దళితుల అణిచివేతకు రూపాలను మారుస్తున్న RSS – BJP మతోన్మాద శక్తులు.

షేర్ చెయ్యండి
  • 101
    Shares
ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని కి వ్యతిరేకంగా ఎవరుమాట్లాడిన మావోయిస్ట్ ముద్రవేసి అణచివేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఎక్కడ పది మంది కూడిన వారివెనుక మావోయిస్టులు ఉన్నారనే ఆరోపణపై అరెస్ట్ లు చేసే ఎత్తుగడలకు మనువాద ప్రభుత్వం తెరలేపింది. మనువాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పెనలా వస్తున్న దళిత వెతిరేకతను పూర్తిగా అణిచివేయటానికి దళిత ఉద్యమ కారులమీద నక్సలైట్లని, మావోయిస్టు లని ముద్రలువేసి తన రాజ్యాహంకారానికి ఎదురు లేకుండా చేసుకోవటానికి దళితుల అణిచివేత సరికొత్త కుట్రలతో మనువాదం ముందుకు వస్తుంది.
 
దళితులు తమ విముక్తి పోరాటన్నాయిన, అంటరానితనం వ్యతిరేకపోరాటమైన… మతోన్మాద వ్యతిరేక పోరాటమైన, తమ సమస్త పోరాటాలకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్  డా.. బి. ఆర్. అంబెడ్కర్ గారి  చిత్రపటాన్ని  ముందు పెట్టుకొని బలమైన పోరాటాన్ని ముందుకు తీసుక వస్తున్నారు.
 
దళిత ఉద్యమాలకు రాజ్యాధికారమే ప్రధాన ఏజండాగా ఉంటుంది. అప్పనంగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న బ్రాహ్మణ వర్గానికి, రాజ్యాధికారం కోరుకుంటున్న దళిత వర్గానికి మధ్య ప్రధాన పోరాటం నేడు  జరుగుతుంది. ఈ రోజు బ్రాహ్మణ వర్గానికి  సవాల్ విసురుతున్న వర్గాల్లో ప్రధానంగా దళితులు మరియు  పీడిత వర్గాలు ముందున్నాయి… 
              
“దళిత వర్గాల విముక్తి పోరాటానికి కులనిర్ములనా , బాబాసాహెబ్అంబెడ్కర్ భావజాలం, బుద్ధిజం పునాదిగా నడుపుతున్నారు   హిందూ ఇజానికి పోటీగా అంబేడ్కరిజాన్ని  ముందుకు తీసుక వస్తున్నారు.”
 
మనువాదుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్  కోరుకున్న మానవ హక్కుల పోరాటానికి పునాదులు వేస్తున్నారు. మానవహక్కుల పోరాటంతో పాటు రాజ్యాధికారం కావాలనే కోరికను కూడా ప్రధాన డిమాండ్ ను బలంగా ముందుకు తీసుకవస్తున్నారు.
 
రాజ్యాధికారాన్ని ఒడిసి పట్టుకున్న బ్రాహ్మణ వర్గాలు విడవటానికి సిద్ధంగా లేకపోవటమే కాకుండా డిమాండ్ ను ముందుకు తీసుక వస్తున్న వారిని అనేక భౌతిక, మానసిక హింసలకు గురిచేస్తుంది. అందులో భాగంగానే  ఈ దేశంలో మూక హత్యలు స్వేచ్ఛ గా జరిగి పోతున్నాయి.
 
ఆడవారిని బట్టలిప్పేసి బహిరంగంగానే  ఉరేగిస్తున్నారు. ముస్లింలను బహిరంగంగానే చంపేస్తున్నారు. దళితుల రక్షణ కోసం ఉన్న అత్యాచార నిరోధక చట్టాన్ని రోజు రోజు కి నీరు గారుస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను మూసి వేస్తున్నారు.రెజర్వేషన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడటానికి వేదికలను సిద్ధం చేస్తున్నారు. దళితులు ఇతర మైనారిటీ వర్గాల వారు ఎమి  తినాలో, తినకూడదో సంఘ్ పరివార్ నిర్ణయిస్తుంది.
 
దళితుల అణిచివేత కు కారణం దళితులు విజేతలుగా కీర్తింపబడటమేనా?
 
