దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

షేర్ చెయ్యండి
  • 96
    Shares

  • బాబాసాహెబ్ డా అంబేడ్కర్ 31 మే 1936, దాదర్ లో మహర్ సమ్మేళనంలో మాట్లాడుతూ మీరు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురయ్యారు అని ప్రశ్నిస్తూ దళితుల అణిచివేతకు కారణం శక్తి లేకపోవడమే అంటారు. 
మీరు కేవలం మీ శక్తి మీదనే ఆధారపడి ఉన్నంతకాలం మీరు ఈ అణిచివేతను ఎదొర్కొనలేరు. మీకు శక్తి లేకపోవడం వల్లనే మీరు అణిచివేతకు గురవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మీరు మాత్రమే అల్ప సంఖ్యాకులుగా వున్నారని నా ఉద్దేశం కాదు. ముస్లిం లు కూడా మీలాగే అల్ప సంఖ్యాకులు. మహార్లు, మాంగ్స్ ( మాల , మాదిగ )లాగే ముస్లింల ఇండ్లు కూడా గ్రామాల్లో స్వల్పంగానే ఉంటాయి. అయినా ముస్లింలను వేధించేందుకు, వారి పై నిరంకుశత్వం ప్రదర్శించేందుకు ఎవరూ సాహసం చెయ్యరు. ఎందుకని? ఊళ్ళో కేవలం రెండే ముస్లింల ఇండ్లున్నా వారికి హాని కలిగించే సాహసం ఎవరూ చెయ్యరు. కానీ పది ఇండ్లున్నా సరే మిమ్మల్ని మాత్రం దారుణంగా వేధిస్తారు. ఎందుకిలా జరుగుతుంది.? ఇదొక శాశ్విత ప్రశ్న. దీనికి మీరు తగిన సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. 
 
నా ఉద్దేశ్యంలో ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం వుంది. అదేమిటంటే ఊళ్ళో ముస్లిం ల ఇండ్లు రెండు ఉన్నా వాటి వెనక బారత దేశంలోని మొత్తం ముస్లిం ల  జనాభా శక్తి ఉందన్న విషయాన్ని హిందువులు గ్రహించెరు. అందుకే వాళ్ళ జోలికి వెళ్లే సాహాసం చెయ్యరు. అదేవిధంగా ఆ రెండు ముస్లిం  కుటుంబాలు కూడా స్వేచ్ఛ గా నిర్భయంగా జీవించగలుగుతాయి. ఏ హిందువు  మా   మీద దాడి చేస్తే పంజాబ్ మొదలుకుని ఇటు మద్రాస్ వరకు ఉన్న మొత్తం ముస్లింలంతా తమ రక్షణ కి నడుంబిగిస్తారనీ, దేనికైనా తెగిస్తారని వాళ్ళ భరోసా. మరి  మీ విషయానికి వస్తే, మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ముందుకు రారు ఆర్ధిక సహాయం మీకందదనీ, ఏమి చేసినా ఏ అధికారీ మీ పక్షం వహించరని హిందువులకు బాగా తెలుసు. తాహిసీల్దార్లు, పోలీసు అధికారులు అంతా అగ్రవర్ణ హిందువులకు చెందిన వాళ్ళే. హిందువులకు – అంటరాని వాళ్లకు మధ్య గొడవలు హిందువులు మీకు మాత్రమే అన్యాయం చేస్తూ, మీ పట్ల మాత్రమే అంత అన్యాయం చేస్తూ,  మీ పట్ల మాత్రమే అంత నిరంకుశంగా ఎందుకు ఉంటున్నారు అంటే మీరు నిస్సహాయులు కాబట్టి. ఈ చర్చ వలన మీకు రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి ఒకటి- మీరు మీ శక్తిని  కూడగట్టుకోకుండా ఈ నిరంకుశత్వాన్ని ఎదిరించలేరు. రెండు మీ వద్ద ఈ నిరంకుశత్వాన్ని ఎదిరించే శక్తి లేదు. ఇవి రెండూ రుజువైన తర్వాత వెంటనే మూడో ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే, ఈ నిరంకుశత్వాన్ని ఎదిరించగలిగిన శక్తిని మనం బయట నుంచైనా సమీకరించుకోవాలి అని, ఆ శక్తిని మీరు ఎలా పొందగలుగుతారు? అనేది అసలైన ప్రశ్న? దీని గురించి మీరంతా స్థిర చిత్తంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.   
 
