దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా? తెలంగాణా, ఆంధ్రాలో దళితులు రాజ్యాధికారం సాధించగలరా?

షేర్ చెయ్యండి
  • 71
    Shares

 

దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా ? బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ ) ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా లో రాజకీయ కార్యకలాపాలు చెయ్యకపోవడం వలన దళితులు ( ఎస్సి / ఎస్టీ ) లు ఆల్టర్నేట్ రాజకీయ పార్టి కోసం ఆలోచిస్తున్నారు. 
 
దళితుల్లో ఎవరైనా కోటి రూపాయలు ఫండ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అనే ఒక స్టేటస్ సోషల్ మీడియా లో వచ్చింది. ఫేస్ బుక్ లో ఆ ప్రకటన కి పెద్ద గా రెస్పాన్స్ లేదు. సమాదానాలు చెప్పిన వారు  ఎక్కువగా నెగిటివ్ గా నిర్వేదం, నిస్సహాయత తో సమాదానం తమ కామెంట్ల రూపంలో చెప్పారు. 
 
అంటే వీరికి తమ  ఆర్ధిక శక్తి మీద నమ్మకం లేదు.సహజంగా ఊహించడం కూడా కష్టం అవుతుంది. దళితులు ఇంకా కిలో రూపాయి బియ్యం తినేవారు గానే ఉన్నారు అనుకుంటున్నారు. 
 
ఈ రోజుల్లో కోటి రూపాయలు పెద్ద సమస్య కాదు. మన వాళ్లు ఎన్నికల్లో మన కోసం రిజర్వుడు కాబడిన సీటు కోసం 20-30 కోట్లు డోనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ నేపధ్యంలో ఎస్సి / ఎస్టీలు 2019 లో కూడా సొంత పార్టీ తో ఎన్నికల బరిలో  నిల బడటం లేదని అర్ధం అవుతుంది. ఒక పార్టీ పెట్టి కనీసం 100 కోట్లు కూడా ఫండ్ దళిత సమాజం నుండి తెచ్చుకోలేమా ?
 
ఆ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ తో మాట్లాడుతున్న సందర్భంలో వైజాగ్ నుండి కృష్ణ జిల్లా వరకు చర్చీలకు నెలకు చందాలు రూపంలో కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి మరి దళితుల వద్ద డబ్బు లేకపోతే చర్చీలు ఇంత డబ్బు ఎలా జెనరేట్ చేస్తున్నాయి అని చర్చ వచ్చింది.
 
బేసికల్ గా ఎస్సి లలో కౌంటట్ కల్చర్ లేకపోవడం ,  వేలాది సంవత్సరాలు బానిస భావజాలం లో ఉండటంతో ప్రజలను నాయకులు సొంతగా రాజకీయం చెయ్యవచ్చు అని ప్రేరణ కల్పించ లేక పోతున్నారు.
 
ఇక్కడ ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పాలి. సంవత్సరం క్రితం ఒక దళిత నాయకుడు పార్టీ పెడుతున్నాను అని చెప్పేసరికి  ఒక గంట సమయం  లో అక్షరాల లక్ష రూపాయలు డొనేషన్ గా ఇచ్చేరు. ఆ మీటింగ్ లో ఉన్న జనాభా కేవలం వంద లోపే. 
 
దళితుల మీద దాడి జరిగిన సంఘటన లో ర్యాలీ కోసం అంటూ నెల రోజుల క్రితం దాదాపుగా 2 లక్షలు ఖర్చు పెట్టెరు. అవి కూడా  చందాల రూపంలో తీసుకున్నవే. 
 
బాబాసాహెబ్ ఏమన్నారు ‘ఏ సమాజంలో అయినా 10 మంది ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు’ బాబాసాహెబ్ ఉద్దేశ్యం అది విద్యలో కావచ్చు. లేదా ఆర్ధిక స్థితిలో కావచ్చు. 
 
నేడు ఎస్సి , ఎస్టీల లో ఆల్ ఇండియా సర్వీస్ లో చాలా మంది ఉన్నారు. గ్రూప్ 1 ,2 లో కూడా ఉన్నారు. డాక్టర్స్, ఇంజినీర్లకు కొదవ లేదు. మరి దళిత సమాజం ఎందుకు వెనకబడిపోతుంది. ఇంకా బర్రెలు, గొర్రెల లోన్లు కోసం ప్రాకులాడే స్థితి లో ఎందుకు ఉన్నాము.
 