తమ పూర్వికుల విజయాలకు గుర్తుగా వేడుకలు జరుపుకోవడం నిషేధిస్తున్నారు…  దళిత వేడుకల మీద బహిరంగ దాడులకు తెగబడుతున్నారు.అందులో భాగమే జనవరి ఒకటైన కోరేగాం విజయోత్సవం ర్యాలీ పైన RSS కి చెందిన మిళింద్ ఇగ్బోడే… చంభాజి ల నాయకత్వం లో అమాయక దళిత కార్యకర్తల పైన భౌతిక దాడులకు తెగ బడ్డారు. ఎదురు తిరిగిన దళిత ఉద్యమ నాయకులు తిరిగి కొట్టడం తో RSS గ్యాంగులు  సహించలేక పోయారు.
 
Bhima_koregaon
Google Image: Bhima Koregaon
 
దళితులను ఇలానే వదిలేస్తే రెపటి  నాడు మనకు మెకులవుతారని గ్రహించిన నయా పీష్వా బ్రాహ్మణ ప్రభుత్వ నాయకుడైన ఫడ్నవీస్ నాయకత్వంలో  అణచివేత కార్యక్రమాలకు తెరలేపుతున్నారు…ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు జాతీయ పోలీసులుగా వ్యవహరిస్తూ ముక్కు మొఖం తెలియని వాళ్ళ ఇళ్లలోకి జొరబడి స్వేచ్ఛగా సోదాలు చేస్తున్నారు.
 
 కోరేగామ్ అమరుల బంధుమిత్రుల  సంప్రదాయ ఉద్యమానికి, మావోయిస్ట్ పార్టీ కి మధ్య ఎలాంటి సంభంధం లేదు. ఈ కోరేగామ్ ఉద్యమమ్ బాబాసాహెబ్ డా అంబేడ్కర్  బ్రతికున్న రోజుల్లోనే ప్రారంభించబడి నేటికి యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ స్థూపాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వచ్చే జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు.
 
1818లో జరిగిన యుద్ధంలో పీష్వా బ్రాహ్మణ పాలకులను పునా సరిహద్దుల వరకు తరిమీకొట్టిన మహార్ల ధైర్య సాహాసాలను కొనియాడుతూ వివిధ కళారూపాలలో వివరిస్తువేడుకలు చేసుకుంటారు.. ఈ సంవత్సరం కూడా యధావిధిగా వివిధ రాష్ట్రాల నుండి వేలమంది స్థూపం దగ్గరకు చేరుకున్నారు, ఇది సహించలేని  RSS..BJP మతోన్మాద శక్తులు భవిష్యత్తులో దళిత ఉద్యమం మళ్ళీ లెవకుండా చేయటానికి వినూత్న కుట్రలకు తెర లేపారు. అదే కోరేగామ్ వెనుక మావోయిస్టులు ఉన్నారని, వీళ్ళమూలంగానే దేశంలో అంతర్గతంగా అల్లర్లు జరుగుతున్నాయని ఒక గోబెల్ ప్రచారానికి లంగించుకున్నారు.
 
చరిత్ర బారునపరిశీలించిన కమ్యూనిస్టులు.. దళిత ఉద్యమ శక్తులు కలిసి పెద్ద ఎత్తున  ఉద్యమ నిర్మాణం చేసిన ఘటనలు లేవు… అంత మాత్రామ్ చేత వీళ్ళమధ్య శత్రుత్వం కూడా లేదు… ఈ రెండు శిబిరాల మధ్య కులం అనే అంశం మీద సైద్ధాంతిక చర్చే తప్పా  మిగతా ఏ విషయంలో కూడా విభేదించుకోరు 
 
మావోయిస్ట్ లాంటి పార్టీలతో కలవక పోయినప్పటికీ మిత్రపూరిత వైరుధ్యమే ఉంటాది. దళితుల మీద ఎక్కడ దాడులు జరిగిన మావోయిస్టు ఇతర అనుబంధ సంఘాలు స్పందించి నట్లుగానే, ఎన్కౌంటర్లు ఎక్కడ జరిగిన వాటిని ఖండిస్తూ మొదటగా దళిత సామాజిక వర్గమే రోడ్లమీదకు వచ్చి తమ నిరసనను తెలియచేస్తాయి…కానీ కులం  సమస్యపై ఇద్దరి మధ్య నేటికి వాదోప వాదాలు జరుగుతున్నాయి. కానీ కలిసి నట్లే ఉంటారు గాని ఎక్కడ కలిసి పనిచెయ్యరు, పనిచేసిన దాఖలాలు లేవు. 
 
