దళితులను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లా వై. యెస్. ర్. సి పి!

షేర్ చెయ్యండి
  • 122
    Shares
 
  • ప్రకాశం జిల్లా లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గా ఉన్న దళిత వర్గాలు వై సి పి కి అండగా గత ఎన్నికల్లో ఉన్నారు. ఈ జిల్లా లో మొత్తం మూడు ఎస్సి (Schedule Caste ) నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ ముండిటిలో రెండు ఖచ్చితంగా వై సి పి గెలుచుకునే స్థానాలు గా కంచు కోట లా ఉన్నాయి. 
 
ఎస్సి నియోజక వర్గాల లో ఓటర్ల శాతం పరిశీలించినా అత్యధిక ఓటర్లు దళితులే. ప్రకాశం జిల్లా లో మొదట నుండి జిల్లా కేంద్రం అయిన ఒంగోలు కి దగ్గరలో ఉన్న సంతనూతలపాడు నియోజక వర్గం మొదట నుండి  ఎస్సి ల కు కేటాయించగా డీలిమిటేషన్ లో భాగంగా కొండపి, యర్రగొండపాలెం నియోజక వర్గాలు ఎస్సి లకు కేటాయించేరు. 
 
పేరుకు రిజర్వుడ్ నియోజక వర్గాలు అయినా మొదట నుండి ఇక్కడ అన్నీ పార్టీలు దళిత నాయకులకు పైన వారి కుల నాయకుడిని ఇంచార్జ్ గా నియమించడం ఆనవాయితీ గా వస్తుంది. తెలుగు దేశం పార్టీ కమ్మ సామజిక వర్గ నాయకుడిని, వై సి పి రెడ్డి సామాజిక వర్గ నాయకుడిని దళిత నాయకుల ఫై పెత్తనం చెలాయించడం కోసం నియమిస్తున్నారు. 
 
ఈ మధ్య కాలంలో దళితుల్లో ఉన్నత చదువులు చదువుకుని, కాస్త స్వతంత్ర బావాలు గల నాయకులు, ఆర్ధికంగా ఒక రూపాయి స్వతంత్రంగా ఖర్చుపెట్టగలిగిన నాయకులు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. గతంలో సంతనూతలపాడు లో శాసన సభ్యులుగా వున్న దారా. సాంబయ్య గారు, బి యెన్ విజయ్ కుమార్ గారు లాంటి వారు అదే విధంగా కొండపి నియోజక వర్గం లో మాజీ మంత్రి స్వర్గీయ జి వి శేషు గారి లాంటి వారు ఫ్యూడల్ కుల నాయకులను ఎదిరించి వారి నియోజక వర్గంలో స్వతంత్రంగా పనిచేసి జనం మెప్పు చూరగొన్నారు. ఈ పరిణామాలు ఫ్యూడల్ కుల పార్టీ లకు మింగుడు పడని విషయం అందుకే వారికి  తమ సొంత సామాజిక వర్గం నాయకుల తో అడుగు అడుగునా అడ్డుతగులుతూ ఉంటారు. 
 
ఈ జాడ్యం కొత్తగా వచ్చిన  వైఎస్సార్ పార్టీ కి కూడా అంటుకుంది. రెడ్డి సామాజిక వర్గం తమ పార్టీ గా చెప్పుకుంటూ దళిత నాయకులను అగౌరవ పరుస్తూ, చిన్న చూపు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి విచిత్ర పరిస్థితి ప్రకాశం  వైఎస్సార్ సి పి లో జరుగుతూ  ఉండటం విడ్డురంగా, ఆచ్చర్యంగా ఉంది. 
 