మానస్య శ్రీ కాన్షిరాం గారు హెలికాప్టర్ లో డబ్బులు సూటు కేసులు, సూటు కేసులు తెచ్చేవారంటా. మరి అత్యంత పేద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో అన్ని కోట్లు డబ్బులు వస్తే ధనిక రాష్ట్రలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో విమానంలో డబ్బులు తీసుకు రావాలి కదా. 
 
దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా?
 
పైన చెప్పిన ఉదాహరణలు బేరీజు వేసుకుంటే దళిత రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్ధం అవుతుంది. 
 
ఎస్సి, ఎస్టీలు గా కావాల్సినంత మంది బలం ఉంది. అలాగే ఆర్ధిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంది మరి ఎందుకు దళిత రాజకీయ పార్టీ గా ముందుకు రాలేక పోతున్నారు. 
 
బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు రాజ్యాధికారం  మాస్టర్ కీ అని చెప్పినా లేదా కులాన్ని ఉపయోగించుకుని రాజకీయం చేద్దామని మాన్యశ్రీ కాన్షిరాం చెప్పినా అంతిమంగా వారి ఉద్దేశ్యం రాజ్యాధికారం కోసమే కదా? అదే కదా మన సమాజాన్ని మార్చగలిగేది.
 
బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ఆశయాలు కొనసాగింవడం అంటే రెండే రెండు లక్ష్యాలు సాధించడం 1. రాజ్యాధికారం, 2. కుల నిర్ములన. ఏడు దశబ్దాల బారత స్వాతంత్ర కాలంలో ఎస్సి, ఎస్టీలు  ఈ రెండు లక్ష్యాలు సాధించ లేకపోవదానికి కారణం నాయకత్వం విఫలం అవడమే?
 
నాయకత్వం విఫలం అవడానికి కారణం నిరంతరం దళిత సమాజం మీద దాడులు అనుకుందాం. మరి మాన్యశ్రీ కాన్షిరాం ఎలా దేశంలో మూడో అతి పెద్ద పార్టీ గా బీఎస్పీ ని తీర్చిదిద్దేరు? 
 
కుల సంఘాల నాయకులు రాజకీయం చెయ్యలేరా? రాజకీయ పార్టీ పెట్టలేరా అంటే మన కళ్ళముందే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. దళిత సేన నాయకులు రాంవిలాస్ పాశ్వన్, దళిత పాంథర్స్ నుండి రాందాస్ అధవలే, మాల మహానాడు నుండి జూపూడి ప్రభాకర రావు, కారెం శివాజీ లాంటి నాయకులు మనకి స్పస్టమైన ఉదాహరణలు. 
 
 
మరి లోపం ఎక్కడ ఉంది. దళిత నాయకత్వం  ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకం కల్పించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు / అయ్యేరు. కమిట్మెంట్ లేకుండా , తన సొంత సమాజానికి భరోసా కల్పించ లేక దళిత నాయకత్వం విఫలం అవుతుంది. నాయకుడు భరోసా, నమ్మకం కల్పించలేక పోతే ప్రజలు ఎలా నమ్మకంతో నాయకుడిని అనుసరిస్తారు.?
 
దళిత నాయకత్వం విఫలం అవడానికి కారణం ఏంటి? 
 
ఎస్సి, ఎస్టీ వర్గాలలో   అంబేద్కరిస్టు లు  చాలామంది ఉన్నారు, కానీ దళిత రాజకీయ పార్టీ పెట్టే నాయకులు లేరు.  1932  లో బాబాసాహెబ్ కి గాంధీకి మధ్య జరిగిన ఒప్పందం వలన ఎస్సీ ల నాయకులు అంటే కీలు బొమ్మలు. 
 
 వీరినే కాన్షిరాం గారు చెంచాలు అన్నారు. సహజంగా భూర్జువా కుల పార్టీ లో ఉన్న దళిత నాయకులను చెంచాలు అనడం సహజమే.
 