జనవరి 1, 2018 న కోరేగామ్ లో జరిగిన భారీ ర్యాలీ జన సమీకరణలో మావోయిస్ట్ పాత్ర ఏమాత్రం లేదని చెప్పవచ్చు. ఈ ర్యాలీ జన సమీకరణలో మావోయిస్ట్ ల పాత్రలేదని  మావోయిస్ట్ పార్టీనే స్వయంగా ప్రకటించాలి. కానీ అలా చెయ్యటం లేదు ఎందుకని.. మొత్తం దళిత కంమ్యూనిటీ ని మావోయిస్ట్ ఖాతాలో వేసు కోవాలని తలంపుతో ఉండవచ్చు నెమో, కానీ దానివల్ల దళితులు ఎదుర్కొనే నష్టాల గురించి పట్టించు కొకపోవటం చాలా విషాధకారం. 
 
నక్షలైట్ పార్టీల్లో పనిచేయటం దళితులకు కొత్త కాకపోవచ్చు కానీ బాబాసాహెబ్ డా అంబేడ్కర్ని, ఆయన ప్రభోధించిన కుల నిర్ములనా సిద్ధాంతాన్ని మీరు విస్మరిస్తున్నప్పుడు మీ కాడి దళితులెందుకు మొయ్యాలో ఒక్క సారి ఆలోచించండి
.
ఇప్పుడు మావోయిస్టులను అడ్డం పెట్టుకొని దళిత ప్రతిఘటన ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలకు RSS ..BJP మతోన్మాదం గుంపు  బరితెగించింది.
 
దళితుల అణిచివేత సాధ్యమవుతుందా?
 
 బాబాసాహెబ్ డా అంబెడ్కర్ బొమ్మని ముందుపెట్టుకొని రాజ్యాధికారం నినాదం తో ఒక ఉప్పెనలా ముందుకొస్తున్న దళిత సమూహాన్ని ఆపటం బ్రాహ్మణ వర్ణానికి సాధ్యమయ్యే పనికాదు.
 
అణచివేయటం అంతకంటే సాధ్యం కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ డా అంబేడ్కర్  బొమ్మను ముందుపెట్టుకొని వస్తున్న దళిత సమూహాన్ని ఏ పేరుమీద అణిచివేయ్యలేరు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఈ దేశంలో కోట్లాదిమంది అంటరాని ప్రజలను మనుషులుగా తీర్చిదిద్దిన వాడు.  బానిసలను మనుషులుగా మార్చినవాడు.
 
 మనుస్మృతిని తగల బెట్టి సమాన హక్కులతో కూడిన రాజ్యాంగాన్ని రాసి న మహోన్నత వ్యక్తిత్వం గలవాడు. అలాంటి వ్యక్తి బొమ్మనుని ముందు పెట్టుకొని వస్తున్న సమూహాల ఉద్యమాలను అనచటం సాద్యం కాదు.. కానీ అణచాలి. ఎలా?
 
అలాంటి ఆలోచనల నుండి పుట్టిందే మావోయిస్ట్ ల ఉత్తరం. ఆ ఉత్తరం కచ్చితంగా నాగపూర్ RSS కార్యాలయంలో  పురుడుపోసుకొని ఉంటుంది.   ఈ ప్రపంచంలో ఏ మేధావి కూడా ఒకరిని చంపాలని కోరుకొడు కానీ రాజ్యవ్యవహారాలను కచ్చితంగా ప్రశ్నిస్తారు.. ప్రశ్నని తట్టుకోలేని మతోన్మాదపు గుంపు, దళితుల రాజ్యాధికార నినాదాన్ని తట్టుకోగలదా? 
 
దళిత సమూహాలధ్వారా నిత్యం తమ రాజ్యం ప్రశ్నలపరంపరలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మతోన్మాదులు తట్టుకోలేక పోతున్నారు. మనుస్మృతి ప్రకారం మాట్లాడే అవకాశమే లేని అలాగా జనాభా మనువాదులప్రభుత్వం ముందు మాట్లాడటం కనీసం సహించలేక పోతున్నారు.
 
