దళితులపై దాడుల్లో ముద్దాయిలు ఎవరు?

షేర్ చెయ్యండి
  • 1
    Share

గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో ఆగుస్ట్ 6, 1991 లో జరిగిన దళితుల (మాల సామాజిక వర్గం) 8 మందిని కిరాతకంగా హత్య చేసిన సంఘటనలో ముద్దాయిలు ఎవరు? అంటే బారతీయ సమాజం నిశబ్దంగా ఉంది. బారతీయ న్యాయ దేవత కళ్ళు మూసుకుని జీవచ్చంలా ఉంది. మరి ముద్దాయిలు ఎవరు?

సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండటానికి కారణం కులం. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉంటాము, ఏదైనా కిరాతకమైన, అమానుష సంఘటన జరిగినప్పుడు అలాంటి వారిని నడిబజారులో కాల్చి చంపాలి, లేదా రాళ్ళతో కొట్టాలి, లేదా నడి బజారులో ఉరి తీయాలి అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రతి 15 నిమషాలకు బారత దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, చుండూరు లాంటి హేయమైన సంఘటనలు జరిగేయి ఆ సంఘటనలన్నిటిలో ఉన్న ముద్దాయిలకు ఎలాంటి శిక్ష వెయ్యాలి. చుండురులో 8 మంది ని చంపిన సంఘటనలో అందరూ నిర్దోషులు అయితే మరి ముద్దాయిలు ఎవరు?

1999లో అప్పటి తెలుగు దేశం ప్రబుత్వం, ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మర్చి 21 న హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పున్నయ్య గారి నేతృత్వంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సి/ ఎస్టీ ల మీద జరుగుతున్న విపరీతమైన దాడులు గురించి సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని కమీషన్ నియమించింది. 20 సంవత్సరాల తర్వాత నేడు అదే చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముక్యమంత్రిగా ఉన్నారు. ఈ 20 సంవత్సరాల లో జస్టిస్ పున్నయ్య కమీషన్ అమలకు నోచుకుపోవడానికి కారణం ఎవరు?

చాల చురుకుగా, చొరవగా పనులు చేస్తున్నట్టు కనిపించే చంద్రబాబు నాయుడు పాలనా విధానాల గురించి సరయిన అంచనాలకు రావాలంటే  ఈ హడావిడి మన కళ్ళను కప్పెయకుండా జాగ్రతపడడం  అవసరం: మానవ హక్కుల నాయకుడు కే బాల గోపాల్

ఆనాడు చంద్రబాబు జస్టిస్ పున్నయ్య కమీషన్ నియమించిన సంధరభంగా కే బాల గోపాల్ చేసిన వాక్యాలు.  అంటే చేసేది చేస్తూనే నాకు మంచి పేరు రావాలి అని చంద్రబాబు ఆరాటం. తన సొంత జిల్లాలో కరుడుగట్టిన కుల వివక్ష తనకి తెలియంది కాదు, కానీ కమీషన్ అంటూ దళితుల సానుబుతి కోసం చేసే ప్రయత్నం. 2014లో చంద్రబాబు ప్రబుత్వం వచ్చిన నాటి నుండి దళితుల పై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత తేజం పేరిట యాత్రలు నిర్వహిస్తున చంద్రబాబు ఆనాడు తాను నియమించిన కమీషన్ రిపోర్టు దుమ్ము దులిపి దళితుల ఫై ప్రేమ చూపించ వచ్చు కదా!

Also read  Dalit political empowerment in Andhra pradesh-Telanganga

బారత దేశంలో దళితుల ఫై దాడులకు ప్రధాన బాద్యత రాజకీయ నాయకులదే, వారి తాబేదారులే గ్రామాల్లో ఎస్సి / ఎస్టీల మీద దాడులు చేసిన వారికి అండగా ఉంటున్నారు. కాబట్టి దళితులపై దాడులలో మొదట ముద్దాయి రాజకీయ నాయకుడినే ప్రకటించాలి. ఈ రాజకీయ ముద్దాయి ఒక పార్టీ వ్యక్తులు కాదు, అన్నీ రాజకీయ పార్టీల లో ఉన్నారు. కమ్యునిస్ట్ లలో కూడా ఉన్నారు.  రాజకీయ అండ చూసుకునే దళితుల మీద దాడికి పాల్పడుతున్నారు.

ఎస్సి / ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 లో సెక్షన్ 17 ప్రకారం దళితులపై దాడి చేస్తాము అని బెదిరించిన, లేదా దాడి చేయ్యబోతారు అని అనుమానించిన సదరు వ్యక్తులను డిఎస్పీ స్తాయి పోలీసు ఆఫీసర్ వారిని ముందే అరెస్ట్ చేసే అవకాసం ఉంది. అలాగే ఏదైనా ప్రాంతంలో దళితుల పై దాడులు జరగబోతున్నాయి అని తెలిసిన , లేదా సమస్యాత్మక ప్రాంతం అయినా పోలీసులు ముందస్తు గా చర్యలు చేపట్టవచ్చు.

