దళిత క్రైస్తవులు: ఓటు బ్యాంకు రాజకీయంలో దళిత క్రైస్తవులు!

షేర్ చెయ్యండి
  • 83
    Shares

దళిత క్రైస్తవులకు ఎస్సి ( షెడ్యూల్ క్యాస్ట్ ) హోదా కల్పిస్తానని అసెంబ్లీ లో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు మరొకసారి ఎస్సి లను మోసం చేసే పక్రియ మొదలుపెట్టాడు. 


ఎస్సి రిజర్వేషన్లను వర్గీకరిస్తానంటూ 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు తనకి లేని హక్కును కల్పించుకుని కోర్టు ముందు బోర్లాపడిన అనుభవం మరవక ముందే మరోకసారి ఎస్సి లను మభ్యపెట్టడానికి తప్పుడు ప్రకటన చేసాడు. 


దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సి / ఎస్టీ ల ఓట్ల కోసం ఇన్నిరోజులు సంక్షేమ పధకాలు ప్రకటిస్తూ వస్తే చంద్రబాబు నాయుడు కులాలను వర్గీకరిస్తూ, గుత్తంగా ఒక వర్గం ఓట్లు పొందే కుట్ర రాజకీయం చేస్తున్నాడు. 


అంటరానితనం ఆధారంగా ఏర్పడిన షెడ్యూల్ కులాన్ని నేడు ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం తమకి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటూ వ్యవస్థలనే మోసం చేసే పనిలో ఉన్నారు. 


మతం మారితే ఎస్సి  హోదా ఎందుకు పోతుంది? 


దళితులు (ఎస్సి ) లు క్రైస్తవులు గా మారినా లేదా ఇస్లాం లోకి మారినా ఎస్సి హోదా ఆటోమాటిక్ గా తొలగిపోతుంది. కారణం క్రైస్తవం , ఇస్లాం మతాలు కులాలకు, వృత్తులు ఆధారంగా లేదా వారు నివసించే ప్రదేశం ఆధారంగా వివక్ష చూపించదు. దేవుడి ఎదుట అందరూ సమానం. 


కాబట్టి దళితులు క్రైస్తవులు గా మారిన యెడల వారికి ఎలాంటి కులం ఉండదు, వారి చేసే వృత్తులను బట్టి వివక్ష ఉండదు. 


కులం హిందూ మతానికి ఆయువు పట్టు,  వర్ణ వ్యవస్థ కాపాడటం హిందువుల ధర్మం. ఇదే గాంధీ పలుమార్లు నొక్కి చెప్పాడు. 

 
ఆధునిక భారత నిర్మాత బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు ఏమంటారంటే ” కులం అనేది వర్ణవ్యవస్థ యొక్క వికృత రూపం” గా అభివర్ణిస్తారు. 


ఆ కులాన్ని త్వజింజి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బుద్ధిజం లోకి మారితే, బాబాసాహెబ్ కంటే ముందు దళితులు క్రైస్తవులుగా, ముస్లిం లు గా, సిక్కు లుగా మారి కులం యొక్క రుగ్మత బారిన పడకుండా తప్పించుకున్నారు.

Also read  సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత: బెదిరింపు ధోరణిలో సుప్రీం కోర్టు తీర్పు!

 
ఏ కులాన్నైతే ఎస్సి లు వద్దనుకుని క్రైస్తవులు గా మారేరో అదే క్రైస్తవ్యం లో నేడు కులం బుసలు కొట్టడం వేలాది సంవత్సరాలుగా నర నరాణ పాతుకు పోయిన కుల వ్యవస్థ ను వదులు కోలేకపోవడం భారతీయుల దురదృష్టం.  


ఇక్కడ మళ్ళీ బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గారి మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి.దేశంలో  ఏ దిక్కుకు పోయినా మొదట ఎదురు పడేది కులమే అంటారు. 