అందుకే మనువాదులకు  బాబాసాహెబ్ డా అంబేడ్కర్ఒక ప్రధాన శత్రువు అయ్యాడు…ఆయన రాసిన రాజ్యాంగం కంటిలోనలుసై అనునిత్యం గులపుట్టిస్తుంది. అందుకే ఈ రాజ్యాంగం ఉండకూడదు. ఈ అంబెడ్కర్ వాదం ఉండకూడదు.
 
ఈ రెండు ఉండకూడదు అంటే దళిత రాజ్యాధికార పోరాటాన్ని మొవోయిస్టులకు లింకు కట్టి తీవ్రవాదం పేరుమీద ఇద్దరిని అణచివేయాలనే కుట్రలో భాగంగానే వరవరరావు లాంటి మరో ఐదుగురు ప్రజాస్వామిక వాదులను అక్రమంగా అరెస్ట్ చేసి మరలా ఇంటికి తీసుక పోయి గృహ నిర్బంధంలో పెట్టమని కోర్ట్ అదేశించటంతో చెచేదేమిలేక ఎవరి ఇళ్లకు వారిని పంపి పోలీసు కాపలా పెట్టింది. 
 
వీరి మీద ప్రధాన ఆరోపణ కోరేగామ్ జనసామికరణలో మావోయిస్ట్ల పాత్ర ఉందని.రాజీవ్ గాంధీని హత్యచేసిన తరహాలోనే మోడీ ని కూడా హత్య చెయ్యాలని కుట్ర పన్నారని .. రాజద్రోహానికి పాల్పడ్డారని ఇత్యాది పసలేని ఆరోపణలు చేసి ప్రజాస్వామిక వాదులను అరెస్ట్ చేసింది. కానీ అసలు కుట్ర మాత్రం దళితులను టెర్రరైజ్ చేయటమే మతోన్మాదుల ప్రధాన ఉద్ధేశ్యం. 
 
  
ఈ దేశంలో దళిత ఉద్యమాన్ని అనచటానికి లేదా దళితుల అణిచివేత  ఇంతకంటే మార్గంలేదని గ్రహించిన మోడీ మతోన్మాద శక్తులు కోరేగామ్ వెనుక మొవోయిస్టులు ఉన్నారనే ఒక దుష్ప్రచారానికి పునుకుంటుంది.
 
 వాస్తవంగా కోరేగామ్ ఉద్యమం వయసంత లేదు మావోయిస్ట్ పార్టీ వయసు. మావోయిస్ట్ పార్టీ పుట్టకముందు నుంచే కోరేగామ్ జనసామికరణ జరుగుతుంది.దానికేవరు జనాల్ని పోగేయ్యాలసిన అవసరం లేదు.ఎవరికి వారే సద్దులు కట్టుకొని కొరేగామ్ కి బయలు దేరుతారు.
 
ఆనాటి మహార్ల ధైర్య సాహాసాలను ఇప్పటికి గుర్తుచేసు కోవటానికి పూనపట్టణంలో సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. అలాంటి సమావేశాల్లో ఒకరిద్దరు లెఫ్ట్ భావాలున్నవారు పాల్గొంటే పాల్గొనవచ్చేమో కానీ  ఇది  బాబాసాహెబ్ డా అంబేడ్కర్ భావజాలంతో కూడిన మహార్ల ప్రజాస్వామిక పోరాటం.
 
దళితుల అణిచివేత కు మావోయిస్టులకు ఏమైనా సంభందం ఉందా? 

మావోయిస్టు పార్టీ లో అనేక మంది మేధావులున్నారు. ఒక ప్రధాన మంత్రిని చంపే కుట్ర చెయ్యరు ఎందుకంటే రాజ్యం ముందు ఆ పార్టీ, ఆ ఉద్యమం చాలా చిన్నది. మోడీ ని చంపాలని ప్లాన్ చేసి తమ పార్టీ మీదకు కోరి నిర్బంధాన్ని కొని  తెచ్చుకోరు. అంతే కాకుండా భారత మిలటరీ ముందు మావోయిస్ట్ మిలటరీ కూడా చాలా చిన్నది పైగా ఆయుధ సంపత్తి కూడా చిన్నది.

