ఆర్పీఐ నుండి బీఎస్పీ వరకూ, దళిత మహాసభ నుండి దండోరా, మాలా మహానాడు వరకూ  వెన్ను పోటుకు గురైన దళిత సమాజం. 

షేర్ చెయ్యండి
  • 42
    Shares
 
 
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించడం ప్రారంభించింది. కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం లో దళితులను కూడా చేర్చుకున్నారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కృషి వలన కానీ లేదా దళితులు జనాభాపరంగా  దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉండటం వలన కానీ లేదా పూనా ఒడంబడికలో భాగంగా దళితులకు కల్పించిన రాజకీయ రిప్రెజెంటేషన్స్ వలన కాంగ్రెస్ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలలో దళితులను బాగస్వామ్యం చేసింది. 
Dalit movement
Dalit movement in Andhra Pradesh. Image Curtacy: Syamsysunder. Unnamati
 
నెహ్రు మొదటి మంత్రి వర్గంలో బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారు కూడా చేరేరు. కానీ బుద్ధిజం తీసుకున్న కొన్ని రోజుల్లో నే  అంటే 1956 డిసెంబర్ లో చనిపోవడం మనకి తెలిసిందే. బాబాసాహెబ్ బుద్ధిజం తీసుకోవడమే కాకుండా దళితుల కోసం, దళిత వాయిస్ ని వినిపించటానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( RPI ) ని స్థాపించేరు. 
 
దురదృష్టవశాత్తు బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ దళిత ప్రయోజనాల కొరకు కాకుండా వ్యక్తుల కొరకు అన్నట్టు గా ముక్కలు చెక్కలై దళిత చెంచాల చేతిలో పావుగా మారింది. దళితుల ప్రయోజనాలు గాలికి వదిలేసి వ్యక్తుల ప్రాభల్యం కోసం అనేక గ్రూపులుగా విడగొట్టబడింది. 
 
దళితుల ఐక్యత అనేది ఒక నినాదం మాత్రమే దీనిమీద ఏ దళిత నాయకుడికీ పెద్దగా ఆశక్తి లేదు. నిజం చెప్పాలంటే దళితుల ఐక్యత దళిత ప్రజల చేతుల్లోకానీ, లేదా దళిత నాయకుల చేతుల్లోకానీ లేదు. అది ఆధిపత్య కులాల రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. వాళ్ళే నిర్ణయిస్తారు, దళితులు ఎప్పుడు ఐక్యం కావాలో , ఎప్పుడు కాకూడదో , అసలు ఐక్యం కాకుండా విడి విడిగా ఉంటూ కొట్టుకుంటూ ఉండాలా? ఇదంతా నిర్ణయించేది ఆధిపత్య కులమే దళిత నాయకత్వం తోలుబొమ్మలు లేదా కీలు బొమ్మలు మాత్రమే?
 
దళిత రాజకీయ నాయకులు కీలు బొమ్మలేనా?
 
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ మాతృ సంస్ఠ ఆ సంస్థ పేరుని సొంతం చేసుకున్న ఒక గ్రూప్ నాయకుడు , ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రాందాస్ అతవాలె దగ్గర నుండి నేటి మన సమకాలిని రాజకీయ నాయకులు , పార్టీల వరకూ చుస్తే అందరూ పెత్తందారీ పార్టీల కు అనుబంధంగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రాభల్యం కోసం ప్రాకులాడిన వ్యక్తులే. రాందాస్ అథవాలే మొదట శరద్ పవార్ రాష్ట్ర  మంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా అయ్యేరు, నేడు భాజపా కేంద్ర మంత్రి వర్గంలో  మంత్రి అయ్యేడు. 
 
బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారి మాతృ సంస్థను అడ్డం పెట్టుకుని పూర్వం  నుండి కాంగ్రెస్ కి మద్దత్తు ఇస్తూ దళితులను సొంత రాజకీయ ప్రయోజనాల దిశగా ఆలోచించకుండా తన వ్యక్తిగత ప్రయోజనాలకే అయన RPI ని వాడుకున్నారు. అక్టోబర్ 3, 1957 నుండి కార్యకలాపాలు సాగించిన RPI నేడు 50 గ్రూపులు గా విడిపోయిందంటే నమ్మశక్యం కాదు. 2009 లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ( యునైటెడ్ ) గా  RPI ప్రధాన గ్రూపులు కలిసినా 2014 కు వచ్చేసరికి విడిపోవడం జరిగింది. 
 
దళిత రాజకీయ నాయకత్వం లేదా పార్టీ లు ఎప్పుడైతే పెత్తందారీ కుల పార్టీల పంచన చేరుతారో అప్పుడు దళిత పార్టీలు పతనం కాకతప్పదు లేదా కీలు బొమ్మలు గా మారిపోవడం జరుగుతుంది. 
 
దళితులకు బహుజన రాజకీయం ఒక కొత్త వరవడిని నిర్మించిందా ?
 
మాన్యశ్రీ కాన్షిరాం గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ లో  దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేసేరు. ఆయన డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గాని అధ్యయనం చేయటానికి మహారాష్ట్ర వచ్చి దళిత సంఘాలతో మమేకమై బాబాసాహెబ్ నిర్మించిన సంస్థల్లో పనిచేసి ఆ సంఘాలు , పొలిటికల్ పార్టీలు దిగజారిపోవడం గమనించి వాటి నుండి బయటకు వచ్చి సొంతగా బహుజన్ సమాజ్ పార్టీ ని నిర్మించడం జరిగింది. 
 
బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ గారు కుల నిర్ములనా కోరుకుంటే మాన్యశ్రీ కాన్షిరాం గారు జనాభా లో ఉన్న 85 %  చెందిన కులాలను సమీకరించి రాజ్యాధికారం ద్వారా కుల నిర్ములనా చెయ్యాలని బహుజన సమాజ్ పేరిట రాజకీయ పార్టీ స్థాపించి ఉత్తర ప్రదేశ్ కి దేశంలో మొట్ట మొదటి దళితుల సొంత కాళ్ళ మీద ఒక మహిళను ముఖ్యమంత్రి చెయ్యగలిగేడు. 
 
దేశ వ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించిన బీఎస్పీ నేడు నాయకుల వైఫల్యం , సిద్ధాంత లోపంతో తిరోగమనంలో ఉంది అని చెప్పక తప్పదు. ప్రజల్లో గుర్తింపు ఉన్నా పార్టీ కేంద్ర నాయకత్వం మాన్యశ్రీ కాన్షిరాం తర్వాత చిన్నగా బీటలు వాడుతూ నేడు జాతీయ స్థాయిని కోల్పోయే ప్రమాదంలో ఉంది. 
 
1950 నుండి – 1990 దశకం వచ్చేటప్పటికీ దళిత వర్గాల్లో విద్యాధికుల శాతం ఎక్కువ కావడం, ఉద్యోగులు గా దళితులు స్థిరపడటం తో  దళితుల్లో వచ్చిన మార్పులు నాయకత్వం అందిపుచ్చుకోవడంలో విఫలం చెందింది. సమాజం లో 50 % ఉన్న బి సి లు 25 % ఉన్న దళితులు , ఇతర మైనారిటీ లతో కలిసి రాజ్యాధికారం ని సులువు చేసిన మాన్యశ్రీ కాన్షిరాం గారు. బెహన్ జీ మాయావతి గారు మాన్యశ్రీ కాన్షిరాం గారి యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకు వెళ్లడం లో పూర్తిగా విఫలం చెందేరు. 
 
బీఎస్పీ అటు బహుజనులను, ఇటు దళితులను సమీకరించలేక పోవడం వలన నేడు దళిత రాజ్యాధికారం కోసం ఇంటికో పార్టీ పుట్టుకొస్తుంది. 
 
