ది రైజింగ్ ఆఫ్ నామ శుద్ర . . . విజేతల గాథ!

షేర్ చెయ్యండి
 • 20
  Shares

భారత ఉప ఖండంలో కొందరు పరాజితులు విత్తనం భూమి అట్టడుగు పొరలను చీల్చుకుంటూ మొలకెత్తి మహా వృక్షంగా రూపాంతరం చెందినట్లుగా, వేల సంవత్సరాల వర్ణ వ్యవస్త అయిన హైందవ మత అణిచివేత నుండి అంటరాని జాతుల నుండి కారు చీకట్లను చీల్చుకుని సూర్యుడు ఉదయించినట్టుగా బెంగాల్ ప్రాంతం నుండి “చండాల” ప్రజలు ‘నామ శూద్రులు”గా ధిక్కార పతాకాన్ని ఎగరవేసిన విజేతల గాధ “ది రైజింగ్ ఆప్ నామ శూద్ర”

” సింహాలు తమ చరిత్ర రాయక పొతే , వేట, వేటగాని పిట్ట కథ లే చరిత్ర గా కీర్తింపబడుతుంది” ఆఫ్రికన్ సామెత.

చరిత్ర నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. స్ఫూర్తిని పొందాలి. ఈ దేశంలో సామాజిక న్యాయంకోసం చేసిన పోరాటాలు యాదృచ్ఛికం కాదు. అవమానాల నుండి, ఆత్మగౌరవ పోరాట కోసం చేసిందే సామాజిక న్యాయ పోరాటం. 19 మరియు 20 వ శతాబ్దంలో సనాతన ఆచారాలు , ధర్మాల పేరిట సతీ సహగమనాలు , బహు భార్య విధానం , వరకట్నం , బాల్య వివాహం మరియు వితంతు పెళ్లిళ్లు తదితర దురాచారాల గురించి సాంఘిక ఉద్యమాలు గా చరిత్రలో రికార్డ్ చేసేరుకాని , అదే చరిత్ర కారులు సామజిక న్యాయం కోసం చేసిన పోరాటాలు ఎక్కడా లిక్కించబడలేదు. కావాలనే , ఉద్దేశ్య పూర్వకంగానే మెజారిటీ ప్రజల పోరాటాలు , విజయాలు లిఖించబడలేదు. దళితుల చరిత్ర కూడా ఈ దేశంలో అంటరానిది అయ్యింది.

కుహనా చరిత్రకారులు మరిచిన ప్రజల యొక్క విజయ గాదె నామ శూద్ర. చరిత్ర మరిచిన మనుషులే ఛండాల కుల ప్రజలు. భారత దేశంలోని తూర్పు బెంగాల్ ( నేడు బంగ్లా దేశ్ ) లోని చండాల ప్రజలు. అఖండ భారత దేశంలో కులం వాస్తవం, దాని పుట్టుక హిందు మతం . దాని అధిపతి బ్రాహ్మణలు. బెంగాల్ బ్రాహ్మణులు మరియు ఇతర అగ్ర వర్ణ ప్రజలు విద్యా బుద్దులు నేర్చి , ఇంగ్లీష్ వారి ప్రాపకంలో ఇంగ్లీష్ చదువులు చదివినా కులం విషయంలో బిగుసుకు పోతారు. మళ్ళీ వీరే స్వేచ్ఛ గురించి , సామ్బ్రజ్యా వాదం గురించి ఉపన్యాసాలిస్తూ ఉంటారు, పోరాటాలు చేస్తారు, మానవత్వం గురించి మాట్లాడతారు.

ఛండాల.

హిందూ మతంలో భాగంగా ఉన్న చండాల అనే మెజారిటీ ప్రజలను ఆనాడు హిందు మత /కుల పెద్దలు వారికి కొన్ని కట్టు బాట్లు చేసారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. చండాల ప్రజలు గ్రామానికి దూరంగా నివసించాలి 
2. వారి ఆస్తి కుక్కలు , గాడిదలు 
3. చనిపోయిన జంతు కళేబరాల మధ్యనే జీవించాలి 
4. వారి ప్రధాన వృత్తి శవాలను కాల్చటం 
5. క్రిమినల్స్ ను ఉరితీయటం. 

