దళితులను వంచించిన BJP ప్రభుత్వం!

షేర్ చెయ్యండి
  • 72
    Shares
  • బారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. బారతీయులందరికీ ఒక ఓటు – ఒకే విలువ కల్పించింది రాజ్యాంగం. ఎన్నికల సమయంలో ఓటర్లు తమ కులం వ్యక్తికె ఎక్కువగా ఓటు వేస్తారు. ఎన్నికల ప్రచారములో తమ యొక్క కుల , మతానికి సంబంధించిన గుర్తులను ఏదో ఒకరూపంలో ప్రదర్శిస్తూ ప్రచారం చేసుకోవడం ఆనవాయితీ. 
 
అయితే 2014లో ఒక పెద్ద మార్పు కనిపించింది. అదేమిటంటే ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన కాకుండా నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ అభివృద్ధి, ఉద్యోగాలు, నల్లధనం  అంటూ ఉదార గొట్టే ప్రచారం తో నరేంద్ర మోడీ కి దళిత సామాజిక వర్గం నుండి అత్యధిక ఓట్లు వచ్చేయి. RSS తో విడదీయలేని అనుబంధం ఉన్న పార్టీ BJP కి దళితుల ఓట్లు రావడం విశ్లేషకులను సైతం ఆచ్చర్య పరిచింది.  
 
బ్రాహ్మణ -బనియా పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీ (BJP ) గత ముప్పై సంవత్సరాలలో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీ వచ్చింది అంటే దానికి కారణం దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుండి BJP కి మారడం వలెనే జరిగింది. సహజంగా దళితులు BJP లాంటి హిందు మతతత్వ పార్టీ కి ఆమడదూరం లో ఉంటారు. కానీ 2014 లో దళితులు బా జ పా కి ఓటు వేసేరు. 
 
కేద్రంలో BJP నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 5 వ సంవత్సరంలోకి ప్రవేశించింది. కానీ మోడీ ప్రభుత్వం మీద దళితుల నిరసన రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పక తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ దళితుల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పక తప్పదు. ఇంకో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. దేశంలో అతి పెద్ద జనాభా అయిన దళితుల విశ్వాసం చూరగొనడంలో BJP పూర్తిగా విఫలం చెందింది. 2014లో వచ్చిన దళితుల ఓట్ల శాతం 2019 లో భాజపా కి ఎట్టి పరిస్థితిలో రాదు. 
 
ఈ ఏడాది మొదటి రోజే BJP పార్టీ కి మరియు దాని మాతృ సంస్థ అయిన RSS కి  వ్యతిరేకంగా మహారాష్ట్రలో దళితులు రోడ్ల మీదకు భారీయెత్తున వచ్చి ప్రదర్సన చేసేరు. ముంబయి నగరాన్ని బందు చేసేరు. అలాగే ఏప్రిల్ నెలలో ఎస్సి , ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిరుపయోగం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా బందు నిర్వహించెరు. ఈ కార్యక్రమంలో 11 మంది దళితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లో  RSS కార్యకర్తలే దళితుల మీద రాళ్ళ దాడి మరియు కాల్చి చంపడం జరిగింది. 
 
రాజకీయ విశ్లేషకుల ప్రకారం SC /  ST POA Act ని తూట్లు పొడిచే విధంగా సుప్రీం కోర్టు తీర్పు కి వ్యతిరేకంగా జరిగిన నిరసన దేశ వ్యాప్తంగా దళితులకు BJP ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని తెలియజేస్తుంది. BJP ప్రభుత్వం కుల వివక్షతను , దళిత వర్గాల మీద దాడులను ప్రోత్సహిస్తుందని దళితులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, నరేంద్ర మోడీ మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. మోడీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, అవినీతి తగ్గుతుందని. కానీ అవి ఏమీ లేకుండా మోడీ నాలుగేళ్లుగా పాలిస్తూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో కొత్త ట్రెండ్ ఏంటంటే, ప్రతి కులం వారి యొక్క సొంత కుల ప్రయోజనాల కోసమే పోరాడుతుంది. 
 