దళిత , గిరిజనుల మీద దాడులు లేదా అంటారనితనం అరికట్టడానికి ఎస్సి/ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం లో కటినమైన, పకడ్బందీ చట్టాలు ఉన్నా నిత్యం దాడులు లేదా వెలివేత జరగటానికి కారణం రాజకీయ నాయకులే.  పచ్చమ గోదావరి జిల్లా  గరగపర్రు లో 400 మంది దళిత కుటుంబాలను దాదపుగా ౩ నెలలు వెలివేసిన సంఘటనలో ప్రదాన ముద్దాయి తెలుదేశం పార్టీ నాయకుడు ఇందుకూరి బలరామ కృష్ణ రాజు, అలాగే ప్రకాశం జిల్లా దేవరపల్లి దళితుల భూమిని బలవంతంగా అక్రమించుకోవాలి అని చూసిన పెత్తందారులకు నాయకత్వం వహించింది స్తానిక తెలుగు దేశం శాసన సబ్యుడు ఏల్చూరి సాంబశివరావు, విశాఖ జిలా పెందుర్తి లో ఒక ఎస్సి మహిళను వివస్త్రను చేసి దాడి కి పాల్పడిన వ్యక్తులు స్తానిక తెలుగుదేశం శాసన సబ్యుడి అనుచరులు అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో దళితుల మీద దాడి చేసిన వ్యక్తులకు అండ దండ స్తానిక తెలుగు దేశం శాసన సబ్యుడు, ఒంగోలు మండలం పెళ్లూరు గ్రామంలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను కాపాడింది స్తానిక తెలుగు దేశం శాసన సబ్యుడు. మందని లో మధుకర్ హత్య పై స్తానిక శాసన సభ్యుడి ప్రమేయం ఉన్నట్లు దళిత సంఘాలు పేర్కొన్నాయి. ఇలా లెక్కలు వేసుకుంటూ పొతే దళిత , ఆదివాసీల పై కులం పేరుతొ జరుగుతున్న అమానుష దాడి వెనకాల రాజకీయ నాయకులదే ప్రదాన పాత్ర.

Also read  కశ్మీర్: కశ్మీర్ ఏర్పాటు వాదానికి కారణం మతమా? రాజకీయమా?

కుల వివక్ష పోవాలి అంటే ప్రబుత్వం చాలా ఉన్నతంగా ఉండాలి, నిజాయితీ ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీ దళిత , గిర్జనుల ఫై న దాడులను ఖండిస్తుంది, అలాగే అంటరానితనం నిర్మూలించాలి, కులం పోవాలి అని చెబుతాయి. కానీ చిత్తశుద్ది లేదు. చిత్తశుద్ది లేని ప్రబుత్వాలు ఎన్ని కమీషన్లు వేసినా బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే, అది నిరుపయోగం.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ అయినా, బంగారు తెలంగాణ అయినా లేదా నేటి అమరావతి అయినా పాలకులు టెక్నాలజీ ఉపయోగించుకుని పేరు ప్రఖ్యాతల కోసమే కానీ సమజంలో జరుగుతున్న రుగ్మతలను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

దేశం మొత్తం పరిశీలన చేస్తే ఒక వారంలో దాదాపు 13 మంది దళితులను కుల వివక్ష కారణంగా చంపబడుతున్నారు, 5 దళితుల ఇల్లు తగల బెడుతున్నారు, 6 గురు కిడ్నాప్ చేయబడుతున్నారు మరియు 21 మంది దళిత మహిళలను అత్యాచారం చేస్తున్నారు.

Photo: curtacy The Indian Express NCRB report on atrocities

దళితుల చారిత్రాత్మక స్తలం భీమ కోరేగంవ్ ను 200 సంవత్సరాల మహార్ సైనికుల విజయ స్తుపాన్ని సందర్శించి వస్తున్న దళితుల పై దాడులు జరిగేయి, ఆదాడుల్లో ఒక యువకుడు చనిపోయేరు. ఆ దాడికి సూత్ర దారికి బ జ పా రాజ్య సభ అవకాసం కల్పిస్తునట్టు వార్తలు వచ్చేయి. నేషనల్ క్రీం రికార్డ్ బ్యూరో (NCRB) నివేదిక 2016 ప్రకారం దళితుల పై దాడి 5 % పెరిగింది అని తన నివేదికలో పేర్కొన్నారు.

Also read  సుప్రీం కోర్టు తీర్పు ఎస్సి,ఎస్టీ మహిళల పై దాడులను ప్రోస్తహిస్తుందా!

ఎస్సి , ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 4 ప్రకారం అత్యాచార కేసు ను రిజిస్టర్ చెయ్యకుండా, ఉద్దేశ్యపూర్వకంగా ఎంక్వయరీ ఆఫీసర్ ప్రవర్తిస్తే సదరు ఆఫీసర్ కి 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు ఇప్పటివరకూ ఈ సెక్షన్ ప్రకారం ఏ ఆఫీసర్ కి శిక్షపడిన దాఖాలాలు లేవు. మరి రోజూ నమోదు అవుతున్న అత్యాచార కేసులలో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నరసింహ రెడ్డి 56 మంది చుండూరు దళితులను హత్య చేసిన వారిని సాక్ష్యాలు లేవు అంటూ విడుదల చెయ్యడం ఏ ఆటవీక న్యాయం. వారందరూ నిర్దోషులు అయితే గొని సంచిలో మూటకట్టి తుంగబద్ర కాలవలో కుక్కినింది ఎవరు?

దేశం మొత్తం మీద 5. 3 శాతం మాత్రమె ఎస్సి / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అనుసరించి శిక్షలు పడేయి అంటే మిగతా దాడులు చేసింది ఎవరు/

గత వారం సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ డా. సుభాష్ కాశీనాద్ మహాజన్ కేసులో తీర్పు ప్రకటిస్తూ ఎస్సి/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 దుర్వినియోగం అవుతుంది అంటూ తీర్పు వెల్లడించడం హాస్యాస్పధం గా దళిత , ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నారు.

కటినమైన చట్టాలను బందు ప్రీతి, కులం , మతం దురాభిమానం తో అమలు చెయ్యకుండా దుర్వినియోగం అవుతున్నాయి అంటూ పేర్కొనడం వ్యవస్త యొక్క సచ్చీలతను అనుమానించాల్సి వస్తుంది.

(Visited 306 times, 1 visits today)

2 thoughts on “దళితులపై దాడుల్లో ముద్దాయిలు ఎవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!