వీరిని హిందు సమాజం “అంటరాని వారు అన్నారు “

అణిచివేత ,దోపిడీ ఎల్లకాలం చెల్లదు.

8 ఏప్రిల్ 1873 భారత చరిత్రలో ఒక చారిత్రకమైన రోజు. అణిచివేత మీద, శ్రమ దోపిడీ మీద , వివక్ష మీద “చండాల” ప్రజలు ధిక్కార పతాకం ఎగరవేసిన రోజు. ఈ గడ్డ మీద సామాజిక న్యాయంకోసం మొట్ట మొదటి సారి తిరుగుబాటు చేసిన రోజు. చండాల ప్రజలు బ్రహ్మణ మరియు కాయస్థ తదితర కులాల ఆధిపత్యం మీద తిరుగుబాటు ఎగరవేసిన రోజు. చండాల ప్రజలు బ్రాహ్మణ తదితర కులాల కి సహకరించ కూడదు అని నిర్ణయించుకుని వారికి సహాయ నిరాకరణ ప్రాంభించేరు, అంటే హిందూ అగ్రవర్ణ ప్రజలకు పాలేరు లుగా , వారి శవాలను కాల్చటం కానీ , క్రిమినల్స్ ను ఉరితీయటం కానీ , ఇతర సామాజిక అవసరాలలో ఏ విధంగా సహకరించ కూడదు అని నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ లోని ఫరీద్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ C.A కెల్లీ డాఖ ( నేడు బాంగ్లాదేశ్ రాజధాని ) కమీషనర్ కి ఒక లేఖ రాస్తారు. ఫరీద్ పూర్ ఛండాల ప్రజలు అగ్ర వర్ణ ప్రజలకు , వారు ఎంత గొప్ప వారు అయినా , ఏ అధికారంలో ఉన్నా సహకారం అందించ కూడదు అని నిర్ణయిచుకున్నారు. వారి పట్ల జరుగుతున్న వివక్ష , అంటరానితనం కి వ్యతిరేకంగా ఈ నిర్ణయం / తీర్మానం చేసేరు. ప్రభుత్వానికీ ఒక ఉత్తరం రాస్తారు. బంద్ పాటిస్తారు

Also read  దళితులను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లా వై. యెస్. ర్. సి పి!

ఆనాటి చరిత్రను అధ్యయనం చేస్తున్న ఒక చరిత్ర కారుడు ఈ బంద్ నే భారత దేశంలో అధికారికంగా మొట్ట మొదటి గుర్తించిన బంద్ అని పేర్కొన్నారు . ఒక విధంగా ఇది అగ్రవర్ణ ప్రజల సాంఘిక బహిష్కరణ గా చెప్పాలి . హరిచంద్ ఠాకూర్ ( 1812- 1877) మరియు వారి కుమారుడు గురుచంద్ (1847 -1937) చదువులేని చండాల ప్రజలకు విద్య బుద్దులు నేర్పించటానికి కంకణం కట్టుకున్నారు బెంగాల్ ప్రాంతంలోని ఇతర జిల్లా లు బరిసల్ , డాఖ, జెస్సోరీ , మైమన్ సింగ్ షిల్హేట్ తదితర జిల్లాలోని చండాల కులస్తులు వారి సోదరులైన ఫరీద్ పూర్ చండాల ప్రజలు తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దత్తు ప్రకటించి వారు కూడా సహాయనిరాకరణ బంద్ లో పాల్గొంటారు. 1871 జనాభా లెక్కల ప్రకారం ఛండాల ప్రజల జనాభా 16,91,545 మంది. అయితే బందు లో పాల్గొన్నది 11,91,204 మంది. అంటే హిందూ అగ్రవర్ణ ప్రజల లో 74 శాతం ప్రజలు పోరాటం చేస్తున్నారు. వీరు ” భద్రకాల్ ” కూటమికి ( బ్రాహ్మణ, కాయస్థ , బైద్య కులాల కూటమి ) మీద తిరుగుబాటు చేసి విజయం సాధిస్తారు. చదువు లేని ఛండాల ప్రజలు వారికి ఉన్న సహజ పోరాట పటిమ, ఆర్గనైజింగ్ నైపుణ్యంతో ప్రజలను సమీకరించి, వారి మధ్య ఒక నెట్వర్క్ ఏర్పాటు చెయ్యటంలో అద్భుత ప్రతిభ కనపరిచేరు.