శ్రామిక వర్గాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వకూడదు. వారిని ఎల్లకాలం అణిచి ఉంచాలి. ఇది భూర్జువా కులాల లక్ష్యం. బ్రాహ్మణీయ కుల సంస్కృతి లో అణిచివేయబడిన మెజారిటీ వర్గాన్ని అధికారంలోకి రానీయకుండా వారి చైతన్యాన్ని అణిచివేస్తున్నారు. 
 
తమ వ్యక్తిగత స్వార్ధం కోసం, తమ వ్యక్తిగత కుటుంబ అభివృద్ధి కోసం కొందరు పెత్తందారులకు చాలా చీప్ గా అమ్ముడు పోతున్నారు. ఈ అమ్ముడు పోయే నాయకులే ఎస్సి / ఎస్టీల కు ప్రధాన అడ్డంకి, వీరే దళిత రాజకీయ పార్టీ కి అడ్డు.
 
ఎస్సీ లను వర్గీకరించి మీ కుల అభివృద్ధికి చేయూతని ఇస్తామని గత 25 సంవత్సరాల క్రితం అమ్ముడు పోయిన నాయకత్వం వలన ఆంధ్ర, తెలంగాణా లో జనాభా పరంగా మెజారిటీ ఉన్నా రాజకీయ, సామజిక అభివృద్ధికి నోచుకోలేక పోయేము. దళిత రాజకీయ పార్టీ గురించి ఆలోచన చెయ్యలేదు. 
 
అంబేడ్కరిజం పేరుతొ ఉన్నత శ్రేణి ఉద్యోగులు పాలక వర్గాల ప్రయోజనాలు కాపాడే దిశగా కులాలను సమీకరిస్తున్నారు. అమ్ముడు పోవడం లో ఇదొక రకం. 
 
దళితులు మారరు, డబ్బు , సారాయి కోసం ఓట్లు అమ్ముకుంటారనే తప్పుడు ప్రచారాన్ని పెత్తందారులు సృష్టిస్తే అదే తప్పుడు ప్రచారాన్ని దళితులు అందుకుని వారికంటే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అమ్ముడు పోయే కీలు బొమ్మలే ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకు వస్తారు. తాను అమ్ముడు పోవడానికి కారణం కావాలి అందుకు ఒక సాకు  కావాలి. 
 
పాలక పార్టీలతో లాబీయింగ్ చేసుకుని మన హక్కులు సాధిద్దామని కుల పార్టీల వైపు ప్రజలను నడిపిస్తున్నారు కానీ దళిత రాజకీయ పార్టీ అంటే, ఎవరు ఓటు వేస్తారని తిరిగి ప్రశ్నిస్తున్నారు 
 
దళితులు రాజకీయ శక్తి గా ఎదగలేరా? 
 
దళితులు రాజకీయ శక్తిగా లేదా  దళిత రాజకీయ పార్టీ ఎదగాలంటే ఒక నిజాయితీ కల్గిన నాయకత్వం అవసరం. సహనం అవసరం. ఈ రెండుగల నాయకుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. 
 
దళిత మేధావులు కవులు , కళాకారులు కౌంటర్ కల్చర్ ని  తమ రాతలు ద్వారా పాట ద్వారా , మాట ద్వారా దళితుల ఇంటిలోకి చొచ్చుకు పోవాలి. కౌంటర్ కల్చర్ ద్వారా వచ్చిన చైతన్యాన్ని నాయకులు దళిత రాజకీయ పార్టీ వైపు నడిపించాలి. 
 
సోషల్ మీడియా  దళితులకు ఒక కౌంటర్ కల్చర్ , మన గొంతు వినిపించడానికి సోషల్ మీడియా పెద్ద పాత్ర వహిస్తుంది. నిజాయితీ కలిగిన నాయకత్వం ఉంటే కమ్యూనిటీ మొత్తం వారి వెనక నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 
 
దళిత రాజకీయ పార్టీ ఊహించలేక పోవడం అంటే   యుద్ధం చెయ్యకుండా ఓటమికి కారణాలు వెతుక్కోవడం వీరుల లక్షణం  కాదు. నాయకుల లక్షణం కాదు. 
(Visited 254 times, 1 visits today)
Also read  డా.అంబేడ్కర్:అంబేడ్కర్ ను వెలివేసిసాధించేదేమిటి?

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!