దళితులు విముక్తి పొందాలన్నా,అభివృద్ధి చెందాలన్నా మతం మార్చుకోక తప్పదు!

షేర్ చెయ్యండి
  • 206
    Shares
 
  • మత మార్పిడి గురించిన నా ఆలోచనలను తెలుసుకునేందుకె మీరంతా ఇక్కడ సమావేశమయ్యారు. అందువల్ల నేను ఈ అంశం పై సవివరంగా మాట్లాడలనుకుంటున్నాను. కొందరు తరుచుగా “మనం మతాన్ని ఎందుకు మార్చుకోవాలి”? అని ప్రశ్నిస్తున్నారు. అందుకు సమాధానం గా “మనం మతాన్ని ఎందుకు మార్చుకోకూడదు”? అని అడగలనిపిస్తుంది నాకు:బాబాసాహెబ్ డా. అంబేడ్కర్
 
దళితులు మత మార్పిడి పై తీవ్రమైన సందేహాలు నేటికీ ఉన్నాయి. అయితే అవి సరైన సమయంలో, సరైన వేదికల మీద దళిత ఉద్యమకారులు లేదా అంబేద్కరిస్టు లు దళిత ప్రజలకు కానీ లేదా దళితేతరులైన హిందువు లకు గాని చెప్పలేక పోయేరు. అంటే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఆలోచనా విధానం, వారి సిద్ధాంతం సరిగా ప్రచారం జరగలేదు. 
 
బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ తన జీవితంలో జరిగిన మూడు సంఘటనలు 17 మే 1936 లో కళ్యాణ్ అనే పట్టణం లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ చెప్పుకొచ్చేరు. ఆ సభ మత మార్పిడి గురించి బాబాసాహెబ్ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 
 
బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఇండోర్ లోని మహో లో జన్మించెను. బాబాసాసాహెబ్ నాన్న గారు ఆర్మీల సుబేదార్ గా పనిచేస్తుండటం వలన కంటోన్మెంట్ ( సైనిక నివాస ప్రాంతం ) లో నివసించే వారు. నిజానికి బాబాసాహెబ్ కి కంటోన్మెంట్ లో ఉన్నప్పుడు కుల వివక్ష గురించి అసలు తెలియదు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తల్లి బాబాసాహెబ్ 5 సంవత్సరాల అప్పుడే చనిపోయెరు. బాబాసాహెబ్ తండ్రి పెన్షన్ మీద ఆర్మ్ నుండి రిటైర్డ్ అయి మహారాష్ట్ర లోని సతారా కి మకాం మార్చేరు. సతారా జిల్లా గోరేగాంవ్ లో తీవ్ర కరువు రావడం తో ఆసమయాన కరువు పనులు (చెరువు తవ్వడం ) జరుగుతూ ఉండేవి, అక్కడ కూలీలకు డబ్బులు ఇచ్చే పనికి బాబాసాహెబ్ నాన్న గారు చేరేరు.
 
1. బాబాసాహెబ్ కి మొదటి అంటరానితనం అనుభవం సతారా లో నే జరిగింది. బాబాసాహెబ్ కి కానీ వారి అన్నలకు కానీ జుట్టు కత్తిరించటాని కి మంగలి వచ్చేవాడు కాదు. ఊరిలో ఇంతమంది మంగలి వాళ్ళు ఉన్నా మాకెందుకు జుట్టు కత్తిరించరని బాబాసాహెబ్ ఆలోచన చెయ్యడం మొదలెట్టేరు. బాబాసాహెబ్ అక్క వారిని వారి ఇంటి ముందున్న గోడ మీద కూర్చో బెట్టి తనే స్వయంగా  తల జుట్టు కత్తిరించేవారు. 
 
2. గోరేగాంవ్ లో ఉన్న బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తండ్రి వాళ్లకు తరచూ ఉత్తరాలు పంపేవారు. సెలవుల్లో బాబాసాహెబ్ , వారి తమ్ముడు మరియు అక్క కూతురు  తండ్రి ని చూడటానికి కొత్తబట్టలు బయలుదేరేరు.   ఏరోజు చేరుకుంటారో ముందుగానే ఉత్తరం రాసేరు. అయితే బాబాసాహెబ్ నాన్న కు ఉత్తరం చేరానేలేదు. వారిని రిసీవ్ చేసుకోవడానికి మనుషులను కానీ లేదా ఏదైనా బండి కానీ ఏర్పాటు చేసి ఉంటారు అనుకున్నారు. ఈ ముగ్గురు పిల్లలు స్టేషన్ లో తచ్చాడుతూ ఉండే సరికి స్టేషన్ మాస్టర్ వారిని పిలిచి అడిగేరు. వారు మహార్ కులస్తులు అని తెలిసి దూరంగా జరగమన్నారు. సాయంత్రం ఐదు చీకటి పడుతుంది ఏ బండీ తమని తీసుకు వెళ్ళటానికి రక పోయే సరికి స్టేషన్ మాస్టారు ఒక ఎద్దుల బండి అతనిని మాట్లాడి పంపేరు. ఆసమయంలో ఏ ఒక్కరూ బాబాసాహెబ్ కులం తెలుసుకుని బాడుగకు వచ్చేందుకు నిరాకరించారు. అయితే ఆ ఎద్దుల బండి వాడు ఒక కండీషన్ పెట్టేడు. బండి తను తోలను అని షరతు విధించేడు. 
 
