తెలంగాణ ఎన్నికలు దళిత – బహుజనుల నవీన రాజకీయానికి నాంది కాబోతుందా!

షేర్ చెయ్యండి
  • 4
    Shares
 
 
తెలంగాణ ఎన్నికలు దళిత – బహుజనుల నవీన రాజకీయానికి నాంది కాబోతున్నాయి! తరతరాలుగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తుంది కేవలం మధ బలం ఉన్న కొన్నికులాలే. ఆర్యుల కుల వ్యవస్థ కొందరికే రాజ్యాధికారాన్ని పర్మినెంట్ గా కట్టబెట్టింది. కుల వ్యవస్థ కుంపట్లతో దేశాన్ని పరాయి పాలకులకు అప్పజెప్పేరు  ఆర్యులు – క్షత్రియులు. 
 
కొన్నివందల సంవత్సరాల తర్వాత తిరిగి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాత రాజరికానికి , కుల వ్యవస్థకు స్వస్తి పలికి బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్మించేరు. 
 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల నిర్ణయమే అంతిమ తీర్పు. బారత దేశంలో మెజారిటీ ప్రజలు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ మరియు వెనకబడిన తరగతులు. 
 
మాన్యశ్రీ కాన్షిరాం ఈ షెడ్యూల్ కులం , షెడ్యూల్ జాతులు మరియు వెనకబడిన కులాలను , మైనారిటీలను కలిపి బహుజనులు గా దేశంలో అతిపెద్ద సమూహాన్ని నిర్మించేరు. 
 
బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ నిర్మించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బహుజనులదే రాజ్యాధికారం కావాలి. కానీ బారతీయ ఫ్యూడల్ వ్యవస్థ, మత వ్యవస్థ బహుజనుల రాజ్యాధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని బహుజనులకు రాజ్యాధికారాన్ని ఎండమావిగా చేసింది. 
 
బారత దేశం రిపబ్లిక్ గా ఏర్పడి అర్ధ శతాబ్దం పైనే అయినా కుల వ్యవస్థ చట్రంలో ఇరుక్కుని బహుజనులు స్వతంత్రంగా బయటకు రాలేకపోతున్నారు. 1932 లో  బాబాసాహెబ్  కమ్యూనల్ అవార్డు ద్వారా ఎస్సీ , ఎస్టీలకు  ప్రత్యేక నియోజకవర్గాలు సాధిస్తే గాంధీ నిరాహార దీక్ష వలన వాటిని హరించిన సంగతి తెలిసిందే. 
 
ప్రత్యేక నియోజకవర్గాల స్థానంలో ఉమ్మడి నియోజకవర్గాలలో  ఆధిపత్య కులాలు రిజర్వడ్ స్థానాలలో వారి తాబేదారులను, పాలేరులను నియమిస్తూ ఎస్సి / ఎస్టీలకు కల్పించిన రాజకీయ రిజర్వేషన్లు వారి దగ్గరే పెట్టుకున్నారు. 
 
  మీ గోడల మీద రాసుకోండి మనం పాలకులం కాబోతున్నాం అన్న బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ స్ఫూర్తి తో , ‘ఓట్లు మావి -రాజ్యం మీదా’ అన్న మాన్యశ్రీ కాన్షిరాం ప్రభావంతో బహుజన సమాజ్ పార్టీ జాతీయ స్థాయికి రాగలిగింది. 
 
మారుతున్న సామాజిక సమీకరణాలు కారణం కావచ్చు లేదా అస్తిత్వ ఉద్యమాల ప్రబావం కావొచ్చు దేశ వ్యాప్తంగా దళితులు – వెనకబడిన తరగతులు రాజ్యాధికారం సాధించాలనే నినాదంలో మునిగి తేలుతున్నారు. 
 
2014 నుండి జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సోషల్ మీడియా ప్రభావం తో యువత లో సామాజిక బాధ్యత పెరిగిందని చెప్పక తప్పదు. అందులో బాగంగానే దళితులకు ఒక రాజకీయ పార్టీ / వేదిక  అవశ్యకతను నిరంతరం చర్చిస్తూనే ఉన్నారు. 
 
అనుకోకుండా వచ్చిన తెలంగాణ ఎన్నికలు దళిత వర్గాల్లో నూతన ఉత్తేజం కలిగించింది. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని తెలంగాణా ఉద్యమం లో మాట ఇచ్చి మోసం చేసిన తెరాసా పార్టీని నిలువరించాలంటే దళితులు గా సొంత రాజకీయ వేదిక కావాలంటే దళితులు బరిలో ఉండాలి. 
 