Also read  ఎస్సి సామాజికవర్గం: దిశ దశ లేని ఎస్సి సామాజికవర్గం!
 
అలాంటి బలహీన మైన పార్టీ మోడీ ని హత్య చెయ్యటానికి ప్లాన్ చెయ్యటం అంటేనే చాలా హాస్యాస్పదం అనిపిస్తాది ఏ బుద్ధిజీవి కైనా. కానీ మతోన్మాదుల ఆలోచన అధికాదు?  మావో ల భూచిచూపించి దళితులను అణచివేయాలనేది వెనుక దాగిన కుట్ర.
 
ఆ ఉత్తరమే నిజమైతే అరెస్ట్ చేసిన ఐదుగురు హక్కుల కార్యకర్తలను రిమాండ్ విధించి జైలుకు తరలించాలి కదా! అలా కాకుండా ఇంటికేందుకు పంపించారు.అదే 90 శాతం వికలాంగుడైన  సాయిబాబా ను గాలి, వెలుతురు లేని అండమాన్  జైల్లో ఎందుకు నిర్బంధించారు ? శూద్ర వర్ణానికి చెందిన వాడనా ?  నిజంగా వాళ్ళెగనుక రాజద్రోహానికి పాల్పడిఉంటే మిలిటరీ మార్షల్ చెయ్యవచ్చు కదా? మీరు అలా చెయ్యలేదు అంటే మీరు కేవలం దళితులను వేధించటానికే అగ్రకులాలకు చెందిన వారిని అరెస్ట్అని నాటకాలాడుతున్నారు.
 
ఏ రాజ్య ద్రోహం చేశాడని భీం ఆర్మీ  చంద్రశేఖర్ ఆజాద్ ని నడుం ఇరగ్గొట్టి జైల్లో బంధించారు? ఏ నేరం చేసిందని సోనిశోరి మీద ఆసిడ్ దాడులు చేసి హింస పెట్టారు? ఏ నేరం చేశాడని రోహిత్ వేముల ను ఆత్మహత్య కు ప్రేరేపించారు? ఏ నేరం చేశారని నిత్యం దండకారణ్యం ఆదివాసీల మీద హత్యాకాండను కొనసాగిస్తున్నారు?  ఏ నేరం చేసిందని గౌరి లంకేశ్ని దారుణంగా హత్య చేసారు.? ఎనేరం చేశారని దభోల్కర్ ని, పంచారే ని హత్యలు చేశారు? ఏ నేరం చేశాడని సాయిబాబాని అండమాన్  జైల్లో కుక్కి నిత్యం హింసిస్తున్నారు?
 
ఈ దేశం లో ఒక్క హిందూ మతోన్మాదులు తప్ప , ప్రజాస్వామిక వాదులు, ఉద్యమ కారులు ఏ తప్పులు చెయ్యటం లేదు. ఏ హింస చెయ్యటం లేదు.కేవలం రాజ్యాంగ బద్ధ పాలనను మాత్రమే కోరుకున్నారు, అది మీ దృష్టిలో తప్పైపోయింది. ఒక ప్రభత్వం ప్రతినిధులుగా రాజ్యాంగ బద్దంగా పాలించాలచిన మీరు, బహిరంగంగానే  రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తూ పాలన మొత్తాన్ని RSS మతోన్మాదుల చేతుల్లో పెట్టారు. కనుకనే ఈ రోజు ప్రజలు ఎమ్ తినాలో.ఎమి తిన కూడదో ఎలాంటి బట్టలు వేసుకోవాలో మతోన్మాదులు నిర్ణయిస్తు దళితుల అణిచివేత నిరాటంకం గా సాగిస్తున్నారు 
 
మాంసం తిన్నారని చంపుతున్నారు. ఆవు కు లేని పవిత్రతను అపాదించి ఆవు ని చంపారనే నెపం మీద పదుల సంఖ్యలో దళితులను హత్యలు చేయటం, నడిబజార్లో తీవ్రమైన హింసలుకు గురిచేస్తున్నారు.  పోలీసు లతో కలగలిసి పోయినా RSS శక్తులు దళిత ఆదివాసీ ల మీద నరహంతక దాడులు చేస్తూ వారి స్త్రీలను నిత్యం  రేప్ లకు గురి చేస్తున్నారు. 
 
