దళిత ఇంటెలెక్చువల్స్ బానిసత్వన్ని ఎదుర్కుంటున్న అంబేడ్కర్ వారసులు!

షేర్ చెయ్యండి
  • 33
    Shares

 

దళిత ఇంటలెక్చువల్ బానిసత్వన్ని ఎదుర్కుంటున్న అంబేడ్కర్ వారసులు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు వేదిక గా బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారి వారసులుగా సామాన్య దళితులు ఎన్నికల్లో పోటీ చేసి చరిత్ర సృష్టించబోతున్నారు 

శతాబ్దాలుగా శూద్రులు / అంటరానివారు అంటే నేటి ఎస్సి , ఎస్టీ , బి సి లు  బ్రాహ్మణీయ నిచ్చెన మెట్ల కుల సంస్కృతి కి బాదితులుగా  అంధకారంలో గడిపారు.

 
1848 లో మహాత్మా పూలే , సావిత్రి భాయి బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసారు. 
 
1917 లో  బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు మహద్ చెరువు పోరాటం ద్వారా నిమ్న కులాలకు, జాతులకు మొట్ట మొదట హక్కులు ఉంటాయి, ఇంకెంతకాలం వారి హక్కులు నిరాకరించలేరంటూ పోరాటం చేసి విజయం సాధించారు. 
 
1930 మరియు 1932 మధ్య బారత దేశంలోని సవర్ణ హిందువుల్లో ఒక భయం ఏర్పడింది. ముక్యంగా గాంధీ ఆ భయాన్ని కాస్త ఎక్కువగానే అనుభవించాడు.
 
 అందుకే అప్పటి వరకూ నిమ్న కులాల ఉద్యమాన్ని మద్దత్తు ఇస్తున్నట్లు నటించిన సవర్ణ హిందువులు రౌండ్ టేబుల్ సమావేశాల లో జరిగిన పరిణామాలకు ఉలిక్కి పడ్డారు. 
 
బారత దేశ మూల వాసులు బ్రాహ్మణీయ కుల సంస్కృతి నుండి విడిపోయి , హిందూ మతాన్ని మైనారిటీ మతంలోకి నెట్టేస్తారనే ప్రమాదాన్ని గాంధీ గ్రహించారు. 
 
బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ బ్రిటీష్ సింహాసనాన్నికి కోట్లాది మంది పౌరులు ఎలాంటి హక్కులు లేకుండా బానిసలు కంటే దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని వివిధ సందర్భాలలో వారితో జరిపిన చర్చలు ఫలితంగా కమ్యూనల్ అవార్డు ద్వారా నిమ్న కులాలకు అంటే నేటి దళిత వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసారు. 
 
కాంగ్రెస్ , గాంధీ దీన్ని సహించలేకపోయారు. అంటరాని వారికీ ప్రత్యేక హక్కులా అంటూ పూణే ఎర్రవాడ జైలు లో ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటి చెంచాలకు ఆజ్యం పోసారు. 
 
డా. అంబేడ్కర్ అభిప్రాయం!
 
ఉమ్మడి నియోజక వర్గాలు హిందువులకు ( నేడు ఫ్యూడల్ కుల పార్టీలకు )ఒక వరంలా దొరికాయి. వీటి ద్వారా హిందువులు ( నేడు కుల పార్టీలు ) శాసన సభలోకి నామ మాత్రమై తమ చేతిలో కీలు బొమ్మలవలె ఆడే దళితులను మాత్రమే ఎంపిక చేస్తారు : బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్
 
బాబాసాహెబ్ ఊహించిన పరిణామం 1932 నుండి నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల వరకు జరుగుతూనే ఉంది. 
 
శతాబ్దాలుగా బ్రాహ్మణీయ కుల సంస్కృతి ,ఫ్యూడలిజం తమ రూపురేఖలు మార్చుకుంటూ హైడ్రా వలే జీవిస్తూ దళితుల, రాజకీయ, సామాజిక హక్కులను నిరాకరిస్తూ  అడ్డుకుంటుంది. 
 
బాబాసాహెబ్ అభిప్రాయం ప్రకారం ఇక ఉమ్మడి నియోజకవర్గాలతో ఎస్సి , ఎస్టీలకు అవసరం లేదు, ఎందుకంటే ఉమ్మడి శాసన సభ స్థానాలలో కుల రాజకీయ పార్టీల అనుకూల వ్యక్తులనే నియమిస్తారు. 
 
ఈ కీలు బొమ్మలలో దళిత ఇంటెలెక్చువల్స్ , ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులు, రిటర్మెంట్ అయిన ఉన్నత ఉద్యోగులు కూడా నేడు కీలు బొమ్మల లిస్ట్ లో ఉన్నారు.
 
బానిసత్వంలో దళిత ఇంటలెక్చుల్ వర్గం!
 
పుణా ఒప్పదం యొక్క దుష్ఫలితాల్లో  బాబాసాహెబ్ కల్పించిన రిసర్వేషన్స్ రిప్రజెంటిటీవ్స్ లో  ఐఏఎస్ , ఐపిఎస్ మరియు  గ్రూప్ -1 క్యాడర్ , ఇతర అఖిల భారత సర్వీస్ లో ఉన్నత ఉద్యోగులుగా ఎదిగిన కొందరు చేరారు. 
 
