దళిత రాజ్యాధికారం-బిఎస్పీ!

షేర్ చెయ్యండి
  • 67
    Shares

మీ గోడల మీద రాసుకోండి మనం ఈ దేశ పాలకులం కాబోతున్నాం అని దళితుల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు దళితులకు మట్టిగోడల కుడా లేని ఇళ్ళ సమయంలో చెప్పేరు. నేడు దళితుల పరిస్తితి భిన్నంగా ఉంది. పక్కా బవనాల్లో ఉంటున్నారు. కానీ తమ ఆరాధ్య దైవం యొక్క ఆశయం మాత్రం ఇంకా అక్కడే ఉంది.

కర్ణాటకలో 23 శాతం దళిత జనాభా ఉన్నారు. దళిత పార్టీ గా గుర్తింపబడిన బహుజన సమాజ్ పార్టీ(BSP) ఎన్నికల బరిలో నిలబడి కేవలం ఒకే ఒక్క స్తానంలో గెలిచింది. BSP కి పోలైన ఓట్ల శాతం 0.04 % మాత్రమె. కర్ణాటక లో మాత్రమే కాదు ఇటీవల జరిగిన త్రిపురా ఎన్నికల్లో కుడా ఇదే పరిస్తితి. త్రిపురా లో 17 % మంది దళితులు ఉన్నారు. ఇక పంజాబ్ రాష్ట్రం విషయంకి వస్తే మరీ విడ్డూరం మొత్తం జనాబా లో 35 % ఉన్నా దళితులకు ఓటు పడటం లేదు. కర్ణాటక తర్వాత దళితులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణా లో ఎక్కువ గా ఉన్నారు.

దేశమంతటా దళితుల యొక్క సొంత పార్టీ, మరియు ప్రణాళిక లేనందున ఈ పరిస్తితి కి దారి తీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హక్కుల కోసం పోరాడుతుంది దళితులు మాత్రమె.

పార్టీ నిర్మాణం చాలా అవసరం. ఆ పార్టీ కి అనుబంధంగా, అదే విధంగా ఆ పార్టీ యొక్క నిర్మాణాన్ని బలపరచటానికి ఉద్యమాలు అవసరం, ఉద్యమ సంఘాలు అవసరం. దళితులు సొంతగా పార్టీ పెట్టి అధికారంలోకి రాలేరు  అనేది నిజం కాదు. అరకు లో BSP పార్టీ తరుపున నిలబడి గెలిచిన రాజారావు గారు మనకి ఒక ఉదాహరణ. 2009 లో సోషల్ మీడియా ప్రబావం అంతగా లేదు. ఉండి ఉంటే రాజారావు గారు బాగా పాపులర్ అయ్యేవారు. బారత దేశం యొక్క ఎన్నికల చరిత్ర పరిశీలన చేస్తే దళితులు వారి స్తానాన్ని వారి యొక్క కార్య దీక్షతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎన్ మహేష్  గారి గెలుపు 2019 కి స్వాగత చిహ్నం లాంటిది.ఎన్ మహేష్ గారు దళిత జాతి కోసం తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వాదిలేసేరు.  మహేష్ గారి గెలుపు దళిత యువత ను సమీకరించాతానికి ఉపయోగపడుతుంది.

Also read  చేవలేని దళిత నాయకత్వం!

కర్ణాటకలో కొత్తగా ఎన్నుకోబడిన బిఎస్పి ఎమ్మెల్యే అయిన మిస్టర్ ఎన్.మహెష్ యొక్క సహనం, పట్టుదల మరియు నిబద్ధత గురించి ఒక సూచన చేయాలి. 2004 ఎన్నికల నుంచి బిఎస్పి టిక్కెట్పై ఎన్నికల్లో పోటీ చేయడం ఎన్.మహేష్ గారు  ప్రారంభించారు. 2004 లో జరిగిన ఎన్నికలలో ప్రస్తుతం  అతను గెలిచిన నియోజకవర్గం నుండి మూడు వరుస ఎన్నికలు (19,075 ఓట్లు), 2008 (25,505 ఓట్లు), 2013 (37,209 ఓట్లు పొందింది), ఓటమి చెందటం జరిగింది. 2013 ఎన్నికలలో ద్వితీయ స్తానం రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఎన్. మహేష్ గారికి 15 సంవత్సరాల ఎన్నికల యుద్ధం తర్వాత (2018) అతను మూడు సార్లు ఓడించిన అదే నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో విజయం సాధించాడు. మహేష్ గారు  భుర్జువా కుల ఆధిపత్య పార్టీలలో చేరి ఉంటే, అతను సులభంగా MLA అయ్యేవారు . – ఫేస్బుక్ లో  వినయ్ షెండే రాశారు.

