ధర్మో రక్షిత; రక్షతః – ఒక అనైతికం

షేర్ చెయ్యండి
  • 3
    Shares

ధర్మో రక్షిత; రక్షతః – ఒక అనైతికం – అని ఈ దేశం చెబుతుంది. దేవుడు పేరిట చెప్పబడుతుంది.అనాదిగా ఈ దేశం తనను తాను మోసం చేసుకుంటుంది. తను చెప్పిన సిద్ధాంతం తానే పాటించటం లేదు. మతం, కులం అనే చీకటిలో అనైతికంగా బ్రతుకుతుంది.

అందుకే ఏప్రిల్ 14, 1891 న ఒక జ్ఞాన జ్యోతి ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు అంటూ చీకటి లో మగుతున్న ఈ బారత దేశంకు వెలుగులు ప్రసరించటానికి జన్మించింది.

మేము ఆర్యులం…, మీరు శూద్రులు, మీరు పంచములు అని అధర్మం గా మనుషులను వర్గీకరించి, గిరి గీసి వెలి వేసిన ఈ అధర్మ భారతావనికి ధర్మం చెప్పిన గౌతమ బుద్దుడి వారసుడు బాబాసాహెబ్ డా. భీంరావ్ అంబేడ్కర్ ఆర్యులు ఎవరు, శూద్రులు ఎవరూ అంటూ అందరం మనుషులమే ఆని అధర్మం నుండి, ధర్మం వైవు ఈ దేశాన్ని అడుగులు వేయించిన ‘శాంతి ప్రదాత’ బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్.

“యత్ర నార్యస్తూ పుజ్యంతే,
రమంతే తత్ర దేవతా”

ఎక్కడ స్త్రీలు గౌరవించ బడతారో అక్కడ దైవత్వం ఉంటుంది అని అధర్మం గా స్త్రీలకు ఏ హక్కు లేకుండా బంధించిన ఈ అధర్మ దేశానికి ధర్మం ఆంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి , సమాన హోదా ఉంటుంది అని హక్కులు కల్పించిన మహా నాయకుడు బాబాసాహెబ్ డా.బి ర్ అంబేడ్కర్.

Also read  దళితులు విముక్తి పొందాలన్నా,అభివృద్ధి చెందాలన్నా మతం మార్చుకోక తప్పదు!

రవి అస్తమించని బ్రిటీష్ సాంబ్రాజ్యంలో తూరుపు దిక్కున నిలబడి తన చూపుడు వేలుతో అధర్మ సమాజానికి ధర్మాన్ని రక్షించటం ఆంటే సాటి మనిషిని మనిషిగా గౌరవించాలి అని “కులం” అనే అధర్మాన్ని విడనాడి ప్రతి భారతీయుడు దేశం పట్ల విధేయత చూపాలి అని, దేశ సౌబ్రాతత్వం కాపాడాలి అని నిరంతరం చెబుతున్న గోప్ప వ్యక్తి బాబాసాహెబ్ డా. భీంరావ్ అంబేడ్కర్.

మనిషి అన్నాక మార్పు చెందాలి, పరివర్తన చెందాలి అందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి, గజ దొంగలు గా, బందిపోటు లుగా రాజరికం నుండి వలస పాలకుల వరకు ఒక సమూహాన్ని / జాతి ని తరతరాలుగా అవమానాలకు గురిచేస్తూ ఉన్నటువంటి వారిని గుర్తించి వారికీ హక్కులు ఉంటాయి అని షెడ్యుల్ ట్రైబ్ లో స్తానం కల్పించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్.

అశ్వద్దామ అధః…..కుంజరహః , అనే చాటు మాటు ధర్మాలు లేవు, రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన న్యాయం కల్పించి, చట్టం ముందు అందరూ సమానులే అని చాటి చెప్పిన న్యాయ నిపుణుడు, రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్.

Also read  ఇండియాలో హిట్లర్ వారసులు-విద్వేషమే అజెండా!

డిసెంబర్ 6, 1956 ఈ దేశానికి ఒక దురుద్దినం అని చెప్పాలి. బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ మహా నిష్క్రమణ. బౌతికంగా దూరమైన రోజు.

ఆనాటి నుండి మత చాందస వాదులు అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. పవిత్రమైన పార్లమెంట్ అనే దేవాలయం లో దేవతలు ప్రవేశ పెట్టాలి అనుకుంటే, దెయ్యాలు ప్రవేశించాయి అన్న బాబాసాహెబ్ మాటలు నేడు అక్షర సత్యాలు. మనువు వారసులు మళ్లీ విజృంభిస్తున్నారు. ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు లేకుండా, హక్కులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మత సంప్రదాయం జాతీయ సాంప్రదాయం గా చెయ్యాలి అనే ప్రయత్నం , మతం పేరిట స్త్రీలను కట్టడి చేసే ప్రయత్నం.

డేమోక్రసీ పేరిట ఇప్పుడు అధర్మోక్రసి నడుస్తుంది. అనైతిక అధర్మాలు విజృంభిస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఉద్దేశ్య పూర్వకంగా విఫలం చేసే ప్రయత్నం లో ఉన్నారు. ఒక వేళ రాజ్యాంగం విఫలమైందని ప్రజలు భావిస్తే నా జాతి రాజ్యాంగాన్ని తగలపెడుతుంది అని చెప్పిన బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ మాటలు నిజం చెయ్యాలి అని ఫాసిస్ట్ ల కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం బాబాసాహెబ్ అనుచరుల మీద ఉంది. ప్రజాస్వామ్య వాదుల మీద ఉంది.

Also read  VHP యొక్క రామ రాజ్య రధ యాత్ర విభజన మత రాజకీయం కోసమేనా!

మత రాజ్యాంగం ఎంత ప్రమాదకరమో పొరుగు దేశాలను చూస్తే తెలుస్తుంది. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని ఈ బారతీయులకు అంకితం చెయ్యకు ముందు ఉన్న పరిస్థితి, ఆ తర్వాత పరిస్థితి బేరీజు వేసుకుంటే ఈ దేశాన్ని రెండు విధాలుగా చూడాలి. 1.Before Ambedkar, 2. After Ambedkar

నీవు ఎవరు అని ప్రశ్నించినప్పుడు, నేను హిందు, ముస్లిం, సిక్కు, క్రైస్తవడినో అని చెప్పకుండా I am Indian; firstly, lastly అని చెప్పిన ఏకైక భారతీయుడు బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్.

బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ గారి త్రికరణ సూత్రాలు
1.Educate, 2.Agitate, 3.Organize! 
ప్రతి భారతీయుడు పాటిస్తూ దేశాన్ని ఫాసిస్ట్ ల కంభందచరలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.

(Visited 32 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!