ప్రకాశం జిల్లా వైఎస్సార్ సి పి కి మొదట నుండి పెద్ద దిక్కు గా ఉంది బాలినేని శ్రీనివాస రెడ్డి. 2014 ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిస్థితి ల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి బా వ వై యెస్ జగన్ కి బంధువు అయిన వై వి సుబ్బా రెడ్డి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు గా పోటీ చేసినప్పటి  నుండి వారి కుటుంబంలో రాజకియ విబేధాలు రోడ్డెక్కేయి. 2014 ఎన్నికల్లో తన ఓటమికి వై వి సుబ్బా రెడ్డి కారణం గా బావిస్తున్న బాలినేని శ్రీనివాస రెడ్డి ఒంగోలు వదిలి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తతం ప్రకాశం జిల్లా లో నాయకులు, కార్యకర్తలు బావ – బావమర్తి వర్గాలు గా విడిపోయి ఉన్నారు. వీరిద్దరి రాజకీయ విబేధాలు ప్రకాశంలో దళిత నాయకుల మీద, బలహీన వర్గాల నాయకుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి, ఆర్ధికంగా ఆ వర్గాలను నష్ట పరుస్తున్నాయి. 
 
గత ఎన్నికల్లో (2014 జనరల్ ఎన్నికలు ) సంతనూతలపాడు  అభ్యర్థిగా మొదట నుండి ప్రచారం జరిగి , ఆ నియోజకవర్గం లో పని చేసుకున్న నేత్ర వైద్య నిపుణుడు డా. వరికూటి  చక్రపాణి గారిని చివరి నిమిషంలో బాపట్ల పార్లమెంట్ అబ్యర్ధిగా పంపి అయిన ఓటమికి కారణం , మరియు ఆర్ధికంగా కోట్ల రూపాయిలు నష్టపోవడానికి కారణం బావ – బావమర్థులే కారణం. వీరి పార్టీ అయిన వైఎస్సార్ పార్టీనే కారణం. అలాగే కందుకూరు నియోజక వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు బుర్రా. మధుసూదన్ యాదవ్ గారిని చివరి నిమిషంలో కనిగిరికి మార్చి అక్కడ అతని ఓటమికి కారణం కూడా బాలినేని , వై వి సుబ్బా రెడ్డి లే ప్రధాన కారణం. కనిగిరిలో రెడ్డి సామజిక వర్గం బుర్రా కి వ్యతిరేకంగా పని చేసి అతని ఓటమికి కారణం అయితే , ఓడిన తర్వాత స్వీట్స్ పంచు కోవడం జిల్లా లో చర్చనీయాంశం అయ్యింది. 
 
2019 ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వైఎస్సార్ సి పి ఇప్పుడు కూడా అదే రీతిలో దళితులను, వెనకబడిన వర్గాల నాయకులను మోసగించే పనిలో వుంది. ఇప్పటి వరకూ సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఇంచార్జ్ ని పూర్తిగా నియమించకుండా అమావాస్య , పౌర్ణమి లకు ఒకరిని మారుస్తూ దళిత వర్గాలను ఆర్ధికంగా నష్టపరుస్తూ వారి సమయాన్ని వృద్దా చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నమ్మక ద్రోహం చేస్తున్నారు. 
 
సంతనూతలపాడు నియోజక వర్గానికి ఇంచార్చ్ లు గా డా . వరికూటి అమృతపాణి గారిని కొన్ని రోజులు, శ్రీమతి సామాన్య కిరణ్ ని కొన్ని రోజులు , సుధాకర్ బాబు ని కొన్ని రోజులు ఇలా వారికి ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ దళిత నాయకుల మనోబావాలు దెబ్బతీస్తున్నారు. అదే విధంగా కొండపి నియోజక వర్గంలో వరికూటి అశోక్ బాబు గారిని గత నాలుగు సంవత్సరాల నుండి పార్టీ అవసరాల కోసం వాడు కుని నేడు అతనిని కాదు అని వై సి పి ని వెన్నుపోటు పొడిచి తెలుగు దేశం పార్టీ లోకి వెళ్లిన పోతల రామారావు చెప్పిన అభ్యర్ధికి టికెట్ ఇస్తాం అంటూ ప్రచారం జరుగుతుంది. వరికూటి అశోక్ బాబు గారి ని ఇంచార్జ్ గా తప్పుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం కోరింది. ఈ మోసాన్ని తట్టుకోలేని వరికూటి అశోక్ బాబు గారు వైఎస్సార్ పార్టీ జిల్లా కార్యలయం ఒంగోలు లో నిరాహారదీక్షకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అలాగే కనిగిరి లో గతంలో ఓడిపోయిన బుర్రా మధుసుధన్ ని కాదు అని రెడ్డి సామజిక వర్గ వ్యక్తి కి టికెట్ ఇస్తారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే కందుకూరు లో తూమాటి మాధవ రావు అనే యాదవ సామజిక అబ్యర్ధి ని కాదు అని అక్కడ కూడా ఇప్పటి వరకూ పార్టీ లో లేని రెడ్డి సామజిక అభ్యర్థి కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
వరికూటి అశోక్ బాబు గారు కానీ లేదా బుర్ర మదుసూధన్ , తూమాటి మాధవ రావు లు గత నాలుగు సంవత్సరాల నుండి పార్టీ క్యాడర్ ని కాపాడుతూ, పార్టీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటున్నవారే. పార్టీని నమ్మి కోట్ల రూపాయిలు ఖర్చు చేసుకున్న వీరిని మోసం చెయ్యడం పార్టీ అనైతిక కు చిహ్నం. 
 