మనువాద రాజకీయ పార్టీలను అధికారం నుండి దూరంగా పెట్టాలన్నా బహుజన ఓటు బ్యాంకు ను, బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ లక్ష్యానికి అనుగునంగా దళిత సమాజాన్ని నడిపించాలంటే బహుజనుల రాజకీయ ఏకీకరణ శక్తి పెత్తందారులు చూడాలి. 
 
కాబట్టి తెలంగాణాలో త్వరలో జరగబోయే ఎన్నికలు దళిత శక్తిని – బహుజనుల యుక్తిని తెలియజేస్తుంది. ఇప్పుడు విఫలం అయితే 2019 లో పెత్తందారులు బహుజనులను  పూసిక పుల్లను తీసివేసినట్లు వేస్తారు. 
 
అస్తిత్వ ఉద్యమాలు దళితుల రాజకీయ అనైక్యతకు చిహ్నంగా మారుతుందా? 
 
“Being ruled always…Being buried alive”  డి. విజయభాస్కర్ చెప్పిన ఈ మాట నేటి దళిత – బహుజన సమాజానికి బాగా ఉపయోగపడుతుంది. దళితుల్లో అస్తిత్వ ఉద్యమాల ప్రభావం రాజకీయాల మీద తీవ్రంగా చూపిస్తుందా?  అదే జరిగితే ఎప్పుడూ పాలితుడుగా ఉండాలి, ఎప్పుడూ పాలితుడి గా ఉంటే నిన్ను సజీవంగా కాల్చివేసినట్లే. 
 
సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగిన కళాత్మక  శక్తి ఉన్న బహుజనులు దొరల కోసం కాకుండా స్వీయ సమాజం కోసం గానం చెయ్యాలి. స్వీయ సంవేదల్ని ప్రదర్శించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది రోహిత్ వేముల సంఘటన నుండి నిన్న మొన్న జరిగిన ప్రణయ్ – అమృత ల ప్రేమ పెళ్లి , ఆతర్వాత ప్రణయ్ హత్య వరకూ. 
 
చరిత్రను గమనిస్తే దళిత-బహుజనులు పెత్తందారీ కులాల కీర్తిని పొగడటానికే, గానం చెయ్యడానికే బహుజనులు ఉన్నారు. అయినా సరే దళితుల స్తానం పెత్తందారుల గడప వెలుపలనే కానీ లోపల ఎప్పుడూ లేదు. 
 
నేడు కూడా మెజారిటీ దళిత – బహుజన యువత తెరాస , తెదేపా వైకాపా, బిజెపి పార్టీల జెండా మోస్తూ  పెత్తందారుల కీర్తిని ప్రచారం చేస్తూ బానిసలుగా ఉంటున్నారు. 
 
దళిత బహుజనులు పెత్తందారుల పల్లకీ మోసినా రాజకీయంగా వారికీ సరైన ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే అదీలేదు.. ఏదో ఒక నెపంతో దళితులను నిందించడమే చేస్తున్నారు. 
 
ఇటీవల ఒంగోలు లో జరిగిన తెలుగు దేశం పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ముగ్గురు దళిత ప్రజాప్రతినిధులను తిట్టడం పైన పేర్కొన్న వాక్యాలకు  ఒక మంచి  ఉదాహరణ 
 
“తనతో తాను సంఘర్షించే వ్యక్తి తన్ను తాను తెలుసుకుని నిర్ధారణలకు చేరే విధంగానే, సమాజం కూడా అంతర్ము ఖంగా తనను తాను పరిశీలించుకుని నిర్ధారణకొస్తుంది. ఆ తెలివిడితో మార్పు గురించిన ఆలోచన మొదలవుతుంది ” 
 
దురదృష్టవశాత్తు దళిత సమాజం అంతర్ముఖంగా తనను తానూ పరిశీలించుకోలేకపోతుంది. ముక్యంగా గత 25 సంవత్సరాల క్రితం పెత్తందారుల స్వార్ధ ప్రయోజనాలకోసం పొలిమేరుల అవతల ఉన్న రెండు కులాల మధ్య గీసిన గీతలు నేటికీ చెరిపివేసుకోలేక పోవడం దళితుల మానసిక స్థితిని తెలియజేస్తుంది.  
 
దళితులు తెలుసుకోవలసినది ఏంటంటే, అస్తిత్వ వాదాల వెలుగులు పడని కులం తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. వర్గీకరణ ఉద్యమాల ప్రభావంతో ఎస్సైల లోని రెండు ప్రధాన కులాలు ఎడమొఖం పెడమొఖం గా ఉన్నా కులం అనేది తన ప్రభావం చూపుతూనే ఉంది. 
 