చదువుకున్న దళిత వర్గాలు, మేధావులు నరేంద్ర మోడీ మీద ప్రబుత్వం మీద రోహిత్ వేముల సంఘటన నుండి ఆగ్రహంతో ఉన్నారు. అలాగే రిజర్వేషన్ పాలసీని తూట్లు పొడుస్తూ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. యూనివర్సిటీ అధ్యాపకుల మరియు ప్రొఫెసర్స్ ఉద్యోగాలను తగ్గించి వేసింది. దళితులు ఎవరైనా జంతు చర్మ వ్యాపారం చేస్తున్న వారి మీద గో రక్షక దళం పేరుతొ దాడులు చేస్తూ చంపేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుండి లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన చర్యలు లేకపోవడం దళితుల ఆగ్రహానికి మరొక కారణం. గుజరాత్లోని ఉన సంఘటన దేశ వ్యాప్తంగా BJP ప్రభుత్వం మీద దళితులు నిరసన ప్రకటించిన సంఘటన మరిచిపోకూడదు. 
 
అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వాన్ని సొంతం చేసుకుంటున్నాయి. మా ప్రభుత్వం గా చెప్పుకుంటున్నాయి. బడుగు, బలహీన వర్గాలు బీజేపీ ప్రభుత్వం తమని మోసం చేసేయి అని అనుకుంటున్నారు. 
 
బీజేపీ దళిత ప్రజా ప్రతినిధులు కూడా దళితుల మీద జరుగుతున్న పరిణామాలు కలవర పెడుతున్నాయి. పార్టీ లో చర్చకు తెర తీస్తున్నారు. సీనియర్ దళిత నాయకుడు బీజేపీ అనుబంధ సభ్యుడు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ లాంటి వారు ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. దళితుల ఆగ్రహం “లావా లాంటిది, అది లోలోన ఉడుకుతుంది. ఎప్పటికైనా పేలాల్సింది” అంటున్నారు. 
 
తమ పార్టీ పై పెరుగుతున్న దళిత వ్యతిరేకతని సానుకూలంగా మలుచుకోవడానికి నరేంద్ర మోడీ, మరియు బీజేపీ తమ నాయకులకు దళితుల తో సహపంక్తి బోజనాలు చెయ్యవలసింది గా ఆదేశించేరు. చిత్త శుద్ధిలేని ఈ కార్యక్రమం కూడా ఆబాసుపాలు అవడంతో బీజేపీ నేడు దిక్కుతోచని స్థితిలో ఉంది. 
 
 
మోడీ ఈ మధ్య నవభారత నిర్మాత డా బాబాసాహెబ్ అంబేడ్కర్ మంత్రం జపిస్తూ ఉన్నాడు. దళితోద్ధారణ కి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మంత్రం జపిస్తే చాలదు. దళితుల పట్ల తీవ్రమైన ద్వేషం, వివక్ష చూపిస్తూ బాబాసాహెబ్ మంత్రం చదువుతాము అంటే నమ్మే స్థితిలో దళితులు లేరు. రాష్ట్రపతి పట్ల BJP నాయకులు ప్రదర్శిస్తున్న తీరు దళిత వర్గాల్లో అసంతృప్తికి పెరగటానికి మరొక కారణం గా చెప్పవచ్చు. 
 
బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ హిందువుల రూల్ బుక్ “మనుస్మృతి” తగలబెట్టి దాదాపుగా 90 సంవత్సరాలు పైగా అయ్యింది. కానీ నేడు BJP ప్రభుత్వం అదే మనుస్మృతి ఆధారంగా సమాజాన్ని పాలిస్తుంది. కాబట్టి పేద వర్గాలకు మోడీ ప్రభుత్వం మీద ఉన్న ఆశలు ఆవిరైపోయింది. 2019 లో జరిగే ఎన్నికల్లో దళితులు, దళితేతర హిందువుల మధ్యనే జరుగుతుంది. BJP  మళ్ళీ అధికారం వస్తే రాజ్యాంగ పరంగా దళితులకు ఉన్న ప్రత్యేక సౌకర్యాలు తీసివేసే ప్రమాదం ఉంది. అసలు రాజ్యాంగాన్నే మార్చే ప్రయత్నంలో BJP ఉంది. ఇప్పటికే దళితుల హక్కులు అన్నివైపుల నుండి నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం ముందు, ముందు దళితులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసే పరిస్థితి ఉంది. అందుకే 2019 ఎన్నికలు దళితులకు = దళితేతర అతివాద  హిందు వర్గాల మధ్య నే జరుగుతుంది. 
 
(Visited 109 times, 1 visits today)
Also read  ఫైల్యూర్ ఆఫ్ ఇండియన్ మెరిట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!