దళిత, ఆదివాసీ సంస్కృతి-ఆహర సాంప్రదాయాలు!

షేర్ చెయ్యండి
  • 93
    Shares
నీదంటూ ఒక గుర్తింపు లేదా? Do you have an identity?
 
“పుట్టడం ఎంత కష్టమో 
మరణించడం ఎంత దారుణమో 
మంత్రసానులకు, పొత్తి గుడ్డలకు తెలుసు. 
జనన మరణాల మధ్య ప్రయాణమేకదా జీవితం “
-మాయ ఆంగెలో  
 
మూడు వేల సంవత్సారాల అణిచివేతను, అవమానాలను, భరిస్తూ ఉన్న జాతి. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బ్రతికే పాఠాలు నేర్పాలి అంటాడు దళిత తత్వవేత్త కలేకూరి ప్రసాద్. 
 
నీదంటూ ఒక గుర్తింపు లేని సమాజంలో నీ అస్తిత్వం ఎన్నిరోజులు బ్రతకగలుతుంది? అందుకే ప్రపంచంలో ప్రతి అణిచివేత సమూహం నుండి తిరుగుబాటు ఉద్యమాలు వచ్చేయి. ప్రపంచంలో ప్రతి అవమానాలు పొందిన జాతి నుండి స్వేచ్ఛ, స్వతంత్ర , సౌభ్రాతత్వ ఉద్యమాలకు పురుడు పోసుకుంది. 
 
చరిత్ర తెలియని వారు, తమ చరిత్రని నిర్మించలేరు అంటారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్. మరి నీ చరిత్ర ఏంటి? నీ అస్తిత్వం ఎక్కడ ప్రారంభం అయ్యింది? నీ సంస్కృతి, సాంప్రదాయం ఏంటి?  నీ శత్రువు ఒకవైపు నుండి నిన్ను నాశనం చేస్తూ వస్తుంటే, సిందూ నాగరికతను, బౌద్ధుల సంస్కృతిని,  విధ్వంశం చేసిన ఆర్య పుత్రులు ఆధునిక భారతం లో తమ సంస్కృతిని యావత్ దేశ సంస్కృతి గా నిర్మించుకుని మూలవాసులు చరిత్రను మట్టి దిబ్బల్లో దాచేసిన చరిత్రను తిరిగి నిర్మించుకోలేమా? 
 
దళితుల స్వయం సమృద్ధి సాధించలేరా!
 
దళితులు నేటికీ తమ హక్కుల కోసం పోరాటం సాగించాల్సిన అవసరం ఉందా, ఉంటే ఎందుకు ఉంది? 1927 మహద్ పోరాటం తోనే బాబాసాహెబ్ డా అంబెడ్కర్ దళితుల హక్కులు సాదించేరు ఆ స్ఫూర్తి గుండెల నిండా నింపుకున్న దళిత ఉద్యమం ఎస్సి, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1987 వరకూ నిరంతరం కొనసాగింది.  ఒకవైపు హక్కుల కోసం పోరాటం చేస్తూనే దళితుల స్వయం సమృద్ది కి ఆలోచన చెయ్యలేక పోయేరు దళిత మేధో సంపత్తి . అందుకే బెంగాల్ నామశూద్రులను ఈ దేశ దళిత ఉద్యమం అధ్యయనం చెయ్యాలి అని చెబుతూ ఉంటాను. 
 
స్వతంత్రంగా అభివృద్ధిని సాధించలేని సమాజం ఎంతోకాలం సామాజిక ఉద్యమాలను సాగించలేదని అనుభవపూర్వకంగా గ్రహించిన నామశూద్రులు స్వయంగా ఎదగటానికి ప్రణాళికలు రూపొందించుకుంది అందులో భాగంగా సామాజిక పరివర్తన, సంఘాల వ్యూహాలు, విద్య అనే మూడు ప్రధాన అంశాల మీద ద్రుష్టి పెట్టి దేశంలో స్వయం సమృద్ధిని సాధించిన మొట్టమొదటి అంటరాని కులం గా నామశూద్రులు కీర్తి గడించేరు. ఒకానొక సమయంలో వారు ధనిక కులాలను బహిష్కరణ చేసేరు అంటే వారి యొక్క పట్టుదల, ఆత్మగౌరవం ఎంతగొప్పదో చెప్పక్కర్లేదు. 
 ఆనాటితో పోలిస్తే ఇప్పుడు దళిత సమాజంలో అందరూ ఉన్నారు. అందరూ అంటే ఆర్ధికంగా అభివృద్ధి చెందిన వారు, విద్య పరంగా అభివృద్ధి చెందిన వారు, ప్రొఫెసర్లు, డాక్టర్ లు, ఇంజినీర్ లు, శాస్త్రవేత్తలు ,కవులు , కళాకారులు రాష్ట్రపతులు, కానీ నీ చరిత్ర కి ఈ సమాజంలో స్తానం ఎక్కడ? నీ అస్తిత్వానికి గుర్తింపు ఉందా? నీ సంస్కృతి గుర్తింపు ఉందా? 
 
