దళిత పాంథర్స్: నాందేవ్ దస్సాల్

షేర్ చెయ్యండి
  • 170
    Shares

దళిత పాంథర్స్, చరిత్ర తెలియని వారు, చరిత్రను నిర్మించలేరని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పినమాట.

సామ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించిన అఖండ బౌద్ధ రాజ్యాన్ని దోచుకున్న ఆర్యుల చరిత్ర పదిలంగా ఉంది.

 
ఆర్యుల నుండి రాజ్యాన్ని తీసుకున్న ముస్లిం రాజుల చరిత్ర ఉంది. 500 వందల సంవత్సరాలు పరాయి పాలనలో బ్రతికిన భారతీయుల చరిత్ర ఉంది. 


వారికంటే ముందు ఈ దేశాన్ని దోచుకున్న గ్రీకులు , పహ్లవులు, యవనులు, శకుల చరిత్ర ఉంది, మరి ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో పెరిగిన మూలవాసుల చరిత్ర ఎందుకు లేదు. ఎందుకు మట్టితో కప్పివేయబడింది.


సింహాలు చరిత్ర రాయకపోతే వేటగాడు కుప్పిగంతులే చరిత్రగా చదువుకోవాలని ఆఫ్రికన్ సింహాలు చెప్పిన సత్యం. 


ఈ దేశంలో పుట్టిన అలాంటి సింహమే నాందేవ్ దస్సాల్, ఊరికే నాందేవ్ దస్సాల్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.  “దళిత పాంథర్స్” నాందేవ్ దస్సాల్ అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 


దళిత పాంథర్స్ నాందేవ్ దస్సాల్, చలి చీమలకి కూడా తిరుగుబాటు చెయ్యాలనే ధైర్యం ప్రేరణ  వస్తుంది.

 
1972 లో దళిత పాంథర్స్ గా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వ్యక్తి నాందేవ్ దస్సాల్. బాబాసాహెబ్ డా అంబేడ్కర్, మహాత్మా ఫూలే అడుగుజాడల్లో తన అస్తిత్వాన్ని వెతుకుంటూనే అమెరికన్స్ “బ్లాక్ పాంథర్స్ ” ఉద్యమ స్పూర్తితో భారత దేశంలో దళిత పాంథర్స్ స్థాపించిన వ్యక్తి నాందేవ్ దస్సాల్. 


నాందేవ్ దస్సాల్ జీవిత చరిత్ర!


నాందేవ్ ధసాల్ 1949 లో పూణే కి దగ్గర లోని  ఖేడ్ తాలూకా, పుర్ అనే గ్రామంలో ఒక నిరుపేద మహర్ కులం లో జన్మించారు. నాందేవ్ ధసాల్ కి 6 సంవత్సరాల వయస్సు లో తల్లితండ్రులు గ్రామం నుండి ముంబయి కి వలస వెళ్లారు . 

నాందేవ్ ధసాల్ బుద్ధిష్ట్ గా జీవనం సాగిస్తూ వస్తూనే అమెరికన్ బ్లాక్ పాంథర్స్ ఉద్యమం యొక్క స్ఫూర్తి తో 1972 తన స్నేహితులతో కలిసి ‘దళిత పాంథర్స్’ ఉద్యమాన్ని స్థాపించాడు. 

Also read  కాన్షిరామ్: దళితుల  రాజ్యాధికారం ద్వారా కుల నిర్ములన సాధించగలమా?  

సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా సమాజాన్ని నిర్మించాలని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ , మహాత్మా ఫూలే , సాహు మహారాజ్ వారసత్వ ఉద్యమాలకు మద్దత్తు గా దళిత్ పాంథర్స్ ని స్థాపించడం జరిగింది. 

