దళిత నాయకులు: ఆంధ్రా మార్క్సిజం చరిత్రలో కానరాని దళిత నాయకులు!

షేర్ చెయ్యండి
  • 236
    Shares

 

 
దళిత నాయకులు ఏ రాజకీయ పార్టీ లో ఉన్నా వారు వివక్షకు గురికాక తప్పదు. వారి చరిత్రను నీటి మీద రాస్తారు.
 
దేశంలో మార్క్సిజం – లెనినిజం కుడా కులం ముందు దిగదుడుపే. తెలుగు ప్రాంతం లో కాంగ్రెస్ – రెడ్డి పెత్తందారీ తనాన్ని ఎదుర్కోవడానికి కమ్మ భూస్వామ్య వర్గం కమ్యూనిజాన్ని ఆశ్రయించక తప్పలేదు. 
 
కమ్మ కమ్యూనిస్ట్ లు రైతు కూలీల కోసం, అట్టడుగు వర్గాల శ్రామిక విముక్తి కొరకు పోరాడతామంటూ దళితులను ఆశ్ర యించింది.
 
1917 లో జరిగిన రష్యా విప్లవ తిరుగుబాటు విజయ గాధలు ప్రపంచ వ్యాప్తంగా శ్రామికులను, పీడిత కులాలను బాగా ఆకర్షించింది. 
 
తెలుగు లో కూడా అనేక మంది ఔత్సహిక కమ్యూనిజస్ట్ లు రష్యా విప్లవ తిరుగుబాటు గురించి  పేజీలకు పేజీలు రాసి యువతను ఆకర్షించారు. 
 
రష్యా విప్లవ విజయగాధ నుండి మార్క్సిజం బాట పట్టిన వారిలో దళిత నాయకులు కూడా ఉన్నారు. 
 
ఆనాడు మార్క్సిజం యొక్క వర్గ పోరాటం లో కీలక పాత్ర పోషించిన వారిలో దళితులు ఉన్నారు. 
 
అయితే  భారత మార్క్సిస్టు – లెనినిస్టు ఉద్యమ చరిత్రలో వీరు ఎక్కడా కనిపించరు. సమసమాజం కోసం అంటూనే కమ్మ, రెడ్డి కుల నాయకులకే అధిక ప్రాధాన్యాత, వారి చరిత్రలు రాసుకున్నారు. 
 
కుల వ్యవస్థ అంటే కేవలం పని విభజన కాదు, అది కార్మికుల విభజన కూడా అంటారు సామాజిక తత్వవేత్త బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 
 
ఈ దేశంలో కమ్యూనిజం యొక్క ప్రాభల్యం ఒక వెలుగు వెలిగింది అంటే అది దళితుల వలనే. 
 
నాయకత్వ ప్రతిభ, ప్రసంగించే కళ, ఆటా – మాట, రచన, పాట , హరికథ, ఒగ్గు కథ తదితర రంగాల్లో దళితులకు ఉన్న నైపుణ్యం కారణంగా దళిత నాయకులు ఆనాడు   కమ్యూనిస్ట్ నాయకులుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. 
 
కమ్యునిజానికి ఆయువు పట్టు జానపద కళలు. దళితులే కమ్యూనిజం కోసం ఆడారు – పాడారు. 
 
కమ్యూనిస్టు – దళిత నాయకులు:
 
నంబూరి శ్రీనివాసరావు, కృష్ణ జిల్ల బండారుగూడెం చెందిన నంబూరి శ్రీనివాసరావు, ఆనాడు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో ఒకరు.
 
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జీవితం ప్రారంభించి, ఆది – ఆంధ్ర ఉద్యమంలో కృష్ణా జిల్లా లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి నంబూరి శ్రీనివాసరావు. 
 
1937, ఆగస్టు 22 న తూర్పు గోదావరి జిల్లా లో జరిగిన 6 వ ఆది ఆంధ్ర మహాజన సభ కు ఆహ్వాన కమిటీ సెక్రటరీ గా పనిచేశారు. 
అంతే కాదు తూర్పు గోదావరి జిల్లా లో  దళితలతో వ్యవసాయ కూలీల సమాఖ్య ఏర్పాటు చేశారు. 
 
1939 ఏప్రిల్ 8 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా,  రాజోలు తాలూకా కొత్త పేట గ్రామంలో  నిమ్న జాతుల వ్యవసాయ కూలీల రెండవ సభను ఆది ఆంద్ర మహాజన సభ తో కలిపి నిర్వహించారు. 
 
నంబూరి శ్రీనివాసరావు తన ఉద్యమంలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు హరికథ రూపంలో ప్రజలను చైతన్య పరిచేవారు. 
 