విద్యలేనిదే అభివృద్ధి సాధించ లేరు అని గుర్తించి ఛండాల ప్రజలు ఒక యూనియన్ గా ఏర్పడి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రతినిబునెరు. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువు అయిన ఫరీద్ పూర్ జిల్లా లో అసలు విద్య అనేది దీనావస్థలో ఉంది. బ్రాహ్మణులు తప్పా ఎవరూ తగిన ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అలాంటి ఫరీద్ పూర్ నుండి ఒక అంటరాని కులం విద్య కోసం చేసిన ప్రతిజ్ఞ ఆరోజుల్లో ఒక గొప్ప మార్పు కి శ్రీకారం గా చెప్పాలి. సహజంగానే అగ్రవర్ణ ప్రజలు చండాల ప్రజలకు విద్య నా అంటూ ఎగతాళి చేసి , వారికి విద్య చెప్పకూడదు అనుకున్నారు. అంటరాని కులాలకు చదువు అవసరం లేదు అన్నారు . విద్య అనేది బ్రాహ్మణ , కాయస్థ బైధ్య ప్రజల జన్మహక్కు , ఇతరులు చదువు కోకూడదు అని అన్నారు. అయితే ఆరోజుల్లోనే చండాల ప్రజలు , ముస్లిం లు అగ్రవర్ణాల దిష్టి బొమ్మను తగల బెట్టి నిరసన ప్రకటించేరు. దాదాపుగా 15 వేల మంది లో కేవలం 200 మంది చండాల ప్రజలు స్కూల్ లో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆస్ట్రేలియా కి సంబంధించిన బాప్టిస్ట్ క్రైస్తవ సంఘ సభ్యుడు డా . C S మెయిడ్ చండాల ప్రజలకు విద్యా పరంగా సహకరిచేరు. ఫరీద్ పూర్ ఠాకూర్ సొంత గ్రామంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ స్థాపించేరు. ఠాకూర్ గ్రామ లోని పెద్దలు వడ్డీ లెక్కలు , రసీదు లు తప్పుగా రాసి వారి వద్ద ఎక్కువ ధనం తీసుకునేవారు ఈ దోపిడిని అరికట్టటానికి ఠాకూర్ గ్రామంలోనే బడి ఉండాలి అని తీర్మానించేరు. ఈ నిర్ణయానికి మిగతా కులాల్లో ఆందోళన మొదలైంది. చండాల ప్రజలు చదువు కుంటే ఇక వారిని నౌకర్ల గా , ఇంటి పాలేరు గా ఉద్యోగాల లోకి రారు అని ఆందోళన లో పడ్డారు , ఎలాగైనా అడ్డుకోవాలి అనుకున్నారు.

చారిత్రాత్మకమైన సమావేశం.

బెంగాల్ లోని నామ శూద్రులు 1881 సం . లో ఖల్నా జిల్లాలోని దత్తదంగా గ్రామంలో సమావేశం అయ్యేరు. సభ అధ్యక్షుడు గా గురుచంద్ ఠాకుర్ ఉన్నారు. బెంగాల్ లోని నామ శూద్రులు నలుమూలల నుండి హాజరు అయ్యేరు. సమావేశంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తీర్మనం చేసేరు. బహుశా నేటికీ దళిత ప్రజలు ఏ గ్రామంలో కూడా ఇలాంటి తీర్మానాలు చెయ్యలేదు అని చెప్పవచ్చు. అవి కాకుండా 1. ప్రతి నామ శూద్ర గ్రామంలో గ్రామ కమిటీలు , అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసేరు. 2. ప్రతి 15 గ్రామాలకు ఒక సంఘం మరియు జిల్లా సంఘాలను ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు . 3. ప్రతి సభ్యుడు నుండి సభ్యత్య రుసుము వసూళ్లు చేసేరు. 4. ప్రతి జిల్లా కమిటీ సభ్యుడు నెలకు నాలుగు అణాలు చెల్లించాలి అలాగే గ్రామ సభ్యుడు రెండు అణాలు చెల్లించాలి . అందులోని మూడు శాతం డబ్బులు పెళ్లిళ్లకు ఇతర గ్రామ అవసరాలకు వినియోగించే వారు. 5. బాల్య వివాహాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నారు . గ్రామంలో పరిసరాల శుభ్రత పాటించాలి . ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగు దొడ్లు ఉండాలి అని తీర్మానం చేసేరు. ఇవి ఒక సంచలనం అయింది. ప్రతి గ్రామంలో స్కూల్ లు వెలిసేయి .