నాందేవ్ ధసాల్ ఉద్యమకారుడే కాదు మంచి కవి, రచయిత కూడా. ధసాల్ తన మొదటి కవిత సంకలనం ‘గొల్పిత’ ను 1972 లో ప్రచురించాడు

అంతేకాకుండా ధసాల్  ‘మూర్ఖ మ్హతరాయనే’ ( By a foolish old man ),  ఆనాటి నక్సలైట్ ల స్ఫూర్తి తో ‘తుజేహి లిత్త కంచి’ ( How educated are you) , ఎరోటిక్ ఖేల్ మరియు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ప్రియదర్శిని అనే గ్రంధాలను రాసాడు. 

నాందేవ్ ధసాల్ రెండు నవల లను రాసాడు. ఆలాగే కరపత్రాల రూపంలో అంధలే శతక్ (Century of blindness), మరియు అంబేడ్కర్ చల్వాల్ (Ambedkar movement) పేరుతొ బాబాసాహెబ్ యొక్క సామాజిక, విప్లవ దృక్పధం గురించి రాసారు. 

ఆ తరవాత మరో రెండు కవితా సంకలనాలు ప్రచురించారు. ‘ మి మారలే సూర్యచ్య రథాచే సత్ గోడే ‘ ( I killed the seven horses of the sun ) మరియు తుఝే బోత్ ధరూన్ మి ఛలలో ఆహే ( I am walking, Holding your fingar) 

కవితలే కాకుండా మరాఠీ పేపర్ సామాన లో వ్యాసాలు రాసేవారు. అంతకు పూర్వం సత్యత అనే వార పత్రిక లో ఏడిటర్ గా పనిచేసారు. 

దళిత్  పాంథర్స్ ఉద్యమం: 

నాందేవ్ ధసాల్ అతని స్నేహితులు అయినా జెవి పవర్ , అరుణ్ కాంబ్లీ లతో కలిసి అమెరికా నల్లజాతీయుల హక్కుల ఉద్యమం బ్లాక్ పాంథర్స్ స్పూర్తితో ఇండియా లో దళిత పాంథర్స్ స్థాపించారు. 

దళిత ఉద్యమానికి రాడికల్ ఉద్యమ మదత్తు గా తమకు తాము ప్రకటించుకుని బాబాసాహేన్ డా అంబేడ్కర్ , మహాత్మా ఫూలే మరియు కార్ల్ మర్క్స్ విప్లవ పందాలతో మిలిటెంట్ ఉద్యమం స్థాపించారు. 

Also read  సోషల్ మీడియా-యువ చైతన్యం!

మహర్ లకు ఉన్న సైనిక మరియు పోరాట గుణం తో వీరు బ్లాక్ పాంథర్స్ పంధాని అనుసరించారు. అమెరికన్ బ్లాక్ పాంథర్స్ ఉద్యమం వీరి ఉద్యమాన్ని గుర్తించి మద్దత్తు ఇస్తూ బ్లాక్ పాంథర్  వార్త  పేపర్ లో దళిత్ పాంథర్స్ గురించి రాసేవారు. 

1967 – 1980 మధ్య కాలంలో బ్లాక్ పాంథర్ వార పత్రిక ప్రపంచమంతా పంపించేవారు. 

దళిత పాంథర్స్ ఉద్యమంలో పనిచేసిన వారు ఎక్కువ శాతం యువకులు, ఈ యువత ఎక్కువగా నవయాన బుద్దిస్ట్ లు. 

ఈ ఉద్యమంలో ఎక్కువగా నాయకత్వం వహించింది, పనిచేసింది రచయితలు, అలాగే నిరక్ష్యరాసుడు దగ్గర నుండి మాస్టర్స్ డిగ్రీ చేసిన వారి వరకు సంస్థలో మెంబర్స్ గా ఉన్నారు. 

దళిత పాంథర్స్  సొంత పత్రిక సాధన పేరుతొ నిర్వహించేవారు. ఈ పత్రికలో 1972 ఆగస్టు నెలలో రాజ ధలే ‘కాలా స్వతంత్ర దిన్’ ( Black Independence day) అనే వ్యాసం రాసారు. 