క్రిస్టియన్ సంఘాలలో కుల వ్యవస్థ మీద, దళిత క్రైస్తవులకు ఎస్సీ లుగా గుర్తించడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


తమ పూర్వికులు కులం ద్వారా వచ్చే సౌకర్యాలు త్వజించి క్రైస్తవులుగా మారితే, వారి వారసులం రిజర్వేషన్లు కోసం ఎలా కులాన్ని ఆపాదించుకుంటామని పూర్ క్రిస్టియన్స్ లిబరేషన్  నాయకుడు ఆర్ ఎల్ ప్రాన్సిస్ అభిప్రాయ పడ్డాడు. 


క్రైస్తవం అంటే కులాలకు అతీతంగా, మానవత్వం కనబరిచే మతం. ఆ మతం  లోకి కులాన్ని తీసుకురావడం దిక్కుమాలిన చర్యగా ఫ్రాన్సిస్ భిప్రాయపడ్డాడు. క్యాదొలిక్ బిషప్ ల సంఘం (  (CBCI ) జాతీయ అధ్యక్షడు ఢిల్లీ లో జరిగిన ఒక సదస్సులో మాట్లడుతూ కులాన్ని క్రైస్తవం లోకి లాగడం వ్యతిరేకించాడు. 


ఇది ఇలా ఉంటే ఆర్ ఎల్ ఫ్రాన్సిస్ మాత్రం చర్చీలలో కుల వ్యవస్థను ప్రోత్సహిస్తుంది క్యాథలిక్ లే అని అంటున్నాడు. 


కులాన్ని క్రైస్తవం లోకి  తీసుకురావడం అంటే కుల వ్యవస్థను పెంచి పోషించడమే అవుతుంది, కుల నిర్ములనకు అడ్డంకిగా మారుతుంది. 


షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏమిటి?


షెడ్యూల్ క్యాస్ట్ గురించి అర్ధం చేసుకోవాలంటే ముందు ఆ పదం యొక్క పుట్టుక గురించి తెలుసుకోవాలి. షెడ్యూల్ క్యాస్ట్ పదం మొదట 1935 వ సంవత్సరంలో బ్రిటీష్ ఇండియా యాక్ట్ లో చేర్చడం జరిగింది. 


1936, ఏప్రిల్ 30 న ఇచ్చిన బ్రిటీష్ ఇండియా ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్డర్ పేరా నెం 3 లో మొట్టమొదటిసారిగా ఎస్సి లు క్రిస్టియన్స్ గా మారితే వారికి ఎస్సి హోదా పోతుందని వెల్లడించింది. 


హిందూ మతంలో ఉండి అంటరానివారిగా పరిగణిస్తూ, వివిధ నీచమైన వృత్తులు చేసుకుంటున్న వారిని 1880 లో బ్రిటీష్ ఇండియా  జనాభా లెక్కల (సెన్సస్ ) అధికారి సర్ డెంజిల్ ఇబ్బేట్సన్ ( Denzil Ibbetson )  17 గ్రూపులు గా గుర్తించాడు. వీరినే డిప్రెస్డ్ క్లాస్ (Depressed Class ) అన్నారు.

Also read  దళితులు మాత్రమే ఎందుకు అణిచివేతకు గురిఅవుతున్నారు?

 
1931 లో జరిగిన జనాభా లెక్కలలో  ఆనాటి జనాభా లెక్కల కమీషనర్ జె ఎస్ హట్టన్ (JS Hatton ) హిందూ మతస్తులుగా ఉంటూ అంటరానితనం అనుభవిస్తున్న వారిని గుర్తించడానికి కొన్ని మరికొన్ని మార్గదర్శకాలను  చేర్చాడు. 


1936 లో ఏర్పాటు చేసిన బ్రిటీష్ ఇండియా ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్డర్ ఆధారంగానే 1950 ప్రెసిడెంటల్ (షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్ధర్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.

 
బ్రాహ్మణ కుల ( హిందు మతం ) వ్యవస్థ వివిధ వృత్తులను చేసుకునే వారిని  ఏదైతే అంటరానివారిగా పరిగణిస్తూ గుడికి , బడికి , సమాజానికి దూరంగా వెలియబడి, సామాజికంగా, ఆర్ధికంగా, ఎలాంటి హక్కులు లేకుండా జీవిస్తున్నారో వారినే షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సి ) గా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం, స్వాతంత్రం తరువాత భారత ప్రభుత్వం పరిగణించింది. 