గ్రామాల్లో హరికథ లు ద్వారా కమ్యూనిజాన్ని ప్రచారం చేస్తూ, ఉద్యమంలో పాల్గొంటూ   1940 నాటికి ఆయన కమ్యూనిస్టు నాయకుడిగా బాగా పాపులర్ అయ్యేడు. 
 
బ్రిటీష్ సామ్బ్రజ్య వాదానికి వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్దానికి వ్యతిరేకంగా హరి కధ ల ద్వారా ప్రచారం చేసేవారు. 
 
1940 మే 1 వ తేదీన వెయ్యి మంది రైతు కూలీలతో రాజోలు తసల్దార్ ఆఫీసును ముట్టడించాడు. పంటలకు గిట్టు బాటు ధర , భూమి లేని వ్యవసాయ కూలీలకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేసాడు. 
 
నంబూరి శ్రీనివాస రావు ని పోలీసులు నిర్బంధించి వేలూరు జైలు లో సంవత్సరం పాటు ఉంచారు. సంవత్సరం తరువాత కూడా పోలీసులు అయినను  జైలు నుండి  విడుదల కాకుండా అడ్డుకునేవారు. 
 
పుట్టింది కృష్ణా జిల్లా అయినా నంబూరి శ్రీనివాస రావు ఉద్యమకారుడి గా అట్టడుగు దళిత కూలీల కోసం స్థిరపడింది తూర్పు గోదావరి జిల్లా లోనే. 
 
కాకినాడ ఫైబర్ కూలీల స్ట్రైక్ కి నాయకత్వం వహించారు. సెక్షన్ 144 ని కూడా లెక్క చెయ్యకుండా కూలీల తో సభ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ అధికారులను, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. 
 
1948 జూన్ 29 న శ్రీనివాసరావు ని అరెస్ట్ చేసి వెల్లూరు , రాజమండ్రి  కడలూరు తదితర జైలు కి తరలించారు. జైలు కాలంలో మద్రాసు ప్రభుత్వానికి రైతు కూలీ సమస్యలు , నిర్బంధం మీద ఉత్తరాలు రాసేవారు. 
 
జైలు నుండి విడుదల అయిన తరువాత అంతర్వేది పాలెం లో 11 రోజుల పాటు యువత కి రాజకీయ, ఆర్ధిక శిక్షణా తరగతులు నిర్వహించారు. 
 
బేతాళ ఏసుదాసు : గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా దావులూరు కు చెందిన బేతాళ ఏసుదాసు ఆనాటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో ఒకరు. 
 
దళితుడు కావడంతో ఈయన ఉద్యమ చరిత్ర కూడా కుల కమ్యూనిస్టు లు మరుగున పరిచారు.   
 
ప్రభుత్వ ఉపాధ్యాయుడి గా పనిచేస్తూ చుట్టు పక్కల గ్రామాల్లో రైతు కూలీల ను చైతన్య పరచడం లో ప్రముఖ పాత్ర వహించారు. 
 
పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఏసుదాసు కర్ర , కత్తి సాములో నేర్పరి. ప్రజలకు మిలటరీ శిక్షణ ఇచ్చేవారు. ఆయుధాలు లేకుండా ఎలా పోరాడాలో తర్ఫీదు ఇచ్చేవారు. 
 
కమాండర్ గా  బేతాళ ఏసుదాసు ని పిలిచేవారు. దళిత వర్గాలకు నాయకత్వం వహించడమే కాకుండా తెనాలి లో జరిగిన అనేక ఉద్యమాలకు కమాండర్ గా వ్యవహరించారు. 
 
1945 లో దావులూరు లో కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసారు. 1945 డిసెంబర్ 15 నుండి 1946 ఏప్రిల్ 8 వరకూ తెనాలి తాలూకా లో అనేక రైతు కూలీ ఉద్యమాలు నిర్వహించారు. 
 
బేతాళ ఏసుదాసు అంటే ఆరోజుల్లో చుట్టు పక్కల గ్రామాల్లో టెర్రర్. ఉద్యమకారులను దాడులు చేయమని ప్రోత్సహించేవారు. 
 
గ్రామాల్లో పర్యటించేటప్పుడు బేతాళ ఏసుదాసు చేతిలో ఎప్పుడూ పెద్ద కర్ర చేతిలో ఉండేది. కర్ర లేకుండా బయటకు వచ్చేవారు కాదు. 
 
గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కమ్యూనిస్టు పార్టీ లో చేరాల్సిందిగా బెదిరించేవారు. ఇతని ఆగడాలకు బయపడి కాంగ్రెస్ భూస్వాములు గ్రామాలు వదిలి తెనాలి కి మకాం మార్చేవారు. 
 
1948 లో బేతాళ ఏసుదాసు ని పోలీసులు అరెస్ట్ చేసి తమిళనాడు లోని కడలూరు జైలుకి తరలించారు. 
 