వంచనకు గురైన వరికూటి అశోక్ బాబు గారి విషయంలో మొదట నుండి వై వి సుబ్బారెడ్డి తమ సామజిక వర్గం సెకండ్ కేటగిరీ నాయకుల చేత ఇబ్బందులు పెడుతూ వరికూటి అశోక్ బాబు గారికి అడ్డుతగులుతూ వస్తున్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరి  కొందరు కొందరు కూడా అడ్డుపడుతున్నారు. వరికూటి అశోక్ బాబు గారు కొండపి నియోజక వర్గం అభ్యర్థి అయితే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేయరు అని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై వి సుబ్బా రెడ్డి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతటి దౌర్బగ్యమైన స్థితిలో జిల్లా లో పార్టీని నడుపుతున్న బాలినేని శ్రీనివాస రెడ్డి , వై వి సుబ్బారెడ్డి ల ద్వయం 2019 లో కూడా పార్టీ మెజారిటీ స్థానాలను మళ్ళీ తెలుగు దేశానికీ వదులుకోవాల్సిందే. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకూ ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గం లో ఈసారి సునాయాసంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
వైఎస్సార్ సి పి ప్రకాశం జిల్లా లో నేటికీ దళిత వర్గాలకి పార్టీ పరంగా సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా, నియోజక వర్గంలో పనిచేసుకున్న అభ్యర్థి లను గందరగోళం పరుస్తూ దళిత వర్గాలను వంచించటం సరైన విధానం కాదని దళిత వర్గాలు వైఎస్సార్ సి పి పై ఆగ్రహంగా ఉన్నారు.  వైఎస్సార్ సి పి అధినాయకత్వం ఈ పరిణామాలు మార్చుకోకపోతే జిల్లా లో పార్టీ ఎదురు దెబ్బ తినకు తప్పదు. ఒక వైపు బి సి సామాజిక వర్గం, ఇంకొక వైపు దళితులు పార్టీని ఓడిస్తారు. 
 
దళితులు రాజకీయంగా  స్వతంత్రంగా ఎదగాలన్న దళిత సామాజిక వర్గాల ఆలోచనలు ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సిపి కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినా ఆచ్చర్యపడక్కర్లేదు
 
దేశ వ్యాప్తంగా దళితుల మీద ఎక్కువ దాడులు చేసిన రాష్ట్రాలలో ఐదవ స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని పాలిస్తున్న అధికార తెలుగు దేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహంగా వున్నా దళిత వర్గాలు సొంత రాజకీయా పార్టీ లను బలోపేతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. 
 
ప్రకాశం జిల్లా లో జరుగుతున్న పరిణామాలు ముందు ముందు ఫ్యూడల్ కుల పార్టీలకు తగిన బుద్ది చెప్పే అవకాశం ఉంది. అలాగే వరికూటి అశోక్ బాబు గారు లాంటి   దళితులు తమ సొంత దళిత  పార్టీ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.    
(Visited 393 times, 1 visits today)
Also read  కుల వ్యవస్థ - కమ్యూనిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!