డా.అంబేడ్కర్ – గాంధీ సమావేశం!

షేర్ చెయ్యండి

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ పట్ల కాంగ్రెసు దొరాణి మార్చుకోవలిసి వచ్చింది. నిమ్నజాతీయులు  జాతుల పట్ల వారి హక్కుల పట్ల అయినకు ఉన్న ఖచ్చితమైన అభిప్రాయాలు, లండన్ పర్యటన లో అయిన చేసిన కృషి, మరియు దేశ భక్తిని లండన్ పత్రికలు విశేషంగా పొగుడుతూ ప్రచురించేవారు. జవహర్ లాల్ నెహ్రూ ఒక సభ లో మాట్లాడుతూ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్నవారు దేశ ద్రోహులని తాము అనలేదని, వారు ప్రజాప్రతినిధులు కారని మాత్రమె అన్నామని పేర్కొన్నారు.

1931 జులై మూడో వారం లో జరిగే రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబోయే వారి పేర్లలో బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ పేరు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఫెడరల్ స్ట్రక్చరల్ కమిటీలో బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ పేరు ప్రకటించారు.

రెండోవ రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్ళే ముందు గాంధీ బాబాసాహెబ్ డా . అంబెడ్కర్ ని చూడాలి , కలుసుకోవాలి అనిబాబాసాహెబ్ డా.  అంబెడ్కర్ కి ఒక ఉత్తరం రాస్తారు తమకు అభ్యంతరం లేక పొతే రాత్రి 8 గంట లకు స్వయంగా వచ్చి కలుస్తాను అని అందులో సారాంశం.బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ జ్వరం తో ఉండటం అయినా మేమే స్వయంగా వచ్చి కలుస్తాము అని తిరిగి సమాధానం పంపుతారు. కాని జ్వరం తగ్గుకు పోగా ఇంకా ఎక్కువ అవటం చేత కలవలేక పోయేరు ఆరోజు. ఆగస్ట్ 14, 1931 న్ మనిభవన్ , మలబార్ హిల్స్ లో గాంధీ, బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ మొదటి సమావేశం ఏర్పాటు చేసేరు. ఈ సమావేశం ఉద్దేశ్యం బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ని కూడా గాంధీ అనుచరులు గా చేసుకోవాలి అని గాంధీ ఉద్దేశ్యం. సమావేశంలో చర్చ ఈ క్రింది విధంగా సాగింది.

Also read  దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

గాంధీ: డాక్టర్ గారు, ఈ విషయం లో మీరు ఏమంటారు, మీ ఉద్దేశ్యం ఏంటి.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్: మీరు నన్ను పిలిచేరు మీరే తమ అభిప్రాయాలు చెప్పాలి లేదా మీరు నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెబుతాను అంటారు.