మీ హింస మొత్తం కూడా రాజ్యాధికారాన్ని నిలుపుకోవటానికే మీ పాలనకు అడ్డువచ్చే శక్తులను వివిధ రకాల పేర్లు తగిలించి చంపడం మీకు మాములై పోయింది. పాకిస్థాన్ టెర్రరిజం పేరుమీద ముస్లిం యువకులను, నక్షలైట్ ల పేరుమీద దళిత ఆదివాసీ యువకులను స్వేచ్ఛగా చంపుకు పోతున్నారు ఎదురు తిరిగిన వారిని చంద్రశేఖర్ ఆజాద్ లాగా జైల్లో పెట్టి హింసిస్తున్నారు.దళితుల అణిచివేతకు రూపాలను మారుస్తున్న RSS – BJP మతోన్మాద శక్తులు.
 
 మీ హింసలో భాగంగానే  దళితుల అణిచివేత ను కాస్తో కూస్తో అడ్డుకునే sc,st(poa) act 1989ను కోర్ట్ ధ్వారా విచ్ఛిన్నం చేశారు. మీ ఆలోచన ప్రకారం ఈ దేశంలో మెజారిటీ జనాభా అయిన దళితులను హింసలుకు గురిచేసి..భయపెట్టి ఓట్లు వెయ్యక పోతే చంపుతాం అనే వాతావరణాన్ని సృష్టించి బలవంతంగా ఓట్లు వేయించుకునే  పథకారచన ను మీరు తయారు చేస్తున్నారు.
 
 అందులో భాగంగానే మేము ఏమి  చేసిన  మీరు చూస్తూ ఉండాలి తప్ప ప్రశ్నించ కూడదనే  ధోరణి మిలో స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరనే ఏప్రిల్ 2 నాటి RSS ఉన్మాదులు దళితులపైన కాల్పులు జరిపి 13 మందిని పొట్టన పెట్టుకున్నారు. BJPప్రభుత్వం ఏర్పడినాక ఉత్తర భారతంలో దళితులను కనీసం మనుషులుగా కూడా చూడ నిరాకరిస్తున్నారు.ఈ హింస గుజరాత్..ఉత్తర ప్రదేశ్ లాల్లో ఎక్కువుగా జరుగుతుంది.
 
ఈ లాంటి హింస రూపాలను వ్యతిరేకించిన వారిని  మావోయిస్టులుగా ముద్రలు వేసి దళిత యువకులను హత్యలు చెయ్యటానికి, తధ్వారా దళితుల అణిచివేత మరియు దళిత యువకుల్లో రాజ్యాధికార కాంక్షలను చంపాలని మీరు భారీ ప్రణాలికను దళితులకు వ్యతిరేకంగా రచిస్తున్నారు.
 
“చేపకు ఏరేచినట్లుగా దళిత ఉద్యమాన్ని పూర్తిగా  అనచటానికి అగ్రకుల మేధావి వర్గాన్ని అరెస్ట్ చేస్తున్నట్లు నటిస్తూ మంచి నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు “
 
BJP పాలనలో ఒక్క అంబానీ కుటుంభంలాంటి మరో ఇరవై కుటుంబాలు మాత్రమే సుఖంగా జీవించగలుగుతున్నారనేది నగ్న సత్యం. పూర్తి ఆర్ధిక మాంద్యం ఏర్పడి అధిక ధరలతో కోట్లాదిమంది శ్రమజీవులు అర్ధాకలితో జీవితాలను నెట్టకొస్తున్నారు.
 
మీ పాలనలోనే దేశంలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం వలన వందల మంది మధ్యతరగతి ప్రజలు చనిపోయారు. కార్పొరేట్ కంపెనీ యజమానులు లక్షల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారు.
 
విదేశాలకు పారిపోతున్న ఆర్ధిక నేరస్తులను దగ్గరవుండి BJP నాయకులే దేశ సరిహద్దులు దాటిస్తున్నారు.ఆర్ధిక నేరస్థుల తరుపున BJP కి చెందిన న్యాయవాదులే వకాల్తా పుచ్చుకొని వాదిస్తూ ఆర్ధిక లాభాలు పొందుతున్నారు. 
 
