ రాత్రి కూడా బాబాసాహెబ్ డా అంబెడ్కర్ విశాఖపట్నం లో గడిపేరు. అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ వ్యవహారాలు, పోర్ట్ లో లేబర్ వ్యవహారాలు పరిశీలన చేసరు. ఆతర్వాత అయిన మైయిల్ లో బయలుదేరి కాకినాడ ప్రయాణం అయ్యేరు. 

అప్పుడు కూడా ప్రతి స్టేషన్ లో జంసందోహం బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని చూడటానికి వచ్చేరు. ఏలూరు లో అదిమాంద్రా అధ్యక్షుడు శ్రీ రాయుడు గంగయ్య, పచ్ఛమ  గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ గొట్టిముక్కల వెంకన్న గార్లు కలవటానికి ప్రయత్నించేరు. వారికీ ఆవకాశం లభించలేదు. 

సెప్టెంబర్ 30 వ తేదీ ఏలూరు బహిరంగ సభలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్  కి సమర్పించ వలిసిన స్వాగత పత్రాలు ముందుగానే ఇవ్వాలి అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. 

అంతకు ముందు వీరు బాబాసాహెబ్ డా అంబేడ్కర్  కి ఉత్తరాలు రాసేవారు వాటికి అయిన సమాధానం ఇవ్వలేదు. ఈ సంఘటన తో వారికి చిరాకు కల్గించింది. అసంతృప్తి తో బాబాసాహెబ్ డా అంబేడ్కర్  మీద విశ్వాసం లేదని ప్రకటించారు. 

బాబాసాహెబ్ డా అంబేడ్కర్  తన పర్యటన లో కాకినాడ, రామచంద్రపురం, గుడివాడ, కావలి , ఏలూరు, నెల్లూరు పట్టణాలు సందర్శించేరు. పాము రామ్మూర్తి నందనారు హరి అయిన వెంట ఉన్నారు. 

ఒక చోట తన ప్రసంగంలో తెలుగు అనువాద భావం స్పష్టంగా రావటం లేదు అని గమనించి దానిని మళ్లీ ఇంకొకసారి చెప్పేరు అంటా. కాకినాడ లో షెడ్యూల్ తరగతుల సంస్థలు ఘనంగా సత్కరించాయి.

కాకినాడ కేంద్రంగా దక్షిణ భారత్ దేశంలో దళిత దేశం ఏర్పటు చెయ్యాలి అనే భావన  బాబాసాహెబ్ డా అంబేడ్కర్  కి ఉండేది. కాని ఆనాటి పరిస్థితులవలన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

Also read  నరకాసురుడు ; దీపావళి పండగను దళిత, బహుజనులు ఎందుకు చెయ్యకూడదు!

రామచంద్రాపురం లో ఈలి వాడపల్లి గారు  బాబాసాహెబ్ డా అంబేడ్కర్ సభకి నేతృత్వం వహించి జిల్లా అంతటి నుండి ప్రజలు వచ్చేవిధంగా ఏర్పాటు చేసేరు. ఈలి వాడపల్లి నడుపుతున్న హరిజన హాస్టల్ ను బాబాసాహెబ్ డా అంబేడ్కర్  సందర్శించేరు. అక్కడ ఆశ్రమం పొందుతున్న యువకులు స్వాగతం పలికెరు. 

అక్కడి ఉపన్యాసం విన్న బోయి బీమన్న అప్పటికి అప్పుడు అంగ్లం లో కవిత రాసి రామచంద్రపురం లో ప్రేమ్ కట్టించి కాకినాడ సభలో చదివేరు. వి ర్ కాలేజీ క్యాడ్రాంజిల్ హల్ లో సభ జరిగింది ఆ సభ కు పాము. రామమూర్తి అధ్యక్షుడు. ఇప్పుడు బోయి భీంమన్న పద్యాలు చదువుతారు అని రామమూర్తి గారు పిలవగానే అయినను ( బోయి భీమన్న ఖద్దరు పంచె, లాల్చీ , సాలువ ధరించేరు ) చూసి అంబెడ్కర్ who is he, who is he అని అన్నారు. రామ మూర్తి He is our man He is our man అని అంబెడ్కర్ కి చెబితే ఒకే ఒక్క నిమిషం సమయం అని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అని పుస్తక పఠనం లో నిమగ్నమైనారు. 

అర నిమిషం చాలు , నాలుగు పద్యాలే అంటూ భీమన్న పద్యాలు చదివేరు. మొదటి పద్యం చదివే సరికి అంబెడ్కర్ కదిలేరు అంటా, రెండో పద్యానికి తల ఎత్తి చూసేరు , మూడో పద్యానికి పుస్తకం మూసి వేసేరు, నాలుగో పద్యానికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్    లేచి, కరచాలనం చేసి, భీమన్న చేతిలోని ప్రేమ్ కట్టిన ప్రతి ని తీసుకుని అభినందించేరు. ఇదో గొప్ప అనుభూతి అని బోయి భీమన్న చెబుతారు. 

ఈ నాలుగు పద్యాలు కలకత్తా నుండి వెలువడే పీపుల్స్ హెరాల్డ్ అనే పత్రిక లో సంపాదకీయంగా ప్రచురించేరు. ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అని దానికి డిల్లీలో పనిచేస్తున్న నందనారు హరి మీద ఆ బాధ్యత పెట్టేరు. 

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ హైదరాబాద్ పర్యటన వివరాలు  తుదపరి వ్యాసం ద్వారా ప్రచురించడం జరుగుతుంది. 

(Visited 107 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!