ఎన్. మహేష్ గారి లాంటి ఉన్నత విద్యావంతుడు, సమాజం పట్ల అవగాహన, కమిట్మెంట్ ఉన్న వ్యక్తికి  దళిత సమాజం రాజకీయంగా మద్దత్తు పలికి అతనితో ఉంటే 23% ఉన్న దళితులు కర్నాటక రాజకీయ పటం పై తనదైన ముద్ర వేసేవారు. దళితులు కింగ్ మేకర్ లు అయ్యేవాళ్ళు.

కర్ణాటక పరిణామాలు చూసి దళితులు ఆనందోత్సవాలు జరుపుకోవలసిన అవసరం లేదు. కర్ణాటకలో ఏ పార్టీ గెలిచినా దళితులకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. వారిని అధికారం నుండి దూరంగా పెట్టేరు. ఉదాహరణ కు కర్ణాటక రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుత  పార్లమెంటరీ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే లాంటి దళిత నాయకుడిని  కాంగ్రెస్స్ పార్టీ కర్ణాటక లో గెలిచినప్పుడు  అధికారానికి దూరంగా పెట్టేరు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించలేక పోయింది.

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!

దళితులు రాజ్యాధికారానికి రావడానికి పెద్ద కూడికలు, తీసివేతలు లేదా పెద్ద పెద్ద ఫార్ములాలు తల పండిన రాజకీయ నాయకులు అవసరం లేదు. ఉదాహరణకు బిఎస్పీ పార్టీ నే తీసుకుంటే నేడు జాతీయ పార్టీ గా గుర్తింపు ఉన్న దళిత పార్టీ ప్రాంతీయ పార్టీలతో ఒక స్తిరమైన అవగాహన కలిగి ఉంటే బిఎస్పీ జాతీయ స్తాయి లో కీలకమైన పాత్ర పోషించ వచ్చు. మాన్యశ్రీ కన్షిరాం గారినే పని విదానాన్నే దళిత నాయకత్వం అద్యయనం చేయ్యాలి. మాన్యశ్రీ కాన్షీరాం ఉత్తర ప్రదేశ్ లో SP(సమాజ్ వాది పార్టీ ) తో జత కట్టేడు, జమ్ము & కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫెరెన్స్ తో జత కట్టేడు. BSP లాంటి దళిత పార్టీ దళిత వర్గాలకు సరైన విధి విధానాలు ఇవ్వాలి. ప్రజల యొక్క విశ్వసనీయత కలిగి ఉండాలి.

దేశ స్తాయిలో దళితుల రాజకీయ పార్టీ ఏర్పాటు చెయ్యడానికి, దళిత జాతీయ పార్టీ ఏర్పడటానికి పెద్ద దూరం లేదు. దేశమంతటా దళితులు ఐక్యంగా నిలబడి ఒక రాజకీయ అవగాహనతో సమావేశం జరిపి కుల సమీకరణలు చెయ్యగలిగితే దళిత జాతీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. BSP లాంటి అనుభవం ఉన్న పార్టీ అటువంటి సమీకరణలు చెయ్యటానికి సిద్దంగా లేదు.  

Also read  కమ్యునల్ అవార్డు ని అడ్డుకుని గాంధీ హిందూ మతాన్నికాపాడేడా లేక దళితులకు ద్రోహం చేసేడా?

 

(Visited 287 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!