దళితులు -మతం – అంబేడ్కర్!

షేర్ చెయ్యండి
 • 3
  Shares
ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లా లోని ఒక గ్రామంలో దళితులు “అంబేడ్కర్ గార్బ” పేరుతొ నవరాత్రి ఉత్సవం చెయ్యటం సంచలనం అయ్యింది. దసరా సందర్భంగా గార్భ నృత్యం చెయ్యటం గుజరాతీయుల ఆనవాయితీ, అయితే గుజరాత్ కే చెందిన దళితులకు మాత్రం ఈ గార్భ నృత్యం చెయ్యటం, చూడటం నిషేధం. హిందూ ధర్మం లో హిందువుగా ఉన్నా కులం వలన సదరు వ్యక్తులు మిగతా హిందువులతో కలసి పోలేరు. దళితులు హిందువుగా ఉన్నా వారికి ఎలాంటి మత సంభంధమైన హక్కులు లేవు. బారత దేశంలో సాంప్రదాయాలు, సంస్కృతీ హిందూ మతం సొంతం చేసుకోవడంతో గుజరాతీయులైన దళితులు వారి ప్రాంత సాంప్రదాయ నృత్యం చూడటానికి , ఆడటానికి నిషేధం.
అహ్మదాబాద్ లోని రాంపూర గ్రామం ఈసారి ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది అదే అంబేద్కర్ గార్భ. ఇదే నవరాత్రి ఉత్సవాలలో బాగంగా తెలంగాణ ప్రాంతంలో అడే “బ్రతుకమ్మ” కుడా దళితులకు నిషేధమే! తెలంగాణాలో గత కొన్ని దశాబ్దాలుగా మారుతూ వస్తున్న సామజిక ప్రబావం తో దళితులు బతుకమ్మ ను పెట్టి పూజించినా గ్రామాల్లో ప్రతి ఏటా అక్కడ అక్కడ దళితులను భూస్వామ్య కులాల పెతందారులు అడ్డుకుంటూనే ఉన్నారు.
అహ్మదాబాద్ జిల్లా రాంపుర అంబేడ్కర్ గార్భ నిర్వహుకుడు ‘కాను సుమేసేరా మంగలభాయ్’ ప్రకారం ఈ గార్భ నిర్వహించటానికి అతనికి ఐదు సంవత్సరాలు పట్టింది అంటా , గ్రామంలోని 100 దళిత కుటుంబాలు నివసిస్తుంటే అంబేడ్కర్ పేరిట గార్బ నిర్వహించటానికి ప్రజలను ఒప్పించటానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది. దళితులుగా మనకి అంబేడ్కర్ నే దేవుడు ఇంకే దేవుడు , దేవతా మనకి రక్షణ ఇవ్వలేరు కాబట్టి డా అంబేడ్కర్ నే దేవుడు గా పూజ చేద్దాం అని ప్రజలకు వివరించి చెప్పేడు. మంగల్ భాయ్ మాటలు ప్రకారం గుజరాత్ లోని దళితులకు దేవుడి మీద , దేవతల మీద చాల నమ్మకం ఉంది అంటా , వారే దళితుల అభ్యున్నతికి వరాలు ఇస్తారు అని నమ్మకం. అందుకే మంగల్ భాయ్ కి అంబేడ్కర్ పేరిట గార్భ చెయ్యటానికి అన్ని సంవత్సరాలు పట్టింది.
దళితులు తమ సాంస్కృతిక వైభవాని సవర్ణ హిందువులతో కలిసి నిర్వహించుకోవాలి అనుకుంటున్నారా లేక హిందూ మతంతోనే వారి సాంప్రదాయాలు ముడిపడి వున్నాయి అనుకుంటున్నారా? వేలాది సంవత్సరాలు గా అణిచివేయబడ్డ జాతి 21 వ శతాబ్దంలో కుడా కులం పేరుతొ వివక్షకు, వెలివేతకు గురైవుతుంటే ఇంకా హిందూ మత సంస్కృతీ వైపు అడుగులు వెయ్యాల్సిన అవసరం ఉందా? తెలంగాణా లోని బతుకమ్మ, గుజరాత్ లోని గార్బ వెంట దళితులు వెళ్ళటం ఒక విధంగా మత ఆత్మనూన్యాతే అనుకోవాలి. లేకుంటే ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ మళ్ళీ అదే ఆచారం , సంప్రదాయంలోకి వెళ్తున్నాము అంటే మనం వాటిని చాలా ఇస్టపడుతున్నట్టు లేదా ఎక్కువ జనాబా చేస్తున్నారు కాబట్టి మనమూ అందులో పాల్గొందామా అని అనుకోవచ్చు. గత ఏడాది గుజరాత్ లో గార్బ వేడుకలు చూస్తున్న ఒక దళిత యువకుడిన కొట్టి చంపిన విషయం మనకు తెలిసిన విషయమే. గుజరాత్ లో అంబేడ్కర్ గార్బ నిర్వహించటానికి ఒక కారణం చెబుతున్నాడు మంగల్ భాయ్ “ఏ దేవుడు/ దేవత  దళితులకు న్యాయం చెయ్యలేదు కాబట్టి మనకి నాయయంచేసిన దేవుడు అంబేడ్కర్ కాబట్టి అయిననే దేవుడుగా బావించి గార్భ ఎందుకు చెయ్యకూడదు అనే ఆలోచనలతోనే తన ప్రయత్నం మొదలెట్టేడు. ఇటీవల గుజరాత్ లో వరసగా దళితుల మీద జరుగుతున్న దాడులు నుండి ప్రజలను చైతన్య పరచటానికి అంబేడ్కర్ గార్భ ఉపయోగ పడింది అంటాడు 38 సంవత్సరాల మంగల్ భాయ్.