Also read  సంబవ కులం: వెలుగులోకి వస్తున్న ప్రాచీనమైన దళితుల బాష!

1908 లో మొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసేరు . ముస్లింలు , వెనకబడిన వర్గాలు ఇందులో చేరేవారు. వీరి యొక్క ఆసక్తిని గమనించిన బెంగాల్ మరియు అస్సాం గవర్నర్ ఇక్కడ చదివిన వారికి ఉద్యోగాలలో ప్రోత్సాహం కలిపించేవారు దీనికి సంభందించి The proportional representation of communities in public employment act ని తీసుకు వచ్చేరు. దీని ప్రభావం వలన కుముద్ బహార్ మాలిక్ అనే అంటరాని వ్యక్తి బెంగాల్ సహాయ మేజిస్ట్రేట్ గా మొట్ట మొదటిసారి నియమిచబడ్డారు. 4900 మంది నామ శూద్రులు ప్రాథమిక విద్య లో చేరేరు వారిలో 200 మంది డిగ్రీలు సాధించేరు . నామ శూద్రుల కోసం కలకత్తా లో ఒక ఉన్నత విద్య హాస్టల్ కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేరు. కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కలసి హాస్టల్ ఏర్పాటు చేయాల్సిందిగా వినతి పత్రం ఇచ్చేరు. యూనివర్సిటీ అధికారులు అంటరాని వారికి ఇండ్లు ఇవ్వలేము అని ప్రజలు చెప్పేరు. 1885 లో పుంచనన్ బిస్వాస్ అనే నామ శూద్ర వ్యక్తిని గ్రామస్తులు అందరూ కలసి ఆస్ట్రేలియా పంపేరు. అక్కడ బాప్టిస్ట్ సంఘాన్ని వేడుకుని నామ శూద్ర గ్రామంలో మహిళలకు విద్య కోసం కొందరు మహిళలను పంపవల్సిందిగా కోరేరు. అందుకు వారు 5 మంది ని పంపేరు.

చండాల నుండి నామ శూద్రగా. 

1901 ప్రారంభంలో ప్రభుత్వానికి చాలా కులాలు తమ కుల స్థాయి ని మార్చాల్సింది గా ప్రభుత్వాన్ని వినతి పత్రం రూపంలో కోరేరు . ఇవి 1911 లో ఈ వినతి పత్రాల కట్టలు 57 కేజీల బరువు ఉన్నాయి. బాబన్స్ ( ఇప్పుడు భూమిహార్ ) లు వారిని బ్రహ్మర్షి బ్రహ్మణ్స్ గా గుర్తించాలి అని కోరుకున్నారు అలాగే కాయస్తులు క్షత్రియులుగా , భైద్య లు కూడా బ్రాహ్మణ లు గా గుర్తించాలి అని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చేరు. ఇలాంటి డిమాండ్ లు అన్నీ తిరస్కరించబడ్డాయి. కేవలం రెండే రెండు డిమాండ్స్ నెరవేర్చేరు. 1.చండాల లు నామ శూద్రులు గా 2. ఖైబర్దాస్ లు మహిష్యా గా నామకరణం చెందెరు. చండాల ప్రజలు దీనికోసం చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ మార్పు జరిగింది. F B peacock అనే బెంగాల్ ప్రెసిడెన్సీ డివిజన్ కమీషనర్ చండాల ప్రజలను గమనించి 18 జులై 1881 న లెటర్ నెం 81 ఒక జి ఓ ఇస్తూ ఛండాల “The improvement of the Chandals who are in the chief agriculturists in Narail subdivision, in Jessore district] has led them to aspire to a superior status in the Hindu caste system. They call themselves Namasudra and profess to be Baishnab ( వైష్ణవ ).” గా ప్రకటించేరు

Also read  ఆర్ధిక అభివృద్ధి పై కుల ప్రభావం - దళితులు!