కుల సంఘాలు చెంచాగిరికి కేరాఫ్ అడ్రస్? 
 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా దళితులకు మార్గదర్శకం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాజకీయ పార్టీ గా అవతరించలేక పోవడం, బీఎస్పీ ని సొంతం చేసుకోవడం లో విఫలం చెందటం ఇదే అదునుగా కాచుకుకూర్చున్న ఆధిపత్య కులాలు దళితులను ఏకంకాకుండా వారి మధ్య శాస్వితంగా అడ్డ గీత గీసేరు. 
 
“దళితులే దళితులపై యుద్ధం మొదలెట్టేరు. దానిని నడిపింది ఆధిపత్య కులాల బావజాలం. మాదిగ దండోరా గా , మాల మహానాడు గా! ఏ దైతేనేమి నేడు రెండు గ్రూపులు వారి ప్రతినిధులు నేడు పెత్తందారీ కులాల పార్టీల పల్లకి మోస్తున్నారు.” 
 
రోహిత్ వేముల , గరగపర్రు, ఆగిరిపల్లి , మంథని , బాగపట్నం, రాపూరు, గొట్టిపాడు ఇలా ఒకటేమిటి దళితులపై దాడులు జరుగుతున్నా దళిత ప్రజా సంఘాలు  మాట్లాడలేకపోయారు / మాట్లాడలేక పోతున్నారు. 
 
దళితుల మధ్య పెల్లుబుకుతున్న నిరసన 
 
దళిత నాయకత్వం వారి సమాజానికి  సరైన దశ – దిశ కల్పించ లేకపోవడం, కుల ప్రయోజనాలు గాలికి వదిలి కులాన్ని అడ్డంపెట్టుకుని పదవులు పొందటం, దళితుల్లో రోజు రోజుకూ దిగజారుతున్న ఆర్ధిక, సామాజిక పరిస్థితిలో మార్పు చెయ్యకుండా వారి స్వప్రయోజనాలకు కులాన్ని అడ్డంపెట్టుకోవడం తో దళిత ప్రజలు వారిని వెన్నుపోటుకు గురైనట్లు గా భావిస్తున్నారు. 
 
దళితులు కుల సంఘం మీద రోజు రోజుకూ నమ్మకం కోల్పోతున్నారు. బాధితుడికి నష్టపరిహారమే విజయంగా బావిస్తూ అసలైన నేరానికి శిక్ష పడేటట్లు చెయ్యడంలో కులసంఘాలు పూర్తిగా విఫలం చెందేయి. 
 
కారంచేడు లో  జరిగిన అమానుషకాండ కి శిక్ష  చుండూరు లో విధించలేక పోవడం, బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోవడం తో ఆత్మనూన్యత లోకి దళిత సమాజం వెళ్తుంది, భూర్జువా పార్టీలకు తమ చైతన్యాన్ని ధారాపోస్తున్నారు. 
 
శత్రువు యొక్క ఎత్తుగడను ఊహించి ఆదిశగా దళిత సమాజాన్ని ముందుకు నడిపించలేకపొతే బాబాసాహెబ్ తన జీవితాన్ని , తన కన్న బిడ్డల జీవితాన్ని పణంగా పెట్టి దళితులకు అందించిన చైతన్యాన్ని బూడిదలో పోసినట్లే. 
 
దళితుల ఐక్యత కోసం దళితులు సాంస్కృతిక రధాన్ని నిర్మించాలి. దళితుల సాంస్కృతిక ఐక్యతను గ్రామ గ్రామానా తీసుకు వెళ్ళాలి 
 
 
 
 
 
 
 
(Visited 68 times, 1 visits today)
Also read  దేశ ప్రగతికి అడ్డు కుల రిజర్వేషన్ల లేకా స్కాంలా!..

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!