ఈ వ్యాసం అప్పట్లో మహారాష్ట్ర మొత్తం పెద్ద సంచలనం కలిగించింది. ఈ వ్యాసం రాసిన రాజ్ ధలే కి దళిత పాంథర్స్ మద్దత్తు పలికారు. 

ఆ తరవాత రాజ్ ధలే దళిత పాంథర్స్ లో ముఖ్య నాయకుడిగా ఎదిగేడు. 

దళిత పాంథర్స్ లో ఇతర కులస్తులను చేర్చుకోవడం పెద్ద వివాదాస్పదం అయ్యింది, అది దళిత పాంథర్స్ యొక్క భవిషత్ ని ప్రశ్నర్ధాకంలో కి నెట్టి వేసింది. 

ఒకానొక సందర్భంలో బాబాసాహెబ్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకత్వం గ్రూపులుగా విడిపోయిన సందర్భంలో దళిత పాంథర్స్ ఆ గ్యాప్ ని పూర్తి చేస్తుందని భావించారు. 

1982 లో దళిత పాంథర్స్ చీలిక దిశగా అడుగులు వేసింది. దళిత పాంథర్స్ గ్రూపులుగా విడిపోయింది. మహారాష్ట్ర లో అనేక దళిత పాంథర్స్ పుట్టుకొచ్చాయి. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలలో కూడా దళిత పాంథర్స్ సంఘాలు ఏర్పడ్డాయి. 

Also read  భారతీయట్రైబల్ పార్టి: అస్తిత్వ ఉద్యమం నుండి రాజ్యాధికారం వైపు!

పాపులర్ అయిన దళిత పదం. 

ఎస్సి లను దళితులుగా ఒక సామాజిక సంస్కృతిలో ఐక్యం అవడానికి అవకాశం వున్న పధం దళిత. నాందేవ్ ధసాల్ దళిత మాటను అందరూ ఉపయోగించుకోవచ్చు అని పేర్కొంటే , కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తపరిచారు. దళిత సాహిత్యం అనే మాట చాలా పాతది అంటాడు ధసాల్. 

1958 లోనే బాబురావు బగుల్  దళిత పదాన్ని సాహిత్యం లో వాడినట్లు నాందేవ్ ధసాల్ అంటాడు. సాహిత్యంలో ధసాల్ కి ప్రేరణ బాబురావు బగుల్. 

నాందేవ్ ధసాల్ కి సాహిత్యం, దళిత ఉద్యమం రెండూ ఇష్టమైన పనులే. ఒంటరిగా కూర్చుని సాహిత్యం రాసుకోవడం ఎంత ఇష్టమో, వైశ్య లతో కలిసి వారి హక్కుల కోసము చేస్తున్న పోరాటంలో నేనుకూడా బాగాస్వాయం అవడం ఎంతో ఇష్టము అంటాడు. 

దళిత పాంథర్స్ కి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇండియన్ రిపబ్లికన్ అనే పార్టీని స్థాపించారు. ఇందులో దళిత పార్టీలు విలీనం చెందాయి. 

నాందేవ్ ధసాల్ తన కవితలలో తాను ఎక్కడ నుండి వచ్చాడో ఆ ప్రాంత, ఆ కమ్యూనిటి బాషను వాడేవారు. అంటే దళితులు వాడే మాటలు, భావాలను తన కవితల్లో రాసేవారు. 

ఇది ఆరోజుల్లో పెను సంచలనం కలిగించింది. తెలుగులో మనకి మద్దూరి నగేష్ బాబు ఈ కోవకు చెందినవాడే. 

1999 లో నాందేవ్ ధసాల్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అంతేకాకుండా 2004 లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు. 

నాందేవ్ ధసాల్ 2013 లో కాన్సర్ బారినపడ్డాడు, అప్పటి నుండి కాన్సర్ మీద పోరాటం చేస్తూ జనవరి 15, 2015 లో తుది శ్వాస విడిచారు. 

(Visited 330 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!