1905 బెంగాల్ గవర్నర్ జెనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ ను తూర్పు బెంగాల్ మరియు పచ్చిమ బెంగాల్ గా విభజించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆనాటి బెంగాల్ కాంగ్రెస్ లీడర్ సురేంద్ర నాద్ బెనర్జీ నామ శూద్ర నాయకుడు అయిన 58 ఏండ్ల గురుచంద్ ఠాకూర్ ని సహాయం అడిగేరు . నామ శూద్రులు కూడా ఉద్యమానికి సహకరించాలి అని , వారి అవసరం మాకు తక్షణం అవసరం అని అడిగేరు . అందుకు గురుచంద్ ఠాకూర్ సమాధానం ఇస్తూ నామ శూద్రులు విదేశీ వస్తువు వాడేది ఒకే ఒక వస్త్రం అది కూడా చాలా తక్కువ క్వాలిటీ వస్త్రం . హిందు వులే ఎక్కువ గా విదేశీ వస్తువులు వాడతారు.వారికి విద్య లేదు , సాంఘిక బహిష్కరణ కి గురికాబడిన వారు , అలాగే ఈ దేశంలో నామ శూద్రుల కు మనిషిగా గుర్తింపు లేదు , సాటి హిందువు అనే సోదర భావం లేదు , సొంత గడ్డమీదే మీ అగ్ర వర్ణాల చేత వారు వివక్ష కు గురవుతున్నారు అలాంటి నామ శూద్రులు ఇప్పుడు మీకు సహకరిస్తారు అని నేను అనుకోవటం లేదు . కాబట్టి అగ్ర వర్ణ హిందువుల కోసం , వారికీ అవసరం వచ్చినప్పుడు మా మద్దత్తు ఉండదు అని చెప్పేరు

1928 లో సైమన్ కమీషన్ కి నామశూద్రులు వినతి పత్రం ఇచ్చేరు . భద్రలోక్ కూటమికి వ్యతిరేకంగా వారి అరాచకాలు , సాంఘిక బహిష్కరణ లు అన్నీ ఆ వినతి పత్రంలో ఇచ్చి నామ శూద్రులకు ప్రత్యేక హక్కులు కల్పించాలి అని కోరేరు. నామ శూద్రులకు మరియు ఇతర అణగారిన వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలి అని కోరేరు. అదే విధంగా ఆ వినతి పత్రంలో మేము అగ్ర వర్ణ హిందువులను నమ్మలేము అని భారత దేశం మొత్తం ఉచిత ప్రాధమిక విద్య అందించాలి అని కోరేరు. భద్రలోక్ కూటమి కులాలు స్వర్గం నుండి ఊడిపడినట్టు గా ప్రవర్తిస్తారు అని అన్నారు.

నామ శూద్ర నాయకుడు గురుచంద్ మొదట భూస్వాములకు వ్యతిరేకంగా గళం విప్పేరు . 1921 లో నామ్ శూద్ర నాయకులు ముకుంద్ బీహారీ మాలిక్ , బిస్మాదేబ్ దాస్ బెంగాల్ అసెంబ్లీ లో సభ్యులుగా 2/3 వంతు పంటలో రైతు కె హక్కు వుండే విధంగా డిమాండ్ చేసేరు . ఇదే ఆతర్వాత తేబగా ఉద్యమం గా రూపాంతరం చెందింది. 1937 లో బెంగాల్ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో 30 మంది నామ శూద్రులు ఎన్నిక అయ్యేరు.

1946 లో బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ ని రాజ్యాంగ పరిషత్ కి పంపించటం లో నామ శూద్రుల రాజకీయ చతురతకి అంటరాని కులాల ఐక్యత కి నిదర్సనం.

ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపిన నామ శూద్రులు ఈ భారత గడ్డ మీద మొదటి విజేతలు.

Even the darkest night will end and the sun will rise : Victor Hugo

కులం , మతం అనే కారుచీకట్ల ను చీల్చుకుంటూ సూర్యుడిలా ప్రకాసించిన వారే ” నామశూద్రులు “

(Visited 85 times, 1 visits today)

2 thoughts on “ది రైజింగ్ ఆఫ్ నామ శుద్ర . . . విజేతల గాథ!

  • 02/02/2018 at 1:49 PM
   Permalink

   అవును, మీ స్పందనకు ధన్యవాదాలు

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!