ఎస్సి ల మధ్య విభజన రేఖ గీసిన పెత్తందారీ పార్టీలు దళితులకు ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు కల్పించేరా? కులం పరంగా రెండు కులాలు  ఒకే విధమైన వివక్షను అనుభవిస్తున్నారు. 
 
కుల భూతాన్ని సజీవంగా ముందు పెట్టి రెండు వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించి పెత్తందారులు వారి రాజ్యధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వున్నారు. 
 
తరతరాల నుండి వ్యూహాత్మకంగా కుల వ్యవస్థను సజీవంగా కాపాడుకుంటూ వస్తు దళితులను ఓటు బ్యాంకుని వారి కనుసన్నల్లో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. 
 
మీగోడల మీద రాసుకోండి మనం పాలకులం కాబోతున్నాం అన్న బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ ఇచ్చిన చైతన్యం భూర్జువ కులాల వ్యూహంలో పాత్రధారులుగా మిగిలి అదే రాజకీయంగా , రాజ్యాధికారం అనే భ్రమల్లో ఉన్నారు. 
 
ఓట్లు మావి, సీట్లు మీవా అంటూ ప్రశ్నించిన మాన్యశ్రీ కాన్షిరాం ఆత్మగౌరవ పోరాటాన్ని అర్ధం చేసుకోలేక వివిధ కూటమి మద్దత్తు అంటూ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో దళితులు, బహుజనులు. 
 
తెలంగాణ ఎన్నికలు దళిత-బహుజన-రాజకీయాలు!
 
రాచరిక వ్యవస్థలో బ్రాహ్మణులు భగవంతుని ప్రతినిధులుగా, భూసురులుగా అభివర్ణించుకోగా, సురులకు, భూసురులకు క్షత్రియుడు విధేయుడై, విపరీతమైన దైవ భక్తిని రెచ్చగొట్టి సమాజాన్ని మొత్తాన్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచేడు 
 
ఆధునిక క్షత్రియులు కూడా ఇదే సూత్రాన్ని మరొక విధంగా  అమలు చేస్తున్నాయి. రాచరికంలోని క్షత్రియులకు రాజ్య విస్తీరణ ఆయుధ సంపద మీద ఆధారపడి ఉంటే ఆధునిక క్షత్రియులకు ఆర్ధిక సంపతి అవుతుంది. 
 
నేటి పాలకులు తమ కులానికి సంపదను పోగుచేసి మీడియా, ఇండస్ట్రీ లు, సహజ సంపద దోచి పెట్టి, పోగేసుకున్న సంపద తో ఓట్లు కొనుకుంటూ రాజకీయం చేస్తున్నారు. 1994 నుండి 2014 వరకూ తెలుగు రాష్ట్రాలలో మూడు కులాల సంపద ను ఒకసారి పరిశీలిస్తే అర్ధం అవుతుంది. 
 
ఇదే విషయం పైన ఒక విదేశీ యువతి రీసెర్చ్ చేసి వెలిబుచ్చిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలుసు. 
 
ఈ పరిణామాలను గమనిస్తున్న ఆధునిక దళిత – బహుజనులు  నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టేరు. ఉత్తర భారత దేశంలో మండల్ రాజకీయాల ద్వారా ఇప్పటికే రాజ్యాధికారం సాధించిన బహుజనుల స్పూర్తితో స్వతంత్రంగా రాజకీయ ఏకీకరణ దిశ గా అడుగులు వేస్తున్నారు. 
 
చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటి మూడు కులాలు అవసరమైనప్పుడు ఏకం కాగలవు. అభివృద్ధి చెందిన శూద్రులు కొందరు పై మూడు కులాలకు తొత్తులుగా ఉన్నారు. కానీ అణగారిన వర్గాలు ఐక్యం కాకుండా రాజకీయం చేస్తున్నారు. 
 
అణగారిన వర్గాలను కన్ఫ్యూజన్ లోకి లేదా పక్కదారి పట్టించడంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోని పై మూడు కులాలు పనిచేస్తున్నాయి. 
 
ఏకారణం చేత కూడా దళిత వర్గాలు ఒక తాటి మీదకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ కుట్రలు, కుతంత్రాలు దళిత – బహుజనులు అర్ధం చేసుకోగలిగితే, తెలంగాణ ఎన్నికలు దళిత -బహుజనుల్లో కొత్త ఉత్తేజం తీసుకు వస్తుంది. నయా రాజకీయాలకు నాంది కాబోతుంది.   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
(Visited 88 times, 1 visits today)
Also read  బహుజన రాజకీయం; నూతన వరవడిని సృష్టించబోతున్న బహుజనులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!