కార్పొరేట్ పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారు. రైతులు బ్యాంకు రుణాలు మాత్రమె గోళ్ళుడగొట్టి మరి వసూలు చేస్తున్నారు.  మార్వాడీ, హిందూ జైనులే కోట్లల్లో ఆవు మాంసం ఎగుమతి చేస్తే తప్పు లేదుగాని మాంసం తిన్న ఒక ముస్లిం ని దేశ ద్రోహిగా చూపించి నట్టింట్లోనే చంపేసేరు   
 
రామాయణం, మహాభారతం లను దూశించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరణచేసి నగరాలనుండి భహిష్కరణలు చేస్తారు,  అదే రాజ్యాంగాన్ని భహిరంగగ తగలబెట్టిన వారిని మాత్రం ని రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి కాపాడుతావు.ఉందొ లేదో తెలియని పురాణ స్త్రీ సితమ్మను దూషించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారు  అదే బాబాసాహెబ్ డా అంబేడ్కర్  దూషిస్తే గుడ్లప్పగించి చూస్తుంటారు  ఎందుకు?
 
“ఈ దేశ రాజ్యాంగాన్ని రాసిన మహావ్యక్తిని RSS కి చెందిన చిల్లర గ్యాంగులు భహిరంగగా దూషిస్తే నువ్వెందుకు మౌనం దాల్చావని ప్రశ్నించటం మీ దృష్టిలో నెరమైంది.”
 
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్ప చేతకాని మీరు..ప్రశ్నించేవారి తీవ్రవాదులని ముద్రలు వేసి జైళ్లలో పెట్టటం నాజిజం తప్ప మరొకటి కాదు..మీకు కావలసింది కేవలం నాజీలను పోలిన నియంతృత్వం.అంటరాని కులాల ప్రజలను తీవ్రంగా అణిచి వేయాలి. బానిసత్వాన్ని అమితంగా ప్రేమిస్తారు. అందుకే మీ రహస్య ఏజెండాలో దళితులను..అంబెడ్కర్ వాదులను చంపమని కరపత్రాలు పంచుకుంటారు.
 
మీ అరాచకాలను  ప్రశ్నించటానికే వేలాది సంవత్సరాలుగా   ఈ దేశ మూలవాసులు మీ నరహంతక దాడులకు బలై పోతున్నారు. బ్రహ్మనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ప్రజాస్వామిక ఉద్యమాలను మీరు అణిచివేశారు.
 
ప్రస్తుత సమాజంలో మూడు సమూహాల మధ్య అంటే 1.బ్రాహ్మణ, 2.దళిత, 3మార్క్సిస్టు-మావోయిస్ట్ శిబిరాల మధ్య రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి..ఈ మూడు శిబిరాల కార్యకర్తలు అరెస్ట్ అయ్యినప్పుడు తీవ్రమైన వివక్ష చూపిస్తున్నారు. న్యాయవ్యవస్థ బ్రాహ్మణులకు ఒక  న్యాయం, శూద్ర వర్ణనాని కి చెందిన  కార్యకర్తకు ఒక న్యాయం చెపుతున్నారు. వరవరరావు అరెస్ట్ అయినప్పుడు బ్రాహ్మణ ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి 24 గంటల్లో హౌస్ అరెస్ట్ గా మార్పించారు. అదే దళిత  వర్గానికి  చెందిన  భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ను నడుం ఇరగ్గొట్టి జైల్లో బంధించారు… అదే మావోయిస్ట్ పార్టీకి చెందిన కాపు కులస్థుడైన సాయిబాబాను అండమాన్  జైల్లో కుక్కి చావుకు దగ్గర చేస్తున్నారు.. దీన్ని బట్టి ఈ దేశంలో విప్లవమైన. విద్రోహమైన బ్రహ్మణులే చెయ్యాలని మను వాద న్యాయస్థానం బహిరంగంగానే తీర్పులు ఇస్తున్నాయి.
 
రచయిత: కసుకుర్తి. రామలింగం 
సామాజిక విశ్లేషకులు 
 
 
 

 

Also read  దళిత మిలినియర్స్: స్ఫూర్తిదాయకమైన దళిత మిలియనీయర్స్
(Visited 185 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!