1950 ప్రెసిడెంటల్ ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్డర్ కంటే ముందే అంటే బ్రిటీష్ ఇండియా కాలంలోనే ఎస్సి లు క్రైస్తవం లోకి మారితే ఎస్సి హోదా పోతుందని చట్టం చేయబడింది. 


ప్రజాస్వామ్య దేశంలో అంతిమ తీర్పు ఓటర్లదే కాబట్టి ఓటర్లను ఆకర్షించటానికి రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలలో దళిత క్రైస్తవులను ఎస్సి లుగా గుర్తిస్తాం అనేది ఒకటి. 


2013 లో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కి పంపిన ఉత్తరం లో క్రిస్టియన్ మతం ను అనుసరిస్తున్న దళితులను సిక్కు , బుద్దిస్ట్ దళితులకు ఇచ్చినట్లు గా ఎస్సి హోదా ఇవ్వాలని పేర్కొంది. 


దళిత క్రైస్తవులను  ( ఎస్సి ) లుగా గుర్తించాలంటే ప్రెసిడెంటల్ ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్డర్ 1950 లోని పేరా 3 ని తీసివేయాలి. 


1950 ప్రెసిడెంటల్ ( షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్డర్ పేరా 3 ఏమిచెబుతుందంటే హిందు, సిక్కు , బుద్ధిజం కాకుండా మరే ఇతర మతస్తులను షెడ్యూల్ కులం గా పరిగణించరాదు. 


ఈ ప్రెసిడెంటల్ ఆర్డర్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్రిందకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ప్రకటన దళిత క్రైస్తవులను ఎస్సి లుగా గుర్తించడం అనేది రాజ్యాంగ సవరణకు సంభంధించినది లేదా రాష్ట్రపతి తమ విచక్షణా అధికారాలు ఉపయోగించి ఆర్టికల్ 341 (1) ని సవరించాలి. 

Also read  మహారాష్ట్ర ఎన్నికలు 2019: 17 లక్షల దళితుల, 10 లక్షల ముస్లింల ఓట్లు మిస్సింగ్!


తమ పరిధిలో లేని అంశాలను రాజకీయం చేస్తూ ప్రజల మనోభావాలను ఓట్ల మలుచుకోవడం లో ఫ్యూడల్ కులాల రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ, అందులో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కెప్టన్. 


అయితే ప్రెసిడెంటల్ (షెడ్యూల్ క్యాస్ట్ ) ఆర్డర్, 1950 పేరా 3, రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 15 లకు విరుద్ధమని , ఇది బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కల్పించిన మత స్వేచ్చకు విరుద్ధమని చాలా వాజ్యాలు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.

 
సుప్రీం కోర్టు మాజీ  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాధ మిశ్రా కమీషన్ కూడా  ఇతర మతంలోని దళితులను , దళితులుగా గుర్తించాలని తన కమీషన్ రిపోర్ట్ లో ప్రకటించారు. 


ప్రెసిడెంటల్ (షెడ్యూల్ క్యాస్ట్ ) 1950 లోని పేరా 3 ని రద్దు చెయ్యాలని భారత పార్లమెంట్ లో ఒక ప్రైవేట్ బిల్ 1996 నుండి పెండింగ్ లో ఉంది. 


ప్రస్తుతం పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్లమెంట్ సభ్యుల చేత ఆ ప్రైవేట్ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. (Visited 169 times, 1 visits today)

One thought on “దళిత క్రైస్తవులు: ఓటు బ్యాంకు రాజకీయంలో దళిత క్రైస్తవులు!

  • 09/02/2019 at 1:18 PM
    Permalink

    బుద్ధిజంలోకి దళితులు మారాలి మూఢనమ్మలకి క్రైస్తవ మతం హిందు మతానికి ఏమాత్రం తీసిపోదు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!