నీ ఆహారపు అలవాట్ల మీద ఎవరో పెత్తనం ఏంటి? నువ్వు తినే తిండి ని లాగేసి ఎవడో ఏదో పెడతాను అంటే దానికి తలఊపడం ఏంటి? బ్రాహ్మణ వంటకాలు , వైశ్య వంటకాలు , క్షత్రియ ఆహారపు అలవాట్లు కమ్మ , రెడ్డి పేరిట వాళ్ళ అలవాట్లను వ్యవస్తీకృతం చేస్తుంటే వాటినే ఆరాధిస్తూ నోరు వెళ్ళబెట్టుకుని చూస్తుంది దళిత మేధో శక్తి? 
 
దళితులకూ ఆహారపు అలవాట్లు ఉంటాయని తెలుసా? దళిత వంటకాలలో ఒక కల్చర్ వుంది , ఆ కల్చర్ ని కాదని గడ్డి తినటానికి ముందు ఉంటున్నాం.   By virtue of their monstrous poverty and dehumanisation, Dalits do possess their own distinct culinary traditions. Do you belive this? దీనిని మీరు నమ్ముతున్నారా.? 
 
“Brahmins have hegemonized everything, including food,” ప్రొఫెసర్ కంచ ఐలయ్య అంటారు. నిజమే బ్రాహ్మణులు వారి అలవాట్లను, సంప్రదాయాలను  ప్రతిదీ వారి సంస్కృతిలో భాగంగా రాసుకున్నారు. మరి దళితులు ఎందుకు చెయ్యడం లేదు? 
 
ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే నీ జీవితం కూడా నీది కాదు ఎవరో రాసిన రాతల్లో నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు. అది ఆధునిక మనువు అయ్యుండొచ్చు, పురాణ పురుషుడు అయ్యుండొచ్చు. 
 
దురదృష్టం ఏంటంటే భారత దేశంలో ఎన్నో వంటకాల పుస్తకాలు వచ్చేయి, తెలంగాణ వంటకాలు అని పేరు పెట్టేరు కానీ దళిత ఫుడ్స్ అని పేరు పెట్టె సాహసం చెయ్యలేదు, అదే కుల వ్యవస్థ, అదే అణిచివేత  ఆ వ్యవస్థ ని చీల్చి చెండాడాల్సిన దళిత వర్గం దానినే ఆహ్వానించే స్థాయి కి వెళ్తుంది. 2010 లో ఛత్తీస్ ఘడ్ ని దర్శించిన బ్రిటీష్ సెలబ్రిటీ చెఫ్ గోర్ధన్ రామసే( Gordon Ramsay )కి  దురువ జాతి ( Dhuruva tribe) ఆదివాసీలు “ఎర్ర చీమల” పచ్చడి చేసి పెట్టేరు. కానీ ఇలాంటివి ఎక్కడా , ఏ పుస్తకంలో కనిపించవు దళిత , ఆదివాసీల సంస్కృతి , ఆహారపు అలవాట్లు బారత దేశ సంస్కృతి కానట్టుగానే ప్రవరిస్తున్నారు. 
 
ఈ తప్పు వాళ్ళది కాదు దళిత మేధావులదే, ఏ సమాజంలో అయినా 10 మంది ఇంజినీర్లు , డాక్టర్ లు , ప్రొఫెసర్లు, కవులు , కళాకారులు ఉంటే ఆ సమాజం అభివృద్ధి చెందుందని బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆశించేడు. కానీ దళితులు రోజు రోజుకీ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. మనువాద సంస్కృతి అనుసరిస్తున్నారు. ఇది భవిషత్ ని నిర్మించే పని కాదని దళితులు గుర్తించాలి. ఏ సమాజానికైతే సంస్కృతి ఉండదో ఆ సమాజం చనిపోతుంది. 
 
ఇప్పడు దళితులు , ఆదివాసీలు ఏమి చెయ్యాలి.? దళిత తత్వవేత్త కలేకూరి ప్రసాద్ అంటాడు 
మనం చేయాల్సిందల్లా  రాయడమే బాగా రాయడం 
వాళ్ళ ప్రమాణాల్లో వాళ్ళ ఆమోదం కోసం కాదు 
పువ్వులు వికసించినట్లు, నవ్వులు రాలినప్పుడు గుండెలు 
మండినట్లు. గట్లు తవ్వేటప్పుడు కందిమోడు గుచ్చుకుంటే 
గుండెలు కలుక్కుమనట్లు, అప్పటిదాకా కళ కళ లాడిన 
పల్లె పళ్ళెంతా స్మశానమై, పీనుగుల పెంటగా తయారైతే 
కోట్ల పిడికిళ్లు ఒక్కసారిగా బిగుసుకొని ఒక బ్రహ్మాండమైన మెరుపు మెరిసినట్లు మన భాషలో మనం రాయాలి . 
 
పల్లె పల్లెనా దళిత కోయిల పాడినట్లు 
గుండె గుండెనా పోరుమంటలు రాజుకున్నట్లు 
జాతర జాతరగా దళిత సమూహాలు 
ఈ గుండె గుండెల మీదగా ఊరేగింపై 
నడిచిపోతున్నట్లు గా మనం రాయాలి 
మన ప్రమాణం మన జనంలో చైతన్య జ్వాలలు రగల్చడం. 
 
(Visited 156 times, 1 visits today)
Also read  నరకాసురుడు ; దీపావళి పండగను దళిత, బహుజనులు ఎందుకు చెయ్యకూడదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!