3. బాబాసాహెబ్ కి బరోడా ఆశ్రమంలో ఉద్యోగం వచ్చింది. బాబాసాహెబ్ చదువుకోవడం వలన మరియు లండన్ లో ఉండటం వలన మంచి శరీర ఛాయా మరియు చూడటానికి పార్సీ వ్యక్తి లా ఉండే వారు. అందు చేతనే బరోడా మహారాజు కొలువు లో వుద్యోగం చేస్తూ ఒక పార్సీ గా తన పేరు మార్చుకుని పార్సీ కులస్తుల ఆశ్రమంలో చేరెడు. బరోడా మహారాజు కొలువు లో ఒక మహర్ కులస్తుడు ఉద్యోగం చేస్తున్నాడు అని తెలుసుకుని ప్రజలు బాబాసాహెబ్ ఎక్కడ ఉన్నాడో వెతికి చివరికి సత్రం వద్దకు వచ్చేరు. బాబాసాహెబ్ పట్టుకుని నువ్వు ఎవరి అని అడిగేరు, నేను హిందువు ని చెప్పేరు అయినా ప్రజలు నమ్మలేదు. బాబాసాహెబ్ వస్తువులు బయట పడేసేరు. 
 
ఈ మూడు సంఘటనలు బాబాసాహెబ్ కి అంటరాని తనం యొక్క వికృత రూపం తెలిసింది. అందుకే బాబాసాహెబ్ కళ్యాణ్ లో మాట్లాడుతూ “మానవత్వం మచ్చుకు కూడా లేని సమాజంలో, మనల్ని గౌరవించని, మనల్ని రక్షించలేని, కనీసం మనుషుల్లా పరిగణించని వాళ్ళ మధ్య నే ఎందుకు బతకాలి” ? ఈ మతం మనల్ని అడుగడుగు నా అవమానిస్తూ, కించపరుస్తుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా మన మీద రాయి వేయాలని చూస్తుంది. రవ్వంత ఆత్మగౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా ఇలాంటి పైశాచిక మతం లో కొనసాగాలని అనుకుంటారా? కేవలం బానిసత్వాన్ని అభిమానించే వాళ్ళే ఈ మతం లో ఉండాలనుకుంటారు.” అని  ప్రజలకు విశదీకరించి చెప్పేరు. 
 
మా నాన్న, మా తా తా ముత్తాతలు అందరూ భక్తి పరాయులైన హిందువులే. ఈ హిందూ మతం విధించిన ఆంక్షలు వలన వాళ్ళు అక్షరం ముక్క నేర్చుకునే అవకాశం కోల్పోయేరు. ఆయుధాలు ధరించేందుకు ఈ మతం వారికి అనుమతివ్వలేదు. హిందూ మతం లో ఉండటం వలన వాళ్ళు అస్తి కూడా సంపాదించుకోలేదు. హిందూ మత పరమైన కట్టుబాట్లు వలనే దళితులు గా అంటరాని వారిగా ఉంటున్నాం. సంస్కృతం నేర్చుకోవాలన్న, ఆస్తి కలిగి ఉండాలన్నా, చదువుకోవాలన్నా తాత, ముత్తాతల నుండి అన్నీ నిషేధించేరు. 
 
ఇప్పుడు చదువుకుని, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నా అంటరాని వారిగానే పరిగణనిస్తున్నారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ లాంటి వారు విదేశాల్లో ఉన్నత విద్య చదివి, దేశంలోనే మొట్ట మొదటి సారిగా పి. హెచ్ డి చేసినా బరోడా సంస్థానం లో అవమానాలు, అంటరానితనం అనుభవించేడు. 
 
హిందూ మతమే దళితుల దుర్భరమైన, అవమానకరమైన జీవితం గడిపేటట్టు చేసింది. అన్నీ రకాల నికృష్ట పనులను రుద్దింది. నిరుపేదలుగా, అజ్ఞానులుగా మార్చింది. అలాంటి దుర్మార్గమైన సంప్రదాయపు నీడలోనే దళితులు అచేతనంగా ఉండి పోవాలా? తాత ముత్తాతల లాగే మీరు కూడా అవమానాన్ని, తక్కువ స్థాయిని అవహేళన ను ఆమోదిస్తున్నారా? అలా అసహ్యించుకోబడాలంటే అలాగే అందులోనే కొనసాగండి. దళితుల గా  ఎవరూ గౌరవించరు, దళితులు గా  ఎవ్వరూ ఉద్దలించలేరు. 
 
మీ బానిసత్వం పోగొట్టుకోవాలంటే ఏ దేవుడు మీదకానీ, మహాత్ముడి మీద కానీ ఆదారపడకండి అన్నారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 
 
దళితులకు మత మార్పిడి అనేది ముఖ్యమైన అంశం. దళితులు హిందూ మతం విష కౌగిలిలో ఉండబట్టే దేశంలో దళితుల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి లాంటివారినే, ముఖ్యమంత్రులను సైతం గుడిలో దూరం పెట్టేరు. 
 
దళితులుగా నేడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నా వివక్ష గురికావాల్సిందే.!
 
ఈ అధఃపతమైన, అవమానకరమైన బతుకును బంగారు జీవితం గా మలిచేందుకు మత మార్పిడి తప్పనిసరి. 
(Visited 227 times, 1 visits today)
Also read  దళితులు -మతం - అంబేడ్కర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!