అంబేడ్కర్ బోదనలు చైతన్య పరుస్తుంది అందుకే ఇతర దేవుళ్ళను మొక్కే కంటే అంబేడ్కర్ నే మొక్కుదాం మన వెతలు తోలుగుతాయి అంటాడు మంగల్ బాయ్. మంగల్ భాయ్ పూల అలంకరణ వ్యాపారంలో ఉన్నాడు.
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని తెలుసుకున్న మంగల్ భాయ్ లాంటి వారు చాలామందే దళిత సమాజంలో ఉన్నారు కానీ వారికి బాబాసాహెబ్ తమ ప్రజలకి ఇచ్చిన సందేశం పూర్తిగా చేరలేదు. 
“నిమ్న జాతుల అనర్ధాలన్నిటికీ హిందూ మతమే కారణం. వ్యవస్థ లేనిదే హిందూ మతం లేదు. నిమ్నజాతులు హిందూ మతంలో ఉన్నంత వరకూ అంటరానివారు అని ఒప్పుకోవాలి , పంచముడు అని ఒపుకోవాలి. నిమ్నజాతులు పంచముడు గా వున్నంతకాలం సాంఘిక , రాజకీయ , ఆర్ధిక సమస్యలు నుండి విముక్తి రాదు”  బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు ఇచ్చిన ఈ సందేశం మంగల్ భాయ్ లాంటివారికి చేరలేదు. చేరివుంటే రాంపుర దళితులు అంబేడ్కర్ గార్బ పూజ చేసేవారు కాదు ఏమో? అలాగే తెలంగాణా లో దళితులు బతుకమ్మని పూజించే వారు కాదు.దురదృష్ట వశాత్తు నేను హిందువుగా పుట్టెను కానీ , హిందువుగా మరణించను అన్న బాబాసాహెబ్ అనుచరులుగా, పంచమ స్తానం నుండి విముక్తి కోరుకునే ప్రతి దళితుడు అయిన మార్గం అనుసరిస్తే వేలాది సంవత్సరాల అణిచివేత నుండి విముక్తి కలుగుతుంది.
ఏది ఏమైనా మంగల్ భాయ్ లాంటి చిరు వ్యాపారిలో వచ్చిన ఆలోచన గుజరాత్ దళితుల్లో ఆలోచనలు రేకెత్తించింది. హిందూ మతానికి సంబంధించిన దేవి , దేవత విగ్రాలు పక్కన బెట్టడం ఒక మంచి చూచన.
సంవత్సరానికి ౩-4 లక్షల రూపాయిలు సంపాదించే మంగల్ భాయ్ లాంటివారు నవరాత్రి గార్భ కోసం 70 వేలు ఖర్చు చేసేడు అంటే అతని ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. 
ఇపుడు మంగల్ భాయ్ బార్య ౩౩ సంవత్సరాల హంస చాల సంతోషంగా ఉంది. అంబేడ్కర్ గార్భ అంటే బయపడి , తన బర్తకి ఏమైనా అవుతుందేమో అని ఆ ఆలోచన మానుకో అని ఇచ్చిన సలహా వెనక్కి తీసుకుంటాను అంటుంది. మాకు ఇక భయం లేదు , బాద లేదు పండగ అంటే మాకు అంబేడ్కర్ నే దేవుడు. మమ్మల్ని ఇప్పుడు ఎవరూ అంటారని వారు అని గుడి నుండి బయటకు నెట్టరు. మా దేవుడు మాకున్నాడు అంటున్నది హంస.
దళిత మేధావులు తమ వర్గాలకు ఆల్టర్నేటివ్ సంస్కృతిని ఇవ్వటంలో చాల వెనకబడ్డారు. బాబాసాహెబ్ భోధనలు ప్రచారం చెయ్యటం అంతకంటే వెనకబడ్డారు. అందుకే మంగల్ భాయ్ లాంటి వారు ఆల్టర్నేటివ్ సంస్కృతిని పరిచయం చేస్తున్నారు. వారికి కావాల్సింది దేవుడు. అది అంబేడ్కర్ రూపంలో వారికి దర్శనం ఇచ్చింది.
“ఆరతి ఇస్తున్నాం అంబేడ్కర్ గారి కి ..జై జై అంబేడ్కర్ బాబా , జై, జై, జై”
(Visited 97 times, 1 visits today)
Also read  వినాయక చవితి: చిందులేస్తున్న దళిత యువత!

2 thoughts on “దళితులు -మతం – అంబేడ్కర్!

 • 21/01/2018 at 6:38 PM
  Permalink

  Anna jaibheem mee vyasam chala baga undi ee vyasalu pustakarupamlo vaathey baguntundi.

  Reply
  • 22/01/2018 at 5:25 PM
   Permalink

   Thanq Brother. Sure we will try to publish.

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!