ఈ సూడో దళిత ఇంటలెక్చువల్స్ అబేద్కరిజం పేరుతొ సంఘాలు పెట్టి లేదా ప్రజా సేవ, సోషల్ సర్వీస్ అంటూ ఎస్సి , ఎస్టీ యువతను ఆకర్షిస్తూ కుల పార్టీలకు తొత్తులుగా ఉపయోగపడుతున్నారు. 
 
తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ దళిత మేధావి వర్గం ఫ్యూడల్ కుల రాజకీయ పార్టీ ల అవసరాల కోసం ఉపయోగపడుతున్నారు. 
 
శతాబ్దాలుగా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ దళిత సమాజాన్ని అణగదొక్కితే, అభివృద్ధి చెందిన కుల సంస్కృతి దళిత ఇంటలెక్చువల్స్ ని అడ్డంపెట్టుకుని దళితులను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు. 
 
తాజా మాజీ ఐఏఎస్ , ఐపీఎస్ లు మరియు ఇతర ఉద్యోగస్తులు సూట్కేసులు పట్టుకుని బిజెపి , తెరాస , వై సి పి , టిడిపి , కాంగ్రెస్ లాంటి పార్టీల చుట్టూ తిరుగుతుంటే, బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పినట్లు ఉమ్మడి నియోజకవర్గాలు, కాలం చెల్లిన రచ్చబండ లాంటివి. 
 
ఏ సమాజం అయితే 10 మంది ఇంజినీర్లు, డాక్టర్స్, లాయర్లు ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ బావించారు. 
 
దురదృష్టవశాత్తు నేడు అదే దళిత ఇంటెలెక్చువల్స్ ఉన్న సమాజం భూర్జువ పార్టీల కోసం పనిచేస్తూ వాళ్ళ గడప వద్ద పడిగాపులు కాస్తున్నారు. 
 
బానిస దళిత ఇంటెలెక్చువల్స్ ని ఎలా  ఎదుర్కోవాలి?
 
పుణా ఒప్పందం వలన కలిగిన దుష్ఫలితాల ప్రభావంగా జన్మించిన ఈ బానిస దళిత మేధోవర్గాన్ని లేదా కీలు బొమ్మలను, మాన్యశ్రీ కాన్షిరాం అన్నట్లుగా చెంచాల ను ఎదుర్కోవడానికి బాబాసాహెబ్ బోధించు పోరాడు, సమీకరించు అనే సూత్రాలను ఇచ్చారు. 
 
1948 ఏప్రిల్ 25 న లక్నో లో జరిగిన షెడ్యూల్ కులాల సమావేశంలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ రాజకీయం ద్వారా నే కీలు బొమ్మలను ఎదుర్కోవాలని ఎస్సి, బిసి కులాల మధ్య సక్యత కావాలన్నారు. 
 
దళితులు , వెనకబడిన కులాలు కలిస్తే మెజారిటీ వర్గంగా ఈ దేశాన్ని పాలించవచ్చు అని చెప్పారు. 
 
దళిత బిసి వర్గాలనే కాకుండా మిగతా అణిచివేయబడిన కులాలతో “దళిత శోషిత్ సమాజ్ ని స్థాపించారు. 
 
భూర్జువ పార్టీలలోని దళిత నాయకత్వాన్ని, అలాగే ఆ పార్టీలకు మద్దత్తు గా ఉన్న దళిత ఇంటెలెక్చువల్స్ ని రాజకీయంగా ఎదుర్కోవాలి. 
 
మెజారిటీ ప్రజలైన ఎస్సి , ఎస్టీ , బి సి లు ఇతర మైనారిటీ కులాలు ఒక వేదిక మీదకు వస్తే ప్రాంతీయ కుల పార్టీలను వారి పల్లకి మోస్తున్న దళిత మేధావి వర్గాన్ని కట్టడి చెయ్యవచ్చు, శాస్వితంగా అధికారం చేపట్టవచ్చు. 
 
బాబాసెహెబ్ అంతిమ లక్ష్యం దళితులు స్వతంత్రంగా నిలబడాలి, సొంత వేదికల ద్వారా ఆత్మగౌరవాన్ని చాటుకోవాలి. 
 
తెలంగాణా ఎన్నికలు – దళితులు 
 
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా ఎన్నికలు దళిత వర్గాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేయని చెప్పాలి. 
 
ఒక వైపు దళిత కుల నాయకులు , మేధావులు కాంగ్రెస్ , బిజెపి, తెరాస పార్టీల పంచన చేరి చెంచా యుగానికి ప్రతినిధులుగా ఉంటే, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ) రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( ఆర్ పి ఐ ) మరియు స్వతంత్ర అభ్యర్థులుగా బాబాసాహెబ్ కి ప్రతినిధులుగా నిలబడటం దళితుల రాజ్యాంధికారానికి  నాంది. 
 
చెంచా యుగం యొక్క దుష్పలితాల నుండి వచ్చిన ఫ్యూడల్ కుల పార్టీ లలో నాయకులు గా ఉన్న వారిని సామాన్య అంబేద్కరిస్టు లు ఎదుర్కుంటున్నారు. 
 
తెలంగాణా లో దళితుల గెలుపు దక్షణాది రాష్ట్రాలలో రాజకీయంగా మార్పులు తీసుకు వస్తుంది. 
 
ఒక విధంగా చెప్పాలంటే చారిత్రిక సందర్భం. 
(Visited 127 times, 1 visits today)
Also read  నయా సూత మహర్షులు-దళిత రాజకీయ నాయకులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!