మన దేశంలో కులతత్వం, మతోన్మాదం ప్రజల మనసుల మీద, నైతిక ప్రవర్తన మీద చాలా చిత్రమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని నాకనిపిస్తుంది. ప్రజల పేదరికం గురించి గానీ, వారి కష్టాల గురించికానీ ఈ దేశంలో ఎవరూ బాధపడుతున్నట్లు నాకనిపించడం లేదు. ఒకవేళ ఎవరికైనా ఏ కొంచం బాధ ఉన్నా ఆ వ్యక్తి నిర్ములను కనీసం ప్రయత్నం కూడా చెయ్యడు. బీదరికంతో మగ్గుతున్న వాళ్లకి, తీవ్రమైన కష్టాల్లో ఉన్న వాళ్ళకి కొందరు సాయపడేందుకు ముందుకు వస్తుండవొచ్చు – కానీ ఇది కేవలం ఆయా కులాల పరిధిలోనో , మతం పరిధిలోనో జరుగుతుంది. ఇదొక పక్షపాత ధోరణితో కూడిన నైతికత అయినప్పటికీ ఈ దేశంలో అదే కొనసాగుతుంది. 
 
గ్రామాల్లో అగ్రవర్ణాల వారి చేతుల్లో అంటరాని వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. అంటే అగ్రకుల వాళ్ళు అంటరాని వాళ్ళ పట్ల అన్యాయం అన్న సంగతిని ఇతర మతాల వాళ్ళు గుర్తించలేదని కాదు, తెలిసినా కూడా అంటరానివాళ్లకు సహాయ పడేందుకు వాళ్ళు ముందుకు రారు. దీని వెనక ఉన్న కారణమేంటి? మాకు సహాయం చేసేందుకు మీరు ఎందుకు ముందుకు రారు అని వాళ్ళను అడిగితే వాళ్లేమంటారో తెలుసా? మీ అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోలేము , అదే మీరు మా మతం వాళ్ళు అయితే తప్పక సాయం చేసేవాళ్ళం అంటారు. 
 
దీనివలన మీకు ఒక విషయం అర్ధమైఉంటుంది. మీరు మరో ఇతర సమాజంతో సంబంధం పెట్టుకోకుండా మీరు మరో ఇతర మతంలో చేరకుండా ఆ సమాజపు శక్తిని మీరు పొందటం సాధ్యం కాదు. మీరు ఈ విధంగా శక్తిని కూడ దీసుకోలేనంత కాలం మీరూ, మీ బావి తరాలు ఇదే దయనీయమైన పరిస్థితిలో బతకవలిసి ఉంటుంది. 
 
బాబాసాహెబ్ డా అంబెడ్కర్ ప్రసంగం ‘దాస్య విముక్తి కోసం మతమార్పిడి’ 
 
కాబట్టి దళితులు హిందు మతం వీడి బాబాసాహెబ్ మార్గాన ‘నవయాన బుద్ధిజం’ లోకి మారినప్పుడే తమకి శక్తి వస్తుంది అని గ్రహించాలి. హిందువులు గా , క్రిస్టియన్స్ గా , బుద్దిస్ట్ లు గా ఇలా విడి విడి గా ఉంటే బలహీనులం అవుతాము అన్న సత్యాన్ని దళితులు  గ్రహించాలి. 
 
ఈ నెల, మే 24 న ప్రకాశం జిల్లా టంగుటూరు లో జరిగే బౌద్ధ సమ్మేళనం లో పాల్గొని బౌద్ధ మతం లోకి మారుతున్నవేలాది ప్రజల్లో మీరు ఒకరు కావాలని ఆశిస్తూ !
 
కృతఙ్ఞతలు:  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 
 
 
(Visited 264 times, 1 visits today)
Also read  ధీరవనిత ఝాల్కారీ భాయ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!