ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్: వివాదాస్పదం అవుతున్న సినిమా!

షేర్ చెయ్యండి
  • 68
    Shares

రాజకీయ నేపథ్యంలో తీసిన మరో సినిమా  వివాదాస్పదం అవుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు  ప్రధాని గా చేసిన కాలం ఆధారంగా నిర్మితమైన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ ట్రైలర్ డిసెంబర్ 27 న రిలీజ్ అయ్యింది. 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా సినిమాని నిర్మించారు. 

ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు దీని మీద స్పందించారు. 

రిలీజ్ కి ముందు తమ కమిటీ కి చూపించాలని, ఒకవేల ఏమైనా అబ్యంతకరమైన సన్నివేశాలు ఉంటే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సినిమా ట్రైలర్ లో మాజీ ప్రధాని 2004 నుండి 2014 వరకూ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మన్మోహన్ సింగ్ ని అవమానించారు అనే విధంగా చిత్రీకరించారు. 

సినిమా ట్రైలర్ వాస్తవాలకు దూరంగా ఉంది. వక్రీకరించారని యువజన కాంగ్రెస్ మహారాష్ట్ర నాయకులు సినిమా నిర్మాతకు ఉత్తరం రాసేరు. 

సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు, డైలాగ్స్ తొలగించకుండా సినిమా రిలీజ్ చేస్తే మీరు కావాలనే సినిమా నిర్మించినట్లు గా భావించాల్సివుంటుంది. 

Also read  భీమా కోరేగాంవ్: మహార్ల విజయాన్ని ఆరగించుకోలేకపోతున్న నయా మనువాదం!

సినిమా రిలీజ్ అయిన తరవాత జరిగే పరిణామాలు మీరే బాధ్యత వహించాలని ఆ ఉత్తరం లో పేర్కొన్నారు. 

యువజన కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు సత్యాజీత్ తాంబే పాటిల్ నాయకత్వంలో యువజన కాంగ్రెస్ సినిమా నిర్మాతకు ఈ హెచ్చరిక జారీ చేసారు. 

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే బిజెపి ట్రైలర్ లోని సన్నివేశాలు మీద వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. 

బిజిపి అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా చేసిన ట్వీట్ క్రింది చిత్రంలో చూడండి. 

Image: BJP Tweet on movie The accidental Prime Minister

2004 – 2014 వరకూ ప్రధాని గా చేసిన  మన్మోహన్ సింగ్ గురించి సంజయ్  బారు రాసిన “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” అనే పుస్తకం టైటిల్ తో నిమించిన ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ తోపాటు , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరియు ప్రియాంకా గాంధీ ల పాత్రలు ఉన్నాయి. 

ప్రసిద్ధ నటుడు అనుపమ ఖేర్ మన్మోహన్ సింగ్ గా , జర్మనీ కి చెందిన నటి సుజానే బెర్నెట్ సోనియా గాంధీ గా నటించారు. 

Also read  భీమా కోరేగాంవ్: మహార్ల విజయాన్ని ఆరగించుకోలేకపోతున్న నయా మనువాదం!

ఈ సినిమా ని విజయ్. ఆర్  గుత్తే దర్శకత్వం వహించారు. ఈ విజయ్ గుత్తే బిజెపి అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ సమాజ్ పక్షా నాయకుడు రత్నాకర్ గుత్తే కుమారుడు. 

విజయ్ గుత్తే ఈ సంవత్సరం ఆగస్టు నెలలో డైరెక్టర్ జనరల్ గూడ్స్ మరియు సర్వీసెస్ అధికారులు రూ 34 కోట్లు పన్ను అవకతవకలకు పాల్పడిన కేసులో అరెస్ట్ చేశారు.  

నిన్న మధ్యాహ్నం జరిగిన అనూహ్య పరిణామాల వలన మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇచ్చిన హెచ్చరికలు వెనక్కి తీసుకుంది. 

బిజెపి, దాని అనుబంధ సంస్థ దురాలోచనతో నే ఈ సినిమా నిర్మిచిన నేపథ్యంలో ఇక ఆ సినిమా ముందుగా మాకు చూపించాల్సిన అవసరం లేదని సత్యజిత్ తాంబే ట్వీట్ చేసాడు. 

sanjay tambe tweet
Image: Youth Congress leader Sanjay Tambe Tweet

ఇది ఇలా ఉంటే తెలుగు లో ఇప్పటికే మాజీ ముఖ్య మంత్రి ఎన్టీర్ మీద తీసిన  రెండు బయోపిక్ సినిమాల మధ్య వివాదం నడుస్తుంది. 

రాంగోపాల్ వర్మ తీసిన “లక్ష్మీస్  ఎన్టీర్” సినిమా కి కూడా మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేసినట్లే తెలుగు దేశం నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

Also read  భీమా కోరేగాంవ్: మహార్ల విజయాన్ని ఆరగించుకోలేకపోతున్న నయా మనువాదం!

రాజకీయ నేపథ్యంలో  గానీ లేదా వ్యక్తుల చరిత్ర మీద తీసిన ఏసినిమా అయినా వివాదాస్పదం అవడం సహజమే. 

ఎన్టీర్ బ్రతికి ఉండగానే ‘మండలాధీశుడు’ పేరిట ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా , కోట శ్రీనివాసరావు ఎన్టీర్ గా  సినిమా తీయడం గమనార్హం. 

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ లో గానీ, లేదా లక్ష్మీస్ ఎన్టీర్ లో గానీ ట్రైలర్ లో ఉన్న అంత కాంట్రవర్సీ సినిమా మొత్తం ఉంటుందా అనేది చూడాలి. 

ఇంకో నాలుగు, ఐదు నెలలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో వస్తున్న ఈ రాజకీయ సినిమాలు ఏ మాత్రం ప్రేక్షుకులను ఆకట్టు కుంటాయో చూడాలి. 

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ జనవరి 11 న సంక్రాంతి కానుకగా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 

(Visited 60 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!