గాంధీ: మీకు నా మీద , కాంగ్రెసు మీద వెతిరేక భావాలు ఉన్నట్టు గా ఉంది. మీకు తెలుసో లేదో మీరు పుట్టక ముందు నుండి, నా చిన్నతనం నుండి నేను అంటరానితనం రూపుమాపటానికి కృషి చేస్తున్నా , కాంగ్రెస్ ఈ విషయంలో ఏంతో కృషి చేస్తోంది. ఇది ఒక మత సంబంధమైన విషయంగా కాంగ్రెసు భావిస్తుంది. అంటరాని ప్రజల అభివృద్ధి కి కాంగ్రెసు ఇప్పటి వరకు దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టింది. అయినా ఇంకా మీరు మాకు వెతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛ గా చెప్పవచ్చు అంటారు గాంధీ.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్: మీరు అన్నది నిజమే గాంధీ జీ , మేము పుట్టక ముందు నుండి మీరు అంటరానితనం రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలు ఎప్పుడూ తమ వయసును, పనులను ఉత్ప్రేరకంగా చెబుతారు. నిజమే కాంగ్రెసు కూడా ఈ సమస్యను మీ వలనే గుర్తించింది. కాని నేను ఏమంటాను అంటే కాంగ్రెస్ సమస్యను మాత్రమే గుర్తించింది సమస్య పరిస్కారానికి నిజాయతీయగా కృషి చెయ్యలేదు. కాంగ్రెస్ ఖర్చు చేసిన 20 లక్షలు నా వద్ద ఉంటే నేడు నా ప్రజల రూపు రేకలు మారిపోయి ఉండేవి. మీరు నన్ను ఇంకొంచం తొందరగా కలుసుకుని ఉండేవారు. కాంగ్రెస్ కి తమ సభ్యుల సంఖ్య పెంచుకోవటానికి ఖాదీ బట్టల కోసం ఉన్నంత శ్రద్ధ దళితుల మీద లేదు అంటారు. మీరు అంటారు బ్రిటిష్ వారికి హృదయం లేదు స్వరాజ్యం ఇవ్వటానికి, నేను ఏమంటాను అంటే ఈ దేశానికి, హిందూ సమాజానికి అంత కంటే కఠినమైన హృదయం అందుకే అంటారని జాతులను గౌరవించటం లేదు అంటారు. We believe in self help and self respect. ఖరాఖండిగా చెప్పాలి అంటే కాంగ్రెస్ మా సమస్యను పట్టించుకోవడం లేదు, మా ఆవేదనను చిన్నచూపు చూస్తుంది. 
Gandhiji we have no homeland అని అంటారు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్.

Also read  రౌండ్ టేబుల్ సమావేశాలు - అంబేడ్కర్

గాంధీ: ఇది మీ మాతృభూమి నే, రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు చేసిన ప్రసంగం మీకు దేశం మీద ఉన్న ప్రేమ, దేశ భక్తి తెలియజేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కలవటానికి వచ్చెను.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్: మీరు అంటున్నారు ఇది మా మాతృభూమి అని, మేము మల్లీ చెబుతున్నాం ఇది మా homeland కాదు. ఇదే మా మాతృభూమి అయితే ఇక్కడ అందరిలాగే మాకు సమాన అవకాశాలు , గౌరవం ఉండేవి. కాని ఈ గడ్డ మీద మమ్మల్ని కుక్కలు, పిల్లులు కంటే హీనంగా చూస్తున్నారు. తాగటానికి మంచినీరు కూడా లేదు. అంటరానితనం ముద్ర తో మమ్మల్ని హీనంగా చూస్తుంటే మేము ఎలా అనుకుంటాం ఇది మా మాతృభూమి అని.

మీకు తెలిసిందే మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో సిక్కుల, ముస్లిం ల హక్కులను ప్రభుత్వం గుర్తించింది.కాంగ్రెస్ కూడా తమ సమ్మతి తెలియజేసింది. అదేవిధంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో అంటరాని ప్రజల రాజకీయ హక్కులను, సరైన ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రత్యెక రాజ్యాంగ రక్షణ అవసరం అని గుర్తించింది. మీ అభిప్రాయాం ఏంటి గాంధీజీ.

Also read  దేవాలయ ప్రవేశం - నాసిక్ ఉద్యమం!

గాంధీ: హిందువులతో సంబంధం లేకుండా ప్రత్యెక రాజకీయ సౌకర్యాలు అంటే అది మాకు ఆత్మహత్యలాంటిది. దీనికి మేము వెతిరేకం.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్: నిజాయితీగా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మాకు ఇప్పుడు అర్ధం అయింది ఈ దుర్మార్గపు సమస్య మీద మేము ఎక్కడ ఉన్నామో అర్ధం అయింది. మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.

బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ గాందీ మనస్తత్వాన్ని గ్రహించేరు. కర్తవ్య నిర్వహణ మీద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు అని నిర్ణయానికి వచ్చేరు.

గాంధీ మాటకు దేశం లో ఎదురు లేదు. అప్పటి వరకూ గాంధీ మాటకు ఎదురు చెప్పిన వారు లేరు. అవి ఊహించని విషయాలు. అలా ఎదిరించిన వాడు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ ఒక్కరే.

(Visited 65 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!