సంవత్సరం తరువాత విడుదల అవుతున్న సందర్భలో గుంటూరు కలెక్టర్ ఏసుదాసు ని విడుదల చెయ్యవద్దు అంటూ మద్రాస్ మేజిస్ట్రేట్ కి ఉత్తరం రాసారు. 
 
1949 ఆగస్టు 19 వ తేదీన కడలూరు జైలు నుండి విడుదల అయ్యారు.  ఏసుదాసు ను మళ్ళీ 1950 లో గుంటూరు కలెక్టర్ మద్రాసు ప్రభుత్వానికి లేఖలు రాసి అరెస్ట్ చేయించారు. 
 
నంబూరి శ్రీనివాసరావు, బేతాళ ఏసుదాసు లాంటి దళితులే కాదు, విజయవాడకు చెందిన  తుపాకుల సింహాచలం లాంటి రెల్లి కుల నాయకుడు, గుంటూరు బాపనయ్య లాంటి ఎందరో దళితులు కమ్యూనిజం కోసం జీవితం త్యాగం చేసారు. 
దళిత నాయకులు – కుల వివక్ష:
కుల వివక్ష వలన  కమ్యూనిజం చరిత్రలో వీరు లేకపోవచ్చు, వీరి నిబద్దత్త, నాయకత్వం, పోరాట పటిమ, నిజాయితీ ఎప్పటికీ ఆ ప్రాంత ప్రజల్లో నిలిచేవుంటుంది. 
 
కుల వివక్ష రోజువారి జీవితంలో మనకి తారసపడుతూనే ఉంటుంది. రాజకీయాల్లో కానీ, సామాజిక కార్యక్రమాల్లో కులం కనిపిస్తూనే ఉంటుంది. 
 
కేవలం కులం కారణంగానే నంబూరి శ్రీనివాస రావు, బేతాళ ఏసుదాసు లాంటి ఎందరో దళిత నాయకులు కమ్యూనిస్ట్ రాష్ట్ర నాయత్వంలో కనిపించరు. 
 
యాభై ఏండ్ల సిపియం పాలిట్ బ్యూరో చరిత్ర లో బ్రాహ్మణులు, నాయర్లు , క్షత్రియు లు, అప్పుడు, అప్పుడు ఓబిసి లే తప్పా దళితులకు స్తానం కల్పించలేదు. 
 
1952 లో జరిగిన జెనరల్ ఎన్నికల్లో బొంబాయి నుండి పోటీ చేసిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ గెలవకూడదని ప్రచారం చేసారు.
 
  కమ్యూనిస్ట్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు శ్రీపాద ఢాంగే బ్యాలెట్ బాక్స్ లో నీళ్లు అయినా పోసి బాబాసాహెబ్ గెలవకూడదని ప్రచారం చేస్తాడు. 
 
కాంగ్రెస్ లో దళిత నాయకులను చూసిన విధంగానే మార్క్సిజం లో దళితులను అదే కంటితో చూసారు. ఈ దేశంలో కమ్యూనిజం, కమ్యూనిస్ట్ నాయకులు చెప్పేదంతా బోగస్ అంటాడు పెరియార్ రామస్వామి. 
 
కమ్యూనిస్టు లు ఏమి చేస్తున్నారు భూస్వాములను , ముస్లిం లను నిందించడమే కదా!  అంటరానితనం, కులం విషయంలో వారు ఏమీ మాట్లాడటంలేదు. 
 
గాంధీ వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యలేదు.  కాంగ్రెస్ నాయకుడు  రాజాజీ ( బ్రాహ్మణులు సంతోషంగా , రాజ్యాధికారం లో ఉండాలనే కోరుకునే వ్యక్తి ) కి   వ్యతిరేకంగా  ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 
 
పెరియార్ దేశ యువతను  కమ్యూనిస్టులను నమ్మొద్దు అంటాడు. వారి మోసపు మాటలకు ఆకర్షణకు కావద్దని పిలుపు ఇచ్చేడు. 
 
నాటి నుండి నేటి వరకూ దళిత వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసమే రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నారు. 
 
1990 వ దశకంలో వచ్చిన మార్పులతో దళితులు కమ్యునిజం నుండి దూరంగా జరుగుతూ వస్తున్నారు. భారత దేశంలో 1990 నుండే  కమ్యూనిస్ట్ ఎర్ర జెండా మసకబారుతూ వస్తుంది. 
 
 
 
 
 
 
 
(Visited 396 times, 1 visits today)
Also read  మహారాష్ట్ర ఎన్నికలు 2019: 17 లక్షల దళితుల, 10 లక్షల ముస్లింల ఓట్లు మిస్సింగ్!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!