దళితుల ఇంటిలో భోజనం BJP రాజకీయ డ్రామా!

షేర్ చెయ్యండి
  • “కులవ్యవస్త మనుష్యులను జాతిరీత్యా విభజించడం లేదు. అది ఒకే జాతి ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది” బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్.

బారత దేశంలో సహస్రాబ్దాల తరబడి నుండి కులాలే ఉంటూ వచ్చేయి. ఒక విధంగా చెప్పాలి ఆంటే మధ్య యుగం నుండి బారత దేశ పుట్టుక కులం కులం పు నాదు ల నుండే బారత దేశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంకా చెప్పాలి ఆంటే ఒకే కులంలోని ఇంకొక గోత్రాల వారి మధ్య కూడా వివక్ష ఉంది.

ఆధునిక యుగంలో కుల వ్యవస్త గ్రామాల్లో విస్తృతంగా ఉంది. ఎవరైనా కొత్తవారు గ్రామంలో కి వొస్తే ముందు ఆ వ్యక్తి కులం తెలుసుకోవటానికి ఉబలాట పడుతుంటారు. పేరు ని బట్టి, ఇంటి పేరు, తండ్రి పేరున బట్టి, మాట్లాడే విధానం బట్టి కులాన్ని అంచనా వేస్తారు. ఇక కులం తెలిసిన తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తి తో పరిచయాలు పెంచుకుంటారు. దళితులు  అయితే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. కనీసం ఇల్లుకుడా ఇవ్వరు. చులకనగా, ఎగతాళి గా మాట్లాడతారు.

గాంధీ అస్పృస్యత నివారణకు హరిజనోద్యమం చెప్పటెడు, కానీ కులం మాత్రం ఉండాలి అది సాంఘీక ధర్మం అన్నాడు. ఒక పాకీ పని వాడు ఆ వృత్తిలోనే ఉంటూ అభివృద్ధి చెందాలి, వృత్తి ని ప్రేమించాలి అన్నాడు. చాతుర్వణ వ్యవస్త ఉండాలి అన్నాడు. గాందీ మాత్రం అనుసరించలేదు. అయిన కుల వృత్తి అయిన చిల్లర కొట్టు పెట్టుకోకుండా ఆఫ్రికా వెళ్లి న్యాయ వాద వృత్తి చేసేడు.

ఏ కులమని నన్నివర మడిగితే
ఏమని చెప్పుదు లోకులకు – పలుగాకులకు
దుర్మార్గులకు – ఈ దుష్టులకూ”
అని పోతులూరి వీర బ్రహ్మం కుల వ్యవస్త ని చీల్చి చెండాడెడు.

బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ కులం గురించి చెబుతూ “కులం ఆంటే దడికట్టుకున్న ఒక సమూహం” ఈ సమూహంలోకి బయట నుండి ఎవరినీ రానివ్వరు, లోన వారిని బయటకు పోనీయరు. ఇలా దడికట్టుకున్న సమూహం ఏర్పాటు చేసిందే అస్పృస్యత.

Also read  ఎన్నికల ఆరాటంలో వ్యవస్తీకృత మోసానికి పాల్పడుతున్న పార్టీలు!

చాలా కాలం నుండి ఈ అస్పృస్యత ను నివారించటానికి చాలా మంది పనిచేసేరు అందులో భాగమే సహపంక్తి భోజనాలు. 12 వ శతాబ్దంలోనే ఈ సహపంక్తి భోజనాలు పల్నాటి సీమలో మనకు కనిపిస్తాయి. ఆంటే ఆనాటి నుండి 21 వ శతాబ్దం వరకూ సవర్ణ హిందువులకు అస్పృస్యత ను నివారించేందుకు , కులాన్ని నిర్ములాన చేసేందుకు చిత్త శుద్ది లేదు అని అర్ధం అవుతుంది.

ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక దళితుడి ఇంటిలో బోజనం చేస్తే విపరీత అర్ధాలు తీసిన ఆనాటి ప్రతి పక్షం నేటి అధికార పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక దళితుడి (Schedule caste0 ఇంటికి వెళ్లి సహపంక్తి బోజనం చెయ్యటం చర్చనీయాంశం. ఆంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బా జ పా కానీ కుల ధర్మం ఇంకా ఉంది, అస్పృస్యత ఇంకా ఉంది అని గట్టిగా నమ్ముతున్నారు అని అర్ధం చేసుకోవాలి? లేదా దళితులు ఇంకా అంటరాని వారుగా వారు గుర్తిస్తున్నారు అని అనుకోవాలి. అసలు పల్నాటి చరిత్రలోనే సహపంక్తి భోజనాలు శుద్ధ కల్పితం అని చరిత్రకారులు చెబుతున్నారు. గుర్రం చెన్నారెడ్డి పల్నాటి చరిత్ర లో వెలమ వారు పెండ్లి జరుపుకోవాలి ఆంటే రేచర్ల గోత్రీకులైన కన్నమదాసు వంశీయులకు ముందుగా పెండ్లి జరిపి ఆ తలంబ్రాలతొనే వెలమలు పెండ్లి జరుపుకోవాలి. నేటికీ ఈ తంతు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. దీనిని బట్టి వెలమ కులస్తుడు బ్రహ్మనాయుడు చాపకుడు, దేవాలయ ప్రవేశం ఒట్టి బూటకం అని అర్ధమవుతుంది. ఆనాటి వెలమల మనుగడ మాల కులస్తుల మీద ఆధారపడి ఉంటే ఇక వెలమ ఆయిన బ్రహ్మనాయుడు మాల లను ఎలా ఉద్దరిస్తాడు అని చరిత్రకారుల ప్రశ్న.

Also read  Honour killing in Telangana, man hacked to death in front of pregnant wife.

మీకు ఉంది, యెస్ సి లకు లేనిది ఏంటి?

అమిత్ షా కానీ, రాహుల్ గాందీ కానీ BJP నాయకులు  సమాధానం చెప్పాల్సిన మొదటి ప్రశ్న మీకు ఉన్నది, యెస్ సి లకు లేనిది ఏంటి? ఆర్థిక స్తోమత నా లేక మీలాగా జంధ్యం లేకపోవటమా? మీరు తినేది అదే ఆహారం, యెస్ సి లు తినేది అదే ఆహారం కదా? ఆహారాన్ని పండించే వారు యెస్ సి లే కదా? మీ సహపంక్తి బోజనాలకు మూలం ఎంటి? మీరు అంటరాని వారు మేము మిమ్మల్ని ఉద్ధరించే పనిలో ఉన్నాం అని చెపుకోవటం కోసమే కదా?. హిందు వ్యవస్త సృష్టించిన అత్యంత హేయమయిన సంస్కృతి కి బలై దేవుడు పేరుతో, దెయ్యం పేరితో కనీస అవసరాలకు దూరంగా నెట్టవేయబడ్డ వ్యక్తులు మీకంటే జ్ఞాన వంతులు, విజ్ఞాన వంతులు , వీరులు అని తెలుసుకోవాలి. సింధు, హరప్పా నాగరకతను నిర్మించిన యెస్ సి లు మీ చేత దోపిడీకి గురికాబడ్డ వారు. కాబట్టి ఇకనైనా మీ సానుభూతి వచనాలు మాని ఈ దేశం మీద పడి దోచుకున్న సొమ్ము కట్టండి.

మీరు దళితుల ఇంటిలోకి వెళ్లి బోజనాలు చెయ్యక్కర్లేదు, మీ ధర్మం లో ఉన్న కులాన్ని కాల్చి పడేయండి చాలు. మీ మనువు ని నడిరోడ్డు మీద తగలబెట్టండి.

ఎవరు అస్పృశ్యులు?

Also read  ఆపరేషన్ గరుడ: ఫ్యూడల్ కులాల రాజకీయ క్రీనీడ - చితికిపోతున్న బడుగు జీవులు!

ఉద్యోగాల కోసం సవర్ణ హిందువులు అవలంబిస్తున్న వివిధ వృత్తులు, చేస్తున్న పనులూ వర్ణ సంకరనికి దారితీసినట్టే కదా? మరి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు , శూద్రలు అస్పృశ్యులు కానప్పుఫు ఒక్క యెస్ సి.లే ఎలా అంటరాని వారు అవుతారు. కోళ్లు, సీమ పందులు పెంచి మామసం అమ్మే కసాయి బ్రాహ్మణులు ఉన్నారు. వర్తక వ్యాపారంలో ప్రవేశించి వ్యభిచారం చేసే కోమట్లు, బ్రాహ్మణులు ఉన్నారు. మరి వారు అస్పృశ్యులు కారా ?? మద్యం, మాంసం తాగి, తినే ఎంతమంది ఈ దేశంలో అగ్ర కులాలు అనబడే వారిని అస్పృశ్యులు గా గుర్తించేరు.

చివరిగా,
కులం అనే మీ మానసిక వైకల్యం సరి చేసుకోకుండా సహపంక్తి బోజనాలు చేస్తే కులం పోదు. అది గాయాన్ని తిరగతోడుతుంది. 

 

(Visited 308 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!